Bar and Restaurant
-
కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కు బృహత్ పాలికె నోటీసులు జారీ చేసింది. నగరంలో చిన్నస్వామి స్టేడియం ఎదుట ఒన్8 కమ్యూన్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. దీనికి అగి్నమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేశ్ పాలికెకి ఫిర్యాదు చేశారు. దీంతో సమాధానం ఇవ్వాలని ఆ బార్కి నోటీసులు జారీ అయ్యాయి. సమాధానం రాకపోవడంతో మరోసారి తాఖీదులు పంపారు. కాగా, సమయం మించినా పని చేస్తోందని ఇదే బార్ మీద గత జూలైలో కబ్బన్ పార్కు పోలీసులు కేసు పెట్టారు. -
కిక్కు కోసం వెళ్లే వారిపై వలపు వల.. కూటమి ఎమ్మెల్యేకు షాక్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగర శివారు బీచ్‌కు దగ్గరలోని ఓ బార్‌కు వెళ్లారా మీ పని అంతే. మీరు రెండు పెగ్గులు వేద్దామని ఆర్డర్ ఇస్తే.. డ్రింక్ ఆఫర్ ఇస్తున్నామంటూ అందమైన అమ్మాయిలు మీ వద్దకు వస్తారు. మాటలతో మాయచేసి వలపు వాకిట్లోకి తీసుకెళ్తారు. మొదటగా ఒక పెగ్గు ఇప్పించి.. ఆ తర్వాత తమకూ డ్రింక్ ఆఫర్ చేయాలంటూ అడుగుతారు. ఆ మత్తు మాయలో నుంచి వలపు కౌగిల్లో నుంచి తేరుకునేలోపు బార్ సిబ్బంది వచ్చి మీ చేతిలో వేల రూపాయల బిల్లు పెడతాడు. కనీసం రూ.5 వేల నుంచి రూ.10 వేల మేర బిల్లు ఉంటుంది. ఇదంతా నేనెప్పుడు ఖర్చు చేశానని మీరు తలపట్టుకునే లోగానే ముక్కు పిండి మరీ ఆ బిల్లు వసూలు చేస్తారు. అయితే రెగ్యులర్‌గా వచ్చే మందుబాబులను కాకుండా.. బయట నుంచి వచ్చే కస్టమర్లనూ ఎంపిక చేసుకుని మరీ వల వేస్తారు. వాస్తవానికి వారికి ఇచ్చేది సాధారణ మద్యం అయినప్పటికీ.. ఖరీదైన మద్యం పేరుతో జేబుకు చిల్లు పెడతారు. ఈ బార్లో కేవలం ఈ తరహా మోసాలు చేసేందుకు నలుగురైదుగురు అమ్మాయిలు ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారం జరుగుతున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలున్నాయి.ఈ బార్‌కు అవసరమైన అనుమతులు కూడా జీవీఎంసీ నుంచి సక్రమంగా లేవు. ఈ బార్ యజమానికి అధికార పార్టీలోని ముఖ్యులందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉండటంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు. అంతేకాకుండా లంచం ఇస్తున్న సమయంలో రహస్య కెమెరాలతో బంధించిన వీడియోలతో అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ బార్లో వాటా కోసం ఏకంగా రూ.2 కోట్ల మేర ఓ కూటమి ఎమ్మెల్యే సమర్పించుకున్నారు. ఇప్పుడు వాటా లేదంటూ ఆ బార్ యజమాని ఖరాఖండింగా తేల్చి చెబుతున్నాడు. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యే కిమ్మనకుండా ఉండిపోవడం వెనుక ఏ తతంగం నడిచిందోననే చర్చ జరుగుతోంది.అధికారులకు దడఈ బార్‌కు అనుమతులు లేవనే ఫిర్యాదులున్నాయి. నిర్మాణం చేయకూడని ప్రాంతంలో చేశారనే విమర్శలున్నాయి. అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బార్ వైపునకు వెళ్లేందుకు ఇటు జీవీఎంసీ అధికారులు.. అటు పోలీసులు కూడా జంకుతున్నారనే విమర్శలున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అధికారులకు లంచాలు ఇస్తూ రహస్యంగా బార్ యజమాని వీడియోలు తీశారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఫిర్యాదులపై స్పందిస్తే ఎక్కడ తమ వీడియోలు బయటకు వస్తాయనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తుందనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ వ్యవహారాలన్నీ చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయనే సమాచారం పక్కాగా ఉన్నప్పటికీ.. అధికారులెవ్వరూ అటువైపు తొంగిచూడకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.ఎమ్మెల్యేకు జెల్లకూటమి ఎమ్మెల్యే ఈ బార్ కోసం ఏకంగా రూ.2 కోట్ల మేర చెల్లించారు. బార్లో తనకూ వాటా ఇవ్వాలంటూ ఈ చెల్లింపులన్నీ చేశారు. జీవీఎంసీ నుంచి అనుమతులతో పాటు బార్ లైసెన్స్ ఫీజు కూడా ఆయనే చెల్లించారు. బార్లో ఉపయోగించే వివిధ రకాల సామగ్రికి కూడా ఆయనే నగదు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విధంగా రూ.2 కోట్లకుపైగా చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇప్పుడు భాగస్వామ్యం లేదంటూ బార్ యజమాని తేల్చి చెప్పడంతో ఆ ఎమ్మెల్యే పరిస్థితి ‘కుడితిలో పడ్డ ఎలుక’లా తయారైంది. బార్ యాజమాని అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోపాటు పలువురు ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో... సదరు కూటమి ఎమ్మెల్యే మిన్నకుండిపోవాల్సి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఎమ్మెల్యేకు చెందిన పలు వ్యవహారాలు ఆ బార్ యజమానికి తెలిసి ఉండటం కూడా.. అతడు మాట్లాడకపోవడానికి ప్రధాన కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. రూ.2 కోట్లకుపైగా సమర్పించుకున్న ఎమ్మెల్యే కక్కలేక మింగలేక గమ్మున ఉండిపోయారనే ప్రచారం బార్ యాజమాన్యాల సర్కిల్లో వినిపిస్తోంది. -
ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు..
హైదరాబాద్: బేగంపేటలోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బార్లో యువతులు అశ్లీల నృత్యాలు చేయడం, యువకులను రెచ్చగొట్టడం, డీజే శబ్దాల హోరులో మద్యం సేవించి చిందులు వేయడం తదితర అనైతిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ నెల 3న నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపిన విషయం విదితమే. ఆ సమయంలో బార్ నిర్వాహకులతో పాటు మొత్తం 107 మందిని అరెస్టు చేశారు. వీరిలో 30 మంది యువతులు కాగా మరో 60 మంది యువకులు, 17 మంది నిర్వాహకులు ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసును బేగంపేట పోలీసులకు అప్పగించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్లో అశ్లీల కార్యకలాపాలు, నిబంధనలకు విరుద్ధంగా బార్‌ను నిర్వహించడంతో ఆధారాలతో సహా ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఊర్వశి బార్‌ను మూసివేసి లైసెన్స్‌ను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
US Gunfire: అమెరికాలో నరమేధం
లెవిస్టన్ (అమెరికా): అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్న ఓ సైనికుడు నరమేధానికి దిగాడు. చిన్నారులు, వారి తల్లిదండ్రులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం పారిపోతూ దార్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్పైనా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దారుణాల్లో ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 13 మందికి పైగా గాయపడ్డారు. మెయిన్ రాష్ట్రంలోని లెవిస్టన్లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వేళ ఈ ఘోరం జరిగింది. కాల్పుల అనంతరం చీకటి చాటున తప్పించుకుని పారిపోయిన హంతకుని కోసం భారీ వేట సాగుతోంది. హంతకుడిని 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. అతడు అమెరికా ఆర్మీ రిజర్వ్‌లో ఆయుధాల ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నట్టు సమాచారం. కొంతకాలంగా అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. హంతకుని ఫొటోను విడుదల చేశారు. అందులో అతను చేతిలో ఆటోమేటిక్ రైఫిల్‌తో కన్పిస్తున్నాడు. హంతకుడు పారిపోయేందుకు ఉపయోగించినట్టుగా భావిస్తున్న కారును ఆండ్రోస్కాగిన్ కౌంటీలో స్వా«దీనం చేసుకున్నారు. ఈ దారుణంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మెయిన్ గవర్నర్‌తో మాట్లాడారు. బౌలింగ్ పోటీలు జరుగుతుండగా... కాల్పులు జరిగిన స్పేర్‌టైమ్ రిక్రియేషన్, షెమెంగీస్ బార్ అండ్ గ్రిల్ రెస్టారెంట్ లెవిస్టన్ శివార్లలోని డౌన్టౌన్లో ఉన్నాయి. బుధవారం రాత్రి అక్కడి బౌలింగ్ ఏరియాలో చిన్నారుల బౌలింగ్ లీగ్ జరుగుతోంది. ఆటవిడుపుగా దాంట్లో పాల్గొంటున్న పిల్లలు, వారి తల్లిదండ్రులతో సందడిగా ఉన్న సమయంలో రాబర్ట్ అందులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. హింసాత్మక ప్రవృత్తి రాబర్ట్ది హింసాత్మక ప్రవృత్తి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తెలిపారు. రెండు వారాల క్రితమే ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కూడా తీసుకున్నాడన్నారు. అతను ఎలాంటి సమస్యతో బాధపడుతున్నాడో చెప్పకపోయినా, కంఠధ్వనులు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. బౌలింగ్ ఏరియాలో కాల్పుల మోతకు జనం వణికిపోయారు. ప్రాణభయంతో చెల్లాచెదురైపోయారు. హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. బెలూన్లను పేలుస్తున్నారనుకున్నాం... తాను బౌలింగ్ ఏరియాలోకి వెళ్లిన కాసేపటికే వెంటవెంటనే కనీసం 10సార్లు తుపాకీ పేలి్చన శబ్దం విన్నట్టు బ్రెండన్ అనే వ్యక్తి చెప్పాడు. ‘‘ఆ సమయంలో కాళ్లకు బూట్లు తొడుక్కుంటున్నా. సరదాగా బెలూన్లను పేలుస్తున్నారని తొలుత అనుకున్నా. కానీ డోర్ వద్ద చేతిలో తుపాకీతో హంతకున్ని చూసి వణికిపోయా. వెంటనే నేలపై పాక్కుంటూ బౌలింగ్ మెషీన్‌లోకి దూరి దాక్కున్నా. ఐదారు గంటల పాటు ఉత్తకాళ్లతో గడిపా’’అని వివరించాడు. రెయిలీ దెమోంట్ అనే ఆవిడ తల్లిదండ్రులతో కలిసి తన కూతురి ఆట చూస్తోంది. ఆమె తండ్రి రిటైర్డ్ పోలీసాఫీసర్. ‘‘కాల్పులు మొదలు కాగానే అక్కడున్న వాళ్లందరినీ మా నాన్న హుటాహుటిన ఓ మూలకు తరలించాడు. టేబుళ్లు తదితరాలను వారికి అడ్డుగా పెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు’’అని చెప్పింది. బార్లో కూడా కాల్పుల శబ్దం వింటూనే సిబ్బంది వెంటనే తలుపులన్నీ మూసేసి లోపలున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎందుకీ కాల్పులు...? కాల్పులను కళ్లారా చూసిన జోయ్ లెవెస్క్ అనే పదేళ్ల చిన్నారి ఇప్పటికీ దాన్ని తలుచుకుని వణికిపోతోంది! ‘‘బులెట్ నా కాలికి తగులుతూ దూసుకెళ్లింది. ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎవరైనా ఎందుకిలా ప్రవర్తిస్తారు?’’అని ప్రశి్నస్తోంది. కాల్పుల అనంతరం బౌలింగ్ ఏరియాలో, రెస్టారెంట్లో ఉన్నవాళ్లందరినీ పోలీసులు సమీపంలోని స్కూలుకు తరలించారు. ఈ ఏడాది 36వ ఘటన అమెరికాలో ఇది ఈ ఏడాదే ఏకంగా 36వ సామూహిక కాల్పుల ఘటన! ఇక మెయిన్ రాష్ట్రంలో కాల్పుల్లో ఇంతమంది బలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో 2022 మొత్తంలో పరస్పర కాల్పుల ఘటనల్లో 29 మంది మరణించారు. ఈ రాష్ట్రం వేటకు, షూటింగ్ క్రీడలకు ప్రసిద్ధి. అందుకే ఇక్కడ తుపాకీ కోసం లైసెన్సు కూడా అక్కర్లేదు! తుపాకీ కొనేందుకు లైసెన్సును తప్పనిసరి చేసేందుకు జరిగిన ప్రయత్నాలను స్థానిక ప్రజలే వ్యతిరేకించారు. కనీసం కొనుగోలుదారుల నేపథ్యాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయాలన్న ప్రతిపాదనను కూడా బుట్టదాఖలు చేశారు. ఇక కాల్పులు జరిగిన లెవిస్టన్ కేవలం 38 వేల జనాభాతో కూడిన చిన్న పట్టణం. ఇక్కడ ప్రధానంగా ఆఫ్రికన్లు నివసిస్తుంటారు. ప్రస్తుతం పట్టణంలో లాక్డౌన్ విధించారు. నార్త్ కరోలినాలో ఐదుగురు మృతి క్లింటన్: అమెరికాలో గురువారమే మరో కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. నార్త్ కరోలినాలోని క్లింటన్లో హైవే సమీపంలోని ఓ ఇంట్లో ఐదుగురు తూటా గాయాలతో చనిపోయి కని్పంచినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఎవరు, ఎందుకు పాల్పడిందీ ఇప్పటికైతే తెలియలేదన్నారు. పరస్పర గొడవలే ఇందుకు దారి తీసి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. -
బార్లో పరిచయం, టెక్కీకి శఠగోపం
సాక్షి, బనశంకరి: గుర్తు తెలియని వ్యక్తిని నమ్మి ఇంట్లో ఆశ్రయమిచ్చిన ఓ టెక్కీ రూ. లక్షల్లో వంచనకు గురయ్యాడు. ఈఘటన బెళ్లందూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు... సర్జాపురలో నివాసం ఉంటున్న ఆశీశ్ ఐటీ ఇంజినీర్. గతనె 15న ఇతను బార్‌కు వెళ్లాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి కలిశాడు. తన పేరు తుషార్ అలియాస్ డిటోసర్కార్ అని, ఢిల్లీకి చెందిన వాడినని, బంధువులు ఇంటికి వచ్చినట్లు నమ్మించాడు. ఒక్కరోజు తలదాచుకుంటానని.. బంధువులు నగరంలో లేరని, మరో ప్రాంతానికి వెళ్లారని, దీంతో తనకు ఇక్కడ తెలిసిన వారు ఎవరూ లేరని మాటలు కలిపాడు. ఒకరోజు ఆశ్రయం ఇవ్వాలని తన కష్టం చెప్పుకున్నాడు. అతని మాటలను నమ్మిన ఆశీశ్ అమాయకంగా ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. రాత్రి ఫ్లాట్‌లోనే నిద్రించిన తుషార్ మరుసటిరోజు ఉదయం అక్కడి నుంచి ఉడాయించాడు. ఆశీశ్ ఉదయం నిద్ర లేవగానే తుషార్ కనబడకపోగా ఫోన్లో సిమ్ కార్డు కూడా లేదు. అదేరోజు మధ్యాహ్నం ఆశీశ్ అకౌంట్ నుంచి రూ.1.64 లక్షల నగదు వేరే అకౌంట్‌కు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇదే తరహాలో అతడి బ్యాంకు అకౌంట్ నుంచి దశల వారీగా పదిరోజుల్లో ఆన్లైన్లో షాపింగ్ చేసినట్లు సుమారు రూ.7.20 లక్షలు కట్ అయింది. మొత్తం రూ.8.84 లక్షలు పోయింది. తన సిమ్ కార్డు దొంగలించిన తుషార్ వేరే మొబైల్‌కు అమర్చుకుని అందులో డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ద్వారా నగదు జమ చేసుకున్నట్లు తెలిసింది. బాధితుడు బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. (చదవండి: వాట్సాప్‌తో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు) -
బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అశ్లీల కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని మంజీరా మెజిస్టిక్‌లో నిర్వహిస్తున్న క్లబ్ మస్తీ రెస్టో బార్ అండ్ పబ్‌పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతులతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణ అనుమతుల ను తీసుకున్న క్లబ్ మస్తీ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా తెల్లవారుజాము వరకు పబ్‌ను నిర్వహిస్తూ యువతీ యువకులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేశారు. అప్పటికే హోరెత్తించే డీజే శబ్దాల నడుము యువత మద్యం సేవించి నృత్యాలు చేస్తూ కనిపించా రు. మప్టీలో ఉన్న పోలీసులు వారి ఫొటోలు, వీడియోలను తీయడంతో అనుమానం వచ్చిన పలువురు యువకులు పరుగులు తీశారు. దీంతో అందరినీ ఒకచోటకు చేర్చి వారి వివరాలను సేకరించారు. అనంతరం పబ్‌లో సేవిస్తున్న మద్యం వివరాలు, హుక్కా వివరాలు సేకరించి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు సేవించారా? అనే విషయమై ఆరా తీశారు. డ్రగ్స్ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో హుక్కా సేవించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా పబ్ మస్తీ యాజమానులైన శివప్రసాద్‌రెడ్డి, మేనేజర్ విష్ణు, నిర్వాహకుడు కృష్ణ పరారీలో ఉండగా, డ్యాన్స్‌లు చేస్తూ పట్టుబడిన తొమ్మిది మంది యువతులతో పాటు మేనేజర్ ప్రదీప్‌కుమార్, డ్యాన్సర్ ప్రవీణ్, డీజే ఆపరేటర్ ధన్‌రాజ్, సాయిసంతోష్లను అదుపులోకి తీసుకున్నారు. ప బ్లోని డీజే మిక్సర్, కంట్రోలర్, క్రాస్ ఓవర్ పరికరాలను సీజ్ చేశారు. అనంతరం వీరిని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్‌బీ సీఐ కిషన్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలోనూ ఇక్కడి బార్ అండ్ రెస్టారెంట్‌పై పలువురు ఫిర్యాదు చేయగా కొద్ది రోజుల పాటు పబ్ కార్యకలాపాలను నిలిపివేసిన యజమానులు తిరిగి ఇటీవల కాలంలో మళ్లీ మొదలుపెట్టినట్లు తెలిసింది. ప్రధానంగా యువతులను ఎరవేసి యువకులను పబ్‌కు రప్పిస్తున్నారన్న ఆరోపణలు పబ్ నిర్వాహకులపై ఉన్నాయి. -
పబ్‌లో యథేచ్ఛగా మత్తు దందా... డ్రగ్ మారో డ్రగ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పబ్ సంస్కృతి జడలు విప్పుతోంది. యువతలో విష బీజాలు నాటుతోంది. రేవ్ పార్టీల పేరుతో రెక్కలు తొడుగుతోంది. నిబంధనలకు నీళ్లొదిలి తెల్లవార్లూ బార్లా తెరుచుకుంటున్నాయి. నగరంలోని కొన్ని పబ్బుల్లో చాపకింద నీరులా డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా రాడిసన్ బ్లూ హోటల్ ఉదంతం వెలుగులోకి రావడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పబ్బుల్లో యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ఆబ్కారీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో వందకు పైగా పబ్బులు ఉన్నాయి. అన్ని బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతిచ్చినట్లుగానే ఎక్సైజ్‌శాఖ పబ్బులకు సైతం లైసెన్సులు ఇచ్చింది. బార్ అండ్ రెస్టారెంట్లకు ఉండే నిబంధనలే వీటికీ వర్తిస్తాయి. గ్రేటర్ పరిధిలో అర్ధరాత్రి 12 గంటల వరకు, వీకెండ్స్‌లో మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతినిస్తారు. కానీ కొన్ని పబ్బులు నిబంధనలు ఉల్లంఘించి తెల్లవారుజాము వరకు కొనసాగుతున్నాయి. ఇలాంటి పబ్‌లపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. కొరవడిన నిఘా... సాధారణంగా బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణపై నిఘా ఉన్నట్లుగానే పబ్లపైనా ఎక్సైజ్ అదికారులు నిఘా కొనసాగించాలి. తరచుగా తనిఖీలు నిర్వహించాలి. కొన్ని ప్రత్యేక సందర్భా ల్లో ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ నామమాత్రంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. కొన్ని పబ్‌లపై ఆ మాత్రం కేసులు కూడా నమోదు చేయడం లేదు. మైనర్లను పబ్బుల్లోకి అనుమతించడం, నిర్ణీత వేళలను పాటించకపోవడం, సరైన లెక్కలు చూపించకుండా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. డ్రగ్స్ వాడకంపై మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడకంపై రాడిసన్ బ్లూ హోటల్లో నమోదైన కేసు మాత్రమే మొట్టమొదటిది కావడం గమనార్హం. ప్రత్యేకమైన కేటగిరీ లేదు.. ‘ఎక్సైజ్ శాఖ నిబంధనల మేరకు పబ్‌లు అనే ప్రత్యేకమైన కేటగిరీ లేదు. హోటల్, రెస్టారెంట్ సదుపాయం ఉన్న చోట పెగ్గుల రూపంలో మద్యం విక్రయించేందుకు ఎక్సైజ్ శాఖ లైసెన్సు ఇస్తుంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బార్లను పబ్బులుగా పిలుస్తారు. ఆ సంస్కృతిలో భాగంగానే హైఫై బార్ అండ్ రెస్టారెంట్లు పబ్‌లుగా కొనసాగుతున్నాయి’ అని ఓ అధికారి వివరించారు. ఈ పబ్బులన్నీ రూ.40 లక్షల బార్ లైసెన్సు ఫీజు చెల్లించి అనుమతి పొందినవే కావడం గమనార్హం. స్టార్ హోటళ్లకు ప్రత్యేక అనుమతి.. ఫోర్ స్టార్ కంటే ఎక్కువ కేటగిరీకి చెందిన హోటళ్లలో మాత్రం 24 గంటలు మద్యం విక్రయించేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అనుమతినిస్తోంది. ఇందుకోసం హోటల్ నిర్వాహకులు సాధారణ బార్ లైసెన్సు ఫీజు రూ.40 లక్షలపై 25 శాతం అదనంగా చెల్లించాలి. అంటే సుమారు రూ.14 లక్షలకుపైగా చెల్లించి ప్రత్యేక అనుమతిని తీసుకోవాల్సిఉంటుంది. రాడిసన్ బ్లూ హోటల్ ఈ కేటగిరీ కిందనే ప్రత్యేక అనుమతిపై 24 గంటల పాటు మద్యం విక్రయిస్తోంది. నగరంలో ఇలాంటి అనుమతి కలిగినవి 20కిపైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: పబ్స్‌పై డ్రగ్స్ పడగ) -
మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్
స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలకు జాతీయ గీతాలాపన చేసి దేశ భక్తిని చాటుకుంటాం.ఇటీవల సినిమా థియేటర్లో జాతీయ గీతం వస్తుంటే అక్కడున్న వారంతా నిల్చొని ‘జన గణ మన’ను ఆలపిస్తున్న విషయం తెలిసిందే. అయితే బార్లో జాతీయ గీతం పాడి భక్తికి ప్రదేశంతో సంబంధం లేదని నిరూపించారు మందుబాబులు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చదవండి: వైరల్: ధవణి దీనంగా.. ప్లీజ్ సీఎం తాతా వాటిని పూడ్చండి.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్లు జాతీయ గీతాన్ని ఆలపించడం సాధారణం. ఆ సమయంలో ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని వారంతా గీతాన్ని ఆలపిస్తారు. అయితే హైదరాబాద్‌లోని గోల్నాక బార్ అండ్ రెస్టారెంట్లో మందు తాగేందుకు వెళ్లిన వారంతా టీవీలో మ్యాచ్ ముందు జాతీయగీతం ప్లే అవుతుంటే అందరూ లేచి నిలబడ్డారు ప్రతీ ఒక్కరూ నిల్చోని జాతీయ గీతాన్ని ఆలపించారు. చదవండి: ఎవ్వరు చెప్పినా వినేది లేదు..చర్యలు తప్పవు: సిద్ధిపేట కలెక్టర్ మత్తులో ఉన్నా ఏమాత్రం తూలకుండా జన గణ మన అంటూ దేశంపై ఉన్న ప్రేమను చాటారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ‘మత్తులో ఉన్నా.. దేశభక్తి మరువలేదు. సూపర్ మందుబాబులు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
‘రెస్టారెంట్ వల్లే అంత తాగాను’.. 40 కోట్ల నష్టపరిహారం రాబట్టాడు
నిజంగానే ఇదో క్రేజీ కేసు మరి!. అతనో పచ్చి తాగుబోతు. అలవాటు ప్రకారం ఫుల్‌గా మందేసి.. ఆ మత్తులో బయట మరో తాగుబోతుతో కొట్లాడి గాయపడ్డాడు. మత్తు దిగాక కోర్టులో తనకు మందు పోసిన బార్పైనే కేసు వేసి మరీ దాదాపు 40 కోట్ల భారీ నష్టపరిహారం రాబట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టెక్సాస్‌కు చెందిన డానియల్ రాల్స్.. 2019 మే నెలలో ఓరోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుల్‌గా తాగాడు. ఆపై కార్క్ పార్కింగ్ దగ్గర ఓ వ్యక్తితో గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో రాల్స్ తలకు గాయం అయ్యింది. కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక సరాసరి కోర్టులో బార్ మీద కేసు వేశాడు డానియల్ రాల్స్. ఆ రెస్టారెంట్ వల్లే తాను టూమచ్‌గా తాగానని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని ఆరోపించాడు. ఆ బార్ పరిసరాల్లో జరిగిందని, వాళ్లు నిర్లక్ష్యంతో తనకు ఫుల్‌గా తాగించారని, ఇలాంటి నేరాలు జరిగే అవకాశ ఉందని తెలిసి మరీ తనకు మందు టూమచ్‌గా సర్వ్ చేశారని, పైగా ఘర్షణ టైంలోనూ బార్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేదని, గాయపడ్డాక కనీసం ఆంబులెన్స్‌ను కూడా పిలవలేదని.. లాంటి ఆరోపణలు చేశాడు. బార్ ఓనర్‌తో పాటు తనకు సర్వ్ చేసిన బార్టెండర్ను నిందితులుగా పేర్కొన్నాడు. అయితే రాల్స్ పచ్చి తాగుబోతు. 2019 ఫిబ్రవరిలో పబ్లిక్‌గా తాగి.. న్యూసెన్స్ క్రియేట్ చేసి జైలుకు వెళ్లాడు. ఈ ఏడాది మేలోనూ ఓ వ్యక్తితో గొడవ పడి అరెస్ట్ అయ్యాడు. ఈ విషయాల్ని బార్ ఓనర్ తరపు న్యాయవాది వాదనలుగా వినిపించినప్పటికీ.. కోర్టు పట్టించుకోలేదు. ఆ తాగుబోతుకు సపోర్ట్‌గా తీర్పు ఇస్తూ.. 5 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం, కోర్టు నోటీసులకు సరిగా స్పందించనందుకు మరో అర మిలియన్ డాలర్లను కలిపి రాల్స్‌కు చెల్లించాలని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్‌ను ఆదేశించింది ఆండ్రూస్ కౌంటీ 109వ న్యాయస్థానం. ఇది చదవండి: కంపించిన నేల.. 1300 మరణాలు -
బార్లో వ్యభిచారం.. ఇద్దరు యువతులు, నిర్వాహకుల అరెస్ట్
సాక్షి, హస్తినాపురం: వ్యభిచారం నిర్వహిస్తున్న వీఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌పై వనస్థలిపురం పోలీసులు దాడి చేసి ఇద్దరు యువతులు, ఇద్దరు నిర్వాహకులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మురళీమోహన్ సమాచారం మేరకు... వనస్థలిపురం సుష్మాసాయినగర్ కాలనీ విజయవాడ జాతీయ రహదారి పక్కనే వీఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రెస్టారెంట్‌పై ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. రెస్టారెంట్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న వి.అజయ్ (22), సెక్యూరిటీ గార్డు సుగమ బాగర్(35) ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తూ యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించారు. వీఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. ఇద్దరు ఆర్గనైజర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. వారి నుంచి కొంత నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. చదవండి: అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ -
ఈ బార్ కి ఎగబడతున్న జనాలు.. ఎందుకంటే?
మీకు మంచి కిక్ ఇచ్చే మందు కావాలా? మందుతో పాటు మీ మూడ్ కి తగ్గట్టు వినోదం కోరుకుంటున్నారా? అయితే పదండి సింగపూర్ కి. ప్రస్తుతం కోవిడ్ వల్ల చాలా రెస్టారెంట్లు, హోటల్స్, బార్లలో రోబోలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటివల్ల కరోనా సోకే అవకాశం ఉండదు కాబట్టి, ఎక్కువ శాతం యజమానులు తమ హోటల్స్, బార్లలో రోబోలను ఉపయోగిస్తున్నారు. అలా ఓ బార్ యజమాని తన బార్ లో పనిచేసేందుకు ఓ రోబోని తీసుకొచ్చాడు. దాన్ని ముద్దుగా బార్నీ అని పిలుస్తాడు. ఈ రోబో కాక్టైల్ కలపడం నుంచి కస్టమర్లకు జోకులు వినిపించడం వరకు అన్ని పనులూ చకచకా చేసేస్తుంది. బార్ని 16 రకాల స్పిరిట్లనూ, 8 రకాల సోడాలను అవలీలగా మిక్స్ చేసి సూపర్ కాక్ టైల్స్ తయారు చేయగలదు. రోబో సినిమాలో రోబో మందు కలిపే సన్నివేశంలో చేసిన విధంగా. కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇచ్చే ఆర్డర్లకు అనుగుణంగా బార్నీ అన్నింటినీ సజావుగా కలిపి సర్వ్ కూడా చేస్తుంది. అలాగే, బార్ కు వచ్చేవారి మూడ్ కు తగ్గట్టు జోకులు వేస్తూ వారిని నవ్విస్తుంది. కరోనా సమయం కాబట్టి బార్ని కూడా తన చేతులను శానిటైజ్ చేసుకుంటుంది. అలా జాగ్రత్తలతో పాటు వినోదం అందిస్తోన్న ఈ బార్ కి వచ్చే కస్టమర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీంతో బార్ కు 'ది బార్ని బార్' అనే పేరు కూడా వచ్చింది. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
గుంటూరు జిల్లాలో దారుణ హత్య
సాక్షి, గుంటూరు: జిల్లాలో దారుణ హత్య జరిగింది. తెనాలిలోని బార్ అండ్ రెస్టారెంట్లో ఓ యువకుడిని రఫి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్‌లో శ్రీదుర్గ బార్‌పై కేసు నమోదు..
సాక్షి, హైదరాబాద్ : కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారిపై చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యం విక్రయాలు సాగిస్తున్న ఎల్ఎన్ నగర్‌లోని దుర్గ బార్ అండ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు చేశారు. మొత్తం 26 మద్యం బాటిల్స్‌ను అధికారులు సీజ్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో వైన్ షాప్‌లు, బార్లు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని అధిక రేట్లకు అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. -
అర్ధరాత్రి మద్యం విక్రయాలు
నెల్లూరు(క్రైమ్): ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా మద్యం విక్రయాలు సాగిస్తున్న నగరంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌పై ఎక్సైజ్, స్థానిక పోలీసులు దాడిచేశారు. వారి కథనం మేరకు.. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జిల్లాలో మద్యం విక్రయాలు నిలుపుదల చేశారు. ఆదివారం అర్ధరాత్రి నగరంలోని మెక్లిన్స్రోడ్డులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లోని సిబ్బంది బార్ సీల్‌ను తొలగించి గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఈ విషయంపై చిన్నబజారు, ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నెల్లూరు –1 ఇన్స్పెక్టర్ ఎ.రత్నం, చిన్నబజారు పోలీస్‌స్టేషన్ ఎస్సై అలీసాహెబ్లు, సిబ్బంది బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేశారు. మద్యం విక్రయిస్తున్న షేక్ మహ్మద్, షేక్ సలీంలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మద్యం విక్రయాల తాలూకా నగదు రూ.1,41,100, 59 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. -
తలపాగాతో ప్రవేశానికి అమెరికా బార్ నో
న్యూయార్క్: తలపాగా ధరించిన కారణంగా అమెరికాలో ఓ సిక్కు యువకుడిని బార్లోకి అనుమతించలేదు. అర్థరాత్రి దాటిన తన స్నేహితుడి కలుసుకోవడానికి వెళ్లిన ఆ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు మీడియా పేర్కొంది. గురువీందర్ గ్రేవల్ అనే యువకుడు అర్థరాత్రి తర్వాత తలపాగాతో పోర్ట్ జెఫర్‌సన్‌లోని హర్బర్ గ్రిల్ బార్కి వెళ్లాడు. అక్కడి భద్రతా సిబ్బంది తలపాగా ఉన్న కారణంగా అతడిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇది తమ సాంప్రదాయం అని మేనేజర్‌కి వివరించినా ప్రవేశానికి అనుమతించలేదని గురువీందర్ తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత హర్బర్ గ్రిల్ ఫేస్బుక్లో క్షమాపణలు తెలపడంతో పాటు వివరణ ఇచ్చింది. శుక్రవారం, శనివారాల్లో రాత్రి పది గంటల తర్వాత టోపీలు, హ్యాట్లు ధరించిరావడంపై నిషేధం విధించామని, అంతేకానీ సాంప్రదాయంగా ధరించేవాటిపై ఎలాంటి నిషేధం లేదని చెప్పుకొచ్చింది. -
బాబు వస్తున్నారని బార్‌కు ముసుగేశారు!
భవానీపురం (విజయవాడ పశ్చిమ) : విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులోని రాగమయి బార్ అండ్ రెస్టారెంట్ బోర్డుకు ముసుగు వేశారు. బార్ పక్కనే ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్‌ను బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నందున ఆయనకు కనబడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తగా బార్‌కు రెండు వైపులా పేరుతో ఉన్న బోర్డుకు ముసుగు వేయించేశారు. బుధవారం మాత్రం మద్యం దుకాణాన్ని మూసివేయాల్సిందిగా అధికారులు బార్ యజమానిని హెచ్చరించటంకూడా జరిగింది. కాగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీకి వెళ్లిన సందర్భంలో కాలనీకి వెళ్లే రోడ్డు ప్రారంభంలో ఒక వైన్ షాపు ఉండటాన్ని గమనించి ఆ వైన్ షాప్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఆ తరువాత జిల్లాకు చెందిన మంత్రి ఒకరు దానిని పునఃప్రారంభించేలా లాబీయింగ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందుగానే అన్న క్యాంటిన్ పక్కనే ఉన్న బార్‌ను చంద్రబాబుకు కనబడకుండా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. -
హెడ్ కానిస్టేబుల్‌ను చితకబాదిన ఏజీఎస్ పోలీసులు
సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలో యాంటీ గూండా స్క్వాడ్ (ఏజీఎస్) పోలీసులు గురువారం రాత్రి సెలవులో ఉన్న ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన అతను ఆస్పత్రి పాలయ్యాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మారేడుమిల్లి స్టేషన్ రైటర్‌గా పని చేస్తున్న నాయుడు అనే వ్యక్తి బంధువుల పెళ్లికి గురువారం రాజమహేంద్రవరం వచ్చారు. రాత్రి స్నేహితులతో కలసి ఏవీ అప్పారావు రోడ్డులోని సవేరా బార్ అండ్ రెస్టారెంట్‌కి వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో ఏజీఎస్ పార్టీ పోలీసులు బార్ వద్దకు వచ్చి సమయం అయిపోయింది మూసేయాలని ఆదేశించారు. ఆ సమయంలో బిల్లు కట్టి బయటకు వచ్చిన బాధితుడు నాయుడు సిగరెట్ వెలిగించారు. మా ముందే సిగరెట్ తాగుతావా? అంటూ ఏజీఎస్ పార్టీలోని ఓ కానిస్టేబుల్ లాఠీతో నాయుడిని చితకబాదారు. తనను అకారణంగా కొట్టడంతో బాధితుడు ఎదురుదాడికి దిగాడు. తాను కూడా డిపార్ట్మెంట్ వాడినేనని చెబుతున్నా వినకుండా ఏజీఎస్ పార్టీ ఎస్సై రాంబాబు బృందంలోని దాదాపు ఎనిమిది మంది బాధితుడిని విచక్షణా రహితంగా కొట్టారు. కాళ్లు, తొడలు, వీపు, చేతులు, మోచేతులపై తీవ్రగాయాలయ్యాయి. లాఠీ దెబ్బలతో బాధితుడి శరీరంపై వాతలు తేలాయి. బాధితుడిని చితకబాదిన ఏజీఎస్ పోలీసులు అనంతరం అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించడం గమనార్హం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి వచ్చిన ప్రకాశ్‌నగర్ ఏఎస్సై వివరాలు నమోదు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఈ విషయం ఎస్పీ బి.రాజకుమారి దృష్టికి రావడంతో కేసును తూర్పు మండలం డీఎస్పీ నాగరాజుకు అప్పగించారు. ఆయన మొదటి సారిగా బాధితుడిపై దాడి చేసిన కానిస్టేబు ల్ను, బాధితుడు నాయుడిని పిలిపించి రాజీ చేశారు. ఈ విషయంపై డీఎస్పీ నాగరాజును ‘సాక్షి’ సంప్రదించగా విషయం తన దృష్టికి వచ్చిందని, పోలీసు అని తెలియక ఏజీఎస్ పార్టీ కొట్టారని, అతడి ఎదురుదాడి చేశారని పేర్కొన్నారు. అందరూ పోలీసులే కావడంతో మాట్లాడి సర్ధి చెప్పామని చెప్పారు. సవేరా బార్ అండ్ రెస్టారెంట్ రాత్రి 11:15 గంటల వరకు ఉందని, ఈ విషయం ప్రకాశ్‌నగర్ పోలీసులకు సమాచారం రావడంతో ఏజీఎస్ పోలీసులు వెళ్లారని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి బార్లు 11 గంటలకు, మద్యం దుకాణాలు 10 గంటలలోపే కచ్చితంగా మూసివేసేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. -
యూపీ బీజేపీలో కలకలం
లక్నో: ఆయన సర్వసంగ పరిత్యాగి. దేశంలోనే ప్రముఖ సాధువు చేత బార్‌ను ఓపెనింగ్ చేయించిన వ్యవహారం ఉత్తరప్రదేశ్ బీజేపీలో తీవ్ర కలకలం రేపుతున్నది. అత్యాచార ఘటనలతో ఇటీవల వార్తల్లో నిలిచిన ఉన్నావ్ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆ సాధువు మరెవరోకాదు.. సాక్షి మహారాజే! మతపరమైన అంశాల్లో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ బీజేపీ ఎంపీ.. అనూహ్యరీతిలో సొంత పార్టీ నాయకులపైనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. అసలేం జరిగింది?: ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే మేనల్లుడు.. లక్నోలోని అలీగంజ్ ఏరియాలో ఓ బార్ అండ్ నైట్ క్లబ్‌ను నిర్మించాడు. ఆదివారం సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉన్నావ్ ఎంపీ సాక్షి మహారాజ్‌ను ఆహ్వానించాడు. మర్యాదకొద్దీ వెళ్లిన ఆ సాధువు.. రిబ్బన్ కత్తిరించి, నిర్వాహకులు బహుకరించిన గణేశుడి ప్రతిమతో వెనుదిరిగాడు. సంబంధిత ఫొటోలు వైరల్ కావడంతో ‘సాధువు అయి ఉండి బార్‌ను ప్రారంభించడమేమిట’నే విమర్శలు వెల్లువెత్తాయి. మరుసటిరోజు(సోమవారం) స్థానిక పేపర్లలోనూ ఆ వార్త ప్రచురితమైంది. అది బార్ అని తెలియక వెళ్లాను..: ఈ వ్యవహారంపై ఎంపీ సాక్షి మహారాజ్‌ను మీడియా వివరణ కోరగా ఆయన భిన్నంగా స్పందించారు. ‘‘అది బార్ అన్న సంగతి నాకు తెలియదు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే సూచన మేరకే ఆ కార్యక్రమానికి వెళ్లాను. అయినా సాధువునైన నాచేత ఆయన(పాడే) ఇలాంటి పని చేయింస్తాడని నేను ఊహించలేదు. తప్పుడు సమాచారంతో నన్ను మోసం చేశాడు. నా గౌరవానికి భంగం కలిగించిన ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని ఎంపీ వివరించారు. ఇప్పటికే దళిత ఎంపీల తిరుగుబాట్లు, సీఎం యోగి పనితీరుపై సోంత పార్టీలోనే అసంతృప్తి తెత్తిన నేపథ్యంలో తాజాగా సాక్షి మహారాజ్ ఉదంతం యూపీ బీజేపీని కుదిపేస్తున్నది. బార్ ఓపెనింగ్ వివాదంపై పార్టీ అధిష్టానం స్పందించాల్సిఉంది. -
బార్లో అగ్ని ప్రమాదం; ఐదుగురి మృతి
సాక్షి, బెంగళూరు: ముంబైలో పబ్‌లో అగ్నిప్రమాదం జరిగి 14 మంది మృతి చెంది పదిరోజులైనా కాకముందే మరో మహానగరంలోనూ బార్ అండ్ రెస్టారెంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు కలాసిపాళ్యలోని కైలాస్ బార్ అండ్ రెస్టారెంట్లో సోమవారం తెల్లవారుజామున చెలరేగిన మంటల కారణంగా అందులో పనిచేసే ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మృతులను తుమకూరుకు చెందిన స్వామి, ప్రసాద్, మహేష్, హాసన్‌కు చెందిన మంజునాథ్, మండ్యకు చెందిన కీర్తిగా గుర్తించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో, ఇరుకైన ద్వారంతో ఈ బార్ ఉంది. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మంటలు చెలరేగగా అక్కడే నిద్రిస్తున్న ఐదుగురు బయటకు వెళ్లలేక బాత్రూమ్లో దాక్కున్నారు. పొగకు ఊపిరాడక వారంతా ప్రాణాలు విడిచినట్లుగా భావిస్తున్నామనీ, పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదం జరిగిన వెంటనే బార్ యజమాని వీఆర్ దయాశంకర్‌ను అరెస్టు చేశారు. -
బార్ కోసం దారి మాయం
♦ పిడుగురాళ్లలో బార్ నిర్వహణకు గాను పన్నాగం ♦ ఎదురుగా ఆసుపత్రి ఉంటే అనుమతులు రావని ♦ డివైడర్ మధ్య దారి మూసేసిన టీడీపీ నాయకులు పిడుగురాళ్ల టౌన్ : బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటు విషయంలో అధికార పార్టీ రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. పిడుగురాళ్లలో ఏభై పడకల ఆసుపత్రి ఎదురు బార్ ఏర్పాటు చేసేందుకు అడ్డంకిగా మారిందని అధికార పార్టీకి దగ్గరి వ్యక్తులు ఏకంగా డివైడర్ మధ్య దారినే మూసివేయడం విశేషం. రాకపోకలకు బంద్ అయిన తర్వాత దూరం చూపి అనుమతులు పొందుదామని పన్నాగం పన్ని సోమవారం రాత్రి దారి మూసేశారు. నిబంధనలు మారిన తర్వాత జాతీయ, రాష్ట్రీయ రహదారుల పక్కన ఉండకూడదనే నియమం రావడంతోనే ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో టీడీపీకి చెందిన నియోజకవర్గ ముఖ్యనేత చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయం సమాచారం. రాత్రికి రాత్రే దారి మూసివేత.. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సెంట్రల్ డివైడర్ మధ్యలో ఉన్న దారిని రాత్రికి రాత్రే మూతపడింది. పదేళ్ల క్రితం ఈ దారి నిర్మించగా పాదచారులకు, రోగులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. ఈ ప్రాంతంలో వైద్యశాలలు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌లు ఎక్కువ. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే రోడ్డులో ఏభై పడకల ఆరోగ్యశ్రీ ఆసుపత్రి ఉంది. అలాంటి మార్గాన్ని మూసివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వైద్యశాల ఎదుట బార్ ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం, వంద అడుగుల దూరం చూపేందుకు గాను బార్ నిర్వాహకులు ఈ పని చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం ఇచ్చారు. -
వక్ఫ్ స్థలంలో టీడీపీ నేతల బార్ అండ్ రెస్టారెంట్
- వద్దే వద్దంటూ మహిళలు, విద్యార్థుల రాస్తారోకో నంద్యాల రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు అనాలోచిత నిర్ణయం వల్ల అవస్థల పాలవుతున్నామని, ఇళ్ల మధ్య బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటును తక్షణమే నిలుపుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతునగరం గ్రామ పంచాయతీ వాసులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం రైతునగరం పంచాయతీ పరిధిలోని వీరన్న కాలనీ, ఎస్ఆర్నగర్ కాలనీల మహిళలు, నాగార్జున జూనియర్ కళాశాల విద్యార్థులు స్థానిక నంద్యాల–కోవెలకుంట్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నూనెపల్లె రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 231లో ఉన్న వక్ఫ్‌బోర్డు స్థలంలో మంత్రి అఖిలప్రియ సమీప బంధువుల భాగస్వామ్యంతో చందమామ బార్అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు మంగళవారం పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న వీరన్న కాలనీ, ఎస్ఆర్నగర్ కాలనీల మహిళలు, నాగార్జున జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు న్యాయవాది వివేకానందరెడ్డి, స్థానికులు పార్థసారథిరెడ్డి, నాగేంద్రారెడ్డి, జయరామిరెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. ప్రహరీ నిర్మాణానికి పునాదులు తవ్వుతుండగా మహిళలు అడ్డుకొని.. మేస్త్రీలను, కూలీలను వెనక్కి పంపారు. అనంతరం అక్కడే ఉన్న రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మంత్రి అఖిలప్రియ తక్షణమే జోక్యం చేసుకుని బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటును నిలిపివేయించాలని డిమాండ్ చేశారు. మహిళలు ఆందోళన చేస్తున్న సందర్భంలోనే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి కాలనీలోని మోహన్‌రెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేశారు. రోడ్డుకు పదిఅడుగుల దూరంగా ఏర్పాటు చేస్తామని, మహిళలతో ఆందోళన విరమింపజేయాలని సూచించారు. ఈ సమాచారాన్ని ఆయన తెలపడంతో మహిళలు మరింత ఆగ్రహానికి గురయ్యారు. చంద్రబాబు డౌన్.. డౌన్, ఇళ్ల మధ్య బార్ అండ్ రెస్టారెంట్ వద్దే వద్దంటూ నినాదాలు చేశారు. దీంతో నంద్యాల రూరల్ ఎస్ఐ తిమ్మారెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలతో చర్చించారు. నిబంధనలకు విరుద్ధంగా బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో స్థల యజమానిగా చెప్పుకుంటూ అక్కడికి వచ్చిన లక్ష్మిరెడ్డిని మహిళలు చుట్టుముట్టారు. ‘బార్ అండ్ రెస్టారెంట్ మా ఇళ్ల ముందు కాదు.. మీ ఇంటి ముందు ఏర్పాటు చేసుకోండి’ అంటూ హితవు చెప్పారు. పోలీసులు జోక్యం చేసుకొని మహిళలను శాంతింపజేశారు. -
గంభీర్ & గంభీర్
న్యూఢిల్లీ: అదో బార్ అండ్ రెస్టారెంట్... దాని పేరు ఘుంగ్రూ ‘బై’ గౌతమ్ గంభీర్. ఇదే పేరుతో రాజధాని నగరంలో పలు చోట్ల హోర్డింగ్‌లు వెలిశాయి. చూడగానే ఇదేదో భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు సంబంధించిందే అనిపిస్తుంది కదా! సరిగ్గా ఇదే విషయం గంభీర్‌కు కూడా చిర్రెత్తించింది. అసలు మద్యం ముట్టని తన పేరును ఇలా బార్ ప్రచారానికి వాడుకోవడం ఏమిటని ఆగ్రహించిన అతను ఏకంగా ఢిల్లీ హైకోర్టులోనే కేసు వేశాడు. తనకు ఈ బార్‌తో చెడ్డ పేరు వస్తోందని అతను పిటిషిన్ దాఖలు చేశాడు. అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్. ఆ బార్ యజమాని పేరు కూడా గౌతమ్ గంభీర్ కావడమే వివాదానికి కారణం. అతనితో చర్చించేందుకు గంభీర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాను కూడా వెనక్కి తగ్గనని, కోర్టులోనే తేల్చుకుంటానని అతను కూడా సవాల్ చేశాడు. ‘ఆయన ప్రముఖుడు, పెద్ద క్రికెటర్ కావచ్చు. అయితే ఏంటి? నాకంటూ సొంత గుర్తింపు ఉంది. ఆయన పేరు గౌతమ్ గంభీర్ అయితే నన్ను పేరు మార్చుకోమంటారా? నేనేమీ ఆయనను బద్నాం చేయడం లేదు. ఎక్కడా క్రికెట్‌కు సంబంధించిన వస్తువులను ప్రకటనల్లో చూపించడం లేదు. నా సొంత పేరును నా వ్యాపారానికి వాడుకునే హక్కు నాకు ఉంది’ అంటూ వ్యాపారి గంభీర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు! -
నిషా ధర.. నషాళానికి!
⇒చుక్కల్లో మద్యం ధరలు క్వార్టర్‌కు రూ.10 అదనం ఫుల్ బాటిల్‌పై రూ.40 ⇒ఎక్సైజ్ మంత్రి సొంత ఇలాకాలోనూ ఇష్టారాజ్యంగా విక్రయాలు ⇒24 గంటలూ అందుబాటులో మద్యం బెల్టుషాపుల నిర్వహణ షరా మామూలే జిల్లాలో మద్యం ధరలు చుక్కలనంటుతున్నాయి. ఎమ్మార్పీ ధరకు మించి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లా అంతటా ఈ పరిస్థితి కొనసాగుతోంది. సాక్షాత్తూ ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లా అయినా నిబంధనలను పట్టించుకునే నాథుడే లేడు. అధిక ధరకు విక్రయాలు సాగిస్తున్నా అడిగే పరిస్థితి లేదు. తాజాగా మంత్రి సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలోనూ మద్యం ధరలు ఇష్టారాజ్యంగా పెంచేశారు. మచిలీపట్నం : ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత ఇలాకాలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. జిల్లాలో యథేచ్ఛగా ఎమ్మార్పీపై క్వార్టర్ బాటిల్‌కి రూ.10 పెంచి విక్రయాలు చేస్తున్నారు. ఫుల్ బాటిల్‌కి ఈవిధంగా రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. తాజాగా మంత్రి సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలోనూ బరితెగించేశారు. ఐదు రోజుల క్రితం మద్యం సిండికేట్ వ్యాపారులు, మరో ఇద్దరు టీడీపీ కీలక నాయకులు సమావేశమై మద్యం ధరలను పెంచాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా క్వార్టర్ బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంచేసి విక్రయాలు జరుపుతున్నారు. పట్టణంలోని ఏడు వైన్ షాపులు, పది బార్ అండ్ రెస్టారెంట్లలో ఇవే ధరలు అమలవుతున్నాయి. ఇంతా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. జిల్లా అంతటా... జిల్లాలో మొత్తం 334 మద్యం దుకాణాలు ఉండగా, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో 160, మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో 174 మద్యం షాపుల వరకు ఉన్నాయి. మచిలీపట్నం ఈఎస్ పోస్టు ఎనిమిది నెలలుగా ఖాళీగానే ఉంది. మచిలీపట్నం సీఐ పోస్టుతో పాటు మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయ ఏవో పోస్టు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉన్నా వీటిని భర్తీ చేయటం లేదు. ఏఈఎస్ ఇన్చార్జ్ ఈఎస్‌గా వ్యవరిస్తున్నారు. జిల్లా అంతటా మద్యం ధరలు ఎమ్మార్పీ కంటే అదనంగా పెంచి వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. సమయపాలన ఏదీ? మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటోంది. నిబంధనల ప్రకారం వైన్‌షాపు ఉదయం 10 గంటలకు తీసి రాత్రి 10 గంటలకు మూసివేయాలి. బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. ఈ నిబంధనలు జిల్లాలో ఎక్కడా అమలుకాని పరిస్థితి నెలకొంది. 24 గంటల పాటు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. వీటికి తోడు తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. బెల్టు షాపుల్లో క్వార్టర్ బాటిల్‌కు మరో రూ.5 వసూలు చేస్తున్నారు. చింతగుంటపాలెం, కాలేఖాన్‌పేట, గిలకలదిండి, బందరుకోట బైపాస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో బెల్టుషాపుల నిర్వహణ యథేచ్ఛగా కొనసాగుతోంది. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
బార్ లెసైన్సుల కోసం పాట్లు
రేపటి నుంచి నూతన పాలసీ అమలు నిబంధనలకు అనుగుణంగా రెస్టారెంట్లలో మరమ్మతులు తిరస్కరణకు గురైన మొత్తం దరఖాస్తులు ఆందోళనలో వ్యాపారులు నరసరావుపేట టౌన్ : బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణలో ప్రభుత్వం కొత్తపాలసీ తీసుకురావడంతో వ్యాపారులు పడుతున్న పాట్లు అన్నీ.. ఇన్నీ.. కావు. ఇప్పటి వరకు నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వ్యాపారులు నూతన లెసైన్సులు పొందేందుకు రెస్టారెంట్ల రూపురేఖలను మార్చాల్సి వస్తోంది. కాగా లెసైన్సు పొందేందుకు పెటుకున్న అన్ని దరఖాస్తులను తిరస్కరించడంతో రెస్టారెంట్ల యాజమాన్యంలో కలవరం మొదలైంది. వివరాలు ఇలా ఉన్నాయి. డివిజన్ కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో 16 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రభుత్వం బార్ అండ్ రెస్టారెంట్ల లెసైన్సులో కొత్తపాలసీని ప్రవేశపెట్టిన విషయం విధితమే. ఈ ఏడాదితో పాత లెసైన్సులు పూర్తిగా రద్దయి జనవరి 1 నుంచి కొత్త లెసైన్సుదారులు రానున్నారు. కాగా నూతన రెస్టారెంటుకు లెసైన్సు పొందాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. రెస్టారెంట్లు బడి, గుడి, వైద్యశాలకు 100 మీటర్ల దూరంలో ఉండాలి. అదే విధంగా 100 మీటర్ల ఆర్సీసీ డాబా, మొత్తం ప్రాంగణం 200 మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. సౌకర్యవంతమైన పార్కింగ్ కలిగి ఉండాలి. ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల వీడియోను సీడీలో పొందుపరచడంతోపాటు పొందిన ట్రేడ్లెసైన్స్తో రూ.5వేల చలనాను జతచేసి హైదరాబాద్ కమిషనరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు విచారణకు వచ్చి నిబంధనలను పరిశీలించిన పిమ్మట లెసైన్సు మంజూరుకు చర్యలు తీసుకుంటారు. దీంతో పట్టణంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యం నిబంధనలకు అనుగుణంగా తమ రెస్టారెంట్లను మార్పు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి పాత స్టాకును విక్రయించేందుకు ఎన్నడూ లేని విధంగా ఎమ్మార్పీధరలకు అమ్మకాలు బార్ అండ్ రెస్టారెంట్లలో మొదలుపెట్టారు. కొన్ని బార్ల యాజమాన్యం రెస్టారెంట్ల ఎదుట క్లియరెన్స్ సేల్, ఎమ్మార్పీ ధరకే అమ్మకాలంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి విక్రయాలను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ముగిస్తే లెసైన్సులు ఉంటాయో లేదో అన్న ఆందోళనలో రెస్టారెంట్ల యాజమాన్యం క్లియరెన్స్ సేల్ విక్రయాలు కొనసాగిస్తున్నారని పట్టణంలో చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా 30 వేల మంది జనాభాకు ఒక బార్ అండ్ రెస్టారెంట్ చొప్పున ఉండాలన్నది నిబంధన. నరసరావుపేట పట్టణంలో సుమారు 1.4 లక్షల జనాభా ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. అంటే నిబంధనల ప్రకారం 5 రెస్టారెంట్లకు మించరాదు. కాగా పట్టణంలో అత్యధికంగా 16 రెస్టారెంట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటిల్లో కొన్ని తొలగిస్తారన్న ప్రచారం సాగుతున్నా, అధికారులు మాత్రం అవన్నీ అపోహలేనని తేల్చి చెబుతున్నారు. 16 దరఖాస్తులు తిరస్కరణ బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతి కోరుతూ లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న యాజమాన్యాలకు చుక్కెదురైంది. దరఖాస్తుతోపాటు దాఖలు చేసిన ట్రేడ్ లెసైన్సులో అవకతవకలు ఉన్నాయంటూ హైదరాబాద్ కమిషనర్ అన్ని దరఖాస్తులను తిరస్కరించినట్లు సమాచారం. ట్రేడ్ లెసైన్స్ సరైన పద్ధతిలో పొంది తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. దరఖాస్తు చేసుకునేందుకు 31వ తేదీ సాయంత్రంతో గడువు ముగుస్తుండటంతో బార్ యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఇన్ఛార్జిగా మున్సిపల్ ఇంజినీర్ ఓంప్రకాష్, ఫుల్ఛార్జి లేదనే సాకుతో ట్రేడ్ లెసైన్స్ అనుమతికి దూరంగా ఉండటంతో యాజమాన్యాల్లో కలవరం రేకెత్తింది. ఇదిలా ఉండగా ఇప్పటికే వైన్‌షాపుల నిర్వహణను తమ కంబంధ హస్తాల్లో ఉంచుకున్న అధికార పార్టీ బార్ అండ్ రెస్టారెంట్ల వ్యవహారంలో ఏవిధంగా ముందుకు సాగుతుందో వేచిచూడాల్సి ఉంది. -
రాష్ట్రంలో మరో 86 బార్లు!
నూతన బార్ లెసైన్స్ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: బార్ లెసైన్స్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన బార్లు కేటాయించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతీ 13 వేల జనాభాకు ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పా టు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో 30 వేల జనాభాకు బార్ ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్త పాలసీ ప్రకారం జనాభాతో సంబంధం లేకుండా మూడు నక్షత్రాల హోటళ్లు, ఆపై స్థాయి హోటళ్ల రెస్టారెంట్లలో కూడా బార్లు నిర్వహించుకోవచ్చు. జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, నగరపంచాయితీలకు ఇది వర్తిస్తుంది. పర్యాటక కేంద్రాల్లోని రెస్టారెంట్లలోనూ బార్లు నిర్వహించుకోవచ్చు. బార్ అండ్ రెస్టారెంట్ల సమయాన్ని అదనంగా గంట పొడిగించాలని భావించినప్పటికీ... ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో దాన్ని ప్రస్తావించలేదు. నూతన బార్ల లెసైన్స్‌లకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 846కు చేరిన బార్లు కొత్త పాలసీ ప్రకారం రాష్ట్రంలో బార్ల సంఖ్య 846కు చేరనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 760 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 509 బార్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీని మినహా ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా 251 బార్లు ఉన్నాయి. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన నూతన పాలసీ ప్రకా రం రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 86 బార్లు అం దుబాటులోకి రానున్నాయి. కొత్తగా వచ్చే బార్లలో కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే 38 అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 48 బార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ పాలసీ ప్రకారం రాష్ట్ర ఖజానాకు బార్ల లెసై న్స్ ఫీజు ద్వారా రూ.115 కోట్లకు పైగా ఆదాయం లభించనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహించే బార్ల లెసైన్స్ ఫీజును ప్రభుత్వం రూ.35 లక్షలుగా నిర్ధారించింది. మున్సిపాలిటీలు, నగర పంచాయితీలలో నిర్వహించే బార్ల లెసైన్స్ ఫీజును రూ.28 లక్షలుగా నిర్ణయించింది. అయితే వరంగల్, కరీంనగర్ జిల్లాలోని బార్ల లెసైన్స్ ఫీజును మాత్రం అన్నిచోట్ల కంటే ఎక్కువగా నిర్ధారించారు. ఈ రెండు జిల్లాలోని బార్ల లెసైన్స్ ఫీజును రూ.38 లక్షలుగా నిర్ణయించారు.ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా ద్వారా నిర్ణయిస్తారు. ఇవీ నిబంధనలు బార్ అండ్ రెస్టారెంట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. దరఖాస్తుదారుడు ట్రేడ్ లెసైన్స్ కలిగి ఉండటంతో పాటు రెస్టారెంట్ ఉండి తీరాలని స్పష్టం చేసింది. దరఖాస్తుదారు కచ్చితంగా రెండేళ్ల పాటు వ్యాట్ చెల్లించి ఉండాలని సూచించింది. బార్ల ఏర్పాటు స్కూళ్లకు, ప్రార్థనా మందిరాలకు 100 మీటర్ల దూరం ఉండాలని స్పష్టం చేసింది. బార్ల దరఖాస్తు కోసం మొదటగా రూ.5 వేలు చెల్లించి అఫ్లికేషన్ ఫారం తీసుకోవాలి. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించరు. దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయి గల అధికారి పరిశీ లిస్తారు. నియమ నిబంధనలన్నీ పక్కాగా ఉండి, పోటీ లేకపోతే లెసైన్స్ నేరుగా అప్పగిస్తారు. పోటీ ఉంటే లాటరీ పద్ధతిన లెసైన్స్ ఇస్తారు.