
నరేంద్రకుమార్ (ఫైల్)
నిడదవోలు రూరల్(తూర్పుగోదావరి జిల్లా): క్షణికావేశంలో కాలువలోకి దూకిన స్నేహితుడి భార్యను కాపాడబోయి ప్రమాదవశాత్తూ యువకుడు మృతిచెందినట్లు పట్టణ ఎస్సై పి.నాగరాజు గురువారం తెలిపారు. నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కాపకాయల నరేంద్రకుమార్ (31) గతంలో ఒక ప్రైవేట్ సెల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి ప్రస్తుతం వ్యవసాయ పనులు చేస్తున్నాడు.
నరేంద్రకుమార్ స్నేహితుడు కొవ్వూరుకు చెందిన జావిద్ బాషా(చోటు)కు అతని భార్య దేవికి మనస్పర్థలు వచ్చాయి. దీంతో నరేంద్రకుమార్ భార్యాభర్తలను ఈ నెల 14వ తేదీన శెట్టిపేట తీసుకువచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా గొడవలు పెరగడంతో భార్య దేవి.. శెట్టిపేట పవర్‌ప్లాంట్ వద్ద బుధవారం తెల్లవారుజామున వంతెనపై నుంచి కాలువలోకి దూకేసింది.
ఆమెను కాపాడే ప్రయత్నంలో కాలువలోకి దిగిన నరేంద్రకుమార్ ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా నరేంద్రకుమార్ మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి నాగతులసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
చదవండి: వివాహితతో సహజీవనం.. అసలు విషయం తెలిసి షాకయిన మహిళ
Comments
Please login to add a commentAdd a comment