లేటెస్ట్... బ్రైటెస్ట్ | latest fashion designs from architha narayanam | Sakshi
Sakshi News home page

లేటెస్ట్... బ్రైటెస్ట్

Published Thu, Sep 8 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

లేటెస్ట్... బ్రైటెస్ట్

లేటెస్ట్... బ్రైటెస్ట్

వివాహపు దుస్తులంటే విలక్షణంగానూ మెరవాలి. సలక్షణంగానూ ఉండాలి.
వెన్నెల జిలుగూ, సూర్యుడి వెలుగూ మిక్స్ చేసినట్లు!
ఆ ఆలోచనతోనే పాశ్చాత్యానికి కాస్తంత ప్రాచ్యం రంగరిస్తే వచ్చిన పర్‌ఫెక్ట్ ఎఫెక్ట్ ఇది.
పట్టు పరికిణీకు కాస్త వెస్ట్రన్ మిక్స్‌తో వచ్చిన గ్రేస్ ఇది.

గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీని తీర్చిదిద్దిన ఎరుపు రంగు లాంగ్ గౌన్‌ని ధరించి వేదిక మీద మెరిసిన బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.

చందనం రంగు ధోతీ కట్టు స్టైల్ డ్రెస్‌తో విద్యుత్‌కాంతుల తో పోటీపడుతున్నట్టు కనిపిస్తున్న మోడల్.

చందనం, బంగారు కలిపి తయారుచేస్తే వచ్చే అందం ఈ లెంగా సొంతం. లెహంగా, దుప్పట్టా.. ఎరుపు రంగు సన్నని అంచు అబ్బురపరిచే కాంతులతో జిగేల్మంటుంది.

బంగారు రంగు పట్టు క్లాత్‌కి అద్భుతమైన పనితనంతో ఆకట్టుకుంటున్న ఎరుపు రంగు అంచు వేడుకలలో వైవిధ్యంగా కళ్లకు కడుతుంది.

పువ్వుల జిలుగులు.. జలతారు మెరుపులతో ఈ లెహంగాని అలంకరించడం తో వేదిక మీద అద్భుతంగా వెలిగిపోయింది.

లతలు, ఆకులు, పువ్వుల అందం ఎరుపు రంగు మీద అత్యంత వైభవంగా వెలిగిపోతుంది అనార్కలీ లెహంగా! లాంగ్ స్లీవ్స్ ఈ డ్రెస్‌ను మరింత హైలైట్‌గా నిలిపాయి.

బంగారు తీగల అల్లిక
ఇటీవల ముంబయ్‌లో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్ ఫెస్టివల్‌లో భాగంగా ‘కాశికా బజార్’ పేరుతో రూపొందించిన ఈ కలెక్షన్‌ని మోడల్స్ చేత ప్రదర్శించాను. మంచి పేరు తెచ్చి పెట్టిన ఈ కలెక్షన్‌లో ఎరుపు, ఆకుపచ్చ, ఎలిఫెంట్ రంగుల మూలాంశాలను తీసుకొని వీటికి బంగారు తీగల అల్లికలను జత చేసి ఒక ప్రాచీన దేశవాళీ పొకడలను చూపించాను. సంప్రదాయం, ఆధునికం సమ్మేళనంగా పట్టు, బంగారు జరీ, బనారసీ కలబోతతో వివాహ వేడుకలలో హైలైట్‌గా నిలిచేలా శ్రద్ధ తీసుకున్నాను.
- అర్చిత నారాయణమ్, ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement