
గంగానగర్‌లోని అంగన్‌వాడి కేంద్రంలోని టెబుల్‌పై మద్యం గ్లాసులు, సీసా
► అంగన్‌వాడి కేంద్రంలో మందు.. విందు
► గోల్నాక గంగానగర్‌లో ఘటన
అంబర్‌పేట: బడి, గుడి ఎంతో పవిత్రమైనవి. వీటిలో మద్యపానం నిషేధం. చిన్నారులు ఓనామాలు దిద్దే బడిలో మందుబాలు పట్టపగలు దర్జాగా విందు చేసుకుంటున్నారు. అక్షరాలు దిద్దించడంతో పాటు శిశువులకు, గర్భవతులకు మందులు, పౌష్టిక ఆహారం అందించే అంగన్‌వాడి కేంద్రాన్ని పానశాలగా మర్చేశారు. గోల్నాక గంగానగర్‌లోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న అంగాన్‌వాడి కేంద్రంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఇద్దరు తాగుబోతులు అంగన్‌వాడి కేంద్రంలో ఉన్న సామగ్రిని ఒకవైపు చేర్చి, టేబుల్‌పై మద్యం గ్లాసు పెట్టుకుని విందు చేసుకున్నారు.
ఈ దుశ్చర్య అంగవాడి కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఈ ఘటనపై స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అంగన్‌వాడి కేంద్రాల హైదరాబాద్ జిల్లా ప్రాజెక్ట్ అధికారిణి–1 ప్రజ్వలను ‘సాక్షి’ ఈ విషయంపై వివరణ కోరగా ఇలాంటి సంఘటన మొట్టమొదటి సారి తన దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.