
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మైసూరు(కర్ణాటక): నగరంలోని బోగాది రోడ్డులో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. రవి (28), బసవ (30) అనే ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు మహేష్, అతనికి సహకరించిన మరొకరిని సరస్వతిపురం పోలిసులు అరెస్టు చేశారు. వీరందరూ కలిసి మద్యం తాగారు. ఆ మత్తులో మహేష్ భార్య అటు వైపు రాగా, మృతులు ఇద్దరూ ఆమెను వేధించారు. గతంలో కూడా కొన్నిసార్లు ఇలాగే జరిగింది.
ఈసారి తీవ్ర ఆగ్రహానికి లోనైన మహేష్, అతని స్నేహితునితో కలిసి రవి, బసవను కత్తులతో నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతులు హెచ్‌డీ కోటె కొత్తగాల గ్రామానికి చెందినవారని, అందరూ చిన్న చిన్న పనులు చేసుకునేవారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment