సాక్షి, పథినంతిట్ట : కేరళలో 42 ఏళ్ల నర్సు.. 18 సంవత్సరాల యువకుడితో సహజీనం చేయడం సంచలనంగా మారింది. లివ్‌ఇన్ రిలేషన్ ఇప్పుడు సహజమే అయినా.. వయసులో ఇంత అంతరమా? అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం కేరళ మహిళా కమిషన్‌కు చేరడంతో అందరికీ తెలిసింది. డబ్బు, శృంగారం.. వంటి వాటిని ఎరగా వేసి తమ కుమారుడిని నర్సు బుట్టలో వేసుకుందని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి యువకుడి తల్లి చెబుతున్న వివరాలు ఇవి.. ‘పథినంతిట్ట జిల్లా కేంద్రంలో మేము కూలి చేసుకుని జీవిస్తున్నాం, నా కుమారుడు సెకండరీ విద్యను అభ్యసించే సమయంలో నర్సు పరిచయమైంది. ఒకరోజు మా అబ్బాయి బైక్ కావాలని అడిగాడు.. ఆర్థిక పరిస్థితిని వివరించి కొనలేనని చెప్పాను. అదే సమయంలో అతడికి సౌదీ అరేబియాలో నర్సుగా పనిచేస్తున్న 42 ఏళ్ల మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. గిఫ్ట్ కింద బైక్ కొనుక్కోమని రూ. 43 వేలు మావాడి బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. సౌదీ అరేబియా నుంచి నర్సు ఇండియాకు తిరిగి రాగానే.. మా అబ్బాయిని తీసుకుని బెంగళూరు వెళ్లిపోయింది. అక్కడే ఇద్దరు ఆరు నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఈ సమయంలో మా అబ్బాయికి మద్యం, సహా ఇతర దురలవాట్లను నేర్పింద’ని ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా... ఆరు నెలల తరువాత 19 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులను కలిసే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. వెంటనే తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలంటూ నర్సు.. వేధింపులు మొదలు పెట్టింది. యువకుడి మీద క్రిమినల్ కేసులు పెట్టి.. మూడు నెలల పాటు జైలు పాల్జేసింది. కుమారుడిని విడిపించుకోవడం కోసం అతడి తల్లిదండ్రులు ఆస్తిని తనఖా పెట్టారు. దీంతో సదరు నర్సు కేరళ మహిళా మిషన్‌ను ఆశ్రయించింది. రూ.43 వేల అసలుతో పాటూ వడ్డీ కూడా చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ ఘటనపై విచారణ చేసిన మహిళా కమిషన్.. ఆమె దిమ్మతిరిగేలా తీర్పు చెప్పింది. సమాజానికి నీలాంటి మహిళల వల్ల ప్రమాదం ఉందని చెబుతూ.. యువకుడు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని కమిషన్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment