'డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది' | Karisma married me for my money says Sunjay Kapur | Sakshi
Sakshi News home page

'డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది'

Published Sun, Jan 17 2016 1:08 PM | Last Updated on Mon, Aug 20 2018 2:14 PM

'డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది' - Sakshi

'డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది'

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ విడాకుల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన ఈ జంట, ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో మరోసారి వార్తల్లో నిలిచింది. కరిష్మా కేవలం తన డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందంటూ కోర్టులో ఫిర్యాదు చేశాడు ఆమె భర్త సంజయ్ కపూర్. అంతేకాదు ఆమె ప్రవర్తన పై కూడా పలు ఆరోపణలు చేశాడు. పెళ్లికి ముందు ఆమెకు అభిషేక్ బచ్చన్ తో సాన్నిహిత్యం ఉందని, తనతో విడిపోయాకే తనను పెళ్లాడిందని ఆరోపించాడు.

ఎంతో సాంప్రదాయ బద్దంగా ఉండే తన కుటుంబాన్ని కూడా గ్లామర్ వరల్డ్ గా మార్చే ప్రయత్నం చేసిందని, తమ పిల్లలు తన తండ్రి దగ్గరకు వెళ్లడానికి కూడా అంగీకరించేది కాదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేవలం భార్యగానే కాదు, ఒక కోడలిగా, తల్లిగా కూడా కరిష్మా విఫలమయ్యిందని, అందుకే తనకు విడాకులు కావాలని కోరుతున్నానని చెప్పాడు. కరిష్మా తరుపు లాయర్లు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. కేవలం కరిష్మా ఇమేజ్ను పాడు చేయటం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement