అన్ని ప్రేమకథలు సుఖాంతం కావు.. ఇక్కడ చెప్పుకునే జంట కూడా అదే కోవలోకి వస్తుంది. హీరో అభిషేక్ బచ్చన్- హీరోయిన్ కరిష్మా కపూర్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నిశ్చితార్థం జరిగింది. తర్వాత పలు కారణాలతో అది రద్దయిపోయింది. అనంతరం అభిషేక్.. రాణీ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం నడిపాడు, కానీ అది కూడా సెట్ కాలేదు. చివరకు ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు.
2003లో పెళ్లి
అటు కరిష్మా కపూర్.. 2003లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్‌ను పెళ్లాడింది. వీరికి సమీరా, కిరణ్ అని ఇద్దరు సంతానం. కొంతకాలానికి ఈ జంట మధ్య పొరపచ్చాలు రావడంతో 2014లో విడాకులకు దరఖాస్తు చేయగా 2016లో మంజూరయ్యాయి. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన కరిష్మా ప్రస్తుతం 'మర్డర్ ముబారక్' అనే వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ క్రమంలో ఆమె వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
వేలానికి పెట్టాలని..
గతంలోని ఓ ఇంటర్వ్యూలో కరిష్మా మాట్లాడుతూ.. భర్తతో హనీమూన్‌కు వెళ్లినప్పుడు తన స్నేహితులతో రాత్రంతా గడపాలని ఒత్తిడి తీసుకొచ్చాడని వాపోయింది. ఒకానొక సమయంలో తనను వేలానికి పెట్టి అమ్మేయాలని చూశాడని కన్నీళ్లు పెట్టుకుంది. ఒకసారి తన తల్లితో కొట్టించాలని చూశాడని బాధపడింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అత్తారింట్లో పడరాని కష్టాలు పడుతుండటంతో ఆమె తండ్రి రణ్‌ధీర్ కపూర్ తల్లడిల్లిపోయాడు.
డబ్బు వెనక పరుగెత్తాల్సిన అవసరం లేదు
సమాజంలో మా స్థాయేంటో, మా స్థానమేంటో అందరికీ తెలుసు. మేము డబ్బుకోసం పాకులాడాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు మాకు ప్రతిభ, డబ్బు.. రెండింటినీ ఇచ్చాడు. ఆ సంజయ్.. థర్డ్ క్లాస్ వ్యక్తి.. అతడితో పెళ్లంటేనే నాకిష్టం లేదు. వాడెప్పుడూ నా కూతుర్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నా బిడ్డను వదిలేసి మరో అమ్మాయితో తిరిగాడు. అతడెలాంటివాడో ఢిల్లీ మొత్తానికి తెలుసు అంటూ ఆ సమయంలో ఆగ్రహానికి లోనైన విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment