Karisma Kapoor And Her Ex-Husband Sunjay Kapur Spotted In Mumbai, Video Viral - Sakshi
Sakshi News home page

Karisma Kapoor: అప్పుడు వరకట్నం కేసు పెట్టి.. ఇప్పుడేమో మాజీ భర్తతో కలిసిపోయి..

Published Sun, May 28 2023 12:27 PM | Last Updated on Sun, May 28 2023 1:16 PM

Karisma Kapoor Steps Out for Dinner with Ex Husband Sunjay Kapur - Sakshi

కొందరికి ఎన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు లభించదు. మరికొందరు మాత్రం ఫస్ట్‌ సినిమాతోనే క్లిక్‌ అవుతారు. ఆ జాబితాలోకే వస్తుంది హీరోయిన్‌ కరిష్మా కపూర్‌. మొదటి సినిమాతోనే అందరినీ ఆకర్షించిన ఆమె వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. 2012లో డేంజరస్‌ ఇష్క్‌ చిత్రంలో చివరిసారి పూర్తి స్థాయిలో నటించిన ఆమె ఆ తర్వాత బాంబే టాకీస్‌, జీరో సినిమాల్లో కొద్ది నిమిషాలే అతిథి పాత్రలో మెరిసింది. దాదాపు పదేళ్ల తర్వాత మర్డర్‌ ముబారక్‌ అనే సినిమా చేస్తోంది. మధ్యలో వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలు కూడా చేసింది.

మాజీ భర్తతో డిన్నర్‌..
ఇకపోతే గతంలో వ్యాపారవేత్త సంజయ్‌ కపూర్‌ను పెళ్లి చేసుకున్న ఆమె కొంతకాలానికి అతడికి విడాకులు ఇచ్చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా కరిష్మా తన భర్త, అత్తలపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది. ఆశ్చర్యంగా వాళ్లిద్దరూ ఇప్పుడు కలిసిపోయారు. ఆదివారం నాడు మాజీ భర్తతో కలిసి ముంబైలో రెస్టారెంట్‌కు వెళ్లింది కరిష్మా.

ఇద్దరూ డిన్నర్‌ చేసి బయటకు వచ్చే సమయంలో అక్కడున్న కెమెరామన్లు వారి ఫోటోలను క్లిక్‌మనిపించడమే కాకుండా వీడియో తీసి సోషల్‌ మీడియాలో వదిలారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. విడాకుల సమయంలో దుమ్మెత్తిపోసుకున్నారు, ఇప్పుడు ఇలా కలిసిపోయారేంటి? ఇది నిజమేనా? నటిస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఇలా కలవడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చిలోనూ కరిష్మా కొడుకు కిరణ్‌ రాజ్‌ బర్త్‌డేను కలిసే సెలబ్రేట్‌ చేశారు. సంజయ్‌ భార్య ప్రియ కూడా తన పిల్లలతో కలిసి ఈ వేడుకలో పాల్గొంది.

కరిష్మా- సంజయ్‌ విడాకులు..
2003లో ఢిల్లీ వ్యాపారవేత్త సంజయ్‌ను పెళ్లాడింది కరిష్మా. వీరికి సమీరా, కిరణ్‌ అని ఇద్దరు సంతానం. కొంతకాలానికి ఈ జంట మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2014లో విడాకులకు దరఖాస్తు చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 2016లో విడాకులు మంజూరు అవగా పిల్లల బాధ్యతను తల్లికే అప్పజెప్పింది న్యాయస్థానం. 2017లో ప్రియను పెళ్లాడాడు సంజయ్‌. ఇది ప్రియకు కూడా రెండో వివాహమే!

చదవండి: శర్వానంద్‌కు యాక్సిడెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement