మున్నా భయ్య ఈజ్ బ్యాక్.. సినిమాగా 'మీర్జాపుర్' సిరీస్ | Mirzapur Movie Announcement And Release Date | Sakshi
Sakshi News home page

Mirzapur Movie: కొత్తగా ఏం చూపిస్తారు? అంతా డబ్బుల కోసమేనా?

Published Mon, Oct 28 2024 11:24 AM | Last Updated on Mon, Oct 28 2024 11:41 AM

 Mirzapur Movie Announcement And Release Date

మన దేశంలో ఓటీటీల్లోనే ద బెస్ట్ వెబ్ సిరీస్‪‌ల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు 'మీర్జాపుర్'. తొలుత హిందీలో మాత్రమే తీశారు. కానీ ఊహించని రెస్పాన్స్ వచ్చేసరికి తెలుగు లాంటి ప్రాంతీయ భాషల్లో డబ్ చేశారు. దీంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పటికే మూడు సీజన్లు రాగా.. నాలుగో సీజన్ కూడా ఉంటుందని అన్నారు. ఇంతలోనే మూవీగా దీన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు)

'మీర్జాపుర్' వెబ్ సిరీస్‌లో హీరో కంటే మున్నాభయ్య అనే విలన్ పాత్రకే బీభత్సమైన క్రేజ్ వచ్చింది. తొలి రెండు సీజన్లలో ఈ పాత్ర ఉండటంతో ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. మూడో సీజన్‌లో మున్నాభయ్యా లేకపోయేసరికి చాలామందికి సిరీస్ నచ్చలేదు. ఇక నాలుగో సీజన్ అంటే సాహసమనే చెప్పాలి.

సరే ఇదంతా పక్కనబెడితే 'మీర్జాపుర్' సిరీస్‌లో మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు, బూతులపై విమర్శలు వచ్చినప్పటికీ.. జనాలు వాటినే తెగ చూశారు. ఇప్పుడు 2026లో 'మీర్జాపుర్'ని సినిమాగా తీసుకొస్తామని ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ కొత్త కథ ఏం చూపిస్తారు? బూతులు, వయలెంట్ సీన్స్‌ లాంటివి లేకుండా ఇంటెన్సెటినీ ఎలా చూపిస్తారనేది పెద్ద క్వశ్చన్. అయితే ఇదంతా సిరీస్‌కి ఉన్న క్రేజ్‪‍‌ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలానే అనిపిస్తుంది!

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement