Pankaj Tripathi
-
మున్నా భయ్య ఈజ్ బ్యాక్.. సినిమాగా 'మీర్జాపుర్' సిరీస్
మన దేశంలో ఓటీటీల్లోనే ద బెస్ట్ వెబ్ సిరీస్‌ల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు 'మీర్జాపుర్'. తొలుత హిందీలో మాత్రమే తీశారు. కానీ ఊహించని రెస్పాన్స్ వచ్చేసరికి తెలుగు లాంటి ప్రాంతీయ భాషల్లో డబ్ చేశారు. దీంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పటికే మూడు సీజన్లు రాగా.. నాలుగో సీజన్ కూడా ఉంటుందని అన్నారు. ఇంతలోనే మూవీగా దీన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు)'మీర్జాపుర్' వెబ్ సిరీస్‌లో హీరో కంటే మున్నాభయ్య అనే విలన్ పాత్రకే బీభత్సమైన క్రేజ్ వచ్చింది. తొలి రెండు సీజన్లలో ఈ పాత్ర ఉండటంతో ఎంటర్టైనింగ్గా అనిపించింది. మూడో సీజన్లో మున్నాభయ్యా లేకపోయేసరికి చాలామందికి సిరీస్ నచ్చలేదు. ఇక నాలుగో సీజన్ అంటే సాహసమనే చెప్పాలి.సరే ఇదంతా పక్కనబెడితే 'మీర్జాపుర్' సిరీస్‌లో మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు, బూతులపై విమర్శలు వచ్చినప్పటికీ.. జనాలు వాటినే తెగ చూశారు. ఇప్పుడు 2026లో 'మీర్జాపుర్'ని సినిమాగా తీసుకొస్తామని ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ కొత్త కథ ఏం చూపిస్తారు? బూతులు, వయలెంట్ సీన్స్ లాంటివి లేకుండా ఇంటెన్సెటినీ ఎలా చూపిస్తారనేది పెద్ద క్వశ్చన్. అయితే ఇదంతా సిరీస్‌కి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలానే అనిపిస్తుంది!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ
మీర్జాపూర్.. ఓటీటీల్లో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ల లిస్ట్‌లో టాప్‌లో ఉంటుంది. 2018లో తొలి సీజన్‌తో మిర్జాపూర్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత 2020లో రెండో సీజన్‌తో ప్రేక్షకుల అంచనాలకు మించి హిట్ కొట్టారు. ఇప్పుడు మీర్జాపూర్ సీజన్-3 ద్వారా ఓటీటీలో తమ సత్తా చూపించారు. క్రైమ్ యాక్షన్ జానర్లో వచ్చిన ఈ సిరీస్‌లు యూత్ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాయి. ఈ కథ మొత్తం ప్రధానంగా కొన్ని పాత్రల చుట్టే తిరుగుతుంది. కాలీన్‌భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు పండిత్ ( అలీ ఫజల్) బబ్లూ పండిత్ (విక్రాంత్ మాస్సే), మున్నా భాయ్ (దివ్యేందు) గోలు (శ్వేతా త్రిపాఠి), బీనా త్రిపాఠి (రసిక దుగల్) భరత్ త్యాగి (విజయ్ వర్మ) పేర్లతోనే ఎక్కువ పాపులర్ కావడం కాకుండా మీర్జాపూర్లో మెప్పించారు.మీర్జాపూర్ వెబ్‌సిరీస్.. మొదటి రెండు సీజన్లు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. భారీ క్రైమ్ యాక్షన్ జానర్లో వచ్చిన ఈ సిరీస్ ముఖ్యంగా యువతను విశేషంగా అలరించాయి. అందుకే ఈ సీరిస్ నుంచి మిలియన్ల కొద్ది మీమ్స్ వైరల్ అయ్యాయి. సీజన్-3 కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణకు ఫుల్స్టాప్ పడింది. నేడు (జులై 5) నుంచి మిర్జాపూర్-3 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు.మీర్జాపూర్ మొదటి సీజన్లో గుడ్డూ భయ్యా (అలీ ఫజల్),బబ్లూ పండిత్ (విక్రాంత్ మాస్సే) అనే ఇద్దరు అన్నదమ్ములు కాలీన్ భయ్యా కోసం పనిచేయడం. ఆ సీజన్ చివర్లో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా చేతిలో గుడ్డూ భయ్యా తన సోదరుడితో పాటు సన్నిహితులను కోల్పోతాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా రివేంజ్ తీర్చుకుంటాడు. సీజన్ చివరకు మీర్జాపూర్ గద్దెపై ఎలా కూర్చుంటాడన్నది చూపించారు. ఈ క్రమంలో కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను గుడ్డు చంపేస్తాడు. కానీ, కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని వెళ్లిపోవడం చూపించారు. సరిగ్గా అక్కడి నుంచే సీజన్- 3 ప్రారంభం అవుతుంది.సీజన్-3 కథ ఏంటి..?సీజన్-3 మున్నా భయ్యా అంత్యక్రియలతో ప్రారంభం అవుతుంది. మున్నా సతీమణి మాధురి (ఇషా తల్వార్) ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆమెను శరద్ శుక్లా కలుస్తాడు. మీర్జాపూర్‌ను తిరిగి దక్కించుకునేందుకు ఒకరికొకరం సాయంగా ఉండాలని కోరుతాడు. కానీ, కాలీన్ భయ్యాను కాపాడిన సంగతి ఆమెకు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్‌కు కొత్త డాన్‌గా గుడ్డు భయ్యా అవుతాడు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్‌గా ఉంటుంది. గుడ్డు భయ్యా మిర్జాపూర్ సింహాసనంపై కూర్చున్నప్పటికీ పూర్వాంచల్‌లో అధికార పోరు కొనసాగుతోంది. కాలీన్ భయ్యాను కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కూడా మీర్జాపూర్ సింహాసనంపై దృష్టి సారిస్తారు. దీంతో శరద్ శుక్లా , గుడ్డు భయ్యా మధ్య నేరుగా ఘర్షణ జరుగుతుంది. అలా కాలీన్ భయ్యా లేకుండానే మొదటి నాలుగు ఎపిసోడ్లు పూర్తి అవుతాయి. ఈ అధికార పోరు మధ్య, SSP మరణానికి సంబంధించి పండిట్ జీ ఆరోపణలను ఎదుర్కోవడంతో, ఒక రాజకీయ ఆట సాగుతుంది.మరోవైపు ముఖ్యమంత్రి మాధురీ యాదవ్ కూడా శరద్ శుక్లాతో పాటు దద్దా త్యాగి (లిల్లిపుట్ ఫరూఖీ), అతని కుమారుడు (విజయ్ వర్మ) నుంచి మద్దతు తీసుకుంటుంది. ఇలా వీరందరూ గుడ్డు భయ్యాను బలహీనపరచేందుకు పెద్ద ఎత్తున ప్లాన్స్ వేస్తుంటారు. జైలులో ఉన్న గుడ్డు పండిట్ తండ్రి రమాకాంత్ పండిట్ జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. కొత్త శత్రుత్వాలు, స్నేహాల ఆవిర్భావంతో, కాలీన్ భయ్యా పునర్జన్మను పొందుతారు. మిర్జాపూర్ సింహాసనం కోసం కొత్త, చివరి సరైన వారసుడి కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. బీనా త్రిపాఠి బిడ్డకు అసలు తండ్రి ఎవరనే అనుమానం ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. దీనికి సంబంధించిన క్లూ సీజన్లో వెల్లడి అవుతుంది. చివరికి, కాలీన్ భయ్యాతో కోడలు మాధురి కలిసి కథకు నిజమైన ట్విస్ట్ జోడించి మొత్తం ఆటను మలుపు తిప్పుతుంది. మొత్తం 10 ఎపిసోడ్లలో మీరు ఊహించని విధంగా చివరి 15 నిమిషాల్లో అద్భుతమైన క్లైమాక్స్ ఉంటుంది. మీరు ఈ కథను ఉత్తరప్రదేశ్‌లోని ఇటీవలి రాజకీయాలకు కూడా అనుబంధించవచ్చు. "భయం లేని రాష్ట్రం" అనే పదే పదే వచ్చే థీమ్ మీకు యోగి ఆదిత్యనాథ్ పరిపాలనను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అతిక్ అహ్మద్ మరణం తర్వాత గ్యాంగ్స్టర్లలో చట్టాన్ని అమలు చేయడం పట్ల భయం కూడా చిత్రీకరించబడింది. రాజకీయ ఫిరాయింపులు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నీ ఈ సీజన్‌ని ఇటీవలి ఈవెంట్లకు సంబంధించినవిగా చేస్తాయి.గుడ్డు భయ్యా, గోలు ఇద్దరూ మీర్జాపూర్‌ను తమ గుప్పిట్లో ఉంచుకోగలిగారా..? గుడ్డు భయ్యాకు ప్రధాన శత్రువు ఎవరు..? జైలుకు ఎందుకు వెళ్తాడు..? మీర్జాపూర్ పీఠం దక్కిన సమయంలో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి..? మీర్జాపూర్ పీఠం కోసం ఎంతమంది పోరాటం చేస్తున్నారు..? కాలీన్ భయ్యా భార్య బీనా నిజంగానే గుడ్డు, గోలుకు అండగా నిలిచిందా..? పూర్వాంచల్ పవర్ కోసం ఎటువంటి రక్తపాతం జరిగింది..? గుడ్డు షూట్ చేశాక కాలిన్ ఎలా తిరిగొచ్చాడు..? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలనే ముఖ్యమంత్రి మాధురి (ఇషా తల్వార్) లక్ష్యం నెరవేరిందా..? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు అందరినీ మెప్పిస్తుంది.సిరీస్ ఎలా ఉంది..?'మీర్జాపూర్'కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు, నాలుగేళ్లుగా ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఈ సీజన్ గత వాటితో పోలిస్తే అంతగా మెప్పించకపోవచ్చు. ముఖ్యంగా మున్నా భయ్యా లేకపోవడం, ఆపై కథలో కాలీన్ భయ్యాకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఈ సీజన్‌కు బిగ్ మైనస్ అని చెప్పవచ్చు. సీజన్ మొత్తం చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. మూడవ ఎపిసోడ్ వరకు కథలో వేగం కనిపించదు. కథ బలహీనంగా ఉండటమే కాకుండా ప్రధాన పాత్రల నుంచి వచ్చే సీన్లు ప్రేక్షకుల అంచనాలకు దగ్గరగా కనిపిస్తాయి. కానీ, మీర్జాపూర్ అభిమానులకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. గత సీజన్లను పోల్చుకుంటూ చూస్తే మాత్రం కాస్త కష్టం. మీర్జాపూర్ అంటేనే వయలెన్స్, సీరిస్‌కు అదే ప్రధాన బలం. కానీ, ఈ సీజన్లో హింసను చాలా వరకు తగ్గించారు. పొలిటికల్ డ్రామాను ఎక్కువగా చూపించారు. ఫిమేల్ పాత్రలకు భారీగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులోని ప్రతి ఎపిసోడ్ సుమారు 45 నుంచి 50 నిమిషాల పాటు ఉంటుంది. దీంతో సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. కథలో నెక్స్ట్ ఏంటి..? అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కనిపించలేదు. ఇందులోని స్క్రీన్ ప్లే కూడా చాలా సీన్స్‌లలో ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే ఉంటాయి.ఎవరెలా చేశారంటే..?గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. ఈ సీజన్ మొత్తం తన తన భుజాలపై మోశారు. కానీ, ఒక్కడిపై భారం అంతా పడటంతో షో రన్ చేయడం కష్టమైంది. గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడా నిరుత్సాహపరచదు. ఇందులో ఆమె పాత్ర అందరినీ మెప్పిస్తుంది. అంజుమ్ శర్మ సైతం తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోశారు. ఆమె పాత్ర అండర్ రైట్‌గా అనిపిస్తుంది. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. అందరి కంటే విజయ్ వర్మ ఎక్కువ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా సరే తన మార్క్ చూపించారు. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ ఈ సిరీస్‌ను అనుకున్నంత స్థాయిలో తెరకెక్కించారు. కానీ, అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల కాస్త రెస్పాన్స్ తగ్గే అవకాశం ఉంది. 'మీర్జాపూర్ సీజన్ -3' చూడదగినది. మునుపటి సీజన్ల మాదిరి మెప్పంచకపోవచ్చు కానీ, మీరు ఈ సిరీస్‌కి అభిమాని అయితే, మీరు దీన్ని మిస్ చేయకండి. -
ఓటీటీలోకి మీర్జాపూర్ 3... సీజన్ 1, 2లో ఏం జరిగింది?
‘మీర్జాపూర్’.. ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరిస్ ఇది. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రేక్షకుల అంతా ఈ క్రైమ్ యాక్షన్ వెబ్ సిరీస్‌ని ఆదరించారు. ముఖ్యంగా యూత్‌కి ఈ సిరీస్ బాగా నచ్చింది. ఇప్పటి వరకు రెండు సీజన్లు రాగా.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. అలీ ఫజల్, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, పంకజ్ త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో నటించిన మీర్జాపూర్ సీజన్ 3 జులై 5 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో అసలు సీజన్ 1, 2లలో చెప్పారు? సీజన్ 3లో ఏం చూపించబోతున్నారు? తెలుసుకుందాం.గన్స్, డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది. మీర్జాపూర్ మొత్తం కాలీన్ భాయ్(పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉంటుంది. అక్కడి మాఫియా సామ్రాజ్యానికి అతనే మహా రాజు. కాలీన్ భాయ్ కొడుకు మున్నా భాయ్(దివ్యేంద్) ఓ పెళ్లి కొడుకును గన్‌తో కాల్చి చంపేస్తాడు. ఈ కేసును లాయర్ రమాకాంత్ పండిత్(రాజేశ్ తైలాంగ్) వాధిస్తాడు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు పేరు గుడ్డు పండిత్(అలీ ఫజల్), చిన్న కొడుకు బబ్లూ పండిత్(విక్రాంత్ మస్సే), కూతురు డింపీ(హర్షిత). కొడుకును కాపాడుకునేందుకు కాలీన్ భాయ్ భారీ ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో తన వ్యాపార పనులను గుడ్డు, బబ్లులకు అప్పగిస్తాడు. దీంతో మున్నా..తీవ్ర కోపంతో రగిపోతుంటాడు. గుడ్డు ప్రేయసి స్వీటీపై కన్నేస్తాడు. ఆమె దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన గుడ్డు, స్వీటీ, బబ్లూ, డింపీలపై మున్నా తన గ్యాంగ్‌తో దాడి చేస్తాడు. ఈ దాడిలో గర్భిణి అయిన స్వీటీతో పాటు బబ్లు కూడా చనిపోతాడు. గోలు సహాయంతో గుడ్డు తప్పించుకుంటాడు. ఇంతటితో సీజన్ 1 ముగుస్తుంది.మున్నా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరంభమయ్యే సన్నివేశాలతో సీజన్-2 మొదలవుతుంది. మరోవైపు డింపీ, గోలు కలిసి ఓ డాక్టర్ని కిడ్నాప్ చేసి గుడ్డుకు చికిత్స చేయిస్తారు. మున్నాను ఎలాగైన చంపేయాలనే పగతో రగిలిపోతుంటారు. మీర్జాపూర్లో కాలీన్ భాయ్‌కు అత్యంత నమ్మకస్తుడైన మక్బూల్.. ఒకప్పుడు తన కుటుంబ సభ్యుడి చావుకు కారణం అయ్యాడనే కోపంతో కాలీన్ తండ్రిని చంపేందుకు ప్లాన్ వేస్తాడు. కాలీన్ భార్య బీనా కూడా అతనితో చేతులు కలిపి మామను చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు మీర్జాపూర్ డాన్ సింహాసనంపై ఆశపడి తండ్రినే చంపేందుకు ప్లాన్ వేస్తాడు మున్నా. అందుకోసం శరత్ శుక్లాతో చేతులు కలుపుతాడు. అయితే గుడ్డు, గోలులు మాత్రం పక్కా ప్లాన్‌తో మున్నాపై దాడికి దిగుతారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాలీన్ భాయ్‌ని శరత్ కాపాడగా.. మున్నాను మాత్రం ప్రాణాలు కోల్పోతాడు. అనంతరం గుడ్డు మీర్జాపూర్ సింహాసనాన్ని అధిరోహిస్తాడు. ఇంతటితో సీజన్ 2కి ఎండ్ కార్డు పడుతుంది.మీర్జాపూర్ 3లో ఏం చూపించబోతున్నారు?మీర్జాఫూర్ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న గుడ్డు.. పూర్వాంచల్‌లో తన ఆదిపత్యాన్ని కొనసాగించాలనుకుంటాడు. మీర్జాపూర్లో కాలీన్ భాయ్ గుర్తులేవి లేకుండా చేస్తాడు. మరోవైపు భర్త మున్నాభాయ్ మరణంతో అతని భార్య, యూపీ సీఎం కూతురు మాధురి రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. కాలీన్ భాయ్‌పై సింపథీ క్రియేట్ చేసి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో కాలీన్ భాయ్ తిరిగి వచ్చినట్లు ట్రైలర్లో చూపించారు. మీర్జాఫూర్ మాఫీయా సామ్రాజ్యాన్ని కాలీన్ భాయ్ తిరిగి పొందడా? డాన్‌గా ఎదిగిన తర్వాత గుడ్డు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? మాధురి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది? తదితర విషయాలన్నీ తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే. -
స్ట్రీమింగ్కు వచ్చేస్తోన్న ఆసక్తికర వెబ్ సిరీస్.. ట్రైలర్ వచ్చేసింది!
ఓటీటీ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న వెబ్‌సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే రెండు సీజన్స్ సినీ ప్రియులను అలరించాయి. తాజాగా మూడో సీజన్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్ వచ్చే నెల 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజాగా మూడో సీజన్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ , శ్వేతా త్రిపాఠి శర్మ, విజయ్ వర్మ, ఇషా తల్వార్ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ చూస్తే గత సీజన్లను మించి ఉంటుందని అర్థమవుతోంది. కొత్త సీజన్లో మరికొన్ని పాత్రలు పరిచయం చేయనున్నారు. -
ఓటీటీకి మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న బయోపిక్ మెయిన్ అటల్ హూన్. రవి జాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఈ మూవీ హక్కులను ఇప్పటికే సొంతం చేసుకున్న జీ5 స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈనెల 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఇందులో పంకజ్ త్రిపాఠి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఆయన పర్సనల్ లైఫ్, రాజకీయ జీవితం గురించి చూపించారు. ఈ చిత్రంలో పీయూష్ మిశ్రా, దయా శంకర్ పాండే, రాజా సేవక్, ఏక్తా కౌల్ పలువురు నటించారు. జనవరి 19, 2024న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రెండు నెలల్లోపే ఓటీటీకి వచ్చేస్తోంది. Shuru karo taiyaari, aa rahe hain Atal Bihari! #MainAtalHoon premieres on 14th March, only on #ZEE5#AtalOnZEE5#MainAtalHoon@TripathiiPankaj @meranamravi @vinodbhanu @thisissandeeps #KamleshBhanushali @thewriteinsaan #BhaveshBhanushali @directorsamkhan @BSL_Films… pic.twitter.com/so934WIZOu — ZEE5 (@ZEE5India) March 10, 2024 -
డైరెక్ట్‌గా ఓటీటీకి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఆడియన్స్ ఓటీటీకి బాగా అడిక్ట్ అయిపోయారు. అలాంటి వారికోసమే వరుసపెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్, జానర్లతో ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్, కరిష్మా కపూర్, విజయ్ వర్మ, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, డింపుల్ కపాడియా లాంటి భారీ తారాగణంతో రూపొందించిన మర్డర్ మిస్టరీ మూవీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మర్డర్ ముబారక్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి హోమి అడజానియా దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్‌గానే తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని సెలబ్రిటీలు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలకు మాత్రమే అనుమతి ఉన్న రాయల్ ఢిల్లీ క్లబ్లో జరిగిన ఓ మర్డర్ ఆధారంగా కథను రూపొదించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ డైరెక్ట్‌గా మార్చి 15వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. సారా అలీ ఖాన్ నటించిన మరో మూవీ 'ఏ వతన్ మేరే వతన్' కూడా నేరుగా ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్‌పై పబ్లిక్ రెస్పాన్స్ ఇదే
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి బయోపిక్ (Main Atal Hoon) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి జాదవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'మే అటల్ హూ' అనే పేరుతో థియేటర్లలోకి వచ్చింది. బాలీవుడ్లో టాప్ యాక్టర్‌గా కొనసాగుతున్న పంకజ్ త్రిపాఠి అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రకు జీవం పోశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ చిత్రంలో అటల్ బిహారీ వాజపేయి జీవితం గురించి ఉన్నది ఉన్నట్లు చూపించారని రివ్యూలు వస్తున్నాయి. ఆయన పాత్రలో త్రిపాఠి జీవించేశారని తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో నెటిజన్లు సినిమాపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు త్రిపాఠి, టీమ్‌ను తెరపై లెజెండరీ లీడర్‌గా చూపించినందుకు ప్రశంసించారు. సినిమాపై ప్రశంసలు కురిపించిన ఓ సోషల్ మీడియా యూజర్ పంకజ్ త్రిపాఠి నటన అద్భుతం అని అన్నారు.‘మే అటల్ హూ, అందరూ తప్పక చూడాల్సిన సినిమా’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన ఓ నెటిజన్ ఈ చిత్రం అందరి హృదయాలను గెలుచుకుంది. అటల్ బిహారీ వాజ్‌పేయిని తెరపై చూపించడం అంత ఈజీ కాదని రాశారు. పంకజ్ త్రిపాఠి తన అద్భుతమైన నటనతో మరోసారి సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని ఆయన నటనకు విస్మయం చెందానని ఒకరు పేర్కొన్నారు. ‘మే అటల్ హూ – పంకజ్ త్రిపాఠి కెరీర్లో ఇప్పటివరకు బెస్ట్ ఫిల్మ్ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ చిత్రానికి రవి జాదవ్ దర్శకత్వం వహించారు. వాజ్‌పేయి జీవితం, రాజకీయాల ఆధారంగా 137 నిమిషాల నిడివిగల ఈ చిత్రం పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణు పరీక్షలతో సహా కొన్ని అత్యంత క్లిష్టమైన సమయాల్లో భారతదేశాన్ని నడిపించడంలో అటల్ పాత్రను వర్ణిస్తుంది. వ్యక్తిగత తగాదాలు, కుటుంబ సమస్యలు కూడా బయటపడ్డాయి. అలాగే, సాహిత్యంపై ఆయనకున్న మక్కువను ఈ చిత్రం ఎత్తిచూపింది. దేశానికి అటల్ చేసిన సేవలు తెరపై అద్భుతంగా చూపించారని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. ఒక రాజనీతిజ్ఞుడిగా భారతదేశానికి అటల్ చేసిన త్యాగాలను కూడా మెయిన్ అటల్ హూన్లో కనిపిస్తాయి. ఈ సినిమా స్క్రీన్‌ప్లే చలించేలా ఉందని.. ఇందులో దర్శకుడి పనితీరును ఎవరైనా మెచ్చుకోవాల్సిందే అని తెలుపుతున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా నెమ్మదిగా కథ నడుస్తుంది.. దానిని మీరు తట్టుకోగలిగితే సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఉత్కంఠతతో కొనసాగుతుందని కొందరు తెలుపుతున్నారు. ఇదొక విజువల్ ట్రీట్ అని పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. చిత్రంలోని మొదటి భాగంలో వచ్చే డైలాగ్‌లు అంతగా ఆకట్టుకోలేదు కానీ ఇంటర్వెల్ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిజమైన పరాక్రమాన్ని వర్ణిస్తుందని నెటిజన్లు పేర్కొన్నారు. అయోధ్యను రామజన్మభూమిగా ప్రకటించాలనే అంశాలు, ఉద్యమాలు ఇందులో కనిపిస్తాయి. అరుదైన రాజకీయ మేధావిగా ప్రసిద్ధి. అటల్ బిహారీ వాజ్‌పేయి కవిగా, రాజకీయవేత్తగా, మానవతావాదిగా పేరుపొందారు. వాజ్పాయ్ బీజేపీని ప్రభావితం చేసిన నాయకులలో ఒకరు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దేశ పదవ ప్రధానిగా అటల్ బిహారీ వాజపేయి ప్రమాణ స్వీకారం చేశారు. #OneWordReview...#MainAtalHoon: CAPTIVATING. Rating: ⭐️⭐️⭐️½ It’s tough to make a biopic on a stalwart and encompass pertinent episodes from his lifespan in 2+ hours… #NationalAward-winning director #RaviJadhav achieves it with flourish… #MainAtalHoon is, without doubt, one of… pic.twitter.com/rkR9Ab4pPP — taran adarsh (@taran_adarsh) January 19, 2024 Watch #MainAtalHoon in theatres now!#PankajTripathi actor par excellence pic.twitter.com/4KLugu43Ig — Kungfu Pande 🇮🇳 (Parody) (@pb3060) January 19, 2024 Amazing performance by Pankaj Tripathi. I believe it should’ve rather been a series than a movie. 2 hours is too little for a film to be made on Bharat Ratna Shri Atal Bihari Vajpayee ji 🙏🏻 A must watch film that I’d recommend.#MainAtalHoonReview#MainAtalHoon pic.twitter.com/Td2pJK9EwE — Lohit Kamarajugadda (@Onlylohit) January 19, 2024 Saw #MainATALHoon yesterday at a special screening. “Bharat ka PM, Jung jeetne k baad hi baat karega.” Mind blowing performance by #PankajTripathi do watch in theatres near you pic.twitter.com/f5H8w0Bs7S — Kungfu Pande 🇮🇳 (Parody) (@pb3060) January 17, 2024 #MainATALHoon screening last evening gives u the taller picture of why we too have to be ATAL if we want the BHARAT of our dreams We r close very very close Brilliantly played by #PankajTripathi It is a story of a great leader who began this journey of Nation first Must watch pic.twitter.com/JAzpgey2w0 — Shirin Udhas Aggarwal (@ua_shirin) January 17, 2024 #MainAtalHoonReview | Film #MainAtalHoon is an honest attempt backed by a stellar performance by @TripathiiPankaj who is the heart and soul of the film Rating: ⭐⭐⭐⭐ Once again #PankajTripathi proves that he is an actor par excellence & no one would have done justice to… pic.twitter.com/tCINnZlSV3 — Aashu Mishra (@Aashu9) January 18, 2024 Movie: Main Atal Hoon Rating: ⭐️⭐️⭐️½ Review: ADMIRABLE Pankaj Tripathi delivers one of his career-best in #MainATALHoon 👏 Ravi Jadhav did decent work, @meranamravi 👍#AtalBihariVajpayee #MainAtalHoonReview @TripathiiPankaj #PankajTripathi https://t.co/7JYLQwbCj0 — Simran Kumari (@I_amSimran) January 19, 2024 -
ఆడిషన్‌కు వెళ్తే ఆర్జీవీ బెంచ్ మీద కూర్చోబెట్టి..: పంకజ్
కొన్నిసార్లు నిరాశ, ఓటములు కూడా మంచే చేస్తాయంటున్నాడు బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి. ఓసారి రామ్‌గోపాల్ వర్మ సినిమా ఆడిషన్‌కు వెళ్తే తనను సెలక్ట్ చేయలేదని, కానీ తర్వాత మాత్రం వేరే చోట్ల ఆఫర్స్ రావడంతో కెరీర్లో ముందుకు వెళ్లానని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ.. 'ముంబైలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అవకాశాల కోసం తిరిగాను. అలా ఓసారి రామ్‌గోపాల్ వర్మ ఆఫీసుకు వెళ్లాను. అక్కడికి వెళ్లేసరికే చాలామంది ఉన్నారు. వాళ్లంతా గూండాల్లా కనిపించారు. నా ముఖమేమో చూడటానికి కాస్త అమాయకంగా కనిపిస్తుంది. అందరూ భయంకరంగా.. మరి గూండా పాత్రకు నేను సూటవుతానా? లేదా? అన్న అనుమానంతోనే లోపలకు వెళ్లాను. కొందరికైతే ముక్కు, ముఖం మీద దెబ్బ తాకినట్లుగా గాయాలు కనిపించాయి. మీరు నటులేనా? అని అడిగితే అవునన్నారు. మరి ఎందుకింత భయంకరంగా రెడీ అయి వచ్చారని ప్రశ్నిస్తే.. ఆర్జీవీ ఖతర్నాక్‌గా కనిపించేవాళ్లనే సెలక్ట్ చేసుకుంటాడని చెప్పారు. తర్వాత వర్మ నన్ను పిలిచి బెంచీ మీద కూర్చోమన్నాడు. నా ఎదురుగా కూర్చుని 10-15 నిమిషాలపాటు నా కళ్లలోకి కళ్లు పెట్టి చూశాడు. ఎవరైనా మనల్ని అదేపనిగా చూస్తే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతా మన మంచికే! కాసేపటికే అతడు నన్ను వెళ్లిపోమని చెప్పాడు. తర్వాత మళ్లీ ఎప్పుడూ పిలవలేదు. కానీ అతడు అద్భుతమైన దర్శకుడు. మేము కలుసుకున్న ప్రతిసారి నా పనిని, నన్ను పొగుడుతూ ఉంటాడు. కాకపోతే ఆ సమయానికి మాకు సెట్ అవ్వలేదంతే! ఒకవేళ ఆరోజు ఆయన నన్ను సెలక్ట్ చేసి ఉంటే తను, నేను ఈ క్రేజ్ కోల్పోయేవాళ్లమేమో! ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. దేనికీ బాధపడకూడదు. ఏదో మంచి జరగబోతుందన్న ఆశతో బతికేయాలి' అని చెప్పుకొచ్చాడు. నాటకాల నుంచి సినిమాలకు.. కాగా పంకజ్ త్రిపాఠి.. స్కూల్లో నాటకాలు వేసేవాడు. అది కూడా అమ్మాయిల వేషాలు ఎక్కువగా వేసేవాడు. ఐటం సాంగ్స్‌కు డ్యాన్స్ చేసేవాడు. సరాదా కోసం వేసిన నటనే తర్వాత ఆయనకు జీవితంగా మారిపోయింది. బరేలీ కీ బర్ఫీ, న్యూటన్, స్త్రీ, గుంజన్ సక్సేనా వంటి పలు సినిమాల్లో నటించిన ఆయన మంచు విష్ణు 'దూసుకెళ్తా' మూవీలో విలన్‌గా నటించి తెలుగువారికీ దగ్గరయ్యాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్ వంటి వెబ్ సిరీస్‌లతో మరింత క్రేజ్ తెచ్చుకుని బిజీ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం అతడు 'మై అటల్ హూన్' సినిమా చేస్తున్నాడు. దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 19న విడుదల కానుంది. చదవండి: ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు ఎలా ఉందో చూశారా.. వీడియో వైరల్