friend wife
-
నర్సు వేషంలో ఆస్పత్రిలో చేరి.. ఫ్రెండ్ భార్యను..
పతనంథిట్ట: ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హత్య చేయాలనుకుంది. అందుకు నర్సు వేషాన్ని వేసింది. ఇంజెక్షన్‌ను వేసి చంపేయాలని వ్యూహం పన్నింది. మనిషికి ఇంజెక్షన్ చేయడం అంత సులువు అనుకుందో.. ఏమో? కానీ తీరా అక్కడికి వెళ్లాక తటపటాయించింది. అనుమానం వచ్చిన బాధితులు యాజమాన్యాన్ని పిలవగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని పరుమాల ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. కేరళలో నర్సు వేశంలో వెళ్లి స్నేహితుడి భార్యను హత్యచేయాలని పతకం పన్నింది ఓ మహిళ. బాధితురాలి పేరు స్నేహ. ఆమె భర్త విదేశాల్లో ఉంటారు. నిందితురాలు పేరు అనుష.. స్నేహ భర్త స్నేహితురాలు. అనూష సోదరి, స్నేహ భర్త ఒకే క్లాస్మేట్స్. ఏ కారణంతో తెలియదు గానీ స్నేహితుని భార్యను అంతమొందించాలనుకుంది అనూష. గర్భవతిగా ఉన్న స్నేహ.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. అందుకు తగ్గ వ్యూహాన్ని పన్నింది అనూష. నర్సు వేషంలో వెళ్లి స్నేహను చంపేయాలనుకుంది. నర్సుగా స్నేహ గదిలోకి వెళ్లి మరో ఇంజెక్షన్ వేసుకోవాలని తెలిపింది. బాధితురాలి శరీరంలోకి మందు ఇంజెక్ట్ చేసే క్రమంలో తటపటాయించింది. అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలి తల్లి డాక్టర్లను పిలిచింది. దీంతో అనూష బండారం బయటపడింది. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. అనూషను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఇదీ చదవండి: Madhya Pradesh: గిరిజనునిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కాల్పులు.. -
షాకింగ్ ఘటన.. స్నేహితుడి భార్యను కాపాడబోయి..
నిడదవోలు రూరల్(తూర్పుగోదావరి జిల్లా): క్షణికావేశంలో కాలువలోకి దూకిన స్నేహితుడి భార్యను కాపాడబోయి ప్రమాదవశాత్తూ యువకుడు మృతిచెందినట్లు పట్టణ ఎస్సై పి.నాగరాజు గురువారం తెలిపారు. నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కాపకాయల నరేంద్రకుమార్ (31) గతంలో ఒక ప్రైవేట్ సెల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి ప్రస్తుతం వ్యవసాయ పనులు చేస్తున్నాడు. నరేంద్రకుమార్ స్నేహితుడు కొవ్వూరుకు చెందిన జావిద్ బాషా(చోటు)కు అతని భార్య దేవికి మనస్పర్థలు వచ్చాయి. దీంతో నరేంద్రకుమార్ భార్యాభర్తలను ఈ నెల 14వ తేదీన శెట్టిపేట తీసుకువచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా గొడవలు పెరగడంతో భార్య దేవి.. శెట్టిపేట పవర్‌ప్లాంట్ వద్ద బుధవారం తెల్లవారుజామున వంతెనపై నుంచి కాలువలోకి దూకేసింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో కాలువలోకి దిగిన నరేంద్రకుమార్ ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా నరేంద్రకుమార్ మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి నాగతులసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: వివాహితతో సహజీవనం.. అసలు విషయం తెలిసి షాకయిన మహిళ -
కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. స్నేహితుడి భార్యను లొంగదీసుకుని..
కందుకూరు(నెల్లూరు జిల్లా): ప్రాణ స్నేహితుడని నమ్మిన పాపానికి అతని భార్యపైనే కన్నేశాడు ఓ ప్రబుద్ధుడు. స్నేహితుడిని మద్యం తాగించి అతని భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ వీడియోలు తీసి పలుమార్లు బెదిరిస్తుండడంతో ఆ దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గురువారం నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలోని చినపవని గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరులోని రంగనాయకులపేటకు చెందిన వ్యక్తి నెల్లూరు కార్పొరేషన్ వాటర్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. చదవండి: అర్ధరాత్రి ఫోన్.. భర్త వార్నింగ్.. గంట తర్వాత చూస్తే.. అతని స్నేహితుడు ఇలియాజ్ ఆ కార్పొరేషన్ పరిధిలోనే లష్కర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. వీరు తరచూ కలిసి మద్యం తాగే అలవాటు ఉంది. ఇదిలా ఉంటే ఇలియాజ్ స్నేహితుడి కుమార్తెకు లింగసముద్రం మండలంలోని చినపవని గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఈ నెల 20వ తేదీన చినపవని గ్రామంలో పెళ్లిని ఘనంగా జరిపించారు. పెళ్లి వేడుకల్లో భాగంగా గత మూడు రోజులుగా పెళ్లికుమార్తె తల్లిదండ్రులతోపాటు, ఇలియాజ్ కూడా అక్కడే ఉంటున్నాడు. అయితే ఇలియాజ్.. అతని స్నేహితుడి భార్యతో సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన బంధువులు అతన్ని పట్టుకుని కొట్టారు. దీంతో అదే రోజు ఇలియాజ్ నెల్లూరుకు వెళ్లిపోయాడు. ఈ వివాదం నేపథ్యంలో ఇలియాజ్ స్నేహితుడికి, అతని భార్యకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. భార్యాభర్తలిద్దరూ గత రెండు, మూడు రోజులుగా గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా దంపతులిద్దరూ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తమ చావుకు కారణం ఇలియాజ్‌తోపాటు మరికొందరి పేర్లు చెప్పారు. స్నేహితుడిగా నమ్మినందుకు ఇలియాజ్ తన భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి లైంగికదాడికి పాల్పడ్డాడని, వీడియో తీసి తరచూ బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికదాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో అవమానభారం భరించలేక పురుగుమందు తాగుతున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుమందు తాగారు. కొద్దిసేపటికి ఇది గమనించిన బంధువులు దంపతులిద్దరినీ చికిత్సనిమిత్తం కావలిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇలియాజ్ స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న లింగసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితుడి భార్యపైనే కన్నేసి.. ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి..
గూడూరు (తిరుపతి): స్నేహితుడి భార్యపైనే కన్నేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన గూడూరు రూరల్ మండలంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. గూడూరు మండలం, చవటపాళెంకు చెందిన సోగా హరినారాయణ అలియాస్ హరికుట్టి అదే ప్రాంతంలోని ఓ వ్యక్తితో స్నేహంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడి భార్యపై కన్నేసి సమయం కోసం ఎదురు చూశాడు. మంగళవారం స్నేహితుడు పని నిమిత్తం బయటి ప్రాంతానికి వెళ్లాడు. హరినారాయణ ఇదే అదునుగా భావించాడు. అదే రోజు రాత్రి ఆరుబయట పిల్లలతో నిద్రిస్తున్న స్నేహితుడి భార్య తలపై మొదట ఇనుప రాడ్‌తో బలంగా కొట్టాడు. ఆమె స్పహ తప్పడంతో పక్కనే ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బుధవారం ఉదయం తేరుకుని విషయం బంధువులకు తెలియజేయడంతో వారు రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ పీ.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివాహితను వైద్యపరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: (కుమార్తె స్నేహితురాలిపై లైంగిక దాడి) -
ఫూటుగా మద్యం సేవించి... స్నేహితుడి భార్యను
సాక్షి, మైసూరు(కర్ణాటక): నగరంలోని బోగాది రోడ్డులో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. రవి (28), బసవ (30) అనే ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు మహేష్, అతనికి సహకరించిన మరొకరిని సరస్వతిపురం పోలిసులు అరెస్టు చేశారు. వీరందరూ కలిసి మద్యం తాగారు. ఆ మత్తులో మహేష్ భార్య అటు వైపు రాగా, మృతులు ఇద్దరూ ఆమెను వేధించారు. గతంలో కూడా కొన్నిసార్లు ఇలాగే జరిగింది. ఈసారి తీవ్ర ఆగ్రహానికి లోనైన మహేష్, అతని స్నేహితునితో కలిసి రవి, బసవను కత్తులతో నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతులు హెచ్డీ కోటె కొత్తగాల గ్రామానికి చెందినవారని, అందరూ చిన్న చిన్న పనులు చేసుకునేవారని తెలిసింది. చదవండి: సైబర్ మోసాలకు గురయ్యారా? అయితే ఈ నంబర్ మీకోసమే.. -
స్నేహితుడి భార్యపై కన్నేసిన దుర్మార్గుడు.. అత్యాచారం, వీడియోలు తీసి!
సాక్షి, హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని నెహ్రూ నగర్‌కు చెందిన ప్రశాంత్ జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో స్నేహితుడి భార్యపై కన్నేశాడు. తనను ప్రేమించకపోతే చచ్చిపోతానంటూ స్నేహితుడి భార్యను ప్రశాంత్ వేధింపులకు గురిచేశాడు. ఇదే క్రమంలో వివాహితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా లైంగిక దాడికి సంబంధించిన వీడియోలు రికార్డ్ చేశాడు. చదవండి: అన్నం పెట్టడం లేదని కొడుకుతో చెప్పిన తల్లి.. కోడలు క్షణికావేశంలో.. వీడియోలు చూపించి మళ్లీ అత్యాచారానికి ఒడిగడుతూ వచ్చాడు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఆమెను, ఆమె పిల్లలు, భర్తను చంపేస్తానని బెదిరించాడు. వీడియోలను అడ్డుపెట్టి డబ్బులు ఇవ్వాలని వివాహితను డిమాండ్ చేశాడు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలి నుంచి ఇప్పటి వరకు రూ. 16 లక్షలు వసూలు చేశాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: రెండేళ్లుగా సహజీవనం.. కూతురుపై తల్లి ప్రియుడు లైంగిక దాడి.. -
స్నేహితుడి భార్యపై అత్యాచారం
భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్): స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసిన ఇద్దరిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కూకట్పల్లి ఎస్ఐ సురేష్ తెలిపిన మేరకు.. కూకట్పల్లి శివాలయం సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళ భర్త స్వగ్రామానికి వెళ్లాడు. ఇది గమనించిన స్నేహితులు హమీద్, రాజయ్యలు ఇంట్లోకి వచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఊరి నుండి వచ్చిన తన భర్తకు జరిగిన విషయాన్ని తెలపడంతో కూకట్పల్లి పోలీసులను అశ్రయించారు. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. -
స్నేహితుడి భార్యపై సామూహిక అత్యాచారం
జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే తన భార్య పాలిట కిరాతకుడిగా మారాడు. డబ్బుల కోసం తన స్నేహితులతో భార్యపై అత్యాచారం చేయించాడు. ఈ కేసులో భర్తతో సహా ఐదుగురి నిందితులకు ఢిల్లీ కోర్టు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఢిల్లీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌లో సురేష్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలుతో కలసి నివసిస్తున్నాడు. గతేడాది జూలై 9న తన స్నేహితులకు ఇంట్లో మద్యం పార్టీ ఇచ్చాడు. తన స్నేహితుల వద్ద డబ్బు తీసుకున్నానని, వారి కోరిక తీర్చాల్సిందిగా సురేష్ తన భార్యకు చెప్పాడు. ఆమె తిరస్కరించడంతో కొట్టి గదిలో బంధించాడు. అనంతరం అతని స్నేహితులు ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారించారు. నిందితులు నేరం చేసినట్టు రుజువుకావడంతో కోర్టు శిక్ష విధించింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లున్నారు.