డ్రంక్ అండ్ డ్రైవ్​: ‘ఒక్క బీర్‌ మాత్రమే తాగిన సార్‌.. ఒట్టు’ | Drunker Create Newsense Before Police At In Parigi | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్​: ‘ఒక్క బీర్‌ మాత్రమే తాగిన సార్‌.. ఒట్టు’

Published Tue, Nov 30 2021 1:47 PM | Last Updated on Tue, Nov 30 2021 2:11 PM

Drunker Create Newsense Before Police At In Parigi - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పరిగి(వికారాబాద్‌): ఓ మందు బాబు పరిగిలో హల్‌చల్‌ చేశాడు. పోలీసుల డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడి ఒక్కబీరు మాత్రమే తాగానని, వదిలిపెట్టాలని పోలీసులను సతాయించాడు. వివరాలు.. పట్టణంలో ఆదివారం రాత్రి పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తుండగా షాద్‌నగర్‌కు చెందిన భీష్మాచారి కారులో షాద్‌నగర్‌ వైపు వెళ్తున్నాడు. పోలీసులు కారును ఆపి బ్రీత్‌ అనలైజర్‌తో తనిఖీ చేసేందుకు యత్నించారు.

ఆయన గాలి ఊదినట్లు నటించాడు. దీంతో పోలీసులు గట్టిగా ఊదాలని చెప్పగా ఒక్కబీరు మాత్రమే తాగాను సార్‌.. ఒట్టు అని చెప్పాడు. చివరకు పోలీసులు తనిఖీ చేసి కేసు నమోదు చేశారు. ఇతను అంతకు ముందు పరిగిలోని ఓ బార్‌లో మిత్రులతో కలిసి నిర్వాహకులతో గొడవకు దిగాడు. ఫుడ్‌లో పిన్‌ వచ్చిందని నానా హంగామా చేశాడని స్థానికులు తెలిపారు. 
చదవండి: ప్రాణం తీసిన టైర్‌ ముక్క.. బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి..

యువకుడి బలవన్మరణం 
తలకొండపల్లి: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తలకొండపల్లిలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ వరప్రసాద్‌ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పాపయ్య, యాదమ్మ దంపతుల పెద్ద కుమారుడు అశోక్‌(22) అటోమెకానిక్‌. ఇటీవల పొలం అమ్మి నూతనంగా ఇల్లు నిర్మాణం చేపట్టాడు. ఈ విషయంలో అశోక్‌ తల్లిదండ్రులతో గొడవపడి మనస్తాపానికి గురయ్యాడు.

వీరి ఇంటికి కొద్దిదూరంలో అశోక్‌ నానమ్మ చెన్నమ్మ ఇల్లు ఉంది. ఆదివారం చెన్నమ్మ పనినిమిత్తం వేరే గ్రామానికి వెళ్లగా అశోక్‌ ఆమె ఇంట్లో నిద్రించాడు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన అశోక్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం అశోక్‌ తండ్రి పాపయ్య ఇంటికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ  తెలిపారు.  
చదవండి: భార్య మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement