drinkers
-
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే.. అంతే!
-
మందు బాబుల భరతం పడుతున్న బాబా
-
మందుబాబులకు కోపం వస్తే ఇలా ఉంటుంది..
-
Mancherial: మందు బాబులకు రిమ్మ దిగిపోయే శిక్ష
సాక్షి, మంచిర్యాల: శిక్షల విధించడంలోనూ ఈమధ్య కొందరు న్యాయమూర్తులు వైవిధ్యతను కనబరుస్తున్నారు. నేరానికి తగ్గట్లు శిక్ష విధించి.. వాటికి పాల్పడుతున్నవాళ్లలో మార్పునకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంచిర్యాలలో మందుబాబులకు విధించిన శిక్ష చర్చనీయాంశంగా మారింది. తాగి ఊగితే పర్వాలేదు. కానీ, రోడ్ల మీదకు చేరి పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడుతుంటారు కొందరు. అలా తాగి రచ్చ చేసిన 13 మందికి.. వాళ్ల రిమ్మ దిగిపోయేలా జిల్లా పస్ట్ క్లాస్ కోర్టు భలే శిక్ష విధించింది. రెండు రోజుల హాస్పిటల్ క్లీన్ చేయాలని, అలాగే మాతాశిశు ఆసుపత్రిలో రెండు రోజుల పాటు సేవలందించాలని ఆదేశించింది. దీంతో వాళ్లు కంగుతినగా.. ఆదేశాలను పాటించని పక్షంలో.. జైలు శిక్ష, జరిమానా తప్పదని వారించినట్లు తెలుస్తోంది. -
రైతుల ముసుగులో టీడీపీ నేతలు.. ముగింపు సభలో ఏరులైన మద్యం
సాక్షి, తిరుపతి: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభలో మద్యం ఏరులైపారింది. న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. అయితే ఒక పక్క పాదయాత్ర ముగింపు సభ జరుగుతుంటే.. మరో పక్క కొందరు మద్యం సేవిస్తూ ఫుల్ బిజీగా మీడియాకు చిక్కారు. ఈ సభ రైతులది అని చెప్పుకుంటున్నా వెనకుండి నడిపిస్తున్నది టీడీపీయే అన్న సంగతి తెలిసిందే. ఈ సభకు టీడీపీ నాయకులు డబ్బులిచ్చి అమరావతి రైతుల ముసుగులో వివిధ జిల్లాల నుంచి ప్రజల్ని తరలించినట్లు తెలుస్తోంది. -
ఫూటుగా మద్యం సేవించి... స్నేహితుడి భార్యను
సాక్షి, మైసూరు(కర్ణాటక): నగరంలోని బోగాది రోడ్డులో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. రవి (28), బసవ (30) అనే ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు మహేష్, అతనికి సహకరించిన మరొకరిని సరస్వతిపురం పోలిసులు అరెస్టు చేశారు. వీరందరూ కలిసి మద్యం తాగారు. ఆ మత్తులో మహేష్ భార్య అటు వైపు రాగా, మృతులు ఇద్దరూ ఆమెను వేధించారు. గతంలో కూడా కొన్నిసార్లు ఇలాగే జరిగింది. ఈసారి తీవ్ర ఆగ్రహానికి లోనైన మహేష్, అతని స్నేహితునితో కలిసి రవి, బసవను కత్తులతో నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతులు హెచ్డీ కోటె కొత్తగాల గ్రామానికి చెందినవారని, అందరూ చిన్న చిన్న పనులు చేసుకునేవారని తెలిసింది. చదవండి: సైబర్ మోసాలకు గురయ్యారా? అయితే ఈ నంబర్ మీకోసమే.. -
డ్రంక్ అండ్ డ్రైవ్: ‘ఒక్క బీర్ మాత్రమే తాగిన సార్.. ఒట్టు’
సాక్షి, పరిగి(వికారాబాద్): ఓ మందు బాబు పరిగిలో హల్చల్ చేశాడు. పోలీసుల డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి ఒక్కబీరు మాత్రమే తాగానని, వదిలిపెట్టాలని పోలీసులను సతాయించాడు. వివరాలు.. పట్టణంలో ఆదివారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా షాద్‌నగర్‌కు చెందిన భీష్మాచారి కారులో షాద్‌నగర్ వైపు వెళ్తున్నాడు. పోలీసులు కారును ఆపి బ్రీత్ అనలైజర్‌తో తనిఖీ చేసేందుకు యత్నించారు. ఆయన గాలి ఊదినట్లు నటించాడు. దీంతో పోలీసులు గట్టిగా ఊదాలని చెప్పగా ఒక్కబీరు మాత్రమే తాగాను సార్.. ఒట్టు అని చెప్పాడు. చివరకు పోలీసులు తనిఖీ చేసి కేసు నమోదు చేశారు. ఇతను అంతకు ముందు పరిగిలోని ఓ బార్లో మిత్రులతో కలిసి నిర్వాహకులతో గొడవకు దిగాడు. ఫుడ్‌లో పిన్ వచ్చిందని నానా హంగామా చేశాడని స్థానికులు తెలిపారు. చదవండి: ప్రాణం తీసిన టైర్ ముక్క.. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. యువకుడి బలవన్మరణం తలకొండపల్లి: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తలకొండపల్లిలో సోమవారం జరిగింది. ఎస్ఐ వరప్రసాద్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పాపయ్య, యాదమ్మ దంపతుల పెద్ద కుమారుడు అశోక్(22) అటోమెకానిక్. ఇటీవల పొలం అమ్మి నూతనంగా ఇల్లు నిర్మాణం చేపట్టాడు. ఈ విషయంలో అశోక్ తల్లిదండ్రులతో గొడవపడి మనస్తాపానికి గురయ్యాడు. వీరి ఇంటికి కొద్దిదూరంలో అశోక్ నానమ్మ చెన్నమ్మ ఇల్లు ఉంది. ఆదివారం చెన్నమ్మ పనినిమిత్తం వేరే గ్రామానికి వెళ్లగా అశోక్ ఆమె ఇంట్లో నిద్రించాడు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన అశోక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం అశోక్ తండ్రి పాపయ్య ఇంటికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: భార్య మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు! -
పెట్రోల్ బంకులో చొరబడి మందుబాబుల హల్చల్
-
మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్
-
మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్
స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలకు జాతీయ గీతాలాపన చేసి దేశ భక్తిని చాటుకుంటాం.ఇటీవల సినిమా థియేటర్లో జాతీయ గీతం వస్తుంటే అక్కడున్న వారంతా నిల్చొని ‘జన గణ మన’ను ఆలపిస్తున్న విషయం తెలిసిందే. అయితే బార్లో జాతీయ గీతం పాడి భక్తికి ప్రదేశంతో సంబంధం లేదని నిరూపించారు మందుబాబులు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చదవండి: వైరల్: ధవణి దీనంగా.. ప్లీజ్ సీఎం తాతా వాటిని పూడ్చండి.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్లు జాతీయ గీతాన్ని ఆలపించడం సాధారణం. ఆ సమయంలో ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని వారంతా గీతాన్ని ఆలపిస్తారు. అయితే హైదరాబాద్‌లోని గోల్నాక బార్ అండ్ రెస్టారెంట్లో మందు తాగేందుకు వెళ్లిన వారంతా టీవీలో మ్యాచ్ ముందు జాతీయగీతం ప్లే అవుతుంటే అందరూ లేచి నిలబడ్డారు ప్రతీ ఒక్కరూ నిల్చోని జాతీయ గీతాన్ని ఆలపించారు. చదవండి: ఎవ్వరు చెప్పినా వినేది లేదు..చర్యలు తప్పవు: సిద్ధిపేట కలెక్టర్ మత్తులో ఉన్నా ఏమాత్రం తూలకుండా జన గణ మన అంటూ దేశంపై ఉన్న ప్రేమను చాటారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ‘మత్తులో ఉన్నా.. దేశభక్తి మరువలేదు. సూపర్ మందుబాబులు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఎందుకీ కడుపుమంట? తాగుబోతు రాతలేల?
ఏది నిజం? గతంలో కనిష్టంగా 180 మిల్లీలీటర్ల మద్యం బాటిళ్లు మాత్రమే దొరికేవి. ఇప్పుడు దాన్ని సగానికి.. అంటే 90 మిల్లీలీటర్లకు తగ్గించి, రేటు కూడా తగ్గించి అమ్ముతున్నారు. కానీ ఇలా చెయ్యటం ‘ఈనాడు’కు అస్సలు నచ్చటం లేదు. బీరు బాటిళ్లూ అంతే! ఇప్పుడు విక్రయిస్తున్న 650 ఎంఎల్ సైజు సగానికి తగ్గించి..330 ఎంఎల్ టిన్లను విక్రయిస్తున్నారు. ఇది కూడా ‘ఈనాడు’కు నచ్చటం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది.. ఎక్కువ బాటిళ్లు కొనుక్కుని తాగేస్తారట? నిజానికి రామోజీరావుకో, ‘ఈనాడు’కో నచ్చనిది మద్యం బాటిల్ సైజు తగ్గించటమో, దాని ధర తగ్గించటమో కాదు!!. తన సహచరుడు, తన సామాజిక వర్గానికి చెందిన బాబు... ఏపీ ముఖ్యమంత్రి కాకపోవటమే!. పైపెచ్చు మద్య నియంత్రణ చేపడతానన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి... దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ వెళుతుండటమే. ఓ వైపు మద్యం వినియోగం గణనీయంగా తగ్గుతున్నా.. దానిపై ప్రభుత్వానికొచ్చే ఆదాయం తగ్గకపోవటమే!. ఆదాయం తగ్గి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతే... అప్పుడైనా తన చంద్రబాబుకు కాలం కలిసొస్తుందన్న ఆశ రామోజీది!. అది నెరవేరటం లేదన్న ఫ్రస్ట్రేషన్ ఫలితమే పతాక శీర్షికన ‘మద్య నిషాధ’ రాతలు. మరి ఈ నిషా రాతల్లో వాస్తవమెంత? ఏది నిజం? సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యాన్ని దశలవారీ పూర్తిగా నియంత్రించాలన్నది ముఖ్యమంత్రి సంకల్పం. దానికి తగ్గట్టే అధికారం చేపట్టాక చర్యలు మొదలెట్టారు. 43 వేల బెల్ట్ షాపులపై వేటు వేశారు. 4,408 పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. దుకాణాల సంఖ్యను ఈ రెండేళ్లలో మూడోవంతు తగ్గించారు. అవి తెరిచి ఉంచే వేళలనూ కుదించారు. కల్తీలకు చోటు లేకుండా దుకాణాల్ని నేరుగా ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. ఫలితం.. మద్యం అమ్మకాలు ఏకంగా 40 శాతం తగ్గాయి. బాబు పాలనలో 2018 అక్టోబర్ నుంచి ఏడాది కాలంలో 3.12 కోట్ల కేసుల లిక్కర్ విక్రయిస్తే.. ఆ తరువాతి 12 నెలల్లో విక్రయించింది కేవలం 1.88 కోట్ల కేసులు. ఆ తరువాతి ఏడాది... అంటే 2020–21 అక్టోబర్ మధ్య ఈ సంఖ్య 1.72 కోట్ల కేసులకు తగ్గింది. మరి ఇంతలా తగ్గుతుంటే రామోజీకి కడుపుమంట ఎందుకట? మద్యం విక్రయాలు పెంచేస్తున్నారంటూ గగ్గోలు ఏల? ఎందుకంటే అధికారంలో ఉన్నది వైఎస్ జగన్ కాబట్టి!!. సైజు తగ్గించటం జనం మంచికి కాదా? 180 ఎంఎల్ మద్యం సీసాలు మాత్రమే దొరికితే... పేదలు, మద్యం ప్రియులు స్థోమత లేకున్నా వాటినే కొనేవారు. కొన్నందుకు తాగేవారు. బీరు కూడా 650 ఎంఎల్ సీసాలే విక్రయిస్తున్నారు. తాగేవారు స్థోమత లేకున్నా వీటినే కొని తాగాల్సి వస్తోంది. తక్కువ తాగితే ఆరోగ్యం, జేబు బాగుంటాయన్న ఉద్దేశంతోనే 90 ఎంఎల్ సీసాలు, 330 ఎంఎల్ బీర్ టిన్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అందరికీ ఈ నిర్ణయం మంచిదే అనిపిస్తున్నా... ‘ఈనాడు’కు మాత్రం నచ్చటం లేదు. అందరూ 180 ఎంఎల్ లిక్కర్, 650 ఎంఎల్ బీరు తాగాల్సిందేనని ‘ఈనాడు’ చేస్తున్న వాదన లోగుట్టు అందరికీ తెలిసిందే. కుర్చీలో ఉన్నది తమవాడు కాకుంటే పాజిటివ్‌లు కూడా నెగిటివ్ అయిపోతాయన్నది అర్థమవుతున్న కథే. వాకిన్ షాపులు... ఫిలిం సిటీలోనే ఉండాలా? మద్యంతో నిరుపేదల ఇళ్లు, ఒళ్లు గుల్ల కాకూడదన్న ముఖ్యమంత్రి ఆలోచనకు ప్రతిరూపమే ‘వాకిన్ స్టోర్స్’. నిజానికి రామోజీ హోటళ్లలో ఉండే బార్లు ఒక రకంగా వాకిన్ స్టోర్లే. అక్కడకు వెళ్లిన వారు నచ్చిన మద్యాన్ని కొనుక్కోవచ్చు!. రాష్ట్రంలోని మాల్స్‌లో ఇలా వాకిన్ స్టోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయటం మాత్రం రామోజీకి నచ్చటం లేదు. ఇది కూడా మద్యం విక్రయాలను పెంచటానికేనన్నది ‘ఈనాడు’ భాష్యం. ఫుల్ బాటిళ్లనే విక్రయించే ఈ స్టోర్లకు ఎగువ మధ్యతరగతి, ఉన్నతవర్గాల వారే వెళతారని, పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాల వారు వాటి జోలికెళ్లేందుకు సాహసించరని రామోజీకి తెలియదా? దీనివల్ల ఆయా వర్గాల్లో మద్యపానం తగ్గుతుందనేది వేరే చెప్పాలా? బాబు మాదిరి విచ్చలవిడిగా బెల్టు దుకాణాల్ని పెంచటమే మంచిదా? మద్యం విక్రయాలు తగ్గాయని చెబుతున్న అధికారిక లెక్కలు వీళ్లకు కనిపించవా? వాస్తవాలు అక్కర్లేదా? ఎందుకీ సా‘రాతలు’? సారా విక్రయాలు పెరిగితే మాత్రం నష్టమేంటన్న రీతిలో రాసిన ‘ఈనాడు’ రాతలు దాని దిగజారుడుకు పరాకాష్టే. వారిని సారాకు దూరం చేయటానికే 90 ఎంఎల్ సీసాలు తెస్తున్నారనే వాదనా బాధ్యతారాహిత్యమే. ఒకప్పుడు సారాకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర రామోజీది. కాకపోతే అదంతా తన వ్యాపార ప్రయోజనాల కోసమేనన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఇప్పుడాయన సారాను ప్రోత్సహించినా ఆశ్చర్యపోవటం లేదెవ్వరూ!. 1994కు ముందు ఎన్టీఆర్‌తో కలిసి మద్య నిషేధం ఎందుకు అవసరమో రెచ్చిపోయి మరీ అచ్చేసిన ఘనత ‘ఈనాడు’ది. 1995లో బాబుతో కలిసి మద్యం ఎందుకు అవసరమో రాసి మరీ చెప్పింది కూడా రామోజీయే. ఈ రామోజీ మార్కు రాజకీయంలో మోసపోయింది రాష్ట్రమే. కాకుంటే ముఖ్యమంత్రి జగన్ తీరు అది కాదు. చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్లటమే ఆయన నైజం. ఇదే నిజం!!. కొన్ని వాస్తవాలివిగో... ► 2019 మే నాటికి రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలు ఉండేవి. ఈ రెండేళ్లలో వీటి సంఖ్య 33% అంటే 1,433 దుకాణాలు తగ్గాయి. ప్రస్తుతం 2,975 దుకాణాలే ఉన్నాయి. ► టీడీపీ హయాంలో రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలకు అనుబంధంగా 4,408 పర్మిట్ రూమ్‌లు ఉండేవి. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ రద్దు చేసింది. ►గతంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేవారు. దాన్ని మార్చి ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకే తెరుస్తున్నారిప్పుడు. ► టీడీపీ అధికారంలో ఉన్న 2019 మేతో పోలిస్తే 2021, ఆగస్టు నాటికి రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు 40 శాతం తగ్గగా... బీర్ అమ్మకాలు ఏకంగా 78 శాతం తగ్గాయి. అప్పట్లో ఏడాదికి 3.12 కోట్ల లిక్కర్ కేసులు విక్రయించగా... ఇప్పుడది 1.72 కోట్ల కేసులకు తగ్గింది. ► బాబు హయాంలో ఏటా 2.44 కోట్ల బీరు కేసుల్ని విక్రయించగా... ఇప్పుడా సంఖ్య 52 లక్షల కేసులకు చేరింది. ఏకంగా 78శాతం తగ్గాయి మరి. -
షార్... మాకు 90 ఎంఎల్ కావాలి.. డయల్ 100కు మందుబాబుల కాల్స్!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఈ కష్టకాలంలో కరోనా బాధితులు మందుల కోసం ఆరాటపడుతుంటే.. మద్యంప్రియులేమో మందు కోసం సతాయిస్తున్నారు. లాక్డౌన్ వేళ.. ‘డయల్ 100’కు ఫోన్‌కాల్స్ పోటెత్తుతున్నాయి. ఇందులో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కాల్స్ అధికంగా ఉంటున్నాయి. మరోవైపు మందుబాబుల కాల్స్ కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నాయి. ఎక్కడ మందు దొరుకుతుందో చెప్పాలంటూ ‘డయల్ 100’ సిబ్బందిని విసిగిస్తున్నారు. ఈ నెల 12 నుంచి లాక్డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉదయం 6– 10 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు తెరిచే ఉంటున్నాయి. అయినా, పనీపాటాలేని కొందరు, తాగిన మద్యం సరిపోక మరికొందరు ‘డయల్ 100’కు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ‘షార్... మాకు 90 ఎంఎల్ కావాలి. మందు ఎక్కడ దొరుకుతుంది? డబుల్ రేటైనా ఫర్లేదు’అని కొందరు, కనీసం బెల్ట్‌షాపుల అడ్రస్లైనా చెప్పాలంటూ మరికొందరు వేధిస్తున్నారు. ఇలాంటి కాల్స్‌తో తమ విలువైన సమయం వృథా అవుతోందని ‘డయల్ 100’ఆపరేటర్లు వాపోతున్నారు. ఇలాంటి ఒక్కో కాల్ వల్ల దాదాపు 45 సెకండ్ల సమయం వృథా అవుతోందని, ఆలోపు ఆపదలో ఉన్నవారికి లైన్ దొరకకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అకారణంగా ఫోన్లు చేస్తే కేసులు పెడతామని సిబ్బంది హెచ్చరించారు. మొత్తం 54 వేల ఫిర్యాదులు ఈ నెల 12 నుంచి 24 వరకు డయల్ 100 సిబ్బందికి మొత్తం 54 వేల ఫోన్ కాల్స్ రాగా... అందులో 6,431 కోవిడ్‌కు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జనం గుమిగూడుతున్నారని 3,121, ఉదయం 10 గంటలు దాటినా షాపులు తెరిచే ఉన్నాయని 1,947, కోవిడ్ అనుమానితులపై 633, మాస్కు ధరించలేదని 308, కరోనా అనుమానిత మరణాలపై 144 కాల్స్ వచ్చాయి. ఆసుపత్రిలో బెడ్లు లేవని, అంబులెన్సులు కావాలని, ఆక్సిజన్ వెంటిలేటర్లు లేవని, చికిత్సకు ఆసుపత్రులవారు అధిక మొత్తం డిమాండ్ చేస్తున్నారని, ప్లాస్మా కావాలని పలు ఫోన్లు వచ్చాయి. -
గొడవ ఆపండ్రా బాబు ... పోలీసులపై దాడి
-
తాగుబోతుల వీరంగం, అడ్డుకున్నందుకు డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లపై
సాక్షి, సిద్దిపేట: మద్యం మత్తులో ఇద్దరు యువకులు సిద్దిపేట జిల్లాలో వీరంగం సృష్టించారు. కోహెడ మండల కేంద్రంలో కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డారు. దాడిలో బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ తలకు రక్త గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కోహెడ పాత బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులు గొడవ పడుతుండగా స్థానికులు 100 కు ఫోన్ చేశారు. వెంటనే బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ మోహన్ మరో కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. గొడవ పడుతున్న ఇద్దరు యువకులు సజ్జు, ఉమేగ్‌లను వారించే ప్రయత్నం చేయగా తిరగబడ్డ ఇద్దరు యువకులు కానిస్టేబుళ్లపై దాడికి తెగబడ్డారు. కర్ర తో దాడికి దిగడంతో బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ మోహన్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు దాడికి పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
గిలగిలా గింజుకుంటున్న మందు బాబులు
కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ మందు బాబుల్ని గిలగిలా గింజుకునేలా చేస్తోంది. మద్యం దొరక్క నీళ్లల్లో స్పిరిట్ కలుపుకుని తాగే వాళ్లు కొందరైతే, షేవింగ్ లోషన్లను శీతల పానీయాల్లో కలుపుకుని తాగేవాళ్లు మరి కొందరు. మతిలేని చేష్టలు కాస్తా వారిని మరణం అంచుకు తీసుకెళ్తున్నాయి. శనివారం పుదుకోట్టైలో సేవింగ్ లోషన్‌ను శీతల పానీయంలో కలుపుకుని తాగిన ముగ్గురిలో ఇద్దరు విగతజీవులయ్యారు. మరొకరు తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాక్షి, చెన్నై: రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ నేతృత్వంలో ప్రభుత్వమే మద్యం విక్రయాలను సాగిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 5300 మద్యం దుకాణాలు, నగరాలు, పట్టణాల్లో ప్రైవేటు బార్లు వెలిసి ఉన్న విషయం తెలిసిందే. వీటి ద్వారా రోజుకు ఆదాయం వందకోట్ల మేరకు ఉంటుంది. శని, ఆదివారాలు, పండుగ సమయాల్లో రెట్టింపు అవుతాయి. తొలుత, రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు 31వ తేదీ వరకు అని ప్రకటించడంతో వారానికి సరిపడా మద్యాన్ని ముందు జాగ్రత్తగా మందుబా బులు సిద్ధం చేసుకున్నారు. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్‌ను ఈ నెల 14 వరకు అంటూ 21 రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో మందు బాబులకు సంక్లిష్ట పరిస్థితులు తప్పలేదు. నాటు సారా జోరు టాస్మాక్ మద్యం దుకాణాల మూతతో మందుబాబులు మద్యం కోసం తల్లడిల్లుతున్నారు. బ్లాక్‌లో మద్యం విక్రయాలు ఓ రెండు రోజులు సాగినా, ఆ తదుపరి మద్యం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి, చివరకు కొందరైతే బలన్మరణాలకు పాల్పడే పనిలో పడ్డారు. నాటు సారా తయారీదారులు రంగంలోకి దిగారు. చెన్నై శివారుల్లో, ఉత్తర చెన్నై పరిసరాల్లో నాటు సారా అమ్మకాలు తెరమీదకు వచ్చాయి. వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూరు, తిరునల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్, కృష్ణగిరి, ధర్మపురి పరిసరాల్లో నాటు సారా తయారీ మీద దృష్టి పెట్టే వారి సంఖ్య పెరిగింది. బుధవారం వేలూరు సమీపంలోని పులియంపట్టిలో నాటు సారా తయారీదారుల్ని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు సైతం జరపక తప్పలేదు. వేలూరు జిల్లా ఆంబూరులో నాటు సారా తాగిన ఓ వ్యక్తి శుక్రవారం మరణించడంతో ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. ( కరోనా విజృంభణ.. మమల్ని ఆదుకోండి: ట్రంప్ ) స్పిరిట్... లోషన్లు మద్యం దొరక్క పోవడంతో స్పిరిట్‌ను నీళ్లలో, షేవింగ్‌కు ఉపయోగించే లోషన్లు, ఇతర మత్తును ఇచ్చే వాటిని శీతల పానీయాల్లో కలుపుకుని తాగే వారి సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. నాటు సారా కేవలం వేడి నీళ్లలో స్పిరిట్‌ను కలిపి విక్రయిస్తున్నారని మందుబాబులు ఆరోపిస్తుండడం బట్టి చూస్తే, కరోనా తాండవం కన్నా, మద్యం రూపంలో మరణ మృదంగం రాష్ట్రంలో మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే శనివారం పుదుకోట్టైలో ఓ ఘటన వెలుగు చూసింది. పుదుకోట్టైలోని కోట్టపట్టినం జాలర్లు హాసన్ (35), అరుణ్(27), అన్వర్(33) మద్యానికి బానిసలయ్యారు. మందు కోసం తీవ్రంగా గింజుకున్న వీరు ఎవరో ఇచ్చిన సలహా మేరకు శీతల పానీయంలో షేవింగ్ లోషన్ కలుపుకుని తాగేశారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన హాసన్, అరుణ్ విగత జీవులయ్యారు. తీవ్ర అస్వస్థతకు లోనైన అన్వర్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం పుదుకోట్టై ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన మేరకు 14వ తేదీనాటికి లాక్డౌన్ ముగిస్తే సరి, ఒక వేళ కొనసాగిన పక్షంలో మందు కోసం తాగుబోతులు ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నాయి. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న అన్ని మద్యం దుకాణాల్లోని స్టాక్‌ను అక్కడి ఓ కల్యాణ మండపానికి తరలించారు. అక్కడ పోలీసు పహారా నడుమ వీటిని భద్ర పరిచినా, ఆ పరిసరాల్లో ఒక్కటంటే ఒక్క బాటిల్ ఇవ్వండి అంటూ మందు బాబులు వేడుకుంటుండడం గమనార్హం. -
ఎర్రగడ్డకు పోటెత్తిన మందుబాబులు
-
లాక్డౌన్: ఎర్రగడ్డకు పోటెత్తిన మందుబాబులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేవలం నిత్యావసరాలకు సంబంధించిన షాప్‌లు తప్ప మిగతా షాప్‌లు మూత పడ్డాయి. వైన్ షాప్‌లు కూడా మూతపడటంతో మందుబాబులు పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు మద్యం సేవించడం అలవాటు ఉన్నవారికి ఒక్కసారిగా మందు దొరక్కపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. మద్యానికి బానిసైన ఒక్కరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరోవైపు వారం రోజుల నుంచి మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు వింతగా ప్రవరిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురైన మందుబాబుల కుటుంబసభ్యులు.. వారిని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తీసుకువస్తున్నారు. దీంతో ఎర్రగడ్డ ఆస్పత్రికి రోజురోజుకు మందుబాబులు రాక పెరుగుతోంది. కాగా, వింతగా ప్రవరిస్తున్న మందుబాబులకు సంబంధించి రోజుకు వందకు పైగా కేసులు వస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉమా శంకర్ తెలిపారు. (చదవండి: మత్తు లేక మరోలోకం!) -
మందుబాబుల అడ్డాగా ఏరియా ఆసుపత్రి
సాక్షి, హైదరాబాద్ : మలక్‌పేట ఏరియా ఆసుపత్రి మందుబాబుల అడ్డాగా మారింది. రాత్రి అయితే చాలు ఆసుపత్రి ప్రాంగణంలో మందుబాబులు దర్శనమిస్తున్నారు. రాత్రుళ్లు ఏరియా ఆసుపత్రి బార్‌ను తలిపించేలా మారుతోంది. ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. సీసీ కెమరాలు ఉన్నా సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది కలిసి పార్టీలు చేస్తున్నట్లు సమాచారం. వీళ్లకు మద్దతుగా పార్కింగ్ సిబ్బంది తోడు అవ్వటంతో అర్ధరాత్రి అవ్వగానే ఆసుపత్రిలా కాకుండా మలక్‌పేట ఏరియా బార్లా కనిపిస్తోంది. -
మందుబాబులు స్ట్రైక్ చేస్తే..
సాక్షి, రాజమండ్రి : మందుబాబులు ఓ వారం రోజులు స్ట్రైక్ చేస్తే ప్రభుత్వాలు అల్లాడిపోతాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.8.50కి తయారయ్యే మద్యంను రూ.50కి అమ్ముతున్నారని, దీంట్లో 37 రూపాయలు ప్రభుత్వం దోచేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై చాలా మంది తనని సంప్రదిస్తున్నారని, ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వస్తామంటున్నారని పేర్కొన్నారు. అమరావతి బాండ్లు, వడ్డీరేట్లపై చర్చ జరుగుతోందని, ట్యాక్స్ ఎంతో తెలియకుండా బాండ్లు ఎలా జారీ చేస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. కండిషన్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసే పరిస్థితి నెలకొందన్నారు. పేద, ధనికుల మధ్య అంతరాన్ని తొలగించాలని, పేదల ఆర్థిక స్థితులను మార్చాలని సూచించారు. దేశంలో ఎక్కడాలేని వడ్డీలు ప్రభుత్వం వసూలు చేస్తోందన్నారు. జలయజ్ఞంలో ఇచ్చిన కేటాయింపులు ఏంటని ప్రశ్నించారు. నాలుగేళ్లలో లక్షా 30 వేల కోట్లు అప్పు చేశారని, ఇంత అప్పు చేసి దేనికి ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నిజం చెప్పి పాలన చేయగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న వ్యాపారాన్ని స్విట్జర్లాండ్ ఆర్థికవేత్త వ్యతిరేకించారని, ఆయన లెక్కలు చెబితే జైళ్లో పెడతారని చెప్పినట్లు ఉండవల్లి పేర్కొన్నారు. వారానికోసారి ఖర్చు పెట్టిన లెక్కలు ప్రజలకు చెప్పగలరా అని, కనీసం ఈ 9 నెలలకు అయిన ఖర్చు చెప్పగలరా అని ప్రశ్నించారు. అవినీతి చేసి డబ్బులివ్వాల్సి వస్తోందని బాబు చెప్పారని, నంద్యాల ఎన్నికల్లో ఒప్పుకున్నారని ఉండవల్లి గుర్తు చేశారు. -
వారం రోజులు స్ట్రైక్ చేస్తే ప్రభుత్వాలు అల్లాడుతాయి
-
సమష్టిగా ‘బెల్ట్’ తీశారు
కథలాపూర్(వేములవాడ) : మూడేళ్ల క్రితం గ్రామాల్లో విచ్చల విడిగా మద్యం బెల్ట్‌షాపులు ఉండటంతో సులువుగా మద్యం దొరికేది. అమ్మకాలు జోరుగా సాగేవి. ఫలితంగా సాయంత్రం అయితే చాలు.. వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలు జరుగేవి. యువత మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవ పడడం, పొద్దంతా కష్టపడిన కార్మికులు, కూలీలు వారికి వచ్చిన డబ్బులు మద్యానికే వెచ్చించడంతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. అన్నిటికీ బెల్ట్‌షాపులే కారణమని భావించారు పోలీసులు. బెల్ట్ షాపులు మూసివేస్తే నేరాలు తగ్గుతాయని నిర్ణయించారు. ఇందుకు గ్రామీణుల సహకారం తీసుకున్నారు. 2016, జనవరి 6 నుంచి అప్పటి ఎస్సై నిరంజన్‌రెడ్డి బెల్ట్ తీయడం ప్రారంబించారు. సుమారు రెండేళ్ల నుంచి బెల్ట్‌షాపులు మూసివేత కొనసాగుతుండటంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. క్రైంరేటు గణనీయంగా తగ్గింది. 55 షాపులకు చెక్ కథలాపూర్ మండలంలో 18 గ్రామాలున్నాయి. 2015, డిసెంబర్ 31 వరకు మండల వ్యాప్తంగా సుమారు 55 బెల్ట్‌షాపులు అక్రమంగా నిర్వహించేవారు. బెల్ట్‌షాపుల్లోనే సిట్టింగ్ సౌకర్యం ఉండటంతో మందుబాబులు గ్రూపులుగా వెళ్లి మద్యం సేవించేవారు. ఈక్రమంలో కొన్నిసార్లు అక్కడే వివాదాలు జరిగేవి. కొన్ని ప్రైవేట్ పంచాయితీలకు బెల్ట్‌షాపులు వేదికగా మారిన సంఘటనలున్నాయి. ఈ క్రమంలో 2016, జనవరి 6న కథలాపూర్ ఎస్సైగా నిరంజన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక మొదటగా బెల్ట్‌షాపులపై దృష్టిసారించారు. షాపులు నిర్వహించొద్దని నిర్వాహకులకు సమాచారమిచ్చారు. కొత్త అధికారి.. ఇవన్నీ కామన్ అనుకున్నారు నిర్వాహకులు. ఏకంగా బెల్ట్‌షాపు నిర్వాహకులను ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతే మండలంలోని బెల్ట్‌షాపులు అన్నీ మూతబడ్డాయి. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఆయన బదిలీ తర్వాత వచ్చిన ఎస్సైలు ఆరీఫ్ అలీఖాన్, జాన్‌రెడ్డి, రాజునాయక్, ప్రస్తుత ఎస్సై నాగేశ్వర్రావు కూడా అదే విధానాన్ని పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో మద్యం బెల్ట్‌షాపు ఊసెత్తకుండా చేశారు. పల్లెల్లో వివాదాలు తగ్గుముఖం పట్టాయి. ప్రశాంత వాతావరణం నెలకొంది. తగ్గిన నేరాల సంఖ్య 2015, డిసెంబర్ 31 వరకు కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో సుమారు 146 నేరాలు నమోదుయ్యాయి. 2016 జనవరి నుంచి బెల్ట్‌షాపులు మూసివేతతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్న ఆటో, జీపు డ్రైవర్లకు పోలీసు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. 2016లో మండలంలో నమోదైన నేరాల సంఖ్య 65. 2017లో మళ్లీ 120కి చేరింది. మద్యం బెల్ట్‌షాపులు బంద్ ఉం డటంతో పోలీసుల కృషి ఫలించిందని మండలంలోని మహిళలు, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు కృతజ్ఞతలు అధికారులు కొత్తగా వచ్చినప్పుడు ఏదో అంటారు అనుకున్నాం. కథలాపూర్ మండలంలో అప్పటి ఎస్సై నీరంజన్రెడ్డితోపాటు ఇప్పటివరకు కథలాపూర్‌లో విధులు నిర్వర్తించిన పోలీస్ అధికారులు మద్యం బెల్ట్‌షాపులు మూసివేయించడం పక్కాగా అమలు చేశారు. కథలాపూర్ మండలంలో మార్పులు తేవడం సంతోషంగా ఉంది. బెల్ట్‌షాపులు లేకపోవడంతో గ్రామాల్లో కొత్త మార్పులు వచ్చాయి. పోలీసులకు కృతజ్ఞతలు. – బద్దం మహేందర్, భూషణరావుపేట మార్పు సంతోషకరం.. గ్రామాల్లో మద్యం అందుబాటులో ఉండడంతో మద్యం సేవించడం ఎక్కువ మందికి అలవాటైంది. యువత ఒకరినిచూసి మరొకరు మద్యం సేవించి చేడిపోతున్నారు. మద్యానికి బానిస అవుతుండటం ఆందోళన కలిగించింది. ఇవన్నిటికీ కారణమైన బెల్ట్‌షాపులు మూసి ఉండటంతో పేద కుటుంబాలు కాస్తా ఆర్థికంగా ఎదిగి సంతోషంగా ఉంటున్నారు. బెల్ట్‌షాపుల మూసివేతకు కృషిచేసిన పోలీస్ అధికారుల సేవలు మరిచిపోలేం. – మైస శ్రీధర్, చింతకుంట ప్రజల సహకారంతో విజయవంతం ప్రజల సహకారంతోనే బెల్ట్ షాపులను నియంత్రించగలిగాం. రెండేళ్లుగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేశాం. యువత వ్యసనాలకు బానిసకావొద్దు. యువత మంచి లక్ష్యంతో ముందుకు వెళ్లాలి. మంచి మార్గాల్లో వెళ్లే యువతను పోలీస్‌శాఖ తరఫున ప్రోత్సహిస్తాం. మండలంలో గతంలోకన్నా నేరాల సంఖ్య తగ్గడం సంతోషం. ప్రజలు ఎల్లప్పుడూ పోలీస్‌శాఖకు సహకరించాలి. – నాగేశ్వర్రావు, ఎస్సై, కథలాపూర్ -
మధ్యాహ్నమైతే ఏంటి?
నిజామాబాద్ సిటీ: నగర శివార్లలోని బహిరంగ ప్రదేశాల్లో మందుబాబులు పగటిపూటే మద్యం సేవిస్తున్నా పట్టించుకునే వారు లేరనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శివారు ప్రాంతాలపై పోలీసు నిఘా లేకపోవటం మద్యం ప్రియులకు బాగా కలిసివస్తోంది. శివారు ప్రాంతాల్లో పోలీసులు రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ పగటిపూట ఇటువైపు రావడం లేదని ఆయా కాలనీల ప్రజలంటున్నారు. నగరం చుట్టూ గల బోర్గాం(పి), మాధవ్‌నగర్, 100 ఫీట్ల రోడ్డు(వినాయక్‌నగర్), ఎల్లమ్మగుట్ట న్యూ వెంచర్, న్యాల్‌కల్‌రోడ్డు, వర్నిరోడ్డు, కంఠేశ్వర్ బైపాస్‌రోడ్డు, అర్సపల్లి శివారు, గంగాస్థాన్ ఫేస్–2 ఆర్మూర్రోడ్డు వంటి శివారు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నారు. నగరం లోపల బహిరంగంగా మద్యం సేవించే వారిపై పోలీసులు సిటీ పోలీస్ యాక్టు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ శివారు ప్రాంతాలపై నిఘా పెట్టక పోవటంతో మద్యం ప్రియులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. యువకులు గుంపులు గుంపులుగా మద్యం సేవిస్తూ కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు పాల్పడుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివారు కాలనీల్లో ఉంటున్న తాము కొన్ని సందర్భాల్లో మధ్యాహ్నం సమయంలోనూ ఇ ళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరికొంతమంది అటువైపు నుండి మరో ప్రాంతాల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కొంతమంది కాలనీవాసులు వారివద్దకు వెళ్లి తమ ప్రాంతాల్లో మద్యం సేవించొద్దని చెబితే కొంతమంది వారి అభ్యర్థనల మేరకు అక్కడి నుంచి జారుకుంటుండగా, మరికొంతమంది కాలనీవాసులకే ఎదురుతిరుగుతున్నారు. మధ్నాహ్నం మొదలయ్యే విందులు సాయంత్ర వరకు కొనసాగుతుంటాయి. ఈ సమయాల్లో పోలీసులు నిఘా పెడితే మద్యం ప్రియులను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకునే అవకాశం ఉంటుందని ఆయా కాలనీ ప్రజలంటున్నారు. పగటిపూట పెట్రోలింగ్ నిర్వహించాలి శివారు ప్రాంతాల్లో రాత్రివేళలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. కానీ మధ్యాహ్నం వేళల్లో అటు వైపువెళ్లకపోవడంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పగటిపూట శివారు ప్రాంతాల వైపు పోలీసులు గాని, ఎక్సైజ్ అధికారులు అటువైపు వెళ్లక పోవటంతో మద్యం సేవిస్తున్నారు. పగటిపూట పెట్రోలింగ్ నిర్వహించాలి. – ప్రవీణ్, నగరవాసి -
విశాఖ బీచ్‌లో మందు బాబుల మృత్యువాత
-
అర్ధరాత్రి మందుబాబుల వీరంగం
-
అర్ధరాత్రి మందుబాబుల వీరంగం
హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు. తప్పతాగి రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడికి దిగారు. దాడికి పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు అల్విన్ కాలనీకి చెందిన కార్పొరేటర్ కుమారుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
పగలంతా బడి! రాత్రంతా బార్..!!
టేకులపల్లి : అదొక చిన్న పల్లె.. అక్కడొక బుడ్డి బడి..! పగలంతా పిల్లలతో కళకళ..రాత్రంతా సీసాలతో గోలగోల..!! ఎక్కడ..? టేకులపల్లి మండలంలోని బేతంపూడి పం చాయతీలోగల తొమ్మిదోమైలు తండా. అదొక చిన్న పల్లె. అక్కడొక.. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. 30 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయినులు ఉన్నారు. అటెండర్, స్వీపర్ లేరు. ఏమైంది..? బడి కాస్తా.. బార్ అండ్ రెస్టారెంట్‌గా మారింది. సెలవు రోజు వచ్చిందంటే చాలు.. ఈ బడి వాతావరణం చెప్పలేనంత అధ్వానంగా, రోత గా మారుతోంది. లోపలికి వెళితే.. గుప్పున మద్యం వాసన. పగిలిన మద్యం సీసాలు. తినుబండారాల వ్యర్థాలు. ప్లాస్టిక్ కవర్లు. ఒక రోజు కాదు.. ఒక వారం కాదు.. దాదాపుగా ఐదేళ్ల నుంచి దాదాపుగా ప్రతి రోజూ.. సెలవు రోజుల్లో తప్పనిసరిగా కనిపిస్తున్న దృశ్యమిది. ఎవరు..? ఇంకెవరు..? ఈ తండాలోని తాగుబోతులు. వారే ఈ బడిని రాత్రి వేళ బార్ అండ్ రెస్టారెంట్‌గా మారుస్తున్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలంతా తమ తమ్ముళ్లో, బిడ్డలో, బంధువుల పిల్లలో అనే కనీస జ్ఞానం కూడా లోపించిన బుద్ధి హీనులు. తమ చర్య కారణంగా ఇబ్బందులు పడుతున్నది తమ ఊరి పిల్లలేనన్న ఆలోచన కూడా లేని అజ్ఞానులు. వారే దీనిని ఇంత అధ్వానంగా, ఛండాలంగా తయారుచేస్తున్నారు. తామంతా ఒకప్పుడు ఈ బడి గోడల మధ్యనే నాలుగు అక్షరాలు నేర్చుకున్నామన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఎలా..? ఈ బడిలోకి ఆ తాగుబోతులు ఎలా వస్తున్నారన్నదేగా మీ ప్రశ్న! సుమారు మూడు నెలల క్రితం మిషన్ భగీరథ తవ్వకాలు చేపట్టారు. ఆ పనులు చేపట్టిన సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ పాఠశాల ముందు గోడ ధ్వంసమైంది. కింద పడిన గేటును తీసి పక్కన విసిరేశారు. ఈ బడి ఆవరణలో వెనుక భాగాన ఓ పాత భవనం ఉండేది. దానిని తొలగించడంతో ప్రహరీ లేకుండా పోయింది. ముందు, వెనుక.. రెండువైపులా ప్రహరీ లేకపోవడంతో లోపలికి తాగుబోతులు, జంతువులు యథేచ్ఛగా వస్తున్నాయి. ఇబ్బందే... కొద్దిగ కాదు.. చాలా! ఇక్కడ దాదాపుగా 30మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయినులు ఉన్నారు. ఇందులో ఒకరు ప్రధానోపాధ్యాయురాలు. ఇక్కడి పరిస్థితి ఎలా ఉంటోందని వారిని పలకరిస్తే.. వెంటనే ఏమీ చెప్పలేక, ఎలా చెప్పాలో తెలీక.. ఉబికొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఇలా తమ మనోవేదనను ఇలా వివరించారు.. ‘‘ఉదయమే బడికి రావాలంటే భయమేస్తోంది. తరగతి గదుల్లో ఏం చూడాల్సొస్తోందని వణుకు పుడుతోంది. ఆదివారం, వరుసగా సెలవు రోజులొస్తే.. మాకు నరకం దాపురించినట్టే. బడి పక్కనే మద్యం దుకాణం ఉంది. అక్కడి నుంచి మందు బాటిళ్లు, తినుబండారాలు తెచ్చుకోవడం.. ఇక్కడికొచ్చి తాగడం, తినడం. తాగిన సీసాలను, తినుబండారాల కవర్లను, వ్యర్థాలను తరగతి గదుల్లో ఇష్టమొచ్చినట్టుగా పడేస్తున్నారు. చెప్పడానికే సిగ్గుగా ఉంది... (ఇబ్బందిపడుతూ, తలొంచుకుని).. తరగతి గదుల్లోనే మలం, మూత్రం విసర్జిస్తున్నారు. మాకు ఇక్కడ స్వీపర్, అటెండర్ లేరు. ఛండాలంగా మారిన ఈ గదులను పిల్లలు రాక ముందే మేమే శుభ్రం చేసుకోవాలి. ఐదేళ్ల నుంచి ఇదే నరకం. మొన్న గురువారం ఉదయం మేము వచ్చేసరికి నాలుగు బీరు సీసాలు, తినుబండారాల వ్యర్తాలు కనిపించాయి. మూత్ర విసర్జన దుర్వాసన కూడా వచ్చింది. గ్రామస్తులను పిలిచాం. చూశారు.. వెళ్లారు. ఈ ఊళ్లోని కొందరైతే.. ‘ఇద్దరు టీచర్లు ఉన్నారుగా! ఒకరు పాఠాలు చెప్పండి.. ఇంకొకరు శుభ్రం చేయండి’ అని ఎగతాళిగా మాట్లాడారు. అధికారులకు చెప్పాం, గ్రామస్తులకు చెప్పాం, ఇక్కడి ప్రజాప్రతినిధులకు చెప్పాం. ఇంకేం చేయాలి? మాకు ఈ నరకం ఇంకెన్నాళ్లో్ల..’’ ఉబికొస్తున్న కన్నీళ్లను ఆపడం ఆ ఉపాధ్యాయినులకు సాధ్యపడలేదు. ఏమంటున్నారు..? ఎవరు..? అధికారులేగా..! ఎంఈఓ ఠాకూర్ రాంసింగ్‌ను కూడా ‘సాక్షి’ పలకరించింది. ‘‘తొమ్మిదోమైలుతండా పాఠశాలలో సమస్యను అక్కడి ఉపాధ్యాయినులు నా దృష్టికి తీసుకొచ్చారు. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పాలని సూచించాను. వారు పని కూడా చేశారట. స్పందన రాలేదట. దీనిని అక్కడి గ్రామ పెద్దలతోపాటు పోలీసుల దృష్టికి తీసుకెళతాం’’ అని అన్నారు. -
రూ.1000 కోట్లు తాగేస్తున్నారు..
ఇదీ జిల్లాలో మద్యం ప్రియుల తాగుడు ఖర్చు ఇళ్లు, ఒళ్లు గుల్లవుతున్నా పట్టించుకోరు మద్యపాన సేవకుల సంఖ్యా అధిరోహణమే రోజువారీ సంపాదనలో సగానికి పైగా జల్సాలకే భీమవరం టౌన్: జిల్లాలో గ’మ్మత్తు’ ఖర్చు ఏటా రూ.1200 కోట్ల వరకు ఉంటోంది. మద్యపాన ప్రియులు చేసే ఈ ఖర్చుతో గుండ్లకమ్మ, తాడిపూడి వంటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయవచ్చు. లేదంటే తోటపల్లి, తారకరామతీర్థ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయవచ్చు. ఇది కూడా కాదంటే ముసురుపల్లి, పుష్కర, మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయవచ్చు. అంటే మద్యం కోసం జిల్లాలో ప్రజలు ఎంతగా దుబారా చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరో కోణంలో చూసినా జిల్లాలో మద్యం ప్రియులు చేసే ఖర్చుతో పేద రోగుల పాలిట సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరి పోసి వేలాది మంది ప్రాణాలు కాపాడవచ్చు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్‌కు అవసరమైన నిధులను ఈ ఒక్క జిల్లా నుంచే అందించవచ్చు. 108 సేవలకు 15 ఏళ్ల వరకూ సరిపడా ప్రతిపాదిత నిధులను కేటాయించవచ్చు. జిల్లాలో జీప్లస్ 3 తరహాలో ఏటా 40 వేల మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించవచ్చు. ఆశ్చర్యంగా ఉందా ఇది అక్షరాలా నిజం. మద్యం ప్రియుల ఖర్చు గ్రాఫ్ ఏటా పెరుగుతూనే ఉంది. మద్యం మత్తులో జోగే వారి సంఖ్య ఏటా పెరుగుతుండడంతో దానికి తగినట్లే రూ.100 కోట్లు అదనంగా ఖర్చు పెరుగుతోంది. ఇలా ఏటా జిల్లాలో రూ.1000 కోట్లు పైగా తాగుడుకు తగలేస్తున్నారంటే నమ్మక తప్పని పరిస్థితి. వ్యసనం మత్తులో ఇళ్లు, ఒళ్లు గుల్లవుతున్నా ఏటా మందుబాబులు చేస్తున్న ఖర్చు మాత్రం తగ్గడం లేదు. దీని తాలూకా గ్రాఫ్ రేటు ఏయేటి కాయేడు పెరుగుతూనే ఉంది. ఇందులో అధిక సంఖ్యలో యువత ఉండడం దిగ్భ్రాంతిని కలిగించే విషయం. ఉన్నత వర్గాలు, పేద వర్గాలు సైతం నెలవారి, రోజు వారి సంపాదనలో సగానికి పైగా జల్సాలకే వెచ్చిస్తుండగా వాటిలో మద్యం ఖర్చు పరిశీలిస్తే తల తిరుగుతోంది. జిల్లాలో మద్యం ప్రియులు నెలకు రూ.వంద కోట్లకు, రోజుకు రూ.3.35 కోట్లు లెక్కన ఖర్చు చేస్తున్నారు. 2005 వరకూ భీమవరం పట్టణంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఉండేది కాదు. ఆ తరువాత ఇక్కడి ఆదాయం చూసి ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో 430 మద్యం దుకాణాలుండగా భీమవరం ఎక్సైజ్ పరిధిలోనే సుమారు 238 ఉన్నాయి. జిల్లాలో మద్యం అమ్మకాలు 200304లో రూ.187.16 కోట్లు 200405లో రూ.217.93 కోట్లు 200506లో రూ.300 కోట్లు జిల్లాలో మద్యం అమ్మకాలు 201415లో రూ.1014 కోట్లు 201516లో రూ.1111 కోట్లు 201617లో రూ.1208 కోట్లు -
మద్యం కోసం తొక్కిసలాట
విజయవాడ: ‘‘కొత్త సినిమా టికెట్ అయినా దొరుకుతుంది కానీ.. కొత్త వైన్ షాప్‌ల్లో మద్యం దొరకడం లేదు..’’ ఇది విజవాడలోని మందు బాబుల ఆవేదన. ఆదివారం కావడంతో మందుబాబులు బారుల ముందు క్యూ కట్టారు. కొత్త మద్యం పాలసీ కారణంగా ఏపీలో వైన్ షాప్‌లు మద్యం ప్రియులతో కిటకిటలాడుతున్నాయి. మద్యం కొరత ఎక్కువ ఉందని తెలిసి ఎక్కడ అయిపోతుందోనని మందు బాబులు ఎగబడి మరీ కొంటున్నారు. విజయవాడలోని బందరు రోడ్డు వద్ద ఉన్న మనోరమ సెంటర్ లోని వైన్ షాప్ వద్ద ఒక్కసారిగా వచ్చిన మద్యం కొనుగోలుదారులతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మద్యం కోసం తోపులాటలతో గందరగోళ పరిస్తితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి మందుబాబులను అదుపు చేస్తున్నారు. లైన్లో వచ్చిన వారికే మందు విక్రయిస్తారని వైన్‌షాప్ యజమానులు చెబుతున్నారు. -
అర్ధరాత్రి మందు బాబుల హల్చల్
-
తిరుమలలో తాగుబోతుల వీరంగం
ముగ్గురి అరెస్టు తిరుపతి (అలిపిరి): పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మంగళవారం తాగుబోతులు వీరంగం సృష్టించారు. శ్రీవారి ఆలయం ముందున్న వరాహస్వామి ఆలయం వద్ద ఆరుగురు యువకులు మద్యం సేవించి, మాంసం (చేప) భుజించి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు వెళ్లేలోపు పరుగులు తీశారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరగడం తిరుమలలో సంచలనం సృష్టించింది. మద్యం సేవించిన ఆరుగురిలో ముగ్గురిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. -
బంజారాహిల్స్‌లో తాగుబోతుల వీరంగం
బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లో తాగుబోతుల వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ కారును స్థంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదస్థలంలోనే కారును వదిలేసి ఆసుపత్రికి వెళ్లారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కారు నెంబర్ప్లేట్లు తొలగించారు. దీంతో ఇది పెద్దవాళ్లకు సంబంధించిన వ్యవహారమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. నెంబర్ ప్లేట్లు పోలీసులు తొలగించారా లేక గాయపడిన వారే తొలగించారనేది తెలియాల్సి ఉంది. -
దెబ్బకు కిక్కు తగ్గింది..
సాక్షి, సిటీబ్యూరో: అడుగడుగునా పోలీసుల తనిఖీలు.. డ్రంకన్ డ్రైవ్‌లు...కేసుల నమోదు..కోర్టు కేసులు..ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లతో మద్యం ప్రియుల్లో కాస్త మార్పు వస్తోంది. బహిరంగ ప్రదేశాలు, బార్లలో మద్యం తాగేందుకు...వాహనాలు నడిపేందుకు వారు వెనుకంజ వేస్తున్నారు. ఈ ప్రభావం నగరంలో లిక్కర్ అమ్మకాలపైనా పడింది. సమయం చిక్కిందంటే చాలు మద్యం దుకాణాల పక్కన ఉండే పర్మిట్‌రూమ్‌లు..ప్రధాన రహదారుల పక్కన ఉండే బార్లలోకి దూరే ‘నిషా’చరులు ఇప్పుడు రాత్రి, పగలూ తేడా లేకుండా పోలీసులు బుక్ చేస్తున్న డ్రంకన్ డ్రైవ్ కేసుల నేపథ్యంలో కాస్త తగ్గినట్లు సమాచారం. బయట కంటే ఇళ్లలోనే మద్యం సేవించేందుకు మక్కువ చూపుతున్నారు. ఆబ్కారీ శాఖ లెక్కలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అంతేకాదు పలు మద్యం దుకాణాలు, బార్ల యజమానులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. గత మూడేళ్లుగా జూన్, జూలై నెలల్లో మహానగరం పరిధిలో మద్యం అమ్మకాల తీరుతెన్నులను పరిశీలిస్తే ఇదే విషయం సుస్పష్టమౌతోంది. ఏటేటా అమ్మకాల్లో నాలుగు నుంచి ఐదు శాతం మేర స్వల్ప తగ్గుదల నమోదవడం గమనార్హం. ఇక నగరంలో వరుస రోడ్డుప్రమాదాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు మిట్టమధ్యాహ్నం సైతం మందుబాబులపై కొరడాఝులిపిస్తూ.. డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తుండడంతో పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. తగ్గిన లిక్కర్ అమ్మకాలు! హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 540 మద్యం దుకాణాలు, 530 బార్లున్నాయి. వీటి పరిధిలో ఒకప్పుడు మూడు ‘ఫుల్లు’..ఆరు ‘బీరు’్ల అన్న చందంగా సాగిన లిక్కర్ వ్యాపారం జోరు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడం విశేషం. గత మూడేళ్లుగా జూన్, జూలై నెలల మద్యం అమ్మకాల తీరును చూస్తే సేల్స్ తగ్గుముఖం పట్టినట్లు తేలింది. అమ్మకాల్లో నాలుగు నుంచి ఐదుశాతం మేర తరుగుదల నమోదవడం విశేషం. ఈ కింద లెక్కలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమౌతోంది. మందుబాబులకు కళ్లెం.. అసలే కిక్కిరిసి ఉండే నగర రహదారులపై రాత్రి, పగలూ మద్యం సేవించి ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలను హరిస్తోన్న మందుబాబులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించడంతో మందుబాబుల ప్రవర్తనలో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు కనిపిస్తోంది. పూర్తిగా మద్యం మానేయకపోయినా..బహిరంగ ప్రదేశాలు, ప్రధాన మార్గాల్లో ఉండే పర్మిట్‌రూమ్‌లు, బార్లలో మద్యం సేవించిన తరవాత కార్లు, ద్విచక్రవాహనాలపై రయ్‌న దూసుకెళ్లే విషయంలో కాస్త వెనక్కి తగ్గుతున్నట్లు తెలిసింది. మద్యం సేవించి పోలీసులకు అడ్డంగా దొరికితే పోలీసులు ఇటు కుటుంబ సభ్యులకు, అటు పనిచేస్తున్న సంస్థలకు కూడా సమాచారం చేరవేస్తుండడం, కౌన్సిలింగ్ నిర్వహంచడం, అతిగా తాగి అడ్డంగా దొరికితే జైలు శిక్షలు తథ్యం కావడంతో మందుబాబులు ఈ విషయంలో పునరాలోచనలో పడడం విశేషం. కలవరపెడుతోన్న రోడ్డు ప్రమాదాలు.. గ్రేటర్ నగరంలో వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరుకుంది. వీటికి తోడు ఏటా రెండు లక్షల కొత్తవాహనాలు రోడ్డెక్కుతున్నాయి. దీంతో నగర రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. పెరుగుతోన్న వాహనాలకు తోడు రోడ్డు ప్రమాదాలు అందరి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వచ్చీరాని డ్రైవింగ్, లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, కాలంచెల్లిన వాహనాలు రోడ్డెక్కడం, అధ్వాన్న రహదారులు వెరసి వాహనచోదకులు, ప్రయాణికులు, పాదచారుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఈనేపథ్యంలో ట్రాఫిక్, పోలీసు, ఆర్టీఏ విభాగాలు ఆలస్యంగానైనా కళ్లుతెరచి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఏడాది మే నెల వరకు నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలిలా ఉన్నాయి. -
పట్టపగలు బరి తెగించిన తాగుబోతులు
► అంగన్వాడి కేంద్రంలో మందు.. విందు ► గోల్నాక గంగానగర్‌లో ఘటన అంబర్‌పేట: బడి, గుడి ఎంతో పవిత్రమైనవి. వీటిలో మద్యపానం నిషేధం. చిన్నారులు ఓనామాలు దిద్దే బడిలో మందుబాలు పట్టపగలు దర్జాగా విందు చేసుకుంటున్నారు. అక్షరాలు దిద్దించడంతో పాటు శిశువులకు, గర్భవతులకు మందులు, పౌష్టిక ఆహారం అందించే అంగన్వాడి కేంద్రాన్ని పానశాలగా మర్చేశారు. గోల్నాక గంగానగర్‌లోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న అంగాన్‌వాడి కేంద్రంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఇద్దరు తాగుబోతులు అంగన్వాడి కేంద్రంలో ఉన్న సామగ్రిని ఒకవైపు చేర్చి, టేబుల్‌పై మద్యం గ్లాసు పెట్టుకుని విందు చేసుకున్నారు. ఈ దుశ్చర్య అంగవాడి కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఈ ఘటనపై స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అంగన్వాడి కేంద్రాల హైదరాబాద్ జిల్లా ప్రాజెక్ట్ అధికారిణి–1 ప్రజ్వలను ‘సాక్షి’ ఈ విషయంపై వివరణ కోరగా ఇలాంటి సంఘటన మొట్టమొదటి సారి తన దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
నడి రోడ్డుపై యువకుల వీరంగం
-
నడి రోడ్డుపై యువకుల వీరంగం
హైదరాబాద్: మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు. పూటుగా మద్యం సేవించిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వైన్‌షాప్ ముందు సోమవారం చోటుచేసుకుంది. వైన్స్‌లో మద్యం సేవించిన ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి, అది తీవ్ర స్థాయికి చేరుకొని దాడులకు దారితీసింది. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
లివర్ జబ్బులకు వైరస్ చికిత్స
శాన్ ఫ్రాన్సిస్కో: పీకలదాకా మద్యం సేవిస్తూ కాలేయ జబ్బులతో బాధపడే మందు బాబులకు శుభవార్త! మద్యం, హెపటైటీస్ సీ, ఫ్యాటీ లివర్ కారణంగా సిరోసిస్ లాంటి ప్రాణాంతక కాలేయ వ్యాధులను సులభంగా నయం చేసే వైరస్‌ను కాలిఫోర్నియా యూనివర్సిటీ కాలేజ్ కు చెందిన నిపుణులు కనుగొన్నారు. ‘అడినో అసోసియేటెడ్ వైరస్ (ఏఏవీ)ని కాలేయంలోకి పంపించడం వల్ల ఆ వైరస్ చెడిపోయిన కాలేయ కణాలను మంచి కణాలుగా మారుస్తున్న విషయం తమ ప్రయోగంలో రుజువైందని జర్మనీలోని హైడెల్బర్గ్ యూనివర్శిటీ హాస్పటల్ నిపుణులతో సంయుక్తంగా ఈ ప్రయోగం నిర్వహించిన ప్రొఫెసర్ డాక్టర్ హోల్గర్ విల్లిన్ బ్రింగ్ తెలిపారు. చెడిపోయిన కాలేయ కణాలను మ్యోఫిబ్రోబ్లాస్ట్స్ అని పిలుస్తామని, మంచి కణాలను హెపటోసైట్స్ అని పిలుస్తామని, తాము ప్రయోగించిన వైరస్ వల్ల చెడిపోయిన కాలేయ కణాలు హెపటోసైట్స్ గా మారిపోయాయని ఆయన వివరించారు. సహజ కణాలలాగే వైరస్ మరమ్మతు చేసిన కణాలు పునరుత్పత్తి శక్తిని కలిగి ఉండడం, సహజ సిద్ధమైన ఆరోగ్య కణజాలంతో ఇట్టే కలిసిపోవడం ఓ అద్భుతమని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి పంచర్ పడిన ఓ టైరుకు ప్యాచ్ అతికించడం లాంటిదే ఈ చర్యని, ప్రస్తుతానికి కాలేయ మార్పిడే సరైన చికిత్స అని ఆయన తెలిపారు. రానున్న సంవత్సరాల్లో ఈ వైరస్ చికిత్సను మరింత అభివద్ధి చేసినట్లయితే కాలేయ మార్పిడి అవసరం లేకపోవచ్చని ఆయన చెప్పారు. ఆయన ఈ ప్రయోగ వివరాలను ‘జర్నల్ స్టెమ్ సెల్’లో ప్రచురించారు. -
మందుబాబులకు స్వచ్ఛభారత్
బంజారాహిల్స్: మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు బుధవారం స్వచ్ఛభారత్‌లో పాల్గొనాలని తీర్పు చెప్పింది. ఈ మేరకు వారంతా బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణను బుధవారం శుభ్రం చేశారు. శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వీరందరికీ కోర్టు ఈ శిక్షను విధించింది. పోలీస్ స్టేషన్లో వృధాగా పడి ఉన్న వస్తువులను ఒక చోటకు చేర్చారు. చిందరవందరగా ఉన్న సామగ్రిని క్రమపద్ధతిలో అమర్చారు. ప్రధాన రహదారి కూడలిలో ట్రాఫిక్ విధులు కూడా వారు నిర్వహించారు. -
అక్కడ మూత..ఇక్కడ మోత..
మందుబాబులతో కిటకిటలాడిన తాడేపల్లి రహదారులు గుంటూరు (తాడేపల్లి రూరల్) : విజయవాడలో మద్యం మరణాల నేపథ్యంలో మద్యం షాపులు మూతబడడంతో మంగళవారం తాడేపల్లి మద్యం షాపుల్లో మోత మోగింది. మద్యం బాబులతో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లు కిక్కిరిసిపోయాయి. రోడ్ల వెంబడి ఉన్న మద్యం దుకాణాల్లో కొనుగోలుదారులు బారులు తీరారు. బార్ షాపుల్లో మద్యం తాగేందుకు అనుమతి ఉన్నా, అక్కడ ఖాళీ లేక, వైన్‌షాపుల్లో కొంతమందికి అవకాశం ఉన్నా, అక్కడ స్థలం లేక మద్యం బాబులు రహదారులను, పంట పొలాలను, కృష్ణాతీరాన్ని బార్లుగా మార్చుకున్నారు. దీంతో రహదారులపై ప్రయాణించే వారికి అవస్థలు ఎదురయ్యాయి. ఇదిలా ఉంటే తాడేపల్లిలోని 1వ వార్డులో సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. విజయవాడ ఘటన నేపథ్యంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఉదయం 11 గంటల వరకు గస్తీ నిర్వహించారు. దీంతో మద్యం దొరక్క మందుబాబులు 1వ వార్డులోని పలు ప్రాంతాల్లో సారా కోసం పరుగులు తీశారు. ఇది గమనించి ఎక్సైజ్ శాఖ వారు గస్తీ నిర్వహించడంతో మందుబాబులు అక్కడనుంచి కూడా పలాయనం చిత్తగించారు. -
తాగుబోతుల స్వచ్ఛ హైదరాబాద్
నాంపల్లి: పీకల దాకా మద్యం సేవించి పోలీసులకు దొరికిపోయిన తాగుబోతులు మంగళవారం నీలోఫర్ ఆస్పత్రిని శుభ్రం చేశారు. గతవారం సౌత్‌జోన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 24 మందికి మూడవ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ ఆంజనేయులు సామాజిక సేవ చేయాలంటూ వారికి శిక్ష విధించారు. దీంతో ట్రాఫిక్ ఏసీపీ జైపాల్ పర్యవేక్షణలో 24 మంది మంగళవారం రెడ్‌హిల్స్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చెత్తాచెదారాన్ని ఎత్తిపోశారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మార్చారు. తాగడం వలంల జరిగే అనర్థాలను తెలియజేయడానికి ఇలాంటి శిక్షలు ఎంతో దోహదపడతాయని ట్రాఫిక్ ఏసీపీ జైపాల్ అన్నారు. -
మందుబాబుల చిందులు..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం-10 లోని గౌరీశంకర్‌కాలనీ పరిసర ప్రాంతాలతో పాటు రామాలయానికి వెళ్లే రోడ్డులో తాగుబోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 2 వరకూ తాగుబోతులు రోడ్ల పక్కన తిష్ట వేసి మద్యం సేవిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే మహిళలను అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని దుయ్యబట్టారు. జన్నత్ హుస్సేన్ ఇంట్లో ఓ ఆసుపత్రి హాస్టల్ ఉందని, ఇందులో నర్సులు ఉంటున్నారని అక్కడ కూడా మందుబాబులు తాగి వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ఉన్న పార్కులో కూడా అర్ధరాత్రి వేళ మందుబాబులు చిందులు వేస్తూ స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రిపూట పోలీసుల నిఘా లేకపోవడం వల్లే ఆకతాయిల బెడద తలెత్తిందని పోలీస్ పెట్రోలింగ్ ఉంచాలని కోరారు. నిఘా పెంచుతాం బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10 లోని గౌరీశంకర్‌కాలనీ పరిసర ప్రాంతాలతో పాటు రామాలయానికి వెళ్లే రోడ్డులో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామని స్థానిక సెక్టార్ ఎస్సై కృష్ణయ్య తెలిపారు. సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, తాగుబోతుల బెడద ఉంటే ఫోన్ నంబర్‌కు 9966074757 ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. -
'ఇక బహిరంగంగా మద్యం తాగం'
పంజగుట్ట: బహిరంగంగా మద్యం తాగుతున్న 26 మందిని అదుపులోకి తీసుకున్నపోలీసులు వారిచే మరోసారి బహిరంగంగా మద్యం తాగనని ప్రతిజ్ఞ చేయించారు. పోలీసుల వివరాల ప్రకారం శుక్రవారం పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్స్ సమీపంలో ఉన్న గణేష్ వైన్స్ వద్ద, రాజ్‌భవన్ రోడ్డు, బంజారాహిల్స్ రోడ్డు నెం బర్ 1 వైన్స్‌ల ముందు ప్రధాన రహదార్లపై మద్యం తాగుతున్న 26 మందిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని ఎస్ ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ డీసీపీ వెంకటేశ్వర్రావు సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్లపై మద్యం తాగడం తప్పు, మద్యం తాగడం వల్ల సాధారణ వ్యక్తులకు, మహిళలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుచేత మరోసారి బహిరంగంగా మద్యం తాగము. దేవుని మీద ప్రమాణం చేస్తున్నాము’ అని వారిచే ప్రతిజ్ఞ చేయించారు. -
మందుబాబుల మద్యం ధర్నా
కరీంనగర్(హుస్నాబాద్) : అసలే ఎండాకాలం... కాస్త చల్లగా ఉంటుందని ఓ బీర్ వేద్దామని వైన్స్‌కు వెళ్లారు. వీరు అడిగిన బ్రాండ్ లేదని షాప్ వాళ్లు అన్నారు. ఆ మద్యం ప్రియులకు ఇష్టం లేని బ్రాండ్ బీర్‌ను... అది కూడా ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువకు ఇచ్చారు. దీంతో వాళ్లకు చిర్రెత్తి ఆందోళనకు సిద్ధమయ్యూరు. వీరికి నాయకులు సైతం తోడై చివరకు ధర్నాకు దిగారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ఎమ్మార్పీ ధరకంటే ఎక్కువకు బీర్లు విక్రయిస్తున్నారంటూ హుస్నాబాద్‌లో వివిధ పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. కింగ్ఫిషర్లాంటి బీర్లు బెల్ట్‌షాపులకు విక్రయిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, వైన్స్‌ల్లో దొరకని బీర్లు రూ.20 ఎక్కువకు బెల్ట్‌షాపుల్లో లభ్యమవుతున్నాయని ఆరోపించారు. ఎమ్మార్పీ రూ.95 ఉన్న బీర్‌ను బెల్ట్‌షాపుల్లో రూ.130కి అమ్ముతున్నారని వాపోయూరు. ఒకటే బ్రాండ్‌ను మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉంచుతున్నారని, ఇష్టం ఉన్నా లేకపోయినా.. అదే బ్రాండ్ అంటగడుతున్నారని వాపోయారు. వైన్స్ యాజమాన్యాలు అన్ని రకాల బీర్లను ఎమ్మార్పీ రేట్లకే విక్రయించాలని, లేనిపక్షంలో దుకాణాల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సింగిల్‌విండో డెరైక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, సీపీఎం పట్టణ కార్యదర్శి శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకే...
చిత్తూరు: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారే లక్ష్యంగా పోలీసులు సోమవారం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 36 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హజరుపరిచారు. కాగా, జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో ఎక్కువమంది యువకులే ఉన్నారని పోలీసులు తెలిపారు. -
ఏపీలో 15శాతం పెరగనున్న బీరు ధరలు?
-
ఆత్మతృప్తినొంద అపరాధమది యేమి?
వైనుతోడ కాస్త వగపు దీరపాడు లోకులేమి పనిలేక వదరెదరు వైనుతేయుని మాట వలపు బాట ఆత్మతృప్తి పొందడానికి ఒక్కొక్కరి మార్గం ఒక్కొక్కరిది. ‘బుడ్డి’మంతులకు మదిరాలయమే ఆత్మానంద కేంద్రం. మర్యాదస్తులతో, మందమతులతో నిండిన పాడు లోకం ‘మందు’మతులను అపార్థం చేసుకుంటుంది. వారిపై నోరు పారేసుకుంటుంది. అందుకేనేమో! విజ్ఞులు లోకులను పలుగాకులుగా అభివర్ణిస్తారు. ‘కుఛ్ తో లోగ్ కహేంగే.. లోగోంకా కామ్ హై కెహెనా..’ లోకుల్లో ప్రధానంగా రెండు రకాల మనుషులు ఉంటారు. కొందరు తాగుబోతులు, మరికొందరు వాగుబోతులు. ఇంకొందరు ఉభయచర జీవుల్లాంటి తాగి వాగుబోతులు కూడా ఉంటారు. మధువు పట్ల నిబద్ధత గల ‘బుడ్డి’మంతులతో ఎలాంటి ఇబ్బంది లేదు గానీ, వాగుబోతులతోనే ఎక్కడలేని ఇక్కట్లు ఎదురవుతాయి. ఇక తాగి వాగుబోతులైతే, మధుశాలలోనే పురాణ కాలక్షేపం ప్రారంభించి, సాటి ‘మందు’మతులకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. నిబద్ధులైన ‘బుడ్డి’మంతుల కోసం ఈ వారం.. ‘మధు’రోక్తి సామ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి నడుమ ఉన్నదే ‘మద్య’తరగతి -నార్మన్ బ్రెన్నర్,అమెరికన్ నటుడు సెలైంట్ పంచ్ వోడ్కా : 30 మి.లీ. నిమ్మరసం : 30 మి.లీ. నారింజరసం : 60 మి.లీ. స్వీట్ అండ్ సోర్ : 60 మి.లీ. సోడా : 60 మి.లీ. -
8మంది నిందితులను గుర్తించిన పోలీసులు
హైదరాబాద్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఇద్దరు ఎస్ఐలపై చేయి చేసుకున్న కేసుపై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం సమావేశం అయ్యారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఎనిమిదిమంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించినట్లు అల్వాల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చిరించారు. కాగా పూటుగా మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు నిరాకరించడంతో అతన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లారు .. ఇక అంతే.. తనపై పోలీసులు దాడి చేశారని హడావిడి చేసి అందరినీ తప్పుదోవ పట్టించాడు. ఈక్రమంలో కొంత మంది ఆదివారం రాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌పై రాళ్లతో దాడి చేసి అడ్డొచ్చిన ఇద్దరు ఎస్సైలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా ఎనిమిదిమందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి అల్వాల్ ట్రాఫిక్ ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో డ్రంకన్ డ్రైవ్ విధి నిర్వహణలో ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి 10.30 గంటలకు ఎర్రగడ్డకు చెందిన జగదీష్ తయార్(50) మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అతన్ని బ్రీత్ ఎనలైజ్ పరీక్ష చేసేందుకు యత్నించగా అందుకు నిరాకరించాడు. దీంతో లా అండ్ ఆర్డర్ ఎస్సై తిరుపతి సిబ్బందితో అక్కడికి చేరుకుని బలవంతంగా జగదీష్‌కు పరీక్ష చేయగా మోతాదుకు మించి మద్యం తాగినట్టు నమోదైంది. అయితే, జగదీష్ తన పేరుకు బదులు పక్క సీట్లో కూర్చున్న సురేష్ అగర్వాల్ పేరును తన పేరుగా చెప్పాడు. అంతే కాకుండా తనపై పోలీసులు దాడి చేస్తున్నారని.. వచ్చి కాపాడండంటూ కొంపల్లి థోలారిధనిలో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఇక అంతే.. నాలుగు బస్సుల్లో తిరుగు ప్రయాణంలో ఉన్న వారంతా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని రాళ్లతో దాడి చేసి అడ్డుకున్న ఎస్సై పురుషోత్తం, తిరుపతిపై దాడికి దిగారు. -
మద్యం తాగి.. తప్పుదోవ పట్టించి..
-
మద్యం తాగి.. తప్పుదోవ పట్టించి..
పూటుగా మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు నిరాకరించడంతో అతన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లారు .. ఇక అంతే.. తనపై పోలీసులు దాడి చేశారని హడావిడి చేసి అందరినీ తప్పుదోవ పట్టించాడు. ఈక్రమంలో కొంత మంది ఆదివారం రాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌పై రాళ్లతో దాడి చేసి అడ్డొచ్చిన ఇద్దరు ఎస్సైలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సోమవారం సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా పలువురిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి అల్వాల్ ట్రాఫిక్ ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో డ్రంకన్ డ్రైవ్ విధి నిర్వహణలో ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి 10.30 గంటలకు ఎర్రగడ్డకు చెందిన జగదీష్ తయార్(50) మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అతన్ని బ్రీత్ ఎనలైజ్ పరీక్ష చేసేందుకు యత్నించగా అందుకు నిరాకరించాడు. దీంతో లా అండ్ ఆర్డర్ ఎస్సై తిరుపతి సిబ్బందితో అక్కడికి చేరుకుని బలవంతంగా జగదీష్‌కు పరీక్ష చేయగా మోతాదుకు మించి మద్యం తాగినట్టు నమోదైంది. అయితే, జగదీష్ తన పేరుకు బదులు పక్క సీట్లో కూర్చున్న సురేష్ అగర్వాల్ పేరును తన పేరుగా చెప్పాడు. అంతే కాకుండా తనపై పోలీసులు దాడి చేస్తున్నారని.. వచ్చి కాపాడండంటూ కొంపల్లి థోలారిధనిలో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఇక అంతే.. నాలుగు బస్సుల్లో తిరుగు ప్రయాణంలో ఉన్న వారంతా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని రాళ్లతో దాడి చేసి అడ్డుకున్న ఎస్సై పురుషోత్తం, తిరుపతిపై దాడికి దిగారు. ఇలా అర్ధరాత్రి 1.30 గంటల వరకు స్టేషన్ ఆవరణలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరిని మందలించినా దాడి చేసేందుకు సిద్ధంగా ఉండడంతో పోలీసులు సంయవనం పాటించారు. అప్పటికే విషయం తెలుసుకున్న బాలానగర్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావులు వారిని సముదాయించి అక్కడ నుంచి పంపించారు. జరిగిన ఘటన ను పోలీసులు సీరియస్‌గా తీసుకుని గొడవకు కారకుడైన జగదీష్‌పై కేసు నమోదు చేయడమే కాకుండా సీసీ పుటేజీ ఆధారంగా మరి కొంత మందిపైనా కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు సీఐ ప్రవీందర్‌రావు తెలిపారు.