బీసీసీఐపై సచిన్ అభిమానుల ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో జెర్సీ నంబర్ 10 గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్ ఆసాంతం పదో నంబర్ జెర్సీనే వాడాడు. సచిన్ రిటైర్డ్‌మెంట్ సమయంలో గౌరవపూర్వకంగా తాము 10 నంబర్‌కు కూడా రిటైర్మెంట్ ఇస్తున్నామని తెలిపింది. భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్ కూడా 10నంబర్ జెర్సీ ధరించడని బీసీసీఐ ఘనంగా ప్రకటించింది.
అయితే గురువారం ఆశ్చర్యకరంగా తొలి అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన పేసర్ శార్దుల్ ఠాకూర్ 10 నంబర్ జెర్సీతో ఆడటం అందరినీ ఆశ్చర్యపరచింది. దీంతో సచిన్ అభిమానులు బీసీసీఐపై అసంతృప్తితో ఉన్నారు. ఇంకోసారి 10నంబర్ జెర్సీని ధరించవద్దని శార్దుల్‌కు విజ్ఞప్తి చేశారు. అది ఒక నంబర్ కాదని, తమ ఎమోషన్ అని, శార్దుల్ జెర్సీ నంబర్ దయచేసి మార్చండి అంటూ బీసీసీఐని కోరారు.
మరికొంత మంది అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని బీసీసీఐ, జెర్సీ ధరించిన శార్దులకు ట్వట్టర్‌లో ఘాటుగా వార్నింగ్‌లుకూడా ఇచ్చారు. శార్దుల్ సచిన్ జెర్సీ వేసుకోవడం మాకు నచ్చలేదు. సచిన్ స్థానంలో మరొకరిని ఊహించుకోలేమని అభిమానులు అన్నారు. 10నెంబర్ జెర్సీ కొత్తగా వచ్చే వాళ్లకు ఇచ్చి దానికి ఉన్న విలువ తగ్గించొద్దంటూ మండిపడ్డారు.
Hey @imShard, please don't wear #JersyNo10 next time. Leave it for #Sachin10 #RetireJerseyNo10 @BCCI r u listening?? @sachin_rt @imVkohli
— Gaurav Sharma (@mightygaurav842) September 1, 2017
@imVkohli sincere request from Sachin fans. Pls ask Shardal Thakur to change his Jersey no