కరిష్మా, మాజీ భర్త మధ్య ముగిసిన వివాదం | Karisma, Ex-husband dispute ended | Sakshi
Sakshi News home page

కరిష్మా, మాజీ భర్త మధ్య ముగిసిన వివాదం

Published Sat, Apr 9 2016 9:35 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

కరిష్మా, మాజీ భర్త మధ్య ముగిసిన వివాదం - Sakshi

కరిష్మా, మాజీ భర్త మధ్య ముగిసిన వివాదం

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె మాజీ భర్త సంజయ్ కపూర్ మధ్య విడాకుల వివాదం ముగిసింది. ఇద్దరూ ఓ ఒప్పందానికి రావడంతో ఏళ్లుగా సాగుతున్న వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. ఒప్పందం ప్రకారం.. వారి ఇద్దరు పిల్లలు కరిష్మ సంరక్షణలో ఉంటారు. సంజయ్‌కి ఆ పిల్లల సందర్శన హక్కులుంటాయి. ఈ మేరకు తాము అంగీకారానికి వచ్చినట్లు వారి తరఫు న్యాయవాదులు శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలపగా, ధర్మాసనం అందుకు సమ్మతించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement