డైరెక్ట్‌గా ఓటీటీకి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Bollywood Stars Sara ali khan and Karisma mystery Thriller Release On this OTT | Sakshi
Sakshi News home page

మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. భారీ తారాగణం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Tue, Mar 5 2024 7:48 PM | Last Updated on Tue, Mar 5 2024 8:41 PM

Bollywood Stars Sara ali khan and Karisma mystery Thriller Release On this OTT - Sakshi

ప్రస్తుతం ఆడియన్స్‌ ఓటీటీకి బాగా అడిక్ట్ అయిపోయారు. అలాంటి వారికోసమే వరుసపెట్టి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు  సందడి చేస్తున్నాయి. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌, జానర్‌లతో ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్, కరిష్మా కపూర్, విజయ్ వర్మ, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, డింపుల్‌ కపాడియా లాంటి భారీ తారాగణంతో రూపొందించిన మర్డర్‌ మిస్టరీ మూవీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న మర్డర్ ముబారక్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.  

ఈ చిత్రానికి హోమి అడజానియా దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్‌ స్టార్స్‌ ఈ చిత్రంలో నటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్‌గానే తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని సెలబ్రిటీలు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలకు మాత్రమే అనుమతి ఉన్న రాయల్ ఢిల్లీ క్లబ్‌లో జరిగిన ఓ మర్డర్‌ ఆధారంగా కథను రూపొదించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ డైరెక్ట్‌గా మార్చి 15వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

కాగా.. సారా అలీ ఖాన్ నటించిన మరో మూవీ 'ఏ వతన్ మేరే వతన్' కూడా నేరుగా ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement