'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్ | Pankaj Tripathi Criminal Justice Season 4 OTT Date | Sakshi
Sakshi News home page

Criminal Justice S4 OTT: క్రేజీ సిరీస్.. ఇప్పుడు నాలుగో సీజన్

Published Tue, Apr 29 2025 12:57 PM | Last Updated on Tue, Apr 29 2025 1:38 PM

Pankaj Tripathi Criminal Justice Season 4 OTT Date

కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు తెలుగులో పెద్దగా రాలేదు. రీసెంట్ టైంలో మాత్రం 'కోర్ట్' అనే మూవీ సూపర్ హిట్ అయింది. తొలుత థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ పైన ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే జోరు చూపించింది. 

'కోర్ట్'(Court Movie Telugu) గురించి కాసేపు పక్కనబెడితే ఇదే తరహాలో తీసిన వెబ్ సిరీసులు కూడా ఓటీటీలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'క్రిమినల్ జస్టిస్'(Criminal Justice). 2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. 'మీర్జాపుర్' ఫేమ్ పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi), విక్రాంత్ మస్సే ఇందులో నటించారు.

(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి? 

తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యేసరికి మరో కేసుని తీసుకుని 2020లో రెండో సీజన్, 2022లో మూడో సీజన్ రిలీజ్ చేశారు. వీటికీ మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు కూడా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని నాలుగో సీజన్ ని సిద్ధం చేశారు. 

'క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్' పేరుతో నాలుగో సీజన్ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. మే 22 నుంచి హాట్ స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈసారి ఎలాంటి కేసు వాదించబోతున్నారో అనేది చూడాలి?

(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్‌ సినిమా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement