live-in relationship
-
సహజీవనానికి సాక్ష్యంగా... కోర్టుకు ‘ఎంవోయూ’ సమర్పించాడు!
ముంబై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ముంబైకి చెందిన వ్యక్తిపై ఓ 30 ఏళ్ల మహిళ కేసు పెట్టింది. నిందితుడు మాత్రం తాము పరస్పర అంగీకారం మేరకే సహజీవనం చేశామని వాదించాడు. ‘‘ఆ మేరకు మేం ఒప్పందం కూడా చేసుకున్నాం. దాని ప్రకారం ఈ కేసు చెల్లదు’’అంటూ రుజువుగా సదరు అవగాహన ఒప్పందాన్నే (ఎంవోయూ) కోర్టుకు సమర్పించాడు. దాంతో వారు పరస్పర అంగీకారంతోనే కలిసి బతికారని కోర్టు తేల్చింది. అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది! ముంబైకి చెందిన వీరిద్దరూ 2023 అక్టోబర్ 6న కలిశారు. 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 దాకా 11 నెలల పాటు సహజీవనం కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) రాసుకున్నారు. అప్పటికే విడాకులు తీసుకున్న ఆమెను పెళ్లి చేసుకుంటానని అతను చెప్పాడు. కానీ అతనికి మరో మహిళతో సంబంధమున్నట్టు కలిసి బతకడం మొ దలుపెట్టాక ఆమె గుర్తించింది. దాంతో, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది. ‘‘నేను గర్భవతినయ్యా. అబార్షన్ మాత్రలు వేసుకోమంటూ బలవంతం చేశాడు. అతనికి అప్పటికే పెళ్లయిందని తర్వాత తెలిసింది. ఇదేమిటని నిలదీస్తే అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడు. తనతో సంబంధం కొనసాగించాలంటూ పట్టుబట్టాడు. నేను లొకేషన్లు మారినా వేధిస్తున్నాడు. నా కొడుకును తీసుకెళ్తానని బెదిరించాడు’’అని ఆరోపించింది. అత్యాచార ఆరోపణలు నిరాధారమని నిందితుడు వాదించాడు. తమ అగ్రిమెంట్‌ను రుజువుగా సమర్పించాడు. దానిపై తాను సంతకం చేయలేదని సదరు మహిళ వాదించింది. ఒప్పంద పత్రం ప్రామాణికతను నిర్ధారించే ఆధారాల్లేవన్న జడ్జి శయనా పాటిల్, ‘ఇది పరస్పర అంగీకారంతో మొదలై చివరికి వికటించిన సంబంధంగా కనిస్తోంది’అని అభిప్రాయపడ్డారు. కస్టడీ విచారణ అవసరం లేదని తేల్చారు. వైరలవుతున్న ఒప్పందం వారి ఒప్పంద పత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో పలు నిబంధనలున్నాయి. ‘ఏడాది పాటు అతనింట్లో కలిసుండాలి. ఆ సమయంలో పరస్పరం లైంగిక వేధింపుల కేసులు పెట్టుకోకూడదు. ఎవరికి నచ్చకపోయినా నెల ముందు నోటీసిచ్చి విడిపోవచ్చు’అని రాసుకున్నారు! -
సహజీవనానికో అగ్రిమెంట్.. కోర్టు మెట్లెక్కిన యువతి
ముంబై : వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. సహజీవనం చేసేందుకు సిద్ధమయ్యారు. హద్దులు దాటకూడదని నిబంధన పెట్టుకున్నారు. ఇందుకోసం ఒప్పందం కుదర్చుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.పెళ్లి చేసుకుంటానని తన భాగస్వామి మోసం చేయడమే కాకుండా తనపై పలు మార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..దీంతో సదరు వ్యక్తి శిక్ష నుంచి అతన తమ ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్‌ను కోర్టుకు అందించాడు. ఆ తర్వాత ఏమైందటే? ముంబైలో కేర్ టేకర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి (29).. ప్రభుత్వ ఉద్యోగి (42)ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ముందుగా సహ జీవనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇబ్బందులు రాకూడదని అగ్రిమెంట్ రాసుకున్నారు. అన్నట్లుగానే కొన్ని రోజులు కలిసి జీవించారు. ఈ నేపథ్యంలో తన భాగస్వామి తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని,సహజీవనం చేస్తున్న సమయంలో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని యువతి కోర్టులో ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి తరుఫు న్యాయవాది సైతం తమకు న్యాయం చేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు.‘తనని తప్పుడు కేసులో ఇరికించారు. ఇద్దరూ రిలేషన్షిప్లో ఉండేందుకు అంగీకరించినట్లు అగ్రిమెంట్లో తేలింది. ఆమె సంతకం కూడా చేసింది’ అని ఆ వ్యక్తి తరఫు న్యాయవాది సునీల్ పాండే తెలిపారు. అందుకు ఒప్పంద పత్రాలు చూపించగా.. అందులో ఉన్న సంతకాలు తనవి కాదని బాధిత యువతి ఆరోపిస్తుంది.వారి మధ్య జరిగిన సహజీవనం ఒప్పందం.. ఇరువురి మధ్య జరిగిన ఏడు అంశాల ఒప్పందం ప్రకారం 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 వరకు కలిసి ఉండాలని నిర్ణయించారు.ఈ కాలంలో ఒకరిపై మరొకరు లైంగిక వేధింపుల కేసు పెట్టుకోరని, శాంతియుతంగా ఉండాలి. ఆమె ఇంట్లోనే అతడితో కలిసి ఉండాలి. అతని ప్రవర్తన సరిలేదంటే ఒక నెల నోటీసు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా విడిపోవచ్చు.మహిళ అతనితో ఉంటున్నప్పుడు బంధువులు ఆమె ఇంటికి రాకూడదు.స్త్రీ పురుషుడికి ఎలాంటి వేధింపులు, మానసిక వేదన కలిగించకూడదు. అదే సమయంలో స్త్రీ గర్భం దాల్చితే పురుషుడు బాధ్యత వహించకూడదు. మానసిక ప్రశాంతత భంగం వాటిల్లకుండా చూసుకోవడం వంటి పాయింట్లు అగ్రిమెంట్లో చేర్చడంతో పాటు దాన్ని నోటరీ చేయించడం గమనార్హం. దీనిపై నెట్టింట చర్చ మొదలైంది. -
యూసీసీ కింద నమోదైతే పోలీసు రక్షణ
నైనిటాల్: సహజీవనం చేస్తున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్‌పై ఉత్తరాఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) ఇంకా అమల్లో రాలేదు. అయినప్పటికీ ఈ చట్టం కింద 48 గంటల్లోగా రిజిస్టర్ చేసుకున్న పక్షంలో పిటిషన్‌దారుగా ఉన్న జంటకు ఆరు వారాలపాటు రక్షణ కల్పించాలంటూ పోలీసు శాఖను ఆదేశిస్తూ జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ, జస్టిస్ పంకజ్ పురోహిత్ల డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ పరిణామంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున జూనియర్ న్యాయవాది హాజరయ్యారు. రాష్ట్రంలో యూసీసీ అమలుపై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదనే విషయం ఆయనకు తెలియదు. అవగాహనా లోపం వల్ల ఇలా జరిగింది. దీనిపై హైకోర్టులో రీ కాల్ పిటిషన్ వేస్తాం. హైకోర్టు ఈ తీర్పును సవరించి, మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తుంది’అని చెప్పారు. అదే సమయంలో, ఆ జంటకు పోలీసులు రక్షణ కల్పిస్తారని కూడా ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. వేర్వేరు మతాలకు చెందిన తమ కుటుంబాల నుంచి ముప్పుందంటూ సహజీవనం చేస్తున్న 26 ఏళ్ల హిందూ మహిళ, 21 ఏళ్ల ముస్లిం యువకుడు వేసిన పిటిషన్ ఈ మొత్తం వ్యవహారానికి కారణమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతిపాదించిన యూసీసీ ప్రకారం యువ జంటలు తాము సహజీవనం చేస్తున్న రోజు నుంచి నెల రోజుల్లోగా అధికారుల వద్ద నమోదు చేసుకోకుంటే జరిమానా విధించొచ్చు. -
Madhya Pradesh High Court: సహజీవనం చేసినా భరణం
భోపాల్: చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా ఒక పురుషుడితో చాలాకాలం సహజీవనం చేసి విడిపోయిన మహిళ భరణానికి అర్హురాలేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భరణం ఇవ్వాలన్న కింది కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. 38 ఏళ్ల శైలేంద్ర బాప్చే, 48 ఏళ్ల అనిత చాలాఏళ్లు సహజీవనం చేశారు. కుమారుడు పుట్టాక విడిపోయారు. బిడ్డను పోషించుకోవడానికి, తన జీవనానికి భరణం ఇవ్వాలని అనిత డిమాండ్ చేయగా శైలేంద్ర అంగీకరించలేదు. దాంతో ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అనిత్ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ.1,500 చొప్పున భరణం చెల్లించాలని శైలేంద్రను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శైలేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వును సమర్థించింది. శైలేంద్ర పిటిషన్‌ను కొట్టివేసింది. సహజీవనం చేసి విడిపోయిన మహిళ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే సీఆర్పీసీ సెక్షన్ 125 కింద ఆమెకు భరణం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. -
సహజీవనం ప్రమాదకరమైన జబ్బు
న్యూఢిల్లీ: సహజీవనం ప్రమాదకరమైన జబ్బు అని బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విధానాన్ని సమాజం నుంచి పూర్తి నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సహజీవన విధానానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని కోరారు. లోక్‌సభలో గురువారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘పాశ్చాత్య దేశాల్లో సహజీవన సంబంధాలు సర్వసాధారణం. కానీ, ఈ చెడ్డ విధానం మన సమాజంలో వ్యాధి మాదిరిగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని పరిణామాలు భయంకరంగా ఉంటున్నాయి. ఢిల్లీలో చోటుచేసుకున్న శ్రద్ధావాకర్, అఫ్తాబ్ పూనావాలా లివ్–ఇన్ రిలేషన్ షిప్ ఎంతటి దారుణానికి దారి తీసిందో చూస్తున్నాం’ అని గుర్తుచేశారు. వివాహాన్ని పవిత్ర బంధంగా భావించే మనదేశంలో విడాకుల శాతం 1.1 శాతం మాత్రమేనన్నారు. అదే అమెరికాలో విడాకుల శాతం 40 శాతం వరకు ఉంటోందన్నారు. ప్రేమ వివాహాల్లో విడాకుల శాతం ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఇలాంటి బంధాల విషయంలో ఇరువైపులా తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేయాలని సూచించారు. సామాజిక, వ్యక్తిగత విలువలు, కుటుంబాల నేపథ్యాలను బట్టి పెళ్లిళ్లను పెద్దలు కుదర్చటం మన దేశంలో అనాదిగా వస్తోందని గుర్తు చేశారు. ‘వసుధైవ కుటుంబకమ్ అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి. మిగతా దేశాలతో పోలిస్తే మన సామాజిక వ్యవస్థ భిన్నమైంది. భిన్నత్వంలో ఏకత్వమన్న భారతీయ భావనను యావత్తు ప్రపంచమే మెచ్చుకుంది’అని ఆయన తెలిపారు. -
కాజల్ అనుమానస్పద మృతి.. ప్రియుడిపై అనుమానం
సాక్షి, వరంగల్: హనుమకొండ బొక్కలగడ్డలో యువతి కాజల్ అనుమానస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ప్రియుడే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆటో డ్రైవర్ అబ్బాస్ తో సహజీవనం చేసే యువతి కాజల్ జూలై 12న మృతి చెందగా కుటుంబసభ్యులు పూడ్చి పెట్టారు. ఆలస్యంగా మేల్కొన్న కాజల్ తల్లి షరనార్జన్ బిడ్డ మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు 20 రోజుల క్రితం పూడ్చిపెట్టిన కాజల్ మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ వైద్య బృందం, తహశీల్దార్ సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. కూలీ పనితో కుటుంబాన్ని పోషించుకునే కాజల్ ను అబ్బాస్ లోబర్చుకుని హత్య చేసి అనుమానం రాకుండా అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించాడని కాజల్ తల్లి ఆరోపించారు. (చదవండి: బావా కలవాలని ఉంది.. అని మెసేజ్ పెట్టి) -
ప్రేమ, పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్‌తో సహజీవనం.. భర్తకు విడాకులు ఇప్పించి...
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాది కొడుకున్న తనకు భర్తతో విడాకులిప్పించి నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న యువకుడు మోసం చేశాడంటూ ఓ జూనియర్ ఆర్టిస్ట్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సమాచారం మేరకు.. రహ్మత్‌నగర్‌లో అద్దెకుంటున్న జూనియర్ ఆర్టీస్ట్(26)కు నాలుగేళ్ల క్రితం ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తితో రహ్మత్‌నగర్ వీడియోగల్లీలో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. చదవండి: పెద్దసారు పాడుబుద్ధి.. విద్యార్థినులు బడికి వెళ్లకపోవడంతో.. నాలుగేళ్లుగా ఇదే ప్రాంతంలో సహజీవనం చేస్తున్నది. ప్రసాద్‌రెడ్డి మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడు. అప్పటి నుంచి జూనియర్ ఆర్టీస్ట్కు వేధింపులు మొదలయ్యాయి. తనను మోసం చేయడమే కాకుండా వేధింపులకు గురిచేస్తూ మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్న ప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రసాద్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 354(డి), 420, 509 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడియో వైరల్: మైనర్ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ప్రియుడితో పారిపోయిందని.. -
మైనర్ బాలుడితో 42 ఏళ్ల మహిళ సహజీవనం
సాక్షి, పథినంతిట్ట : కేరళలో 42 ఏళ్ల నర్సు.. 18 సంవత్సరాల యువకుడితో సహజీనం చేయడం సంచలనంగా మారింది. లివ్ఇన్ రిలేషన్ ఇప్పుడు సహజమే అయినా.. వయసులో ఇంత అంతరమా? అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం కేరళ మహిళా కమిషన్‌కు చేరడంతో అందరికీ తెలిసింది. డబ్బు, శృంగారం.. వంటి వాటిని ఎరగా వేసి తమ కుమారుడిని నర్సు బుట్టలో వేసుకుందని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి యువకుడి తల్లి చెబుతున్న వివరాలు ఇవి.. ‘పథినంతిట్ట జిల్లా కేంద్రంలో మేము కూలి చేసుకుని జీవిస్తున్నాం, నా కుమారుడు సెకండరీ విద్యను అభ్యసించే సమయంలో నర్సు పరిచయమైంది. ఒకరోజు మా అబ్బాయి బైక్ కావాలని అడిగాడు.. ఆర్థిక పరిస్థితిని వివరించి కొనలేనని చెప్పాను. అదే సమయంలో అతడికి సౌదీ అరేబియాలో నర్సుగా పనిచేస్తున్న 42 ఏళ్ల మహిళ ఫేస్బుక్లో పరిచయం అయింది. గిఫ్ట్ కింద బైక్ కొనుక్కోమని రూ. 43 వేలు మావాడి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. సౌదీ అరేబియా నుంచి నర్సు ఇండియాకు తిరిగి రాగానే.. మా అబ్బాయిని తీసుకుని బెంగళూరు వెళ్లిపోయింది. అక్కడే ఇద్దరు ఆరు నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఈ సమయంలో మా అబ్బాయికి మద్యం, సహా ఇతర దురలవాట్లను నేర్పింద’ని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా... ఆరు నెలల తరువాత 19 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులను కలిసే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. వెంటనే తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలంటూ నర్సు.. వేధింపులు మొదలు పెట్టింది. యువకుడి మీద క్రిమినల్ కేసులు పెట్టి.. మూడు నెలల పాటు జైలు పాల్జేసింది. కుమారుడిని విడిపించుకోవడం కోసం అతడి తల్లిదండ్రులు ఆస్తిని తనఖా పెట్టారు. దీంతో సదరు నర్సు కేరళ మహిళా మిషన్‌ను ఆశ్రయించింది. రూ.43 వేల అసలుతో పాటూ వడ్డీ కూడా చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ ఘటనపై విచారణ చేసిన మహిళా కమిషన్.. ఆమె దిమ్మతిరిగేలా తీర్పు చెప్పింది. సమాజానికి నీలాంటి మహిళల వల్ల ప్రమాదం ఉందని చెబుతూ.. యువకుడు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని కమిషన్ ప్రకటించింది. -
సహజీవనం: మహిళా టెక్కీతో గొడవపడి..!
సహజీవనం చేస్తూ.. పెళ్లి విషయమై గొడవపడ్డందుకు ఓ 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఆమె భాగస్వామి గొంతునులిమి చంపాడు. ఈ ఘటన మహారాష్ట్ర థానె జిల్లాలోని బద్లాపూర్‌లో బుధవారం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నాసిక్‌కు చెందిన పూనం పూన్యకర్ గజ్‌బియే గత మూడేళ్లుగా బద్లాపూర్‌లో నివసిస్తోంది. ఆమె ముంబై కన్జుర్‌మార్గ్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని... విజయ్ సంజయ్ ఝార్కడ్(22)తో అనే యువకుడితో ఆమె సహజీవనం చేస్తోంది. తమ సహజీవనం గురించి ఇంట్లో తెలిసిపోయిందని, దీనిని తమ కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నారని, కాబట్టి ఇక తమ అనుబంధం కొనసాగబోదని పూనం చెప్పడంతో ఇద్దరి మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో క్షణికావేశంలో విజయ్ చున్నీతో పూనం గొంతు నులిమి చంపేశాడు. ఆ వెంటనే ఇంటి బయటి నుంచి తలుపు పెట్టి స్నేహితుడి ఇంటికి పరారయ్యాడు. అక్కడ స్నేహితుడికి జరిగిన విషయం చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని.. ఆ తర్వాత విజయ్ను అదుపులోకి తీసుకున్నారు. బద్లాపూర్‌లోని ఓ మొబైల్ రిపేర్ షాపులో పూనం, విజయ్ను మొదట కలిసింది. కొన్నాళ్లుగా వారిరువురు సహజీవనం చేస్తున్నారు. 'ఆరు నెలల కిందట పూనం కొనుగోలు చేసిన గదిలో ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. రెండేన్నరేళ్లుగా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతోంది. ఇటీవల వారి సహజీవనం గురించి పూనం ఇంట్లో తెలిసిందే. దీనిని వారు వ్యతిరేకించడంతో ఈ విషయమై ఇద్దరి మధ్య గత కొన్నిరోజులుగా తరచూ గొడవలు జరిగాయి' అని జోన్ 4 డిప్యూటీ కమిషనర్ సునీల్ భరద్వాజ్ తెలిపారు. -
సహజీవనంలో అత్యాచారం
బనశంకరి (బెంగళూరు): సహజీవనం చేస్తుండగా, తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక మహిళ(39) శనివారం బెంగళూరు సంజయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మహిళ ఇక్కడే ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రదీప్ కుమార్ అభిరామ్ అనే వ్యక్తి బెంగళూరులోనే ఉంటాడు. అతనితో 2010 నుంచి పరిచయమని, ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. సహజీవనం చేస్తున్న సమయంలో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకోమని అడిగితే ఏకాంతంగా గడిపిన వీడియోలు ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. కులం పేరుతోనూ దూషించాడని వాపోయింది. పలువురు మహిళలను బెదిరించి సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపించారు. ప్రదీప్ కుమార్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. -
అది రేప్ కాదు.. లీవ్ ఇన్ రిలేషన్షిప్
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో 10 ఏళ్లు జైలు శిక్షపడ్డ ఓ నిందితుడికి విముక్తి లభించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ఆరోపణలు చేసిన బాధితురాలు నిందితుడితో లీవ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నట్టు తేలిందని, ఇది అత్యాచార ఘటన కాదని కోర్టు తీర్పు చెప్పింది. 2011 జనవరిలో తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు వచ్చి తనపై అత్యాచారం చేశాడని సంబంధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల తర్వాత ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 15 వేల రూపాయల జరిమానా విధించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. భర్తకు దూరంగా ఉంటున్న బాధిత మహిళను తాను అత్యాచారం చేయలేదని, ఆమె తనతో లీవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందని కోర్టుకు విన్నవించాడు. నిందితుడి నుంచి ఆమె 11 వేల రూపాయలు అప్పుగా తీసుకుందని, తిరిగి ఇవ్వమని అడిగినందుకు తప్పుడు కేసు పెట్టిందని అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. -
సహజీవనానికి సై అంటున్న హీరోయిన్!
ముంబై: ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపిస్తున్న చిత్రం బాఘీ. ఈ మూవీ హీరోయిన్ శ్రద్ధాకపూర్ మరోసారి తన నటనతో విమర్శల ప్రశంసలు దక్కించుకుంది. అయితే శ్రద్ధాకపూర్ ఈ మధ్య ఎందుకో మరి సహజీవనం చేయడానకి సిద్ధమైందట. హీరో ఆదిత్యారాయ్ కపూర్ ఏం చెప్పినా 'ఓకే జాను' అంటుంది. ఇంతకి సంగతేంటి అనుకుంటున్నారా.. బాఘీ తర్వాత ఓ కొత్త మూవీలో నటిస్తుంది. ఆ మూవీ టైటిల్ 'ఓకే జాను'. యువ జంట సహజీవనం చేయడం అనే అంశంపై ఈ మూవీ కథాంశం ఉంటుంది. ఆదిత్యారాయ్ తో సహజీవనం చేస్తూ రొమాన్స్ చేయనుంది. బాఘీ విడుదలై వారం రోజులు కూడా గడవకముందే తన తర్వాతి ప్రాజెక్టుపై శ్రద్ధగా వర్క్ చేస్తుంది శ్రద్ధా. ఇంకా చెప్పాలంటే బాఘీ రిలీజైన రోజే షూటింగ్ లో పాల్గొంది. తన మూవీ గురించి టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని, కానీ బిజీగా ఉండటం వల్ల అది సాధ్యమవడం లేదని కాస్త బాధగా ఉందట. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఒకే కన్మణి' మూవీకి ఇది హిందీ రీమేక్. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో 'ఓకే బంగారం' పేరుతో డబ్ చేశారు. హిందీలో 'ఆషికీ 2' జోడీ ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ మరోసారి ఒకే తెరమీద కనిపించనున్నారు. శ్రద్ద నటించిన 'రాక్ ఆన్ 2' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. -
సహజీవనం తప్పేమీ కాదు: సుప్రీంకోర్టు
మన సమాజంలో ఇప్పుడు సహజీవనం కూడా ఆమోదం పొందిందని, అందువల్ల దాన్ని తప్పుగా చెప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుత ఆధునిక సమాజంలో సహజీవనం అందరికీ ఆమోదయోగ్యం అయ్యిందని, అందువల్ల అది నేరం కాదని తెలిపింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజాజీవితంలో ఉన్నవాళ్ల సహజీవనాన్ని బయటపెట్టడం పరువునష్టం కిందకు వస్తుందా అని ప్రభుత్వాన్ని అడిగే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాజీవితంలో ఉన్నవాళ్ల వ్యక్తిగత జీవితంలో ప్రజలు తొంగి చూడకూడదని, అలా చూడటం వల్ల ప్రజా ప్రయోజనం ఏమీ ఉండబోదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కోర్టుకు సమాధానం ఇచ్చారు. -
సహజీవన సారం...
= సుప్రీం తాజా తీర్పుతో ఆమోదముద్ర = నగరంలో పెరుగుతున్న అనుబంధాలకు ఆసరా = పెళ్లిలో ఉన్న సమస్యలు దీనిలోనూ ఉన్నాయంటున్న ‘లివిన్’జంటలు వివాహంతో పనిలేకుండా, జీవితాంతం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసుకోకుండా, ప్రేమించుకున్న స్త్రీ, పురుషుడు కలిసి ఉండడమే ‘లివ్ ఇన్ రిలేషన్షిప్’. విభిన్న సామాజిక పరిస్థితుల నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిన ఈ ‘సహజీవన’ సంస్కృతి పాశ్చాత్య దేశాలకు బాగా పాత. ఇప్పటికీ చాలామంది నటీనటులు తమ ప్రేమికుడు/ప్రేమికురాలితో ‘కలిసి జీవించడం’ కనిపిస్తోంది. భారతదేశపు మెట్రో నగరాలన్నింటిలోనూ ఈ ట్రెండ్ విస్తరిస్తుండటం విశేషం. ముఖ్యంగా కార్పొరేట్, ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ వంటి నగరాల్లో పెళ్లికి ప్రత్యామ్నాయంగా కొందరు ఈ అనుబంధం ఏర్పరుచుకుంటున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ రకమైన అనుబంధాలకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నగరంలో సహజీవనం చేస్తున్న జంటలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పూర్వాపరాలపై విశ్లేషణ ఈ కథనం. ‘పెళ్లి అనేది పాత కాన్సెప్ట్’ ఇటీవలే సీనియర్ నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్య ఇది. నిజంగానే పెళ్లి అంతరిస్తోందా? మన దేశంలో 2004 నుంచి చూస్తే లివిన్ అనుబంధాల్లో పెరుగుదల 60 శాతం కనిపిస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, పూణె.. నగరాల్లో అత్యధిక సంఖ్యలో యువ లివిన్ జంటలు నివసిస్తున్నాయని ఇటీవల నగరానికి వచ్చిన సందర్భంగా ప్రసిద్ధ ఫ్యామిలీ కౌన్సిలర్ అశోక్‌జైన్ అన్నారు. హ్యాపీ మ్యారేజెస్ ఈజీ డైవోర్సెస్ శకం ఇది అని ఆయన అభిప్రాయపడ్డారు. విడాకుల కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో ఎమ్ఎన్సీలకు చెందిన విడాకుల కేసుల విచారణ కోసం చెన్నై కోర్టు ప్రత్యేక విభాగాన్నే దీనికోసం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు కూడా. కుటుంబలక్ష్యాలు లోపించడం, వ్యక్తిగత వ్యవహారాలకి ప్రాధాన్యం పెరగడం, దంపతులిద్దరూ చెరోలోకం అన్నట్టు ఉండడం.. వంటివన్నీ దాంపత్య బంధాల వైఫల్యానికి తద్వారా లివిన్పై ఆసక్తి పెరగడానికి దోహదం చేస్తున్నాయన్నారు. అయితే ఏ రకమైన అనుబంధమైనా.. ‘ఐయామ్ రైట్’ అనే భావన కావాలో, సంతోషం కావాలో వీళ్లు తేల్చుకోవాల్సి ఉందన్నారు. అయితే లివిన్ జంటలకు అంతా హ్యాపీగా ఉందని అనుకోవడానికి లేదు. వీరికి కనీసం అద్దె ఇళ్లు కూడా దొరకడం లేదు. ‘నేను మా టీం లీడర్‌తో ‘రిలేషన్’లో ఉన్నా. మేమిద్దరం పెళ్లి కాలేదని చెప్పి, ఇల్లు కావాలంటే ఎవరూ అద్దెకు ఇవ్వలేదు. చివరకు భార్యాభర్తలం అని అబద్ధం చెప్పి ఇల్లు తీసుకున్నాం. దీని కోసం అప్పటికప్పుడు మంగళసూత్రాలు కొనాల్సి వచ్చింది’ అని పూణె నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న శీతల్ చెప్పింది. ఇలాంటి కష్టాలను లివిన్ జంటలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాయి. గృహహింస ఎక్కువే.. ఇప్పుడిప్పుడే నగరంలో సహజీవనానికి సంబంధించి గృహహింస కేసులు వెలుగులోకి రావడం ప్రారంభించాయి. ఇప్పటికే పలువురు మహిళలు ఈ చట్టం కింద కేసులు వేసినట్టు ఓ ఎన్జీఓ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘ఏరి కోరి ఎంచుకున్న ఈ లివిన్ రిలేషన్షిప్లో పార్ట్నర్ చిత్రహింసలు తట్టుకోలేకపోతున్నా కూడా ఎంతో మంది విద్యావంతులైన మహిళలు సైతం ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్న పరిస్థితి మేం గమనించాం’ అని ఆంధ్రప్రదేశ్ కొయలేషన్ ఆఫ్ జెండర్ జస్టిస్ (ఏపీసీజీజే) వలంటరీ కౌన్సిలర్ అనురాధ అంటున్నారు. వీటిలో చాలా వరకూ కేసులు సన్నిహితులో, బంధువుల ప్రోత్సాహం వల్ల మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని వివరించారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని కూడా ఈ తరహా అనుబంధాలను నిలబెట్టుకోలేకపోయామనే విమర్శను ఎదుర్కోలేక చాలా మంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని ‘అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్’ డెరైక్టర్ బీనా అంటున్నారు. అచ్చం పెళ్లయిన మహిళ ఏ కారణాల వల్లనైతే గృహహింసకు గురవుతుందో.. అవే కారణాలే ఇందులోనూ మహిళను కడగండ్ల పాలు చేస్తున్నాయని ఎన్జీఓ వలంటీర్లు చెబుతున్నారు. లివింగ్ టుగెదర్‌కు సిద్ధపడ్డవారిలో సహోద్యోగులే ఎక్కువని, కలసి పనిచేసే చోట ప్రారంభమవుతున్న ఈ తరహా ఘర్షణాత్మక వాతావరణం ఇంటి వరకు విస్తరిస్తోందని బీనా విశ్లేషిస్తున్నారు. వదలని ‘ఇగో’.. అనుమానం.. తన భాగస్వామి వృత్తిపరమైన అసూయ కారణంగా హింసకు దిగుతున్నాడని ఓ బాధిత మహిళ చెప్పింది. లివిన్లో బంధానికి కట్టుబడి ఉండాలనే నియమమేదీ లేకపోవడంతో భాగస్వాములిద్దరూ.. ముఖ్యంగా మగవాళ్లు భార్యలపై అనుమానాలు ఎక్కువగా పెంచుకుంటున్నారు. తనను అనుమానించిన తన పార్ట్నర్ తనపై అమీర్‌పేటలోని ఓ డిటెక్టివ్‌ని ప్రయోగించాడని, ఆ విషయం తెలిసి అతనితో అనుబంధాన్ని వదులుకున్నానని ఓ ఎన్జీఓ కౌన్సిలింగ్‌కు వచ్చిన మరో యువతి చెప్పింది. అయితే వీరిలో చాలా మంది కలిసి ఉండడం కోసం పెళ్లికి బదులుగా తాము ఎంచుకున్న పంథా విషయంలో పశ్చాత్తాపం చెందడం లేదు. పెళ్లి వల్ల పురుషుడికి మరిన్ని అపరిమిత అధికారాలు సంక్రమిస్తాయి అని వీరిలో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. భూమిక అనే ఎన్జీఓ హెల్ప్‌లైన్ ద్వారా కౌన్సిలింగ్ పొందిన మహిళ మాట్లాడుతూ..‘పెళ్లికాకుండా పార్ట్నర్తో కలిసి జీవించడానికి నేను నిర్ణయించుకున్నందుకు పలుమార్లు బాధపడిన సందర్భాలున్నాయి. చుట్టుపక్కల ఇళ్లలో మమ్మల్ని ఎవరూ దంపతులుగా గుర్తించకపోవడమే కాకుండా కనీసం ఎటువంటి సాయం కూడా చేసేవారు కాదు. అయితే ఆ సమస్యలన్నీ నా పార్ట్నర్ చిత్రహింసల దెబ్బకు ఏ మూలకో పోయాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వృద్ధాప్యంలోనూ.. సహజీవనం.. ఇది కేవలం యువత కోసమే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఒంటరి వృద్ధులను సైతం ఈ లివింగ్ టుగెదర్ జంటలుగా మారుస్తోంది. రాజ్‌కోట్, అహ్మదాబాద్‌లో.. వినమూల్య అమూల్య సేవ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం లివిన్ మేళాలు జరుగుతున్నాయి. ఈ మేళాలకు వేలాదిమంది హాజరవుతున్నారు. మన నగరంలో సైతం తోడు నీడ అనే స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాలు అమ్మే వ్యక్తి దగ్గర్నుంచి పక్కింటి వ్యక్తి వరకు ఎంతో మంది అనుమానపు చూపులు ఎదుర్కోవల్సి రావడం, కొన్నేళ్ల పాటు కలిసి జీవించినా ఒకరిపై ఒకరికి ఎటువంటి హక్కులూ సంక్రమించకపోవడం, అకస్మాత్తుగా భాగస్వామిని కోల్పోతే.. జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎటువంటి వీలూ లేకపోవడం.. వగైరాప్రతికూలతలు కనబడుతున్నా.. బంధమే తప్ప నిర్బంధాలు లేకపోవడం, ఏ రోజైనా స్వేచ్ఛగా నిష్ర్కమించే వీలుండడం.. తదితర కొన్ని ఆకర్షణలు ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో యువతను లివింగ్ టుగెదర్వైపు ప్రేరేపిస్తున్నాయి. అయితే తరాలకు అతీతంగా వర్థిల్లుతున్న వివాహమనే పటిష్ట సంప్రదాయానికి ఇది ఏ రకంగానూ ప్రత్యామ్నాయం కాలేదనేది నిస్సందేహం. ఈ నేపథ్యంలో పరిస్థితుల ఒత్తిడి కారణంగానో, తమపై తమకున్న నమ్మకంతోనో లివ్ఇన్కు ఓటేస్తున్న యువత దానికి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తాజా తీర్పు ద్వారా సుప్రీం చేసిన సూచన అనుసరణీయం. సుప్రీం తీర్పునకు నేపథ్యం.. ఇంద్రశర్మ అనే మహిళ వీకేవీ శర్మ అనే వివాహితుడు, ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో కలిసి వ్యాపారంతో పాటు జీవితాన్ని కూడా పంచుకుంది. అయితే ఏడేళ్ల తర్వాత అతను తన కుటుంబం కోసం వెనక్కు వెళ్లాడు. ఈ అనుబంధం ముగిశాక ఇంద్రశర్మ బెంగుళూరు కోర్టులో భరణం కోరుతూ పిటిషన్ వేసింది. నెలకు రూ.25వేలు మనోవర్తితో పాటు తన వైద్యఖర్చుల కోసం అయిన రూ.3.50లక్షలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే కోర్టు దీన్ని తిరస్కరించింది. వైవాహిక చట్టం కింద ఈ కేసు వర్తించదని తేల్చింది. ఈ కేసులో మనోవర్తి చెల్లించేందుకు ఆదేశాలు ఇవ్వడమంటే చట్టప్రకారం భార్యగా ఉన్న మహిళ, ఆమె పిల్లలకు అన్యాయం చేయడమేనని అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్లు లివిన్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఆహ్వానించదగ్గ పరిణామం.. నాకు తెలిసిన చాలా మంది ఇష్టపూర్వకంగా దీనిలోకి దిగుతున్నారు. ఐటీ మాత్రమే కాదు ఇతర రంగాలకు చెందినవారు కూడా చాలా మంది ఈ అనుబంధానికి సిద్ధపడుతున్నారు. మన నగరం అనే కాదు రాష్ట్రంలోని చిన్న చిన్న ఊర్లకు సైతం ఇది పాకింది. అనుకున్నదే తడవు.. దీనికి పెద్దగా సన్నాహాలవీ అక్కర్లేదు కాబట్టి సులభంగా అనుబంధంలోకి దిగిపోతున్నారు. అంతే సులభంగా విసిగిపోతున్నారు. ప్రస్తుతానికి లివింగ్ టుగెదర్ అనేది హక్కులు, బాధ్యతలు లేని సంబంధం కాబట్టి.. వారికి ఎలా సలహా ఇవ్వాలో కూడా మాకు అర్థం కావడం లేదు. రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టులలో ఈ తరహా కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా మారాల్సిందే కాబట్టి దీనిని కొన్ని దేశాల్లో ఇప్పటికే చట్టబద్ధం చేశారు. మనం కూడా ఆ బాట పట్టాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగిన పరిణామం. - నిశ్చల సిద్ధారెడ్డి, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ -
సమస్యల ‘సహజీవనం’!
భిన్న విలువలు సహజీవనం చేసే సమాజంలో కొన్నిటిని మాత్రమే గుర్తించి, మరికొన్నిటి ఉనికే తెలియనట్టుగా ప్రవర్తిస్తే అది కపటత్వం అనిపించుకుంటుంది. మన దురదృష్టం... అలాంటి కపటత్వం అంతటా ఆవరించి ఉంది. స్త్రీ, పురుష సంబంధాలు అనేక రకాలుగా ఉంటున్నప్పుడు, దాదాపు అన్నిటిలోనూ సమస్యలు తలెత్తుతున్నప్పుడు కొన్నిటి గురించే ఆలోచించడం, వాటి విషయంలోనే చట్టాలు చేయడం అలాంటి కపటత్వం పర్యవసానమే. అన్నీ ప్రభుత్వానికి తెలియాలని లేదు. కానీ, సూచనలు వచ్చినప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకుని ఏం చేద్దామనే విచికిత్స ఉండాలి. అందునా అలాంటి సూచన చేసింది సర్వోన్నత న్యాయస్థానం అయినప్పుడు దాన్ని పట్టించుకుని తీరాలి. ఆ పని జరగనందువల్లనే సుప్రీంకోర్టు మరొక్కసారి చెప్పాల్సివచ్చింది. వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం నేరమో, పాపమో కాదని... అలాంటి సంబంధాల్లో ఉన్న మహిళలకు, వారి పిల్లలకు సంబంధించి రక్షణ కల్పించేలా ఒక చట్టం అవసరమని గురువారం వెలువరించిన తీర్పులో పార్లమెంటుకు సూచించింది. స్త్రీ, పురుష సంబంధాల విషయంలో గతంలోనూ సుప్రీంకోర్టు కొన్ని విలువైన వ్యాఖ్యలు చేసింది. వివాహమనేది లేకుండా దీర్ఘకాలం ఒక జంట కలిసి ఉన్నప్పుడు దాన్ని చట్టబద్ధమైన వివాహంతో సమానంగా గుర్తించాలని, వారి సంతానాన్ని అక్రమ సంతానంగా పరిగణించరాదని అయిదేళ్లక్రితం ఒక కేసు సందర్భంగా స్పష్టంచేసింది. దాదాపు మూడేళ్లక్రితం భరణం గురించి వచ్చిన కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విషయంలో మరింత నేరుగా చెప్పింది. తమిళనాడుకు చెందిన ఒక జంట మధ్య విభేదాలు తలెత్తి, భరణం కోసం ఆమె ఆశ్రయించినప్పుడు ఈ తీర్పునిచ్చింది. ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఆమెకు భరణం ఇప్పించలేమని చెబుతూనే ఆ విషయమై ఆలోచించమని ప్రభుత్వాన్ని కోరింది. వారిది సహజీవనమే అయినా దాంపత్యంగా పరిగణించలేమని, ప్రస్తుతం ఉన్నచట్టాలు అందుకు అనుగుణంగా లేవని తెలిపింది. 2005 నాటి గృహ హింస చట్టం స్త్రీ, పురుష సంబంధాల్లో కొన్నిటిని మాత్రమే గుర్తించి, వాటిని మాత్రమే దాంపత్యంగా పేర్కొంటున్నదని వివరించింది. ఇతరత్రా సంబంధాల్లోకి వెళ్లిన మహిళలు పురుషుడి చేతిలో హింసకు గురవుతున్నప్పుడు చట్టం ఎలాంటి రక్షణా కల్పించడంలేదని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. నిజానికి ఇది జటిలమైన సమస్య. స్త్రీ, పురుష సహజీవనం వివాహం ద్వారా ఏర్పడాలా, దానితో సంబంధంలేని మరే ఇతర పద్ధతిలోనైనా ఉండవచ్చునా అనే సమస్య ఎప్పుడూ ఉంది. ఫలానా సంబంధం మాత్రమే సరైందని నిర్ధారించడానికి ఎలాంటి తూనిక రాళ్లూ ఉండవు. ఆయా సమాజాలు మొత్తంగా ఆచరించే విలువలను బట్టి అది మారుతుంది. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న మన సమాజంలో ఏదో ఒకటి మాత్రమే సరైనదని చెప్పడానికి లేదు. గృహహింస చట్టం వివాహబంధానికి వెలుపల ఏర్పడే సంబంధాలను తొలిసారిగా పరిగణనలోకి తీసుకున్నది. ఆ మేరకు అది ప్రగతిశీలమైనదే. కానీ, అది కూడా పరిమితులకు లోనయింది. కొన్ని సంబంధాలను అది గుర్తించ నిరాకరిస్తున్నది. కేవలం ‘వివాహ స్వభావం కలిగిన సంబంధాల’ గురించి మాత్రమే అది మాట్లాడింది. ఉదాహరణకు బహు భార్యత్వాన్ని అది ‘వివాహ సంబంధం’గా పరిగణించదు. చట్టం గుర్తించినా గుర్తించకపోయినా అలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయి. తెలిసిగానీ, తెలియకగానీ అలాంటి సంబంధాల్లోకి వెళ్లిన మహిళలు మగవాడి దాష్టీకానికి గురవుతున్నారు. అలాంటి మహిళకు, ఆమె పిల్లలకు ఎలాంటి రక్షణా, ఆధారమూ ఉండటంలేదు. ఆ సంబంధాన్ని గుర్తిస్తే వివాహ సంబంధంలో ఉన్న మహిళకూ, ఆమె పిల్లలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుందన్న కారణంతో దాన్ని చట్టం పట్టించుకోవడంలేదు. ఈ బహుభార్యత్వంలో కూడా సాధారణ వివాహ సంబంధాల్లోని మహిళలాగే ఆమె అన్ని రకాల బాధ్యతలనూ నిర్వర్తిస్తుంది. కానీ, పురుషుడికి వ్యామోహం తీరినప్పుడో, అహం దెబ్బతిన్నప్పుడో ఆ మహిళ నిరాశ్రయురాలవుతున్నది. ఇలాంటి సంబంధాలను ‘వివాహ స్వభావంగల సంబంధాలు’గా పరిగణించడానికి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను కూడా సూచించింది. ఆ స్త్రీ, పురుషులిద్దరూ ఒకే ఆవాసాన్ని పంచుకోవడం, కలిసివున్న కాలం, వారిమధ్య ఏర్పడిన లైంగిక సంబంధాల స్వభావం, వారికుండే సంతానం, వారి ఆదాయ వనరులు, వాటిని ఖర్చుపెట్టే తీరు వంటివి గమనంలోకి తీసుకుని బాధిత మహిళకు రక్షణ కల్పించే విధంగా చట్టం చేయాలని పేర్కొంది. వివాహం కాకపోయినా దీర్ఘకాలంగా కలిసి ఉంటున్నప్పుడు దాన్ని వివాహంగా గుర్తించవచ్చని అయిదేళ్ల క్రితం కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగని, ఈ చట్టం అక్రమ పద్ధతుల్లో ఏర్పడే సంబంధాలకు, చేరదీయడం వంటి సంబంధాలకు ఆటవిడుపు ఇచ్చేదిగా ఉండకూడదని కూడా తెలిపింది. మన సమాజం ఎంతగా పురోగమిస్తున్నదనుకున్నా దీనికుండే భూస్వామ్య పెత్తందారీ పోకడలు మౌలికంగా మారలేదు. పురుషుడి ఆధిపత్య భావజాలం అందులో నుంచి వచ్చిందే. స్త్రీ, పురుష సంబంధాల్లో ఇది అప్రజాస్వామికతను పెంచుతున్నది. తెలిసో, తెలియకో వివాహ పరిధి వెలుపల ఏర్పర్చుకునే సంబంధాలవల్ల ఇబ్బందులు పడుతున్న మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సహజీవనంలో ఉండి విడిపోయే మహిళలకు విదేశాల్లో ‘పాలీమనీ’ పేరిట భరణం ఇవ్వడమనే సంప్రదాయం ఉంది. మన దేశంలో మాత్రం ఆ తరహా మహిళలకు ఎలాంటి రక్షణా ఉండటం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వమూ, పార్లమెంటూ ఆలోచించాలి. తగిన చట్టం తీసుకొచ్చి నిస్సహాయులుగా మిగులుతున్న మహిళలను ఆదుకునేందుకు ప్రయత్నించాలి. సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించడం, పరిష్కారానికి పూనుకోవడం అవసరం. ఆ సంగతి సుప్రీంకోర్టు చెబితేగానీ తెలుసుకోలేని స్థాయిలో ఉండటం మంచిది కాదు. -
సహజీవనం నేరం కాదు.. పాపం కాదు: సుప్రీంకోర్టు
పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసినంత మాత్రాన అది నేరం గానీ, పాపం కానీ కానే కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి సంబంధాలు పెట్టుకుని, వాటి వల్ల పిల్లలను కనే మహిళల రోణకు చట్టం చేయాలని పార్లమెంటుకు సూచించింది. అయితే, దురదృష్టవశాత్తు ఈ తరహా సంబంధాలు పెళ్లి లాంటివి కావు, చట్టంలో వాటికి గుర్తింపు లేదు కాబట్టి వీటిని నియంత్రించేందుకు చట్టంలో ఎలాంటి అవకాశం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ చారిత్రక తీర్పు వెలువరించింది. ''సహజీవనం కూడా పెళ్లి లాంటిదే'' అనే అర్థం వచ్చేలా సూచనలు తయారుచేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పార్లమెంటు ఈ అంశాలపై స్పందించాలని, తగిన చట్టం చేయడం లేదా ఉన్న చట్టాలకే సవరణ చేయడం ద్వారా మహిళలు, వాళ్ల పిల్లలకు రక్షణ కల్పించాలని తెలిపింది. ఇలాంటి సంబంధాలు పెళ్లిలాంటివి కాకపోయినా, ఈ రక్షణ మాత్రం వారికి అవసరమని ధర్మాసనం చెప్పింది.