ఉస్మానియా బిస్కెట్స్ With ఇరానీ చాయ్
చిట్‌చాట్
కరిష్మాకపూర్.. భారతీయ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.
తన విలక్షణ అభినయంతో అలరిస్తున్న ఈ మేటి నటి...
శుక్రవారం హైదరాబాద్‌లో తళుకులీనింది. సికింద్రాబాద్ కార్ఖానా,
కూకట్‌పల్లిలో నీరూస్ స్టోర్స్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సిటీప్లస్
ఆమెను పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
.:: శిరీష చల్లపల్లి
ముంబైలాంటి మెట్రో సిటీస్‌లో వెస్ట్రన్ కల్చర్ ఫాలో అయ్యే యూత్ ఉంటారు. అది సహజం కూడా. కానీ హైదరాబాద్ లేడీస్ వెస్ట్రన్ స్టైల్స్‌ని ఎంత ఫాలో అవుతారో.. ట్రెడిషనల్ వేర్‌ని అంతే ఇష్టపడతారు. నేనూ అంతే... ఎన్నో ఏళ్లుగా సినిమా పరిశ్రమతో ముడిపడి ఉన్నా... వెస్ట్రన్ వేర్‌ను ఎంత ఇష్టపడతానో... భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అంతే గౌరవిస్తా. డ్రెస్సింగ్ విషయంలోనూ అంతే. ఇక ఇండో వెస్ట్రన్ వేర్ అన్నా నాకు బాగా ఇష్టం. అందులోనూ ఇంగ్లిష్ కలర్స్ అంటే ఎక్కువ ప్రేమ.
షూటింగ్ పర్పస్ క న్నా... ఏదో ఒక మాల్ లేక ఇతర ఓపెనింగ్స్‌కి హైదరాబాద్‌కి తరచూ వస్తూనే ఉన్నా కార్లో వెళ్లేటప్పుడూ చుట్టూ గమనిస్తుంటా. ఇంతపెద్ద మెట్రో సిటీలో కూడా అమ్మాయిలు చాలా ట్రెడిషనల్‌గా కనిపించడం చూసి ముచ్చటేస్తుంది. స్పైసీ ఫుడ్ అంటే అంతగా ఇష్టం ఉండదు. కానీ హైదరాబాద్‌లో ఏ హోటల్‌కు వెళ్లినా బిర్యానీనే మొదట ఆఫర్ చేస్తాను. ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్స్ అన్నా మనసు పారేసుకుంటాను.
అమ్మాయి అంటే ఫెమినిటీ మిస్సవ్వకుండానే.. మగవాళ్లకు ఏ రకంగానూ తీసిపోము అని ప్రతిబింబించేలా ఉండాలని కోరుకుంటాను. అలా ఉన్నవాళ్లను చూసినప్పుడు ఆడపిల్లగా పుట్టినందుకు గ ర్వపడతాను. మరో జన్మంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టడానికే ఇష్టపడతాను. ఇక వే రే దేశాలకు వెళ్లినా.. నేను ఇండియన్ అని తెలిసే విధంగానే నా డ్రెస్సింగ్ ఉంటుంది. వేరే వాళ్లను కలిసినప్పుడు విష్ చేయడానికి ‘హాయ్’, ‘హలో’ కంటే నమస్తేనే ప్రిఫర్ చేస్తాను. నా జీవితంలో కెమెరా ఓ భాగమైపోయింది. కెమెరా లేకుండా ఉండలేను!