మళ్లీ పెళ్లికి కరిష్మా కపూర్ రెడీ! | Karishma Kapoor to remarry after divorce? | Sakshi
Sakshi News home page

మళ్లీ పెళ్లికి కరిష్మా కపూర్ రెడీ!

Published Fri, Jun 6 2014 4:20 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మళ్లీ పెళ్లికి కరిష్మా కపూర్ రెడీ! - Sakshi

మళ్లీ పెళ్లికి కరిష్మా కపూర్ రెడీ!

ముంబై: సంజయ్ కపూర్ నుంచి విడాకులు తీసుకున్న బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ త్వరలోనే మళ్లీ పెళ్లికి సిద్ధపడుతోంది. కొన్నాళ్లుగా సందీప్ తోష్నీ వాల్‌తో ప్రేమాయణం సాగిస్తున్న ఆమె త్వరలోనే సందీప్‌ను పెళ్లాడనున్నట్లు బాలీవుడ్‌లో వదంతులు వినిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో కరిష్మాకు ఎంతగానో సాయం చేసిన సందీప్ ముంబైలోని ఓ హెల్త్ కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్నాడు. వారిద్దరూ ఏడాదిగా అత్యంత సన్నిహితంగా కనిపిస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

 

సందీప్ కూడా ఇదివరకే తన మొదటి భార్యకు విడాకులిచ్చేశాడు.  దీంతో  ఇద్దరు పిల్లలతో ముంబైలో ఉంటున్నకరిష్మా  మళ్లీ పెళ్లి చేసుకోవడానికి  మార్గం సుగుమం అయినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement