సహజీవనానికి సై అంటున్న హీరోయిన్! | Shraddha starts shooting for new movie title OK Janu | Sakshi
Sakshi News home page

సహజీవనానికి సై అంటున్న హీరోయిన్!

Published Wed, May 4 2016 7:16 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

సహజీవనానికి సై అంటున్న హీరోయిన్! - Sakshi

సహజీవనానికి సై అంటున్న హీరోయిన్!

ముంబై: ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపిస్తున్న చిత్రం బాఘీ. ఈ మూవీ హీరోయిన్ శ్రద్ధాకపూర్ మరోసారి తన నటనతో విమర్శల ప్రశంసలు దక్కించుకుంది. అయితే శ్రద్ధాకపూర్ ఈ మధ్య ఎందుకో మరి సహజీవనం చేయడానకి సిద్ధమైందట. హీరో ఆదిత్యారాయ్ కపూర్ ఏం చెప్పినా 'ఓకే జాను' అంటుంది. ఇంతకి సంగతేంటి అనుకుంటున్నారా.. బాఘీ తర్వాత ఓ కొత్త మూవీలో నటిస్తుంది. ఆ మూవీ టైటిల్ 'ఓకే జాను'. యువ జంట సహజీవనం చేయడం అనే అంశంపై ఈ మూవీ కథాంశం ఉంటుంది. ఆదిత్యారాయ్ తో సహజీవనం చేస్తూ రొమాన్స్ చేయనుంది. బాఘీ విడుదలై వారం రోజులు కూడా గడవకముందే తన తర్వాతి ప్రాజెక్టుపై శ్రద్ధగా వర్క్ చేస్తుంది శ్రద్ధా.

ఇంకా చెప్పాలంటే బాఘీ రిలీజైన రోజే షూటింగ్ లో పాల్గొంది. తన మూవీ గురించి టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని, కానీ బిజీగా ఉండటం వల్ల అది సాధ్యమవడం లేదని కాస్త బాధగా ఉందట. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఒకే కన్మణి' మూవీకి ఇది హిందీ రీమేక్. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో 'ఓకే బంగారం' పేరుతో డబ్‌ చేశారు. హిందీలో 'ఆషికీ 2' జోడీ ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ మరోసారి ఒకే తెరమీద కనిపించనున్నారు. శ్రద్ద నటించిన 'రాక్ ఆన్ 2' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement