చాలా భయంగా ఉంది : కరీనాకపూర్
‘‘సినిమాల వల్ల సమాజంలో మంచి మార్పొస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? మంచి సినిమా కొంతమందిని మాత్రమే ప్రభావితం చేయగలుగుతుంది. అసలు సినిమా ముఖ్యోద్దేశమే ఎంటర్‌టైన్ చేయడం.
‘‘సినిమాల వల్ల సమాజంలో మంచి మార్పొస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? మంచి సినిమా కొంతమందిని మాత్రమే ప్రభావితం చేయగలుగుతుంది. అసలు సినిమా ముఖ్యోద్దేశమే ఎంటర్‌టైన్ చేయడం. అందుకే సినిమాకన్నా సమాజంలో అవినీతిని ఏరిపారేయగల శక్తి ప్రభుత్వానికే ఉంది. చట్టంలో కొన్ని మార్పులు తెచ్చి, తప్పు చేసినవాడికి వెంటనే శిక్షపడేలా చేస్తే తప్పులు జరగవు’’ అంటున్నారు కరీనాకపూర్.
మారు మూల గ్రామాలతో పాటు ఢిల్లీ, ముంబయ్‌లాంటి మహానగరాల్లో సైతం ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలను ఉద్దేశించే కరీనా ఇలా పేర్కొన్నారు. దీని గురించి ఇంకా విపులంగా చెబుతూ -‘‘చట్టాలను పునః పరిశీలించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. భారతదేశంలో ఆడవాళ్లకు రక్షణ కరువయ్యింది. మనకు తెలిసి కొన్ని సామూహిక అత్యాచారాలు వెలుగులోకొస్తున్నాయి.
కానీ వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. పట్టుబడితే వెంటనే శిక్ష పడదనో లేక ఎలాగైనా తప్పించుకోవచ్చనో తప్పులు చేస్తున్నారు. నిరక్షరాస్యత కూడా ఈ తప్పులకు ఓ కారణం అని చెప్పాలి. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చాలా భయంగా ఉంది. మా అక్క కరిష్మాకి ఆరేళ్ల పాప ఉంది. తనకు పదహారేళ్లు వచ్చేసరికి మంచి మార్పొస్తుందని, సమాజంలో ఆడవాళ్లకు తగినంత రక్షణ ఉంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు కరీనాకపూర్.