పెళ్లిళ్లూ విడాకులూ... | Karisma Kapootaken a Divorce | Sakshi
Sakshi News home page

పెళ్లిళ్లూ విడాకులూ...

Published Mon, Jan 4 2016 11:55 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పెళ్లిళ్లూ   విడాకులూ... - Sakshi

పెళ్లిళ్లూ విడాకులూ...

 బాలీవుడ్ బాత్

ఇవి కూడా బాలీవుడ్ సినిమా కథలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉన్నాయి. నటి కరిష్మా కపూర్ వ్యాపార వేత్త సంజయ్ కపూర్ 2003లో వివాహం చేసుకున్నాక ఇద్దరు పిల్లలను కన్నారు. అయితే ఆ తర్వాత పొరపొచ్చాలు వచ్చి 2014లో పరస్పర అంగీకారం ప్రకటిస్తూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ కేసు ఒక కొలిక్కి రాక మునుపే సంజయ్ కపూర్ తన అంగీకారాన్ని వాపసు తీసుకున్నాడు. దాంతో కరిష్మా కూడా వాపసు తీసుకోవాల్సి వచ్చింది. విడాకుల కోసం పెట్టుకున్న షరతులపై ఇరువర్గాలు నమ్మకం కలిగించడంలో విఫలమవడం వల్లే ఈ నిర్ణయం అని పైకి చెబుతున్నా లోపల కారణాలు వేరేగా కనపడుతున్నాయి. సంజయ్‌కు దూరమయ్యాక కరిష్మా ఒక ఫార్మసూటికల్ సంస్థ సిఇవో అయిన సందీప్ తోష్నివాల్‌తో సన్నిహితంగా ఉంటోందని వార్త. వాళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట. అయితే సందీప్‌కు ఇది వరకే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని భార్య (డెంటిస్ట్) విడాకులకు సిద్ధంగా ఉన్నా బదులుగా మూడు కోట్ల రూపాయలు పిల్లల కోసం తన కోసం చెల్లించమని కోరుతోంది. ఇటువైపు సంజయ్ కపూర్ ఢిల్లీ మోడల్ ప్రియా సచ్‌దేవ్‌తో సన్నిహితంగా ఉన్నాడు.

వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం సంజయ్ కపూర్ తల్లికి ఇష్టం లేదట. కనుక కరిష్మాకు సంజయ్‌కు విడాకులు రాకుండా చేసి ఈ పెళ్లికి అడ్డుపడాలని భావిస్తున్నట్టు భోగట్టా. చెప్పుకోవాల్సిన సంగతి ఏమంటే ప్రియా సచ్‌దేవ్ రెండేళ్ల క్రితం న్యూయార్క్ సంపన్నుడైన విక్రమ్ చట్వాల్‌ను అంగరంగ వైభోగంగా పెళ్లాడింది. తాజాగా ఆ పెళ్లి పెటాకులైంది. ఈ గొడవలు ఎలా ఉన్నా నా పిల్లలను నాకివ్వండి అని తాజాగా కరిష్మా భర్త కోర్టుకెక్కాడు. ప్రస్తుతం పిల్లలను తనతోనే పెట్టుకున్న కరిష్మా ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి.
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement