విడాకుల తర్వాత అతనికి దగ్గరవుతున్న నటి! | actress wants to move in new apartment | Sakshi
Sakshi News home page

విడాకుల తర్వాత అతనికి దగ్గరవుతున్న నటి!

Published Sun, Dec 18 2016 1:04 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

విడాకుల తర్వాత అతనికి దగ్గరవుతున్న నటి!

విడాకుల తర్వాత అతనికి దగ్గరవుతున్న నటి!

ముంబై: ఒకప్పటి అందాల కథానాయిక కరిష్మా కపూర్‌. భర్త సంజయ్‌ కపూర్‌తో తీవ్ర విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఓ కంపెనీ సీఈవో అయిన సందీప్‌ తోష్నివాల్‌తో కరిష్మా సన్నిహితంగా మెలుగుతోందట. రోజురోజుకు వీరి అనుబంధం బలపడుతున్నదని చెప్తున్నారు. త్వరలోనే రిలేషన్‌షిప్‌లో అడుగుపెట్టాలని ఈ జంట భావిస్తున్నదని కథనాలు వస్తున్నాయి.

సందీప్‌ కూడా భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్నాడు. త్వరలోనే అతను విడిపోయిన తన భార్య ఆష్రిత నుంచి విడాకులు తీసుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంద్రాలోని ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ తీసుకోవాలని సందీప్‌ భావిస్తున్నాడు. 3 బీహెచ్‌కే ప్లాటు తీసుకొని దానిని తన  ప్రియురాలు కరిష్మాకు కానుకగా ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు వదంతులు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సందీప్‌ తీసుకోబోతున్న ఈ కొత్త అపార్ట్‌మెంట్‌లోకి తన పిల్లలు సమైరా, కియాన్‌తో కలిసి కరిష్మా వెళ్లే అవకాశముందని, ఈ జంట కలిసి సహజీవనం చేయాలనుకుంటోందని చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement