భర్త, అత్తపై కరిష్మా కపూర్ ఫిర్యాదు | Karishma Kapoor files FIR under sections 498 A and section 34 against husband Sanjay and mother in law Rani | Sakshi
Sakshi News home page

భర్త, అత్తపై కరిష్మా కపూర్ ఫిర్యాదు

Published Sat, Feb 27 2016 3:01 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

భర్త, అత్తపై కరిష్మా కపూర్ ఫిర్యాదు - Sakshi

భర్త, అత్తపై కరిష్మా కపూర్ ఫిర్యాదు

ముంబయి:  తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ..భర్త, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సంజయ్‌కపూర్, అతని కుటుంబం తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె  తన ఫిర్యాదులో పేర్కొంది.  కరిష్మా స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు సంజయ్‌కపూర్, అతని తల్లి రాణి సురీందర్ కపూర్పై  సెక్షన్ 498ఏ, 34కింద  కేసు నమోదు చేశారు. కాగా కరిష్మా, సంజయ్‌కపూర్ విడాకుల కేసు ముంబయి బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ కేసు మార్చి 3న విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో సంజయ్ కపూర్ ఫ్యామిలీపై కరిష్మా తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడం గమనార్హం.  కరిష్మ, సంజయ్ కపూర్ మధ్య మనస్పర్థలు రావడంతో వీరు గత అయిదేళ్లుగా విడిగా ఉంటున్నారు.  మరోవైపు  కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ భర్త సంజయ్ కపూర్ గత ఏడాది ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement