ప్రేయసిని పెళ్లాడిన మాజీ నటి భర్త | Karisma Kapoor ex-husband sunjay kapur ties the knot with Priya Sachdev | Sakshi
Sakshi News home page

ప్రేయసిని పెళ్లాడిన మాజీ నటి భర్త

Published Fri, Apr 14 2017 2:17 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

Karisma Kapoor ex-husband sunjay kapur ties the knot with Priya Sachdev

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీష్మా కపూర్‌ మాజీ భర్త సంజయ్‌ కపూర్‌ ఎట్టకేలకు ప్రేయసి ప్రియా సచ్‌దేవ్‌ను పెళ్లాడాడు. గురువారం ఢిల్లీలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి వధూవరుల కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను ప్రియ సచ్‌దేవ్‌ సోదరి తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసింది. కాగా మరోసారి ఈ జంట న్యూయార్క్‌లో వివాహం చేసుకోనున్నారు. వివాహ విషయాన్ని ముంబైయి మిర్రర్‌ వెల్లడించింది.  గత నెల రోజులుగా సంజయ్‌ కపూర్‌ పెళ్లివార్త హల్‌చల్‌ చేసిన విషయంతెలిసిందే.
చాలా ఏళ్ల క్రితం సంజయ్‌ కపూర్‌కు ప్రియ సచిదేవ్‌ న్యూయార్క్‌లో పరిచయం అయ్యింది. గత అయిదేళ్లుగా వీరి బంధం కొనసాగుతోంది. కాగా సంజయ్‌ కపూర్‌కు ఇది మూడో పెళ్లి కాగా, ప్రియా సచ్‌దేవ్‌కి రెండో వివాహం. ప్రియా సచ్‌దేవ్ గతంలో న్యూయార్క్ లో  సంపన్నుడైన విక్రమ్ చట్వాల్‌ను అంగరంగ వైభోగంగా పెళ్లాడింది. ఆ తర్వాత ఆ పెళ్లి పెటాకులైంది. అనంతరం సంజయ్‌ కపూర్‌తో డేటింగ్‌ చేస్తోంది. మరోవైపు సంజయ్‌ కపూర్‌కూడా గత ఏడాది కరీష్మా కపూర్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరికి 12 ఏళ్ల కూతురు సమైరా, ఏడేళ్ల కొడుకు రాజ్‌ ఉన్నారు. అయితే కరీష్మా, సంజయ్‌ కపూర్‌ మధ్య విభేదాలు రావడంతో 13ఏళ్ల దాంపత్య జీవితానికి తెరపడింది. గత ఏడాది జూన్‌లో వీరిద్దరూ చట్టబద్దంగా విడాకులు తీసుకున్నారు.

కాగా కరీష్మా తండ్రి రణధీర్‌ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో సంజయ్‌ కపూర్‌పై మండిపడ్డారు. థర్డ్‌ క్లాస్‌ మెన్‌ అంటూ విమర్శించారు. అతడికి వివాహ వ్యవస్థపై నమ్మకం లేదని, భార్యను ఏనాడు సరిగా చూసుకోలేదని ఆరోపించారు. సంజయ్‌ మరో మహిళలో జీవిస్తున్నాడని, అతడు ఎలాంటివాడో ఢిల్లీలో అందరికీ తెలుసన్నారు. కాగా కరీష్మా కపూర్‌ కూడా ప్రముఖ వ్యాపారవేత్త సందీప్‌ తోష్నీవాల్‌లో సన్నిహితంగా ఉంటుందన్న రూమర్లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement