స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలకు జాతీయ గీతాలాపన చేసి దేశ భక్తిని చాటుకుంటాం.ఇటీవల సినిమా థియేటర్లో జాతీయ గీతం వస్తుంటే అక్కడున్న వారంతా నిల్చొని ‘జన గణ మన’ను ఆలపిస్తున్న విషయం తెలిసిందే. అయితే బార్‌లో జాతీయ గీతం పాడి భక్తికి ప్రదేశంతో సంబంధం లేదని నిరూపించారు మందుబాబులు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
చదవండి: వైరల్: ధవణి దీనంగా.. ప్లీజ్ సీఎం తాతా వాటిని పూడ్చండి..
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్లు జాతీయ గీతాన్ని ఆలపించడం సాధారణం. ఆ సమయంలో ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని వారంతా గీతాన్ని ఆలపిస్తారు. అయితే హైదరాబాద్‌లోని గోల్నాక బార్ అండ్ రెస్టారెంట్‌లో మందు తాగేందుకు వెళ్లిన వారంతా టీవీలో మ్యాచ్ ముందు జాతీయగీతం ప్లే అవుతుంటే అందరూ లేచి నిలబడ్డారు ప్రతీ ఒక్కరూ నిల్చోని జాతీయ గీతాన్ని ఆలపించారు.
చదవండి: ఎవ్వరు చెప్పినా వినేది లేదు..చర్యలు తప్పవు: సిద్ధిపేట కలెక్టర్
మత్తులో ఉన్నా ఏమాత్రం తూలకుండా జన గణ మన అంటూ దేశంపై ఉన్న ప్రేమను చాటారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ‘మత్తులో ఉన్నా.. దేశభక్తి మరువలేదు. సూపర్ మందుబాబులు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment