Sunjay Kapur
-
మాజీ భర్తతో డిన్నర్‌కు వెళ్లిన హీరోయిన్, వీడియో వైరల్
కొందరికి ఎన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు లభించదు. మరికొందరు మాత్రం ఫస్ట్ సినిమాతోనే క్లిక్ అవుతారు. ఆ జాబితాలోకే వస్తుంది హీరోయిన్ కరిష్మా కపూర్. మొదటి సినిమాతోనే అందరినీ ఆకర్షించిన ఆమె వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. 2012లో డేంజరస్ ఇష్క్ చిత్రంలో చివరిసారి పూర్తి స్థాయిలో నటించిన ఆమె ఆ తర్వాత బాంబే టాకీస్, జీరో సినిమాల్లో కొద్ది నిమిషాలే అతిథి పాత్రలో మెరిసింది. దాదాపు పదేళ్ల తర్వాత మర్డర్ ముబారక్ అనే సినిమా చేస్తోంది. మధ్యలో వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలు కూడా చేసింది. మాజీ భర్తతో డిన్నర్.. ఇకపోతే గతంలో వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను పెళ్లి చేసుకున్న ఆమె కొంతకాలానికి అతడికి విడాకులు ఇచ్చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా కరిష్మా తన భర్త, అత్తలపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది. ఆశ్చర్యంగా వాళ్లిద్దరూ ఇప్పుడు కలిసిపోయారు. ఆదివారం నాడు మాజీ భర్తతో కలిసి ముంబైలో రెస్టారెంట్‌కు వెళ్లింది కరిష్మా. ఇద్దరూ డిన్నర్ చేసి బయటకు వచ్చే సమయంలో అక్కడున్న కెమెరామన్లు వారి ఫోటోలను క్లిక్‌మనిపించడమే కాకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. విడాకుల సమయంలో దుమ్మెత్తిపోసుకున్నారు, ఇప్పుడు ఇలా కలిసిపోయారేంటి? ఇది నిజమేనా? నటిస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఇలా కలవడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చిలోనూ కరిష్మా కొడుకు కిరణ్ రాజ్ బర్త్‌డేను కలిసే సెలబ్రేట్ చేశారు. సంజయ్ భార్య ప్రియ కూడా తన పిల్లలతో కలిసి ఈ వేడుకలో పాల్గొంది. కరిష్మా- సంజయ్ విడాకులు.. 2003లో ఢిల్లీ వ్యాపారవేత్త సంజయ్‌ను పెళ్లాడింది కరిష్మా. వీరికి సమీరా, కిరణ్ అని ఇద్దరు సంతానం. కొంతకాలానికి ఈ జంట మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2014లో విడాకులకు దరఖాస్తు చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 2016లో విడాకులు మంజూరు అవగా పిల్లల బాధ్యతను తల్లికే అప్పజెప్పింది న్యాయస్థానం. 2017లో ప్రియను పెళ్లాడాడు సంజయ్. ఇది ప్రియకు కూడా రెండో వివాహమే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: శర్వానంద్‌కు యాక్సిడెంట్ -
కరీష్మా కపూర్ రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్
ముంబయి: ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీష్మా కపూర్ పెళ్లి విషయంలో తన మాజీభర్త సంజయ్ కపూర్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె రెండోపెళ్లికి లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ తోష్నివాల్ను ఆమె త్వరలోనే పెళ్లాడబోతుందట. ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. కరీష్మా మాజీభర్త సంజయ్ కపూర్ తన ప్రేయసి ప్రియా సచ్దేవ్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కరీష్మా కూడా సందీప్‌ను వివాహం చేసుకోనున్నట్లు ఓ వెబ్సైట్ కథనం ప్రచురించింది. కాగా సందీప్ తోష్నివాల్కు అతడి భార్య అశ్రిత విడాకులు ఇచ్చేందుకు సుముఖంగా ఉండటంతో ఈ పెళ్లికి దాదాపు గ్రీన్ సిగ్నల్ పడినట్లే. గతంలో విడాకులు ఇచ్చేందుకు అశ్రిత ఇష్టపడలేదు. అయితే గత కొంతకాలంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అశ్రిత..తన భర్తకు డైవర్స్ ఇవ్వడానికి సిద్ధపడటంతో, అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ కూడా మొదలయ్యాయట. ఇందుకోసం ఆమె భారీగానే భరణం డిమాండ్ చేసిదంట. ఢిల్లీలో ఉన్న ఇంటితో పాటు అశ్రితకు రూ.రెండు కోట్లు, అలాగే ఇద్దరు పిల్లలకు చెరో రూ.3 కోట్లు ఇచ్చేందుకు సందీప్ తోష్నివాల్ అంగీకరించినట్లు సమాచారం. అలాగే ఇద్దరు కూతుళ్లు తల్లి కస్టడీలోనే ఉండనున్నారు. సందీప్ తోష్నివాల్‌తో అశ్రిత వివాహం 2013లో జరిగింది. అయితే భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆరోపణలు చేయడంతో వారిద్దరి వివాహ బంధానికి బీటలు ఏర్పడ్డాయి. సందీప్ తరఫు న్యాయవాది మాత్రం అర్షిత మానసిక రుగ్మతతో బాధపడుతోందని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయితే చికిత్స తీసుకునేందుకు ఆమె నిరాకరించిందని, అశ్రితతో విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఇక కరీష్మా, సందీప్ తోష్నివాల్ బంధం గురించి మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తు వార్తలు కూడా వెలువడ్డాయి. ఇటీవలే కరీనా తన కొడుకు పుట్టిన సందర్భంగా ఇచ్చిన పార్టీలోనూ సందీప్ తోష్నివాల్ హడావుడి కూడా కనిపించింది. కరీష్మా కుటుంబం కూడా వీరి పెళ్లికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. -
'డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది'
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ విడాకుల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన ఈ జంట, ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో మరోసారి వార్తల్లో నిలిచింది. కరిష్మా కేవలం తన డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందంటూ కోర్టులో ఫిర్యాదు చేశాడు ఆమె భర్త సంజయ్ కపూర్. అంతేకాదు ఆమె ప్రవర్తన పై కూడా పలు ఆరోపణలు చేశాడు. పెళ్లికి ముందు ఆమెకు అభిషేక్ బచ్చన్ తో సాన్నిహిత్యం ఉందని, తనతో విడిపోయాకే తనను పెళ్లాడిందని ఆరోపించాడు. ఎంతో సాంప్రదాయ బద్దంగా ఉండే తన కుటుంబాన్ని కూడా గ్లామర్ వరల్డ్ గా మార్చే ప్రయత్నం చేసిందని, తమ పిల్లలు తన తండ్రి దగ్గరకు వెళ్లడానికి కూడా అంగీకరించేది కాదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేవలం భార్యగానే కాదు, ఒక కోడలిగా, తల్లిగా కూడా కరిష్మా విఫలమయ్యిందని, అందుకే తనకు విడాకులు కావాలని కోరుతున్నానని చెప్పాడు. కరిష్మా తరుపు లాయర్లు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. కేవలం కరిష్మా ఇమేజ్ను పాడు చేయటం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
కరిష్మా నుంచి పిల్లల్ని నాకు అప్పగించండి!
వేరువేరుగా ఉంటున్న బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్‌కపూర్ మధ్య విడాకుల గొడవ సద్దుమణుగకముందే.. మరో అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ భర్త సంజయ్ కపూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దూరంగా ఉంటున్న ఈ దంపతుల విడాకుల పిటిషన్‌ను గత నెలలో కోర్టు పరిష్కరించింది. విడాకుల కోసం గతంలో వీరు దాఖలు చేసిన ఉమ్మడి సమ్మతిని ఉపసంహరించుకోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తమకు పుట్టిన సమీర, కియాన్‌రాజ్‌లను కరిష్మా నుంచి తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ 15 రోజుల కిందట సంజయ్‌కపూర్ ఫామిలీ కోర్టులో దరఖాస్తు చేశారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. గతంలోనూ సంజయ్‌కపూర్ ఇదే తరహా అప్లికేషన్‌ను కోర్టులో వేశారని, అయితే, అప్పట్లో విడాకుల కోసం ఇద్దరు ఉమ్మడి సమ్మతితో కోర్టును ఆశ్రయించడం, విడాకుల చట్టంలో పిల్లల సంరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉండటంతో ఆయన తన దరఖాస్తును ఉపసంహరించుకున్నారని ఆయన వివరించారు. ఈ విషయమై స్పందించడానికి కరిష్మా తరఫు లాయర్ ముందుకురాలేదు.