Karisma Kapoor
-
అనార్కలీ డ్రెస్‌లో అదుర్స్.. అంటున్న ఈ నటిని గుర్తు పట్టారా..! (ఫోటోలు)
-
Karisma Kapoor: బాలీవుడ్ బ్యూటీ సీరియల్ లుక్స్.. గ్లామర్ మాత్రం (ఫొటోలు)
-
ఈ హీరోయిన్‌కు 50 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా? (ఫోటోలు)
-
నిర్మాతగా కరిష్మా కపూర్
బాలీవుడ్ సీనియర్ నటి కరిష్మా కపూర్ పూర్తి స్థాయి సినిమాల్లో కనిపించక సుమారు ఎనిమిదేళ్లు పైనే అవుతోంది. ఇటీవలే ‘మెంటల్ హుడ్’ వెబ్ సిరీస్ ద్వారా కమ్‌బ్యాక్ ఇచ్చారు కరిష్మా. పిల్లల్ని పెంచడంలో తల్లి కష్టం ఏంటి? వంటి విషయాలను ఈ సిరీస్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం నిర్మాతగా మారాలనే ఆలోచనలో కరిష్మా ఉన్నారట. ముందు వెబ్ సిరీస్‌లు, ఆ తర్వాత సినిమాలు నిర్మించాలనుకుంటున్నారని సమాచారం. కొత్త కొత్త ఐడియాలను తమ బ్యానర్ ద్వారా ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నారట. త్వరలోనే మొదటి వెబ్ సిరీస్ విషయాలను ప్రకటించడానికి కరిష్మా సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ టాక్. -
సింగిల్ అంటే ఒకరుకాదు
సింగిల్ పేరెంట్ అంటే అమ్మా లేక నాన్న కాదు. అమ్మానాన్న రెండూ! ఇద్దరి ప్రేమనూ ఆ ఒక్కరే పంచాలి. రెండు బాధ్యతలు తీసుకోవాలి. సింగిల్ పేరెంట్ కావడానికి కారణాలు, వాటి నేపథ్యాలు వేరువేరుగా ఉండొచ్చు. కానీ నిలబడే తీరు ఒకటే.. స్థయిర్యంగా. ఛాలెంజెస్ను ఎదుర్కొనే ఆయుధమూ ఒకటే.. ఆత్మ విశ్వాసం! ‘‘భార్యాభర్తలు విడిపోవచ్చు.. కానీ అమ్మానాన్నా విడిపోకూడదు’’..‘భామనే సత్యభామనే’ అనే సినిమాలోని డైలాగ్. వినడానికి బాగుంది. ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. అమ్మానాన్న మానసికంగా విడిపోయాక కూడా వాళ్లు భార్యాభర్తలే. పిల్లల కోసం ఒకే చూరు కింద సర్దుకుపోయే భార్యాభర్తలు. కొన్ని జంటల విషయంలోనే విడాకులు తప్పనిసరవుతాయి. అమ్మా... నాన్న.. ఇద్దరిలో ఎవరో ఒకరు పిల్లల బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి. ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటే సింగిల్ పేరెంట్ ప్రయాణం కాస్త తేలిక కావచ్చు. లేకపోతే.. సామాజికపరమైన సవాల్ అదనం. ముఖ్యం గా ఆడవాళ్లకు. నైతిక స్థయిర్యం చాలా అవసరం. అలా సింగిల్ హ్యాండెడ్‌గా పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేసిన సింగిల్ పేరెంట్స్ సినిమా ఫీల్డ్‌లో చాలా మందే ఉన్నారు. ఎస్పెషల్లీ ఇన్ బాలీవుడ్. సినిమా కథకేమీ తీసిపోని జీవితాలు వాళ్లవి. వాళ్లెవరో చూద్దాం. బబిత బబిత... బాలీవుడ్ నటి. హిందీ సినిమా లెజెండ్ రాజ్‌కపూర్ పెద్ద కోడలు. నటుడు రణధీర్ కపూర్ భార్య. కరిష్మా, కరీనా కపూర్ల తల్లి. భార్యాభర్తలుగా బాగున్నారు. అమ్మానాన్న అయ్యాకే గొడవలు మొదలయ్యాయి. కరిష్మాను నటిని చేద్దాం అని బబిత తల్లిగా బిడ్డ పట్ల ఉన్న తన కోరిక చెప్పగానే తండ్రిగా రణధీర్ కపూర్ వద్దు అన్నాడు. ఈ స్పర్థ ఇంకా అనేక గొడవలకు దారితీసి.. ఎడతెగని వాగ్వివాదాలతో ఆ ఆలుమగలు విడిపోవడం అనివార్యం అయింది. కరిష్మా, కరీనాల బాధ్యత బబితే తీసుకుంది. ఒంటరి తల్లిగా ఆ ఇద్దరినీ పెంచి, పెద్దచేసి తాను నటీమణులుగా నిలబెట్టింది. 2007లో పిల్లలిద్దరూ తమ తల్లిదండ్రులను ఒకే కప్పు కిందకు తెచ్చారు. అమ్మానాన్నగా మాత్రమే కలిసి ఉంటున్నారంతే! అమృతాసింగ్ బాలీవుడ్ నటిగా అందరికీ తెలుసు. సైఫ్ అలీఖాన్ మాజీ భార్యగానూ అంతే పరిచయం. ఈ జంట పిల్లలే సారా అలీఖాన్, ఇబ్రహీం. సారా అలీఖాన్ కూడా ‘కేదార్నాథ్’ సినిమాతో ఈ మధ్యే బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. సారా, ఇబ్రహీంలకు లోకజ్ఞానం వచ్చేటప్పటికే వాళ్ల అమ్మానాన్నా విడిపోయారు. పిల్లలిద్దరినీ అమ్మ అమృతే పెంచింది. నీలిమా అజీమ్ నీలిమా కూడా నటే. కాని షహీద్ కపూర్‌కి అమ్మగానే ఎక్కువ మందికి పరిచయం. నటుడు పంకజ్ కపూర్, నీలిమాలది ప్రేమ వివాహం. షహీద్ కపూర్‌కి మూడేళ్లప్పుడు ఈ ఇద్దరూ విడిపోయారు. షహీద్ తల్లి దగ్గరే పెరిగాడు. తండ్రితోనూ షహీద్‌కు మంచి అనుబంధమే ఉంది. అదంతా నీలిమా పెంపకం గొప్పదనమే అంటారు బాలీవుడ్ ఫోక్స్. షహీద్ కపూర్ బాలీవుడ్ జర్నీ మొత్తం బాక్సాఫీస్ హిట్లుగానే సాగలేదు. అతని ఫెయిల్యూర్స్‌లో వెన్నంటి ఉంది నీలిమే. కొడుకు మానసిక స్థితిని అర్థం చేసుకుని అండగా నిలబడింది. పూజా బేడీ సంచలన నటి. సినిమాల కన్నా ఆమె నటించిన యాడ్స్‌తో ఎక్కువ పాపులర్ అయింది. నటుడు కబీర్ బేడీ – నర్తకి, మోడల్ ప్రతిమా బేడీల ముద్దుల కూతురు. పూజా వైవాహిక జీవితమూ కష్టాలమయమే. బజినెస్ టైకూన్ ఫర్హాన్ ఇబ్రహీమ్‌ను పెళ్లిచేసుకుంది. ఆలియా, ఒమర్ (కూతురు, కొడుకు) పుట్టాక ఫర్హాన్ ఇబ్రహీమ్‌తో సాహచర్యం పూజకు కన్నీళ్లనే మిగిల్చింది. పిల్లలను తీసుకొని ఆ గడపదాటింది. ఒంటరి తల్లిగానే పిల్లల మంచిచెడుల బాధ్యతలను భుజాలకెత్తుకుంది. కోరుకున్న పేరెంటింగ్ కరిష్మా, కొంకణాసేన్‌లు కూడా సింగిల్ మదర్ జాబితాలో ఉన్నారు. వీళ్లు కాక.. బై చాయిస్ అంటే పెళ్లి, విడాకులతో సంబంధం లేకుండా కూడా సింగిల్ మదర్‌గా పిల్లలను పెంచుతున్న సెలబ్రిటీలు ఉన్నారు. రవీనా టాండన్.. అనిల్ థడానీతో పెళ్లికంటే ముందే పూజ, ఛాయ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ కూడా ఈ విషయంలో రవీనాను ఆదర్శంగా తీసుకున్నట్టుంది. పాతికేళ్ల వయసులోనే ఆడపిల్లను దత్తత తీసుకుంది. ఆ తర్వాత 2010లో ఇంకో పాపనూ అడాప్ట్ చేసుకొని సింగిల్ మదర్‌గానే వాళ్లను పెంచుతోంది. నీనా గుప్తా.. థియేటర్ అండ్ బాలీవుడ్ నటి. వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌ను ఇష్టపడింది. పెళ్లిబంధం లేకుండానే మసాబాను కన్నది. అంతే ఇష్టంగా వివ్ రిచర్డ్స్ తోడు లేకుండానే మసాబాను పెంచి పెద్ద చేసింది. మసాబా... సెలెబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్. అపర్ణా సేన్ నటి, దర్శకురాలు అయిన అపర్ణాసేన్ ప్రముఖ బాలీవుడ్ నటి కొంకణా సేన్ వాళ్ల అమ్మ, ఫిల్మీ లైఫ్‌లో గ్రేట్ సక్సెస్ సాధించిన అపర్ణ వైవాహిక జీవితంలో చేదునే చవి చూసింది. కొంకణా సేన్‌కు ఆరేళ్లున్నప్పుడు అపర్ణ తన భర్త ముకుల్ శర్మతో విడిపోయింది. అప్పటికే ఆమె నటిగా, దర్శకురాలిగా కూడా బిజీ.. ఇటు హిందీ, అటు బెంగాలీ భాషల్లో. అయినా కూతురిని తనే పెంచుకుంది. జీవితం ఏం ఇచ్చినా తీసుకోవాలి అన్నది అపర్ణాసేన్ ఫిలాసఫీ. ఆ తత్వాన్నే కూతురికీ బోధించింది. ప్రాక్టికల్‌గా ఉండడం నేర్పింది. అందుకే కొంకణా సేన్ చెప్తుంది.. ‘‘మొదట్లో అమ్మానాన్నా వేరువేరుగా ఉండడం మింగుడుపడలేదు. స్కూల్ ఫంక్షన్స్‌కి నా ఫ్రెండ్స్ పేరెంట్స్ కలిసి వచ్చి, మా అమ్మ మాత్రం ఒక్కతే వస్తుంటే నాకు దిగులుగా, బాధగా.. అనిపించేది. కానీ ఊహ తెలిసింతర్వాత.. మా ఇంటి పరిస్థితిని అమ్మ వివరిస్తుంటే.. అర్థమైంది. అందరి ఇళ్లు ఒకేరకంగా ఉండవని, అమ్మానాన్నలందరూ కలిసి ఉండరని. విడిపోవడం సాధారణ విషయమే అని, విడిపోయినా అమ్మా, నాన్న ఇద్దరూ పిల్లలకు ఉంటారు అని’’ అంటోంది. -
ఆమె బ్యాగ్ ఖరీదుతో ఓ కారు కొనచ్చు...
ముంబై : ఒకప్పుడు భారత్‌లోనే అందరు నటీమణులకన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరైనా ఉన్నారా అంటే ఆమెనే కరిష్మా కపూర్. 1991 నుంచి 2004 వరకు సినీరంగంలో ఎంతో యాక్టివ్‌గా ఉన్న కరిష్మా, గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రతి జనరేషన్‌కు కరిష్మా కపూర్ స్టయిల్ ఐకాన్‌గానే నిలుస్తున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లోనే అందమైన కథానాయికగా పేరు తెచ్చుకున్న ఈమె, ఇప్పటికీ ఏ మాత్రం తన బ్యూటీని తగ్గించుకోలేదు. 1990 ఏళ్లకి, ఇప్పటికీ ఏ మాత్రం తేడా కనిపించకుండా.. ఆమె తన లుక్‌ను మెయిన్టైన్ చేస్తున్నారు. తాజాగా కరిష్మా ఓ స్టన్నింగ్ లుక్‌తో ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్, బ్లాక్ హ్యాండ్‌బ్యాగ్, బ్లాక్ గ్లాసస్.. రెడ్ లిప్స్, రెడ్ షూతో అదుర్స్ అనిపించేలా ఫోటోగ్రాఫర్ల కంటపడ్డారు. తన జుట్టును సైడ్‌కు దువ్వుకుని వదిలిపెట్టుకోవడం మరింత ఆకట్టుకుంటోంది. అయితే ఆమె చేతులో ఉన్న ఆ బ్యాగ్, వేసుకున్న టీ-షర్ట్ ఖరీదు వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందేనట. సాదాసీదాగా కనిపించేలా ఆమె వేసుకున్న ఆ బ్లాక్ టీ-షర్ట్ పర్సియన్ బ్రాండ్ శాండ్రోకు చెందిందట. దాని ధర 6,184 రూపాయలని తెలిసింది. ఇక కరిష్మా చేతిలో టోట్ బ్యాగ్, ఫ్రెంచ్ హై-ఫ్యాషన్ లగ్జరీ గూడ్స్ తయారీదారి హీర్మేస్‌కు చెందిందట. దీని ధర 8,650 డాలర్లు అంటే సుమారు ఆరు లక్షల రూపాయలని తెలిసింది. అంటే ఈమె బ్యాగ్ ఖరీదుతో ఓ కారునే కొనుక్కోవచ్చట. ఇంత కాస్ట్లీ లుక్‌తో ఆమె ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. కాగ, ఇటీవల కరిష్మా, రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను కరిష్మా తండ్రి రణ్‌ధీర్ కొట్టిపారేశారు. పిల్లలే తన ప్రపంచమని ఆయన చెప్పారు. -
రెండో పెళ్లికి సిద్ధమవుతున్న కరిష్మా?!
అలనాటి అందాల తార కరిష్మా కపూర్ (43) రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంజయ్ కుమార్‌తో విడాకుల తరువాత కొంతకాంలగా అన్నింటికి దూరంగా ఉంటున్న కరిష్మా ఈ మధ్య ప్రముఖ వ్యాపారవేత్త సంతీప్ తోష్నివాల్‌తో సన్నిహితంగా ఉన్నట్లు బీ టౌన్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చేలా.. కరిష్మాచ సందీప్‌లు బాంద్రాలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. అందులో ఎగేజ్మెంట్ రింగ్కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కరిష్మా ప్రేమ, రెండో పెళ్లి పుకార్లపై ఆమె తండ్రి రణధీర్ కపూర్ స్పందించారు. కరిష్మ రెండో పెళ్లి చేసుకుంటే.. తన ఆశీస్సులు ఉంటాయని రణధీర్ స్పష్టం చేశారు. కరిష్మా ఇంకా చిన్నపిల్లే.. పెళ్లి చేసుకుని ఆనందంగా గడిపే సమయం ఉంది.. గతాన్ని మర్చిపోయి మళ్లీ కొత్త జీవితాన్ని ఆమె మొదలు పెట్టాలనుకుంటే.. నా కన్నా ఆనందించేవారు ఎవరుంటారు? అని రణధీర్ కపూర్ అన్నారు. -
కరీష్మా కపూర్ రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్
ముంబయి: ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీష్మా కపూర్ పెళ్లి విషయంలో తన మాజీభర్త సంజయ్ కపూర్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె రెండోపెళ్లికి లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ తోష్నివాల్ను ఆమె త్వరలోనే పెళ్లాడబోతుందట. ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. కరీష్మా మాజీభర్త సంజయ్ కపూర్ తన ప్రేయసి ప్రియా సచ్దేవ్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కరీష్మా కూడా సందీప్‌ను వివాహం చేసుకోనున్నట్లు ఓ వెబ్సైట్ కథనం ప్రచురించింది. కాగా సందీప్ తోష్నివాల్కు అతడి భార్య అశ్రిత విడాకులు ఇచ్చేందుకు సుముఖంగా ఉండటంతో ఈ పెళ్లికి దాదాపు గ్రీన్ సిగ్నల్ పడినట్లే. గతంలో విడాకులు ఇచ్చేందుకు అశ్రిత ఇష్టపడలేదు. అయితే గత కొంతకాలంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అశ్రిత..తన భర్తకు డైవర్స్ ఇవ్వడానికి సిద్ధపడటంతో, అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ కూడా మొదలయ్యాయట. ఇందుకోసం ఆమె భారీగానే భరణం డిమాండ్ చేసిదంట. ఢిల్లీలో ఉన్న ఇంటితో పాటు అశ్రితకు రూ.రెండు కోట్లు, అలాగే ఇద్దరు పిల్లలకు చెరో రూ.3 కోట్లు ఇచ్చేందుకు సందీప్ తోష్నివాల్ అంగీకరించినట్లు సమాచారం. అలాగే ఇద్దరు కూతుళ్లు తల్లి కస్టడీలోనే ఉండనున్నారు. సందీప్ తోష్నివాల్‌తో అశ్రిత వివాహం 2013లో జరిగింది. అయితే భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆరోపణలు చేయడంతో వారిద్దరి వివాహ బంధానికి బీటలు ఏర్పడ్డాయి. సందీప్ తరఫు న్యాయవాది మాత్రం అర్షిత మానసిక రుగ్మతతో బాధపడుతోందని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయితే చికిత్స తీసుకునేందుకు ఆమె నిరాకరించిందని, అశ్రితతో విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఇక కరీష్మా, సందీప్ తోష్నివాల్ బంధం గురించి మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తు వార్తలు కూడా వెలువడ్డాయి. ఇటీవలే కరీనా తన కొడుకు పుట్టిన సందర్భంగా ఇచ్చిన పార్టీలోనూ సందీప్ తోష్నివాల్ హడావుడి కూడా కనిపించింది. కరీష్మా కుటుంబం కూడా వీరి పెళ్లికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. -
ప్రేయసిని పెళ్లాడిన మాజీ నటి భర్త
న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరోయిన్ కరీష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఎట్టకేలకు ప్రేయసి ప్రియా సచ్దేవ్ను పెళ్లాడాడు. గురువారం ఢిల్లీలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి వధూవరుల కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను ప్రియ సచ్దేవ్ సోదరి తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా మరోసారి ఈ జంట న్యూయార్క్‌లో వివాహం చేసుకోనున్నారు. వివాహ విషయాన్ని ముంబైయి మిర్రర్ వెల్లడించింది. గత నెల రోజులుగా సంజయ్ కపూర్ పెళ్లివార్త హల్చల్ చేసిన విషయంతెలిసిందే. చాలా ఏళ్ల క్రితం సంజయ్ కపూర్‌కు ప్రియ సచిదేవ్ న్యూయార్క్‌లో పరిచయం అయ్యింది. గత అయిదేళ్లుగా వీరి బంధం కొనసాగుతోంది. కాగా సంజయ్ కపూర్‌కు ఇది మూడో పెళ్లి కాగా, ప్రియా సచ్దేవ్కి రెండో వివాహం. ప్రియా సచ్దేవ్ గతంలో న్యూయార్క్ లో సంపన్నుడైన విక్రమ్ చట్వాల్‌ను అంగరంగ వైభోగంగా పెళ్లాడింది. ఆ తర్వాత ఆ పెళ్లి పెటాకులైంది. అనంతరం సంజయ్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. మరోవైపు సంజయ్ కపూర్‌కూడా గత ఏడాది కరీష్మా కపూర్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరికి 12 ఏళ్ల కూతురు సమైరా, ఏడేళ్ల కొడుకు రాజ్ ఉన్నారు. అయితే కరీష్మా, సంజయ్ కపూర్ మధ్య విభేదాలు రావడంతో 13ఏళ్ల దాంపత్య జీవితానికి తెరపడింది. గత ఏడాది జూన్‌లో వీరిద్దరూ చట్టబద్దంగా విడాకులు తీసుకున్నారు. కాగా కరీష్మా తండ్రి రణధీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో సంజయ్ కపూర్‌పై మండిపడ్డారు. థర్డ్ క్లాస్ మెన్ అంటూ విమర్శించారు. అతడికి వివాహ వ్యవస్థపై నమ్మకం లేదని, భార్యను ఏనాడు సరిగా చూసుకోలేదని ఆరోపించారు. సంజయ్ మరో మహిళలో జీవిస్తున్నాడని, అతడు ఎలాంటివాడో ఢిల్లీలో అందరికీ తెలుసన్నారు. కాగా కరీష్మా కపూర్ కూడా ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ తోష్నీవాల్లో సన్నిహితంగా ఉంటుందన్న రూమర్లు వచ్చాయి. -
మూడో పెళ్లికి సిద్ధమైన నటి మాజీ భర్త
అలనాటి బాలీవుడ్ హీరోయిన్ కరీష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ మూడో పెళ్లికి సిద్ధం అవుతున్నాడు. తన ప్రేయసి మోడల్ ప్రియ సచ్దేవ్ను సంజయ్ పెళ్లాడబోతున్నాడు. వచ్చే నెలలో వీళ్లిద్దరి వివాహం న్యూయార్క్‌లో జరగనుంది. కుటుంసభ్యులతో పాటు కేవలం కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. ఈ పెళ్లిపై సంజయ్ కపూర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. కాగా సంజయ్ కపూర్‌కు ఇది మూడో పెళ్లి కాగా, ప్రియా సచ్దేవ్కి రెండో వివాహం. ప్రియా సచ్దేవ్ రెండేళ్ల క్రితం న్యూయార్క్ లో సంపన్నుడైన విక్రమ్ చట్వాల్‌ను అంగరంగ వైభోగంగా పెళ్లాడింది. ఆ తర్వాత ఆ పెళ్లి పెటాకులైంది. అనంతరం సంజయ్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. అయితే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం సంజయ్ కపూర్ తల్లికి ఇష్టం లేదట. కాగా కరిష్మా కపూర్ వ్యాపార వేత్త సంజయ్ కపూర్ 2003 సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. వీరికి 12 ఏళ్ల కూతురు సమైరా, ఏడేళ్ల కొడుకు రాజ్ ఉన్నారు. అయితే కరీష్మా, సంజయ్ కపూర్ మధ్య పొరపొచ్చలు రావడంతో వారి 13ఏళ్ల దాంపత్య జీవితానికి తెరపడింది. గత ఏడాది జూన్‌లో వీరిద్దరూ చట్టబద్దంగా విడాకులు తీసుకున్నారు. -
విడాకుల తర్వాత అతనికి దగ్గరవుతున్న నటి!
ముంబై: ఒకప్పటి అందాల కథానాయిక కరిష్మా కపూర్. భర్త సంజయ్ కపూర్‌తో తీవ్ర విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఓ కంపెనీ సీఈవో అయిన సందీప్ తోష్నివాల్‌తో కరిష్మా సన్నిహితంగా మెలుగుతోందట. రోజురోజుకు వీరి అనుబంధం బలపడుతున్నదని చెప్తున్నారు. త్వరలోనే రిలేషన్షిప్లో అడుగుపెట్టాలని ఈ జంట భావిస్తున్నదని కథనాలు వస్తున్నాయి. సందీప్ కూడా భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్నాడు. త్వరలోనే అతను విడిపోయిన తన భార్య ఆష్రిత నుంచి విడాకులు తీసుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంద్రాలోని ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ తీసుకోవాలని సందీప్ భావిస్తున్నాడు. 3 బీహెచ్‌కే ప్లాటు తీసుకొని దానిని తన ప్రియురాలు కరిష్మాకు కానుకగా ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు వదంతులు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. సందీప్ తీసుకోబోతున్న ఈ కొత్త అపార్ట్మెంట్లోకి తన పిల్లలు సమైరా, కియాన్‌తో కలిసి కరిష్మా వెళ్లే అవకాశముందని, ఈ జంట కలిసి సహజీవనం చేయాలనుకుంటోందని చెప్తున్నారు. -
లేటెస్ట్... బ్రైటెస్ట్
వివాహపు దుస్తులంటే విలక్షణంగానూ మెరవాలి. సలక్షణంగానూ ఉండాలి. వెన్నెల జిలుగూ, సూర్యుడి వెలుగూ మిక్స్ చేసినట్లు! ఆ ఆలోచనతోనే పాశ్చాత్యానికి కాస్తంత ప్రాచ్యం రంగరిస్తే వచ్చిన పర్ఫెక్ట్ ఎఫెక్ట్ ఇది. పట్టు పరికిణీకు కాస్త వెస్ట్రన్ మిక్స్‌తో వచ్చిన గ్రేస్ ఇది. గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీని తీర్చిదిద్దిన ఎరుపు రంగు లాంగ్ గౌన్ని ధరించి వేదిక మీద మెరిసిన బాలీవుడ్ నటి కరిష్మా కపూర్. చందనం రంగు ధోతీ కట్టు స్టైల్ డ్రెస్‌తో విద్యుత్కాంతుల తో పోటీపడుతున్నట్టు కనిపిస్తున్న మోడల్. చందనం, బంగారు కలిపి తయారుచేస్తే వచ్చే అందం ఈ లెంగా సొంతం. లెహంగా, దుప్పట్టా.. ఎరుపు రంగు సన్నని అంచు అబ్బురపరిచే కాంతులతో జిగేల్మంటుంది. బంగారు రంగు పట్టు క్లాత్కి అద్భుతమైన పనితనంతో ఆకట్టుకుంటున్న ఎరుపు రంగు అంచు వేడుకలలో వైవిధ్యంగా కళ్లకు కడుతుంది. పువ్వుల జిలుగులు.. జలతారు మెరుపులతో ఈ లెహంగాని అలంకరించడం తో వేదిక మీద అద్భుతంగా వెలిగిపోయింది. లతలు, ఆకులు, పువ్వుల అందం ఎరుపు రంగు మీద అత్యంత వైభవంగా వెలిగిపోతుంది అనార్కలీ లెహంగా! లాంగ్ స్లీవ్స్ ఈ డ్రెస్‌ను మరింత హైలైట్‌గా నిలిపాయి. బంగారు తీగల అల్లిక ఇటీవల ముంబయ్‌లో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్ ఫెస్టివల్లో భాగంగా ‘కాశికా బజార్’ పేరుతో రూపొందించిన ఈ కలెక్షన్‌ని మోడల్స్ చేత ప్రదర్శించాను. మంచి పేరు తెచ్చి పెట్టిన ఈ కలెక్షన్లో ఎరుపు, ఆకుపచ్చ, ఎలిఫెంట్ రంగుల మూలాంశాలను తీసుకొని వీటికి బంగారు తీగల అల్లికలను జత చేసి ఒక ప్రాచీన దేశవాళీ పొకడలను చూపించాను. సంప్రదాయం, ఆధునికం సమ్మేళనంగా పట్టు, బంగారు జరీ, బనారసీ కలబోతతో వివాహ వేడుకలలో హైలైట్‌గా నిలిచేలా శ్రద్ధ తీసుకున్నాను. - అర్చిత నారాయణమ్, ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
చాలా పొరపాట్లు చేశాను: నటి
ముంబై: సినిమా జీవితం ఆరంభంలో ఫ్యాషన్ పరంగా చాలా తప్పులు చేశానని బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తెలిపింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చినందున తనకు అప్పట్లో ఫ్యాషన్ పరిజ్ఞానం అంతగా లేదని వెల్లడించింది. లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్/ఫెస్టివ్ 2016లో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘17 ఏళ్ల వయసులో బాలీవుడ్ లో అడుగుపెట్టాను. నాకప్పుడు ఫ్యాషన్ గురించి పెద్దగా తెలియదు. ఫ్యాషన్ పరంగా చాలా పొరపాట్లు చేశాను. అయినప్పటికీ నా డ్రెస్సులను అందరూ మెచ్చుకునేవారు. సినిమాల్లోకి వచ్చేప్పటికి నేను చాలా చిన్నపిల్లని. స్కూల్ నుంచి వచ్చి సినిమాల్లో నటించడం సరదాగా అనిపించేది. అప్పటికి నాకు పెద్దగా ఏమీ తెలియదు. దర్శకులు, నిర్మాతలు ఏ డ్రెస్సులు వేసుకోమంటే అవే వేసుకునేదాన్ని. ఇండస్ట్రీతో పాటు నేను ఎదుగుతూ వచ్చాను. ఫ్యాషన్ పరిజ్ఞానం కూడా పెంచుకున్నాను. ఇప్పుడు నా స్టయిల్ ను అందరూ ఇష్టపడుతున్నార’ని 42 ఏళ్ల కరిష్మా కపూర్ చెప్పింది. అయితే ఇప్పటి హీరోయిన్లు ఫ్యాషన్ విషయంలో పెద్దగా కష్టపడాల్సిన పనిలేదని అంది. హీరోయిన్ల స్టయిల్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా టీమ్‌లు పనిచేస్తున్నాయని తెలిపింది. తనకు చేతినిండా ఎండార్స్మెంట్స్ ఉన్నాయని చెప్పింది. -
ఆమె పిక్నిక్ ఫొటోలకు ఫిదా అయిపోతారు!
నీలాకాశం కింద గగనం అంచులను తాకే మంచుకొండలు.. చెట్లు, పుట్టులు, పూలు.. సందడి చేసే హరివిల్లులు.. అందమైన వీధులు.. సైకిల్ సవారీలు.. విహారయాత్ర అంటే ఆ ఆనందమే వేరు కదా! అలాంటి ఆనందంలోనే ఇప్పుడు బాలీవుడ్ భామ కరీష్మా కపూర్ మునిగితేలుతోంది. యూరప్ విహారానికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ తానెలా ఆస్వాదించానో అభిమానులతో పంచుకుంటూ ఇదిగో ఇలా చూడచక్కని ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్టుచేసింది. లండన్ నుంచి బుడాపెస్ట్ వరకు ఎన్నో పర్యాటక ప్రాంతాల్లో చక్కర్లు కొట్టిన ఈ అమ్మడు.. కట్టలు తెగిన ఆ ఆనందాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. -
కరిష్మా, మాజీ భర్త మధ్య ముగిసిన వివాదం
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె మాజీ భర్త సంజయ్ కపూర్ మధ్య విడాకుల వివాదం ముగిసింది. ఇద్దరూ ఓ ఒప్పందానికి రావడంతో ఏళ్లుగా సాగుతున్న వివాదానికి ఫుల్స్టాప్ పడింది. ఒప్పందం ప్రకారం.. వారి ఇద్దరు పిల్లలు కరిష్మ సంరక్షణలో ఉంటారు. సంజయ్‌కి ఆ పిల్లల సందర్శన హక్కులుంటాయి. ఈ మేరకు తాము అంగీకారానికి వచ్చినట్లు వారి తరఫు న్యాయవాదులు శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలపగా, ధర్మాసనం అందుకు సమ్మతించింది. -
విడాకుల కేసులో హీరోయిన్ ఒప్పందం
న్యూఢిల్లీ: బాలీవుడ్లో ఒకప్పటి టాప్ హీరోయిన్ కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ కపూర్ల విడాకుల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కివచ్చింది. భరణం చెల్లింపు విషయంలో వీరిద్దరూ సుప్రీం కోర్టులో ఓ ఒప్పందానికి వచ్చారు. ఈ కేసును శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ముంబైలో ఉన్న తన తండ్రి ఇంటిని కరిష్మా కపూర్ పేరు మీద బదలాయించేందుకు సంజయ్ అంగీకరించాడు. ఇక సంజయ్ కపూర్ పిల్లల కోసం 14 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేశాడు. వీటి ద్వారా ప్రతి నెల వచ్చే 10 లక్షల రూపాయల వడ్డీని పిల్లల ఖర్చులకు వెచ్చించనున్నారు. కరిష్మ, సంజయ్‌ల మధ్య మనస్పర్థలు రావడంతో గత అయిదేళ్లుగా విడిగా ఉంటున్నారు. కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ సంజయ్ కపూర్ గత ఏడాది ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కరిష్మా ఇటీవల తన భర్త, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు వరకు వెళ్లింది. భర్త, అత్తపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటున్నట్టు కరిష్మా కోర్టుకు తెలియజేసింది. ఇక పిల్లలను కరిష్మా వద్ద ఉంచేందుకు సంజయ్ అంగీకరించాడు. పిల్లలను చూసేందుకు వెళ్లేందుకు సంజయ్‌కు అనుమతించారు. -
విడాకుల కోసం సుప్రీంకోర్టుకు హీరోయిన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ లో ఒకప్పటి టాప్ హీరోయిన్ కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ కపూర్ మధ్య వివాదం వ్యవహారం రోజురోజుకు ముదరుతున్నట్లు కనిపిస్తోంది. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ భర్త సంజయ్‌కపూర్, అత్తపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఈ దంపతులకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయమై కరిష్మా కోర్టుకు హాజరుకాగా, సంజయ్ కపూర్ డుమ్మా కొట్టాడు. తన ప్రాణాలకు అపాయం ఉందని పేర్కొంటూ ఈ వివాదం కేసును ముంబై నుంచి ఢిల్లీ కోర్టుకు అప్పగించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాడు. భర్త, అతని కుటుంబం తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కరిష్మా స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు సంజయ్‌కపూర్, అతని తల్లి రాణి సురీందర్ కపూర్‌పై సెక్షన్ 498ఏ, 34కింద కేసు నమోదు చేశారు. కరిష్మా, సంజయ్‌కపూర్ విడాకుల కేసు ముంబయి బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉంది. కరిష్మ, సంజయ్ ల మధ్య మనస్పర్థలు రావడంతో వీరు గత అయిదేళ్లుగా విడిగా ఉంటున్నారు. కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ భర్త సంజయ్ కపూర్ గత ఏడాది ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. సంజయ్ తన సంతానం ఒక్కోక్కరికి గానూ నెలకు రూ.10 లక్షలు చెల్లించడంతో పాటు విడాకుల నేపథ్యంలో రూ.14 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. -
భర్త, అత్తపై కరిష్మా కపూర్ ఫిర్యాదు
ముంబయి: తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ..భర్త, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సంజయ్‌కపూర్, అతని కుటుంబం తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కరిష్మా స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు సంజయ్‌కపూర్, అతని తల్లి రాణి సురీందర్ కపూర్‌పై సెక్షన్ 498ఏ, 34కింద కేసు నమోదు చేశారు. కాగా కరిష్మా, సంజయ్‌కపూర్ విడాకుల కేసు ముంబయి బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు మార్చి 3న విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో సంజయ్ కపూర్ ఫ్యామిలీపై కరిష్మా తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడం గమనార్హం. కరిష్మ, సంజయ్ కపూర్ మధ్య మనస్పర్థలు రావడంతో వీరు గత అయిదేళ్లుగా విడిగా ఉంటున్నారు. మరోవైపు కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ భర్త సంజయ్ కపూర్ గత ఏడాది ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. -
'డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది'
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ విడాకుల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన ఈ జంట, ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో మరోసారి వార్తల్లో నిలిచింది. కరిష్మా కేవలం తన డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందంటూ కోర్టులో ఫిర్యాదు చేశాడు ఆమె భర్త సంజయ్ కపూర్. అంతేకాదు ఆమె ప్రవర్తన పై కూడా పలు ఆరోపణలు చేశాడు. పెళ్లికి ముందు ఆమెకు అభిషేక్ బచ్చన్ తో సాన్నిహిత్యం ఉందని, తనతో విడిపోయాకే తనను పెళ్లాడిందని ఆరోపించాడు. ఎంతో సాంప్రదాయ బద్దంగా ఉండే తన కుటుంబాన్ని కూడా గ్లామర్ వరల్డ్ గా మార్చే ప్రయత్నం చేసిందని, తమ పిల్లలు తన తండ్రి దగ్గరకు వెళ్లడానికి కూడా అంగీకరించేది కాదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేవలం భార్యగానే కాదు, ఒక కోడలిగా, తల్లిగా కూడా కరిష్మా విఫలమయ్యిందని, అందుకే తనకు విడాకులు కావాలని కోరుతున్నానని చెప్పాడు. కరిష్మా తరుపు లాయర్లు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. కేవలం కరిష్మా ఇమేజ్ను పాడు చేయటం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
పెళ్లిళ్లూ విడాకులూ...
బాలీవుడ్ బాత్ ఇవి కూడా బాలీవుడ్ సినిమా కథలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉన్నాయి. నటి కరిష్మా కపూర్ వ్యాపార వేత్త సంజయ్ కపూర్ 2003లో వివాహం చేసుకున్నాక ఇద్దరు పిల్లలను కన్నారు. అయితే ఆ తర్వాత పొరపొచ్చాలు వచ్చి 2014లో పరస్పర అంగీకారం ప్రకటిస్తూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ కేసు ఒక కొలిక్కి రాక మునుపే సంజయ్ కపూర్ తన అంగీకారాన్ని వాపసు తీసుకున్నాడు. దాంతో కరిష్మా కూడా వాపసు తీసుకోవాల్సి వచ్చింది. విడాకుల కోసం పెట్టుకున్న షరతులపై ఇరువర్గాలు నమ్మకం కలిగించడంలో విఫలమవడం వల్లే ఈ నిర్ణయం అని పైకి చెబుతున్నా లోపల కారణాలు వేరేగా కనపడుతున్నాయి. సంజయ్‌కు దూరమయ్యాక కరిష్మా ఒక ఫార్మసూటికల్ సంస్థ సిఇవో అయిన సందీప్ తోష్నివాల్‌తో సన్నిహితంగా ఉంటోందని వార్త. వాళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట. అయితే సందీప్‌కు ఇది వరకే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని భార్య (డెంటిస్ట్) విడాకులకు సిద్ధంగా ఉన్నా బదులుగా మూడు కోట్ల రూపాయలు పిల్లల కోసం తన కోసం చెల్లించమని కోరుతోంది. ఇటువైపు సంజయ్ కపూర్ ఢిల్లీ మోడల్ ప్రియా సచ్దేవ్తో సన్నిహితంగా ఉన్నాడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం సంజయ్ కపూర్ తల్లికి ఇష్టం లేదట. కనుక కరిష్మాకు సంజయ్‌కు విడాకులు రాకుండా చేసి ఈ పెళ్లికి అడ్డుపడాలని భావిస్తున్నట్టు భోగట్టా. చెప్పుకోవాల్సిన సంగతి ఏమంటే ప్రియా సచ్దేవ్ రెండేళ్ల క్రితం న్యూయార్క్ సంపన్నుడైన విక్రమ్ చట్వాల్‌ను అంగరంగ వైభోగంగా పెళ్లాడింది. తాజాగా ఆ పెళ్లి పెటాకులైంది. ఈ గొడవలు ఎలా ఉన్నా నా పిల్లలను నాకివ్వండి అని తాజాగా కరిష్మా భర్త కోర్టుకెక్కాడు. ప్రస్తుతం పిల్లలను తనతోనే పెట్టుకున్న కరిష్మా ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. -
కరిష్మా నుంచి పిల్లల్ని నాకు అప్పగించండి!
వేరువేరుగా ఉంటున్న బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్‌కపూర్ మధ్య విడాకుల గొడవ సద్దుమణుగకముందే.. మరో అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ భర్త సంజయ్ కపూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దూరంగా ఉంటున్న ఈ దంపతుల విడాకుల పిటిషన్‌ను గత నెలలో కోర్టు పరిష్కరించింది. విడాకుల కోసం గతంలో వీరు దాఖలు చేసిన ఉమ్మడి సమ్మతిని ఉపసంహరించుకోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తమకు పుట్టిన సమీర, కియాన్‌రాజ్‌లను కరిష్మా నుంచి తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ 15 రోజుల కిందట సంజయ్‌కపూర్ ఫామిలీ కోర్టులో దరఖాస్తు చేశారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. గతంలోనూ సంజయ్‌కపూర్ ఇదే తరహా అప్లికేషన్‌ను కోర్టులో వేశారని, అయితే, అప్పట్లో విడాకుల కోసం ఇద్దరు ఉమ్మడి సమ్మతితో కోర్టును ఆశ్రయించడం, విడాకుల చట్టంలో పిల్లల సంరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉండటంతో ఆయన తన దరఖాస్తును ఉపసంహరించుకున్నారని ఆయన వివరించారు. ఈ విషయమై స్పందించడానికి కరిష్మా తరఫు లాయర్ ముందుకురాలేదు. -
అక్క కరిష్మానే నాకు ఇన్స్పిరేషన్
‘‘మా అక్క కరిష్మాకపూరే నాకు ఇన్స్పిరేషన్. నా జీవితంలో ఆమెకు సముచిత స్థానం ఉంది’’ అంటున్నారు కరీనా కపూర్. ఒకానొక సమయంలో కరిష్మా బాలీవుడ్లో పేరున్న కథానాయికగా రాణించారు. బాలీవుడ్ అగ్ర కథానాయకులతో ఆడిపాడిన కరిష్మా పెళ్లయ్యాక వెండితెరకు దూరమయ్యారు. కానీ ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయారు. ఆ తర్వాత 2012లో ‘డేంజరస్ ఇష్క్’లో నటించినప్పటికీ ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించకపోవడంతో మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. ‘‘ఇప్పుడు అక్క ఏ సినిమాలోనూ నటించే పరిస్థితిలో లేదు. ఆమెకు కుటుంబమే లోకం. ఇద్దరు పిల్లల ఆలనాపాలనతో బిజీ బిజీ. కెరీర్‌కు సంబంధించి ఇప్పటికీ అక్క నాకు సలహాలు, సూచనలు ఇస్తూనే ఉంటుంది. అనుభవంతో ఆమె చెప్పే మాటలను విని, ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను’’ అని కరీనా చెప్పుకొచ్చారు. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈ రోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కరిష్మాకపూర్ (నటి) సురేష్‌కృష్ణ (దర్శకుడు) హ్యాపీ బర్త్ డే ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది బృహస్పతికి చెందిన సంఖ్య. మీరు ఈ ఏడాది ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులనే పేరుతో పాటు విజయాలను అందిపుచ్చుకుంటారు. కొత్త స్నేహితులు వస్తారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం, నలుగురిలో మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులకు మంచి కాలేజీలలో వారు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆపోజిట్ సెక్స్ వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా భార్యాభర్తలు కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంది. లక్కీ నంబర్స్: 1,2,3,7; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, గోల్డెన్, ఎల్లో; లక్కీ డేస్: ఆది, సోమ, గురు వారాలు. సూచనలు: దక్షిణామూర్తిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, పండితులను, గురువులను గౌరవించడం, అనాథలను ఆదరించడం మంచిది. డబ్బును ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు -
ఉస్మానియా బిస్కెట్స్ With ఇరానీ చాయ్
చిట్‌చాట్ కరిష్మాకపూర్.. భారతీయ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన విలక్షణ అభినయంతో అలరిస్తున్న ఈ మేటి నటి... శుక్రవారం హైదరాబాద్‌లో తళుకులీనింది. సికింద్రాబాద్ కార్ఖానా, కూకట్‌పల్లిలో నీరూస్ స్టోర్స్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సిటీప్లస్ ఆమెను పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... .:: శిరీష చల్లపల్లి ముంబైలాంటి మెట్రో సిటీస్‌లో వెస్ట్రన్ కల్చర్ ఫాలో అయ్యే యూత్ ఉంటారు. అది సహజం కూడా. కానీ హైదరాబాద్ లేడీస్ వెస్ట్రన్ స్టైల్స్‌ని ఎంత ఫాలో అవుతారో.. ట్రెడిషనల్ వేర్ని అంతే ఇష్టపడతారు. నేనూ అంతే... ఎన్నో ఏళ్లుగా సినిమా పరిశ్రమతో ముడిపడి ఉన్నా... వెస్ట్రన్ వేర్‌ను ఎంత ఇష్టపడతానో... భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అంతే గౌరవిస్తా. డ్రెస్సింగ్ విషయంలోనూ అంతే. ఇక ఇండో వెస్ట్రన్ వేర్ అన్నా నాకు బాగా ఇష్టం. అందులోనూ ఇంగ్లిష్ కలర్స్ అంటే ఎక్కువ ప్రేమ. షూటింగ్ పర్పస్ క న్నా... ఏదో ఒక మాల్ లేక ఇతర ఓపెనింగ్స్‌కి హైదరాబాద్‌కి తరచూ వస్తూనే ఉన్నా కార్లో వెళ్లేటప్పుడూ చుట్టూ గమనిస్తుంటా. ఇంతపెద్ద మెట్రో సిటీలో కూడా అమ్మాయిలు చాలా ట్రెడిషనల్‌గా కనిపించడం చూసి ముచ్చటేస్తుంది. స్పైసీ ఫుడ్ అంటే అంతగా ఇష్టం ఉండదు. కానీ హైదరాబాద్‌లో ఏ హోటల్‌కు వెళ్లినా బిర్యానీనే మొదట ఆఫర్ చేస్తాను. ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్స్ అన్నా మనసు పారేసుకుంటాను. అమ్మాయి అంటే ఫెమినిటీ మిస్సవ్వకుండానే.. మగవాళ్లకు ఏ రకంగానూ తీసిపోము అని ప్రతిబింబించేలా ఉండాలని కోరుకుంటాను. అలా ఉన్నవాళ్లను చూసినప్పుడు ఆడపిల్లగా పుట్టినందుకు గ ర్వపడతాను. మరో జన్మంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టడానికే ఇష్టపడతాను. ఇక వే రే దేశాలకు వెళ్లినా.. నేను ఇండియన్ అని తెలిసే విధంగానే నా డ్రెస్సింగ్ ఉంటుంది. వేరే వాళ్లను కలిసినప్పుడు విష్ చేయడానికి ‘హాయ్’, ‘హలో’ కంటే నమస్తేనే ప్రిఫర్ చేస్తాను. నా జీవితంలో కెమెరా ఓ భాగమైపోయింది. కెమెరా లేకుండా ఉండలేను! -
నాకు కరీనాయే సర్వస్వం
బెంగళూర్: నటి కరీనాకపూర్ తనకు సర్వస్వమని సోదరి కరిష్మా కపూర్ పేర్కొంది. కరీనా తనకు సోదరిగా కంటే మంచి స్నేహితురాలని స్పష్టం చేసింది. 2012లో విడుదలైన ‘డేంజరస్ ఇష్క్’ సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈ 40 ఏళ్ల నటి మా ఇద్దరి మధ్య బంధం గట్టిదని తన మనసులో మాట చెప్పింది. ‘మేమిద్దరం అక్కా చెల్లెళ్లం. కరీనా ఓ కుటుంబ సభ్యురాలిగా కంటే గొప్ప స్నేహితురాలు. ఆమె నా జీవితంలో ఒక ఆశీర్వచనం’ అని కరిష్మా కపూర్ తెలిపింది. పది సంవత్సరాలపాటు ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాలీవుడ్లో విజయపరంపరను కొనసాగించడడం అరుదైన విషయమని ఈ ‘జుబేదా’ సినిమా నటి తెలిపింది. 'ఒకే ఫీల్డ్ లో విజయవంతంగా దశాబ్దంపాటు బాలీవుడ్లో పనిచేయడం గతంలో జరిగిన దాఖలాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. ఈ విషయంలో నేనెంతో అదృష్టవంతురాలినని అనిపిస్తోంది. గొప్ప కెరీర్ దొరకడం మా అదృష్టమని అనుకుంటున్నా. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యా గొప్ప అనుబంధం ఉన్నప్పటికీ వృత్తిపరమైన నిర్ణయాల విషయంలో ఎవరిమీ జోక్యం చేసుకోలేదు’ అని కరిష్మా స్పష్టం చేసింది.