ఈడ్చుకొచ్చి, గొంతు కోసి రేప్‌ చేయాలని చూశాడు...కానీ | 15 YearOld Kerala Boy Dragged Woman, Tried To Choke Rape Her | Sakshi
Sakshi News home page

ఈడ్చుకొచ్చి, గొంతు కోసి రేప్‌ చేయాలని చూశాడు...కానీ

Published Thu, Oct 28 2021 12:17 PM | Last Updated on Thu, Oct 28 2021 1:37 PM

15 YearOld Kerala Boy Dragged Woman, Tried To Choke Rape Her - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం:  అమ్మాయిలు, మహిళలపై   కామాంధుల అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది.  మైనర్‌ బాలురు కూడా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే కేరళలోని ఒక యువతి  దారికాచి దాడిచేసిన  మైనర్‌బాలుడి  దుర్మార్గంనుంచి తృటిలో తప్పించుకుంది. కేరళ, మలుప్పురం జిల్లాలో  సోమవారం జరిగిన  ఈ ఘటన తాజాగా వెలుగులోకి  వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మైనర్‌ బాలుడు(15)  స్థానిక మహిళ (21) పై  దారి కాచి దాడిచేశాడు.సోమవారం మధ్యాహ్నం కంప్యూటర్ క్లాసులకు వెళ్తున్న మహిళను వెంబడించి మరీ రోడ్డు పక్కనే ఉన్న ప్లాంటేషన్ ప్రాంతానికి ఈడ్చుకెళ్లారు.  అనంతరం ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే బాధిత యువతి  తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎటాక్‌ చేశాడు. ఆమె తలపై రాయితో బలంగా కొట్టాడు. అనంతరం ఆమె దుపట్టాతో చేతులు కట్టి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అయితే ఆ క్రమంలో నిందితుడు ఆమె గొంతు కోసేందుకు కూడా  ప్రయత్నించాడని మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ సుజిత్ దాస్ ఎస్ తెలిపారు.

అయితే బాధితురాలు చాకచక్యంగా తప్పించుకుని సమీపంలోని ఇంటికి పారిపోయి ప్రాణాలు దక్కించుకుందన్నారు.నిందితుడిపై కేసునమోదు చేసిన పోలీసులు  జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. అయితే ఈ షాక్‌నుంచి బాధితురాలు తేరుకోవడానికి సమయం పడుతుంది కనుక విచారణ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాదు నిందితుడికి మార్షల్ ఆర్ట్ జూడోకూడా తెలుసని, జిల్లా స్థాయి ఛాంపియన్‌ అని  వెల్లడించారు. అయినా ఆమె చాకచక్యంగా తప్పించుకోవడం విశేషమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement