నాకు కరీనాయే సర్వస్వం | Kareena is a blessing in my life, Karisma Kapoor | Sakshi
Sakshi News home page

నాకు కరీనాయే సర్వస్వం

Published Mon, Oct 13 2014 6:31 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నాకు కరీనాయే సర్వస్వం - Sakshi

నాకు కరీనాయే సర్వస్వం

బెంగళూర్: నటి కరీనాకపూర్ తనకు సర్వస్వమని సోదరి కరిష్మా కపూర్ పేర్కొంది. కరీనా తనకు సోదరిగా కంటే మంచి స్నేహితురాలని స్పష్టం చేసింది. 2012లో విడుదలైన ‘డేంజరస్ ఇష్క్’ సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈ 40 ఏళ్ల నటి మా ఇద్దరి మధ్య బంధం గట్టిదని తన మనసులో మాట చెప్పింది.  ‘మేమిద్దరం అక్కా చెల్లెళ్లం. కరీనా ఓ కుటుంబ సభ్యురాలిగా కంటే గొప్ప స్నేహితురాలు. ఆమె నా జీవితంలో ఒక ఆశీర్వచనం’ అని కరిష్మా కపూర్ తెలిపింది. పది సంవత్సరాలపాటు ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాలీవుడ్‌లో విజయపరంపరను కొనసాగించడడం అరుదైన విషయమని ఈ ‘జుబేదా’ సినిమా నటి తెలిపింది.

 

'ఒకే ఫీల్డ్ లో విజయవంతంగా దశాబ్దంపాటు బాలీవుడ్‌లో పనిచేయడం గతంలో జరిగిన దాఖలాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. ఈ విషయంలో నేనెంతో అదృష్టవంతురాలినని అనిపిస్తోంది. గొప్ప కెరీర్ దొరకడం మా అదృష్టమని అనుకుంటున్నా. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యా గొప్ప అనుబంధం ఉన్నప్పటికీ వృత్తిపరమైన నిర్ణయాల విషయంలో ఎవరిమీ జోక్యం చేసుకోలేదు’ అని కరిష్మా స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement