‘మీర్జాపూర్’.. ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరిస్ ఇది. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రేక్షకుల అంతా ఈ క్రైమ్ యాక్షన్ వెబ్ సిరీస్‌ని ఆదరించారు. ముఖ్యంగా యూత్‌కి ఈ సిరీస్ బాగా నచ్చింది. ఇప్పటి వరకు రెండు సీజన్లు రాగా.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. అలీ ఫజల్, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, పంకజ్ త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో నటించిన మీర్జాపూర్ సీజన్ 3 జులై 5 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో అసలు సీజన్ 1, 2లలో చెప్పారు? సీజన్ 3లో ఏం చూపించబోతున్నారు? తెలుసుకుందాం.
గన్స్, డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది. మీర్జాపూర్ మొత్తం కాలీన్ భాయ్(పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉంటుంది. అక్కడి మాఫియా సామ్రాజ్యానికి అతనే మహా రాజు. కాలీన్ భాయ్ కొడుకు మున్నా భాయ్(దివ్యేంద్) ఓ పెళ్లి కొడుకును గన్‌తో కాల్చి చంపేస్తాడు. ఈ కేసును లాయర్ రమాకాంత్ పండిత్(రాజేశ్ తైలాంగ్) వాధిస్తాడు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు పేరు గుడ్డు పండిత్(అలీ ఫజల్), చిన్న కొడుకు బబ్లూ పండిత్(విక్రాంత్ మస్సే), కూతురు డింపీ(హర్షిత). కొడుకును కాపాడుకునేందుకు కాలీన్ భాయ్ భారీ ప్లాన్ వేస్తాడు.
ఈ క్రమంలో తన వ్యాపార పనులను గుడ్డు, బబ్లులకు అప్పగిస్తాడు. దీంతో మున్నా..తీవ్ర కోపంతో రగిపోతుంటాడు. గుడ్డు ప్రేయసి స్వీటీపై కన్నేస్తాడు. ఆమె దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన గుడ్డు, స్వీటీ, బబ్లూ, డింపీలపై మున్నా తన గ్యాంగ్‌తో దాడి చేస్తాడు. ఈ దాడిలో గర్భిణి అయిన స్వీటీతో పాటు బబ్లు కూడా చనిపోతాడు. గోలు సహాయంతో గుడ్డు తప్పించుకుంటాడు. ఇంతటితో సీజన్ 1 ముగుస్తుంది.
మున్నా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరంభమయ్యే సన్నివేశాలతో సీజన్-2 మొదలవుతుంది. మరోవైపు డింపీ, గోలు కలిసి ఓ డాక్టర్‌ని కిడ్నాప్ చేసి గుడ్డుకు చికిత్స చేయిస్తారు. మున్నాను ఎలాగైన చంపేయాలనే పగతో రగిలిపోతుంటారు. మీర్జాపూర్‌లో కాలీన్ భాయ్‌కు అత్యంత నమ్మకస్తుడైన మక్బూల్.. ఒకప్పుడు తన కుటుంబ సభ్యుడి చావుకు కారణం అయ్యాడనే కోపంతో కాలీన్ తండ్రిని చంపేందుకు ప్లాన్ వేస్తాడు. కాలీన్ భార్య బీనా కూడా అతనితో చేతులు కలిపి మామను చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది.
మరోవైపు మీర్జాపూర్ డాన్ సింహాసనంపై ఆశపడి తండ్రినే చంపేందుకు ప్లాన్ వేస్తాడు మున్నా. అందుకోసం శరత్ శుక్లాతో చేతులు కలుపుతాడు. అయితే గుడ్డు, గోలులు మాత్రం పక్కా ప్లాన్‌తో మున్నాపై దాడికి దిగుతారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాలీన్ భాయ్‌ని శరత్ కాపాడగా.. మున్నాను మాత్రం ప్రాణాలు కోల్పోతాడు. అనంతరం గుడ్డు మీర్జాపూర్ సింహాసనాన్ని అధిరోహిస్తాడు. ఇంతటితో సీజన్ 2కి ఎండ్ కార్డు పడుతుంది.
మీర్జాపూర్ 3లో ఏం చూపించబోతున్నారు?
మీర్జాఫూర్ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న గుడ్డు.. పూర్వాంచల్‌లో తన ఆదిపత్యాన్ని కొనసాగించాలనుకుంటాడు. మీర్జాపూర్‌లో కాలీన్ భాయ్ గుర్తులేవి లేకుండా చేస్తాడు. మరోవైపు భర్త మున్నాభాయ్ మరణంతో అతని భార్య, యూపీ సీఎం కూతురు మాధురి రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. కాలీన్ భాయ్‌పై సింపథీ క్రియేట్ చేసి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో కాలీన్ భాయ్ తిరిగి వచ్చినట్లు ట్రైలర్‌లో చూపించారు. మీర్జాఫూర్ మాఫీయా సామ్రాజ్యాన్ని కాలీన్ భాయ్ తిరిగి పొందడా? డాన్‌గా ఎదిగిన తర్వాత గుడ్డు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? మాధురి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది? తదితర విషయాలన్నీ తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment