![Kerala Woman Poses As Nurse Tries To Kill Friend Wife - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/5/Kerala-Woman-Poses-As-Nurse.jpg.webp?itok=ROANCg0N)
పతనంథిట్ట: ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హత్య చేయాలనుకుంది. అందుకు నర్సు వేషాన్ని వేసింది. ఇంజెక్షన్‌ను వేసి చంపేయాలని వ్యూహం పన్నింది. మనిషికి ఇంజెక్షన్ చేయడం అంత సులువు అనుకుందో.. ఏమో? కానీ తీరా అక్కడికి వెళ్లాక తటపటాయించింది. అనుమానం వచ్చిన బాధితులు యాజమాన్యాన్ని పిలవగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని పరుమాల ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది.
కేరళలో నర్సు వేశంలో వెళ్లి స్నేహితుడి భార్యను హత్యచేయాలని పతకం పన్నింది ఓ మహిళ. బాధితురాలి పేరు స్నేహ. ఆమె భర్త విదేశాల్లో ఉంటారు. నిందితురాలు పేరు అనుష.. స్నేహ భర్త స్నేహితురాలు. అనూష సోదరి, స్నేహ భర్త ఒకే క్లాస్‌మేట్స్. ఏ కారణంతో తెలియదు గానీ స్నేహితుని భార్యను అంతమొందించాలనుకుంది అనూష.
గర్భవతిగా ఉన్న స్నేహ.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. అందుకు తగ్గ వ్యూహాన్ని పన్నింది అనూష. నర్సు వేషంలో వెళ్లి స్నేహను చంపేయాలనుకుంది. నర్సుగా స్నేహ గదిలోకి వెళ్లి మరో ఇంజెక్షన్ వేసుకోవాలని తెలిపింది. బాధితురాలి శరీరంలోకి మందు ఇంజెక్ట్ చేసే క్రమంలో తటపటాయించింది. అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలి తల్లి డాక్టర్లను పిలిచింది. దీంతో అనూష బండారం బయటపడింది.
ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. అనూషను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.
ఇదీ చదవండి: Madhya Pradesh: గిరిజనునిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కాల్పులు..
Comments
Please login to add a commentAdd a comment