tries
-
నర్సు వేషంలో ఆస్పత్రిలో చేరి.. ఫ్రెండ్ భార్యను..
పతనంథిట్ట: ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హత్య చేయాలనుకుంది. అందుకు నర్సు వేషాన్ని వేసింది. ఇంజెక్షన్‌ను వేసి చంపేయాలని వ్యూహం పన్నింది. మనిషికి ఇంజెక్షన్ చేయడం అంత సులువు అనుకుందో.. ఏమో? కానీ తీరా అక్కడికి వెళ్లాక తటపటాయించింది. అనుమానం వచ్చిన బాధితులు యాజమాన్యాన్ని పిలవగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని పరుమాల ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. కేరళలో నర్సు వేశంలో వెళ్లి స్నేహితుడి భార్యను హత్యచేయాలని పతకం పన్నింది ఓ మహిళ. బాధితురాలి పేరు స్నేహ. ఆమె భర్త విదేశాల్లో ఉంటారు. నిందితురాలు పేరు అనుష.. స్నేహ భర్త స్నేహితురాలు. అనూష సోదరి, స్నేహ భర్త ఒకే క్లాస్మేట్స్. ఏ కారణంతో తెలియదు గానీ స్నేహితుని భార్యను అంతమొందించాలనుకుంది అనూష. గర్భవతిగా ఉన్న స్నేహ.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. అందుకు తగ్గ వ్యూహాన్ని పన్నింది అనూష. నర్సు వేషంలో వెళ్లి స్నేహను చంపేయాలనుకుంది. నర్సుగా స్నేహ గదిలోకి వెళ్లి మరో ఇంజెక్షన్ వేసుకోవాలని తెలిపింది. బాధితురాలి శరీరంలోకి మందు ఇంజెక్ట్ చేసే క్రమంలో తటపటాయించింది. అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలి తల్లి డాక్టర్లను పిలిచింది. దీంతో అనూష బండారం బయటపడింది. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. అనూషను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఇదీ చదవండి: Madhya Pradesh: గిరిజనునిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కాల్పులు.. -
డీజీపీ ఆఫీసు వద్ద రేప్ బాధితురాలి పడిగాపులు
-
అర్దరాత్రి యువతి కిడ్నాప్‌కు యత్నం
-
పేదల కార్డులు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర
గడపగడపకూ వైఎస్సార్‌లో ఫిర్యాదుల పరంపర వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ : రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన తెల్లరేషన్ కార్డులను చంద్రబాబునాయుడు ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు విమర్శించారు. మంగళవారం రమణయ్యపేటలోని తన నివాస గృహంలో పత్రికా విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు లక్షా 40 వేల రేషన్ కార్డులను నిలిపి వేశారన్నారు. మొత్తం 14 లక్షల 10 వేల రేషన్‌కార్డులు జిల్లాలో ఉంటే ప్రస్తుతం ఒక లక్షా 60 వేల తెల్లకార్డులకు మాత్రమే సరుకులను అందజేస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం పేదల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసించేందుకు కుట్ర పన్నిందని, దీనిలో భాగంగా ప్రతీ తెల్లకార్డు ఆధార్‌ను అనుసంధానం చేసి వాటి వివరాలను ఆదాయపన్ను, వాణిజ్యపన్నుల శాఖలకు పంపడంలో మర్మం ఏమిటో ప్రజలకు చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆదాయపు పన్నుల చెల్లింపులను తెల్లరేషన్ కార్డులకు అనుసంధానం చేసి రాష్ట్రంలో లక్షల కార్డులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తే పేదలకు అందించే సంక్షేమ పథకాలను మొత్తం తీసివేసి, రాష్ట్రంలో పేదలే లేరని తేల్చి చెప్పే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల్లో అర్హులందరికీ కార్డులు ఇచ్చి ప్రభుత్వ, రేషన్ విధానాలను మెరుగుపరిస్తే చంద్రబాబు వచ్చాక మళ్లీ పేదలకు అన్యాయం చేసే కార్యక్రమాలకు టీడీపీ ప్రభుత్వం తెరతీస్తోందని విమర్శించారు. జిల్లాలో గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యక్రమంలో పర్యటిస్తున్నప్పుడు ప్రతి నెల 1వతేదీ నుంచి 5వ తేదీ వరకు మాత్రమే రేషన్ ఇస్తున్నారని, సమయం దాటితే ఇవ్వడంలేదని ప్రజలు చెబుతున్నారని వివరించారు. ఈ పాస్ విధానం వచ్చాక ఇంటర్నెట్ అనుసంధానం కాక అదే విధంగా బయోమెట్రిక్ విధానంలో వ్రేలు ముద్రలు సరిగా పడక పేదలు నష్టపోతున్నారన్నారు. పేదల కార్డులు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర -
కొండచిలువను దొంగిలించబోయి..
ఫ్లోరిడా: సాధారణంగా దొంగతనం అనగానే ఏ డబ్బులో.. నగలో.. ఇంకేదైనా వస్తువో దొంగిలించారని అనుకుంటారు. ఏ దొంగ అయినా అలాగే చేస్తాడు కూడా. ఎందుకంటే డబ్బయినా, బంగారమయినా.. ఇంకేదైనా వస్తువైనా ఉపయోగపడుతుంది కాబట్టి. కానీ, ఫ్లోరిడాలోని ఓ వ్యక్తి మాత్రం వెరైటీగా దొంగతనం చేశాడు. ఓ పెంపుడు జంతువుల అమ్మకాలు జరిపే దుకాణంలోకి వెళ్లి తొలుత ఆయా విభాగాలన్నీ కలియ తిరిగాడు. చక్కగా స్టైలిష్ గా ఉన్న ఆ వ్యక్తి వేరేవయితే ఎటయినా పోతాయనుకున్నాడో.. లేక అరుస్తాయని అనుకున్నాడో.. ఏకంగా కొండ చిలువను దొంగిలించాడు. ఓ రకంగా దాన్ని చూస్తేనే ఒళ్లంతా గగుర్పొడుస్తుంది. అలాంటిది అతడు మాత్రం ఏ భయం లేకుండా అటూఇటు చూస్తూ చటుక్కున జేబులో వేసుకున్నాడు. అది కాస్త నిఘా నేత్రం(సీసీటీవీ)లో రికార్డవుతూ కనిపించింది. దాంతో వెంటనే అతడి దగ్గరకు దుకాణం యజమాని వచ్చి ఏం తీశావని అడిగాడు. తొలుత తాను ఏం తీయలేదని తాఫీగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నించడంతో ఓనర్ చేయి లేపాడు. దాంతో వెంటనే అతడు తన జేబులో నుంచి కొండ చిలువ తీసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. దొరికినంతసేపు అతడు ఆ వ్యక్తిని పిచ్చికొట్టుడుకొట్టాడు. -
గాంధీభవన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
-
కూతురు పై కన్నేసిన తండ్రి
-
అత్యాచారానికి యత్నించిన వృద్ధుడు
-
హాస్టల్ యువతుల పట్ల యజమాని అసభ్య ప్రవర్తన
-
కిడ్నాప్‌కు ప్రయత్నించిన మహిళ