Sachin Tendulkar fans
-
Sachin Tendulkar: తమ్ముడూ... ఎలా ఉన్నావు?
మనం స్కూటర్‌పై వెడుతుంటే పక్కన కారులో మన అభిమాన హీరో లేదా క్రికెటర్ కనిపిస్తే ‘ఇది కలా? నిజమా?’ అనుకుంటాం. సచిన్ టెండూల్కర్ వీరాభిమానికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. టూ వీలర్‌పై వెళుతున్న హరీష్‌కుమార్‌ను కారులో వెళుతున్న వ్యక్తి ‘ఎయిర్‌పోర్ట్‌కు ఎలా వెళ్లాలి?’ అని అడిగాడు. సమాధానం చెప్పడానికి రెడీ అయిన హరీష్ అటువైపు చూసి స్వీట్ షాక్‌కు గురయ్యాడు. అతడు ఎవరో కాదు సచిన్ టెండూల్కర్. రోడ్డు మీద నుంచి క్లౌడ్ 9లోకి వెళ్లిన హరీష్ ‘నమ్మలేకపోతున్నాను. థ్యాంక్యూ గాడ్’ అన్నాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చి సెల్ఫీ దిగిన సచిన్ హెల్మెట్ ధరించి డ్రైవ్ చేస్తున్నందుకు హరీష్‌ను అభినందించాడు. ‘నేను కూడా సీటు బెల్ట్ ధరించాను చూడు’ అన్నాడు. హరీష్ ధరించిన ముంబై ఇండియన్స్ జెర్సీ వెనుక ‘టెండూల్కర్ 10 ఐ మిస్ యూ’ అనే అక్షరాలు కనిపిస్తాయి. కారులో వస్తున్న సచిన్‌కు ఆ అక్షరాలు కనిపించాయి. అభిమానితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడేలా చేశాయి. ఈ వీడియో క్లిప్‌ను సచిన్ టెండూల్కర్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇది క్విక్‌గా వైరల్ అయింది. అయిదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. -
సచిన్ వీరాభిమానిపై పోలీస్ జులుం.. ప్రారంభోత్సవం చేసిన స్టేషన్లోనే..!
Sachin Die Hard Fan Beaten By Police: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి అంటే తెలియని వాళ్లు బహుశా భారత క్రికెట్ వర్గాల్లో ఎవ్వరూ ఉండకపోవచ్చు. సచిన్ రిటైర్మెంట్ వరకు టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లో అతను స్టాండ్స్‌లో దర్శనమిచ్చే వాడు. ఇంటా, బయటా అన్న తేడా లేకుండా సచిన్ ఆడిన ప్రతి మ్యాచ్‌ను చూసేందుకు అతను ఆస్తులను సైతం అమ్ముకున్నాడు. అతనికి కొన్ని సందర్భాల్లో బీసీసీఐయే ప్రత్యేక రాయితీలు కల్పించి మ్యాచ్ వీక్షించేందుకు పంపేది. సచిన్ సైతం సుధీర్‌కి చాలా మర్యాద ఇచ్చే వాడు. చాలా సందర్భాల్లో అతన్ని సత్కరించడంతో పాటు అతని అవసరాలను కూడా తీర్చాడు. విదేశాల్లో జరిగే టోర్నీల కోసం అతని విమాన చార్జీలను కూడా సచినే స్వయంగా భరించేవాడు. సచిన్‌ను దైవంతో సమానంగా ఆరాధించే సుధీర్.. క్రికెటేతర కారణాల చేత తొలిసారి వార్తల్లోకెక్కాడు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ పోలీసులు తనపై దాడి చేసి హింసించారని ఆయన ఆరోపించాడు. ఓ కేసు విషయంలో సోదరుడు కిషన్ కుమార్‌ను ముజఫర్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేయగా, అతన్ని కలిసేందుకు వెళ్లిన తనను స్థానిక డ్యుటీ ఆఫీసర్ దుర్భాషలాడాడని, అంతటితో ఆగకుండా కాళ్లతో తన్ని, స్టేషన్ బయటికి గెంటేశాడని సుధీర్ ఆరోపించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తనను దూషించి, గాయపరచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశాడు. కాగా, రెండేళ్ల క్రితం ఇదే పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించారని సుధీర్ వెల్లడించడం విశేషం. చదవండి: రైతుగా మారిన టీమిండియా మాజీ కెప్టెన్.. -
బీసీసీఐపై సచిన్ అభిమానుల ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రికెట్లో జెర్సీ నంబర్ 10 గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్ ఆసాంతం పదో నంబర్ జెర్సీనే వాడాడు. సచిన్ రిటైర్డ్మెంట్ సమయంలో గౌరవపూర్వకంగా తాము 10 నంబర్‌కు కూడా రిటైర్మెంట్ ఇస్తున్నామని తెలిపింది. భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్ కూడా 10నంబర్ జెర్సీ ధరించడని బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. అయితే గురువారం ఆశ్చర్యకరంగా తొలి అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన పేసర్ శార్దుల్ ఠాకూర్ 10 నంబర్ జెర్సీతో ఆడటం అందరినీ ఆశ్చర్యపరచింది. దీంతో సచిన్ అభిమానులు బీసీసీఐపై అసంతృప్తితో ఉన్నారు. ఇంకోసారి 10నంబర్ జెర్సీని ధరించవద్దని శార్దుల్‌కు విజ్ఞప్తి చేశారు. అది ఒక నంబర్ కాదని, తమ ఎమోషన్ అని, శార్దుల్ జెర్సీ నంబర్ దయచేసి మార్చండి అంటూ బీసీసీఐని కోరారు. మరికొంత మంది అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని బీసీసీఐ, జెర్సీ ధరించిన శార్దులకు ట్వట్టర్లో ఘాటుగా వార్నింగ్లుకూడా ఇచ్చారు. శార్దుల్ సచిన్ జెర్సీ వేసుకోవడం మాకు నచ్చలేదు. సచిన్ స్థానంలో మరొకరిని ఊహించుకోలేమని అభిమానులు అన్నారు. 10నెంబర్ జెర్సీ కొత్తగా వచ్చే వాళ్లకు ఇచ్చి దానికి ఉన్న విలువ తగ్గించొద్దంటూ మండిపడ్డారు. Hey @imShard, please don't wear #JersyNo10 next time. Leave it for #Sachin10 #RetireJerseyNo10 @BCCI r u listening?? @sachin_rt @imVkohli — Gaurav Sharma (@mightygaurav842) September 1, 2017 @imVkohli sincere request from Sachin fans. Pls ask Shardal Thakur to change his Jersey no -
అభిమానుల రద్దీతో ట్రాఫిక్ జామ్
సాక్షి, ముంబై: నగర రహదారులన్నీ వాంఖడే వైపే కదిలాయి. క్రికెట్ కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న సచిన్ ఆట చూడటం కోసం వేలాది మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు. దీంతో మొదటి రోజే నగర రహదారులపై అక్కడక్కడ విపరీతమైన ట్రాఫిక్ జాం ఏర్పడింది. ముఖ్యంగా స్టేడియానికి చుట్టపక్కల ఉన్న రోడ్లన్నీ ట్రాఫిక్ శాఖ నో పార్కింగ్‌జోన్‌గా ప్రకటించింది. దీంతో ఎంతో ఉత్సాహంతో క్రికెట్ చూడడానికి కార్లలో వచ్చిన అభిమానులు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక మధ్యలోనే ఇరుక్కుపోయారు. బందోబస్తులో భాగంగా అదనపు పోలీసు కమిషనర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, 11వందలకుపైగా మహిళ, పురుష కానిస్టేబుళ్లను నియమించినా వీరంతా స్టేడియంవద్ద విధులు నిర్వహించడానికే సరిపోయారు. కానీ రహదారులపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను మాత్రం క్రమబద్ధీకరించలేకపోయారు. అయితే వాహనాల్లో వచ్చినవారు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కానీ ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంవల్ల వాటిని ఎక్కడ పార్కింగ్ సౌకర్యం కల్పించాలో తెలియక ట్రాఫిక్ పోలీసులు తలలు పట్టుకున్నారు. మొదటిరోజే ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మిగత నాలుగు రోజులు బెస్ట్ బస్సుల్లో, లోకల్ రైళ్లలో స్టేడియానికి రావాలని నగర ట్రాఫిక్ శాఖ సూచించింది. గతంలో ఈ స్టేడియంలో వివిధ దేశాలతో అనేక వన్ డేలు, టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. పాకిస్తాన్-ఇండియా మ్యాచ్‌లకు కూడా ఇంత ఇబ్బందులు ఎదురుకాలేదని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్నారు. అయితే ఇది టెండూల్కర్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే చివరి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెంచిందన్నారు. -
టెండూల్కర్ నామస్మరణలో ముంబై
ముంబై: నగరమంతా సచిన్ నామస్మరణతో మారుమోగింది. ఎక్కడా చూసినా కెరీర్లో చివరి, 200వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సచిన్ ఎన్ని పరుగులు తీస్తాడు? ఇన్నాళ్లు సేవలు చేసినందుకు ఘనమైన వీడ్కోలు లభిస్తుందా? క్రికెట్ తొలినాళ్లలో ఆడిన ఆటతీరునే ప్రదర్శిస్తాడా? తదితర విషయాలు గురించి ముంబైకర్లు చర్చించుకోవడం కనిపించింది. రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్‌కు సేవలందిస్తున్న ముంబై వీరుడు టెండూల్కర్ సొంత గడ్డ వాంఖడే స్టేడియంలోనే కెరీర్ చివరి, 200వ మ్యాచ్ అతనికి చిరకాలం గుర్తుండిపోయేలా ఉండాలని మనసారా ఇష్టదైవాలను వేడుకున్నారు. అయితే అభిమానుల హీట్‌కు తగ్గట్టుగానే నగరంలోని వివిధ ప్రాంతాల్లో మాస్టర్ బ్లాస్టర్‌కు అభినందనలు తెలిపే హోర్డింగ్‌లు వెలిశాయి. సచిన్ గౌరవార్థం తాజ్ హోటల్లో ఓ అభిమాని పువ్వులతో బ్యాట్, బంతి, వికెట్లు తయారుచేశాడు. వాంఖడే స్టేడియం సమీపంలోనే భారీ హోర్డింగ్ వెలిసింది. ఠాణేలోని సెంట్రల్ గ్రౌండ్లో సామాజిక కార్యకర్త శరద్ బెల్ శేఖర్ 200 బెలూన్లను ఎగరవేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా అభిమానులు వివిధ ప్రాంతాల్లో తమకు నచ్చిన రీతిలో సచిన్‌ను గౌరవిస్తూ వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సచిన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, మొహర్రం ప్రభుత్వ సెలవు దినం కావడంతో అత్యధిక మంది నగరవాసులు టీవీలు అంటిపెట్టుకొని మ్యాచ్‌ను వీక్షించడం కనబడింది. ప్రముఖ క్రికెట్ మైదానాలుగా నగరంలో పేరున్న శివాజీ పార్క్, అజాద్ మైదాన్‌లో సచిన్ రిటైర్మెంట్ గురించి చర్చ జరిగినా క్రికెట్ మ్యాచ్‌లు యధావిధిగా సాగాయి. రోజుమాదిరిగానే అందరూ మైదానాలకి వచ్చి క్రికెట్ ఆడారు. సచిన్ గురించి చర్చించుకున్నా ఆటపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. టెండూల్కర్ తొలినాళ్లలో ఎక్కువ ప్రాక్టీసు చేసిన దాదర్‌లోని శివాజీ పార్క్‌లో క్రికెట్ సందడి కనిపించింది. నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. రెండు రోజుల క్రితం సచిన్ టెండూల్కర్ ఆరాధ్య గురువైన రమాకాంత్ అచ్రేకర్ కుమారుడు కల్పన ముర్కర్ ఇదే శివాజీ పార్క్‌లో ఔత్సాహిక క్రికెటర్లకు ఆటలో మెళకువలను నేర్పించాడు. కార్పొరేట్ కంపెనీలు కూడా క్రికెట్ మ్యాచ్‌లు ఆడాయి. ఒక మ్యాచ్‌లో నానావతిని బీఎంసీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నిర్లోన్ జట్లు ఎదుర్కొన్నాయి. మరికొంత మంది ఆట ఆడుతునే చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకొని సచిన్ మ్యాచ్ కామెంటెరీని వినడం కనిపించింది. ‘శివాజీ పార్క్‌లో క్రికెట్‌ను ఎవరూ ఆపలేరు. ఎవరు రిటైరైనా ఆట కొనసాగుతునే ఉంటుంది. ఈ మైదానంలో ఒక్కరోజు కూడా క్రికెట్ ఆగవద్దని సచిన్ కూడా భావిస్తాడ’ని బీఎంసీ తరఫున ఆడిన విశాల్ పఠక్ తెలిపారు. ‘జీవితం కొనసాగుతూనే ఉంటుంది. శివాజీ పార్క్‌లో రోజుచేసే ప్రాక్టీసు చేసే వాళ్లలో నుంచి మరొక సచిన్ వస్తాడనే ఆశ ఉంద’ని యూబీఐ తరఫున ఆడిన రాకేశ్ షా అన్నారు. అజాద్ మైదాన్లోనూ రోజువారి మాదిరిగానే అనేక మంది పిల్లలు చేరి క్రికెట్ ఆడారు. ‘టెండూల్కర్ వీడ్కోలు గురించి ఎంతో అతృతతో ఉన్నాం. అయితే మా రోజువారీ ప్రాక్టీసును మిస్ కాలేం. తొందరగా శిక్షణ తీసుకొని ఇంటికి వచ్చి టీవీల్లో మ్యాచ్ చూస్తామ’ని అనిల్ పఠక్ అన్నాడు.