మీకు మంచి కిక్ ఇచ్చే మందు కావాలా? మందుతో పాటు మీ మూడ్ కి తగ్గట్టు వినోదం కోరుకుంటున్నారా? అయితే పదండి సింగపూర్ కి. ప్రస్తుతం కోవిడ్ వల్ల చాలా రెస్టారెంట్లు, హోటల్స్, బార్లలో రోబోలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటివల్ల కరోనా సోకే అవకాశం ఉండదు కాబట్టి, ఎక్కువ శాతం యజమానులు తమ హోటల్స్, బార్లలో రోబోలను ఉపయోగిస్తున్నారు. అలా ఓ బార్ యజమాని తన బార్ లో పనిచేసేందుకు ఓ రోబోని తీసుకొచ్చాడు. దాన్ని ముద్దుగా బార్నీ అని పిలుస్తాడు.
ఈ రోబో కాక్‌టైల్ కలపడం నుంచి కస్టమర్లకు జోకులు వినిపించడం వరకు అన్ని పనులూ చకచకా చేసేస్తుంది. బార్ని 16 రకాల స్పిరిట్‌లనూ, 8 రకాల సోడాలను అవలీలగా మిక్స్ చేసి సూపర్ కాక్ టైల్స్ తయారు చేయగలదు. రోబో సినిమాలో రోబో మందు కలిపే సన్నివేశంలో చేసిన విధంగా. కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇచ్చే ఆర్డర్లకు అనుగుణంగా బార్నీ అన్నింటినీ సజావుగా కలిపి సర్వ్ కూడా చేస్తుంది. అలాగే, బార్ కు వచ్చేవారి మూడ్ కు తగ్గట్టు జోకులు వేస్తూ వారిని నవ్విస్తుంది. కరోనా సమయం కాబట్టి బార్ని కూడా తన చేతులను శానిటైజ్ చేసుకుంటుంది. అలా జాగ్రత్తలతో పాటు వినోదం అందిస్తోన్న ఈ బార్ కి వచ్చే కస్టమర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీంతో బార్ కు 'ది బార్ని బార్' అనే పేరు కూడా వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment