Sandeep Toshniwal
-
రెండో పెళ్లికి సిద్ధమవుతున్న కరిష్మా?!
అలనాటి అందాల తార కరిష్మా కపూర్ (43) రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంజయ్ కుమార్‌తో విడాకుల తరువాత కొంతకాంలగా అన్నింటికి దూరంగా ఉంటున్న కరిష్మా ఈ మధ్య ప్రముఖ వ్యాపారవేత్త సంతీప్ తోష్నివాల్‌తో సన్నిహితంగా ఉన్నట్లు బీ టౌన్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చేలా.. కరిష్మాచ సందీప్‌లు బాంద్రాలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. అందులో ఎగేజ్మెంట్ రింగ్కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కరిష్మా ప్రేమ, రెండో పెళ్లి పుకార్లపై ఆమె తండ్రి రణధీర్ కపూర్ స్పందించారు. కరిష్మ రెండో పెళ్లి చేసుకుంటే.. తన ఆశీస్సులు ఉంటాయని రణధీర్ స్పష్టం చేశారు. కరిష్మా ఇంకా చిన్నపిల్లే.. పెళ్లి చేసుకుని ఆనందంగా గడిపే సమయం ఉంది.. గతాన్ని మర్చిపోయి మళ్లీ కొత్త జీవితాన్ని ఆమె మొదలు పెట్టాలనుకుంటే.. నా కన్నా ఆనందించేవారు ఎవరుంటారు? అని రణధీర్ కపూర్ అన్నారు. -
కరీష్మా కపూర్ రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్
ముంబయి: ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీష్మా కపూర్ పెళ్లి విషయంలో తన మాజీభర్త సంజయ్ కపూర్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె రెండోపెళ్లికి లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ తోష్నివాల్ను ఆమె త్వరలోనే పెళ్లాడబోతుందట. ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. కరీష్మా మాజీభర్త సంజయ్ కపూర్ తన ప్రేయసి ప్రియా సచ్దేవ్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కరీష్మా కూడా సందీప్‌ను వివాహం చేసుకోనున్నట్లు ఓ వెబ్సైట్ కథనం ప్రచురించింది. కాగా సందీప్ తోష్నివాల్కు అతడి భార్య అశ్రిత విడాకులు ఇచ్చేందుకు సుముఖంగా ఉండటంతో ఈ పెళ్లికి దాదాపు గ్రీన్ సిగ్నల్ పడినట్లే. గతంలో విడాకులు ఇచ్చేందుకు అశ్రిత ఇష్టపడలేదు. అయితే గత కొంతకాలంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అశ్రిత..తన భర్తకు డైవర్స్ ఇవ్వడానికి సిద్ధపడటంతో, అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ కూడా మొదలయ్యాయట. ఇందుకోసం ఆమె భారీగానే భరణం డిమాండ్ చేసిదంట. ఢిల్లీలో ఉన్న ఇంటితో పాటు అశ్రితకు రూ.రెండు కోట్లు, అలాగే ఇద్దరు పిల్లలకు చెరో రూ.3 కోట్లు ఇచ్చేందుకు సందీప్ తోష్నివాల్ అంగీకరించినట్లు సమాచారం. అలాగే ఇద్దరు కూతుళ్లు తల్లి కస్టడీలోనే ఉండనున్నారు. సందీప్ తోష్నివాల్‌తో అశ్రిత వివాహం 2013లో జరిగింది. అయితే భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆరోపణలు చేయడంతో వారిద్దరి వివాహ బంధానికి బీటలు ఏర్పడ్డాయి. సందీప్ తరఫు న్యాయవాది మాత్రం అర్షిత మానసిక రుగ్మతతో బాధపడుతోందని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయితే చికిత్స తీసుకునేందుకు ఆమె నిరాకరించిందని, అశ్రితతో విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఇక కరీష్మా, సందీప్ తోష్నివాల్ బంధం గురించి మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తు వార్తలు కూడా వెలువడ్డాయి. ఇటీవలే కరీనా తన కొడుకు పుట్టిన సందర్భంగా ఇచ్చిన పార్టీలోనూ సందీప్ తోష్నివాల్ హడావుడి కూడా కనిపించింది. కరీష్మా కుటుంబం కూడా వీరి పెళ్లికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. -
విడాకుల తర్వాత అతనికి దగ్గరవుతున్న నటి!
ముంబై: ఒకప్పటి అందాల కథానాయిక కరిష్మా కపూర్. భర్త సంజయ్ కపూర్‌తో తీవ్ర విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఓ కంపెనీ సీఈవో అయిన సందీప్ తోష్నివాల్‌తో కరిష్మా సన్నిహితంగా మెలుగుతోందట. రోజురోజుకు వీరి అనుబంధం బలపడుతున్నదని చెప్తున్నారు. త్వరలోనే రిలేషన్షిప్లో అడుగుపెట్టాలని ఈ జంట భావిస్తున్నదని కథనాలు వస్తున్నాయి. సందీప్ కూడా భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్నాడు. త్వరలోనే అతను విడిపోయిన తన భార్య ఆష్రిత నుంచి విడాకులు తీసుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంద్రాలోని ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ తీసుకోవాలని సందీప్ భావిస్తున్నాడు. 3 బీహెచ్‌కే ప్లాటు తీసుకొని దానిని తన ప్రియురాలు కరిష్మాకు కానుకగా ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు వదంతులు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. సందీప్ తీసుకోబోతున్న ఈ కొత్త అపార్ట్మెంట్లోకి తన పిల్లలు సమైరా, కియాన్‌తో కలిసి కరిష్మా వెళ్లే అవకాశముందని, ఈ జంట కలిసి సహజీవనం చేయాలనుకుంటోందని చెప్తున్నారు.