దాంతో ముందస్తు బెయిల్ ఇచి్చన జడ్జి
ముంబై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ముంబైకి చెందిన వ్యక్తిపై ఓ 30 ఏళ్ల మహిళ కేసు పెట్టింది. నిందితుడు మాత్రం తాము పరస్పర అంగీకారం మేరకే సహజీవనం చేశామని వాదించాడు. ‘‘ఆ మేరకు మేం ఒప్పందం కూడా చేసుకున్నాం. దాని ప్రకారం ఈ కేసు చెల్లదు’’అంటూ రుజువుగా సదరు అవగాహన ఒప్పందాన్నే (ఎంవోయూ) కోర్టుకు సమర్పించాడు. దాంతో వారు పరస్పర అంగీకారంతోనే కలిసి బతికారని కోర్టు తేల్చింది. అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది!
ముంబైకి చెందిన వీరిద్దరూ 2023 అక్టోబర్ 6న కలిశారు. 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 దాకా 11 నెలల పాటు సహజీవనం కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) రాసుకున్నారు. అప్పటికే విడాకులు తీసుకున్న ఆమెను పెళ్లి చేసుకుంటానని అతను చెప్పాడు. కానీ అతనికి మరో మహిళతో సంబంధమున్నట్టు కలిసి బతకడం మొ దలుపెట్టాక ఆమె గుర్తించింది. దాంతో, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది.
‘‘నేను గర్భవతినయ్యా. అబార్షన్ మాత్రలు వేసుకోమంటూ బలవంతం చేశాడు. అతనికి అప్పటికే పెళ్లయిందని తర్వాత తెలిసింది. ఇదేమిటని నిలదీస్తే అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడు. తనతో సంబంధం కొనసాగించాలంటూ పట్టుబట్టాడు. నేను లొకేషన్లు మారినా వేధిస్తున్నాడు. నా కొడుకును తీసుకెళ్తానని బెదిరించాడు’’అని ఆరోపించింది. అత్యాచార ఆరోపణలు నిరాధారమని నిందితుడు వాదించాడు. తమ అగ్రిమెంట్‌ను రుజువుగా సమర్పించాడు. దానిపై తాను సంతకం చేయలేదని సదరు మహిళ వాదించింది. ఒప్పంద పత్రం ప్రామాణికతను నిర్ధారించే ఆధారాల్లేవన్న జడ్జి శయనా పాటిల్, ‘ఇది పరస్పర అంగీకారంతో మొదలై చివరికి వికటించిన సంబంధంగా కనిస్తోంది’అని అభిప్రాయపడ్డారు. కస్టడీ విచారణ అవసరం లేదని తేల్చారు.
వైరలవుతున్న ఒప్పందం
వారి ఒప్పంద పత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో పలు నిబంధనలున్నాయి. ‘ఏడాది పాటు అతనింట్లో కలిసుండాలి. ఆ సమయంలో పరస్పరం లైంగిక వేధింపుల కేసులు పెట్టుకోకూడదు. ఎవరికి నచ్చకపోయినా నెల ముందు నోటీసిచ్చి విడిపోవచ్చు’అని రాసుకున్నారు!
Comments
Please login to add a commentAdd a comment