అక్క కరిష్మానే నాకు ఇన్‌స్పిరేషన్ | Kareena Kapoor Khan: Will Always Aspire to Be Like Karina | Sakshi
Sakshi News home page

అక్క కరిష్మానే నాకు ఇన్‌స్పిరేషన్

Published Fri, Jul 10 2015 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

అక్క కరిష్మానే నాకు ఇన్‌స్పిరేషన్

అక్క కరిష్మానే నాకు ఇన్‌స్పిరేషన్

‘‘మా అక్క కరిష్మాకపూరే నాకు ఇన్‌స్పిరేషన్. నా జీవితంలో ఆమెకు సముచిత స్థానం ఉంది’’ అంటున్నారు కరీనా కపూర్. ఒకానొక సమయంలో కరిష్మా బాలీవుడ్‌లో పేరున్న కథానాయికగా రాణించారు. బాలీవుడ్ అగ్ర కథానాయకులతో ఆడిపాడిన కరిష్మా పెళ్లయ్యాక వెండితెరకు దూరమయ్యారు. కానీ ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయారు. ఆ తర్వాత 2012లో ‘డేంజరస్ ఇష్క్’లో నటించినప్పటికీ ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించకపోవడంతో మళ్ళీ వెండితెరపై కనిపించలేదు.

‘‘ఇప్పుడు అక్క ఏ సినిమాలోనూ నటించే పరిస్థితిలో లేదు. ఆమెకు కుటుంబమే లోకం. ఇద్దరు పిల్లల ఆలనాపాలనతో బిజీ బిజీ. కెరీర్‌కు సంబంధించి ఇప్పటికీ అక్క నాకు సలహాలు, సూచనలు ఇస్తూనే ఉంటుంది. అనుభవంతో ఆమె చెప్పే మాటలను విని, ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను’’ అని కరీనా చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement