singapoor
-
తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో జనవరి 18న ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ (GIIS) స్కూల్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ఇండస్ట్రీస్ & కామర్స్/లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నాగార్జున సాగర్ ఎం ఎల్ ఏ జయవీర్ కుందూరు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు/బాన్సువాడ ఎం ఎల్ ఏ/ మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ రోహిణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారందర్ని అతిధి మర్యాదలతో తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి , పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, అధ్యక్షులు గడప రమేష్ బాబు తదితరులు సింగపూర్ తెలుగు ప్రజల సమక్షంలో ఘనంగా ఆహ్వానించారు. సింగపూర్ తెలుగు ప్రజల మరిచిపోలేని మధుర క్షణాలను మదిలోనింపుకొన్నరోజు ఇదే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చిన్నారుల నృత్యప్రదర్శనలు, స్వాగత గీతంతో ఆహ్వానించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షులు గడప రమేష్ స్వాగత ప్రసంగంతో.. తెలంగాణ కల్చరల్ సొసైటీ స్థాపన తెలుగు సంప్రదాయాలను, ఆచారాలను, ఆధ్యాత్మిక తత్వాలను భావితరాలకు అందించే కృషిలో సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది.తెలంగాణ మీద ఉన్నప్రేమను చూపించడానికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రోహిణ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ కల్చరల్ సొసైటీకి వెన్నంటి ముందుండి నడిపించి తమ సహాయ సహకారాలను ఎల్లవేళల అందించే వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, NRI Cell మంద భీం రెడ్డి కి, GTA గ్లోబల్ ఛైర్మెన్ కల్వల విశ్వేశర్ రెడ్డి, GIIS ఛైర్మెన్ అతుల్ తెముర్ణికర్, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అంతే కాకుండా ఈ కార్యక్రమానికి సహకరించిన బసిక శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి తెలంగాణలో పలు రంగాలలో చేస్తున్న అభివృద్ధిని, తెలంగాణ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించే ప్రణాలికను, ప్రపంచదేశాలు తెలంగాణను తలెత్తి చూసే సమయం ఆసన్నమైంది. అందుకు విదేశాలలో నివసిస్తున్న మన తెలంగాణ తెలుగు ప్రజల సహాయ సహకారాలు ఉండాలని కోరారు. అదేవిధంగా ఐటీ(IT) మినిస్టర్ శ్రీధర్ బాబు, డిజిటల్ రంగంలో చేస్తున్న అభివృద్ధిని వివరించారు .తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, IT మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర మంత్రివర్గ సభ్యులను, తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) కమిటి, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ GIIS ఛైర్మెన్ అతుల్ తెముర్ణికర్ ఘనంగా సత్కరించారు.ఈ వేడుకల్లో మాతృశ్రీసాయి ఇన్స్టిట్యూట్, సర్వ ఫైన్ ఆర్ట్స్, దుర్గ శర్మ గ్రూప్, దీపారెడ్డి అండ్ గ్రూప్ మరియు స్వర్ణకళామందిర్ నుండి చిన్నారుల నృత్యప్రదర్శనలు, మధురమైన గీతాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి కాసర్ల శ్రీనివాస రావు, మిర్యాల సునిత రెడ్డి ముఖ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి అందరిని అలరించారు.కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి , పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యుల చేతుల మీదుగా 2025 తెలుగు క్యాలెండర్ (సింగపూర్ కాలమాన ప్రకారం)ను విడుదల చేసి, అందరికీ వాటిని పంపిణీ చేశారు.తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, IT మినిస్టర్ శ్రీధర్ బాబు, ఇతర ముఖ్య అతిథులకు ధన్యావాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సొసైటీ సభ్యులు ఆలెక్స్ తాళ్ళపల్లి, మల్లారెడ్డి కళ్లెం, లక్ష్మణ్ రాజు కల్వ, రాకేష్ రెడ్డి రజిది, సురేందర్ రెడ్డి గింజల, సింగపూర్ తెలుగు ప్రజలకు అభినందనలు తెలియజేసారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ, అలాగే 'మీట్ అండ్ గ్రీట్' కు హాజరైన ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన సొసైటీ మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు, వాసవి పెరుకు, రావుల మేఘన, చల్ల లత మొదలగు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్‌కి నాట్స్ విరాళం) -
శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం!
'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' ఆధ్వర్యంలో పవిత్ర మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా, అంతర్జాల మాధ్యమంగా ప్రత్యేక ప్రవచన కార్యక్రమము ఏర్పాటు చేశారు. పంచమహాసహస్రావధాని అవధాన సమ్రాట్ డా మేడసాని మోహన్ గారు "శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం" అనే అంశంపై రెండు గంటలపాటు ప్రవచనాన్ని అందించారు.యోగిని ఏకాదశి, మతత్రయ ఏకాదశి కలిసిన రోజు విశిష్టతను వివరించి, ఏకాదశి వ్రతమహిమను తెలియజేశారు. అనంతరం కురుక్షేత్ర సంగ్రామం ముందు పాండవులు ఆచరించిన ఏకాదశి వ్రత కథను తెలియజేశారు.కురుక్షేత్ర సంగ్రామానికి ముందు జరిగిన రాయబార ఘట్టాలనుండి సంగ్రామ సమాప్తి వరకు జరిగిన సన్నివేశాలన్నింటినీ కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ, తిక్కన భారతంలోని పద్యాలను ఉదహరిస్తూ, వాటిలోని సాహితీ విశిష్టతను తెలియజేస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాన్ని నడిపించిన తీరు అంతా అద్భుతంగా వివరించారు. తానే కర్త, కర్మ, క్రియ అయ్యి, ధర్మసంస్థాపన మూల లక్ష్యంగా యుద్ధ సారథ్యం చేయడంలో, వివిధ సందర్భాలలో కృష్ణ భగవానుడు ప్రదర్శించిన లీలల వెనక ఉద్దేశాలను చక్కగా వర్ణించి చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "డా మేడసాని మోహన్ గారు ఎంతో అభిమానంగా తమ సంస్థను ప్రోత్సహించే సహృదయులని, గతంలో కూడా వారి ప్రవచనాలను సింగపూర్ తెలుగు ప్రజలు ఆదరించారని, మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా వారు ఈ ప్రత్యేక ప్రవచనం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.సింగపూర్ నుండి కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులు పాతూరి రాంబాబు, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధి కాసర్ల శ్రీనివాస్ ఆంధ్ర కళావేదిక ఖతార్ అధ్యక్షులు వెంకప్ప భాగవతుల, ప్రతినిధి సాహిత్య జ్యోత్స్న, యూఏఈ నుంచి దినేష్, బహరేన్ తెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.సంస్థ ప్రధాన కార్యవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభను నిర్వహించగా, రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక నిర్వహణలో యూట్యూబ్, ఫేస్బుక్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయగా, వెయ్యి మందికి పైగా ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ చూసారని నిర్వాహుకులు తెలియచేసారు. -
సింగపూర్‌లో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్, క్యాండిడేట్స్ టోర్నీ విజేత దొమ్మరాజు గుకేశ్‌కు స్వదేశంలో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా), చాలెంజర్ గుకేశ్ మధ్య ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆతిథ్య హక్కులు సింగపూర్‌కు లభించాయి. ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కుల కోసం అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), తమిళనాడు ప్రభుత్వం, సింగపూర్ పోటీపడ్డాయి. బిడ్లను పరిశీలించాక ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు సింగపూర్‌కు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు గుకేశ్, డింగ్ లిరెన్ మధ్య 25 లక్షల డాలర్ల (రూ. 20 కోట్ల 85 లక్షలు) ప్రైజ్‌మనీతో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుంది. ఇద్దరి మధ్య 14 రౌండ్లు నిర్వహిస్తారు. తొలుత 7.5 పాయింట్లు సంపాదించిన ప్లేయర్‌ను విశ్వవిజేతగా ప్రకటిస్తారు. 14 రౌండ్ల తర్వాత ఇద్దరూ సమంగా నిలిస్తే టైబ్రేక్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు క్లాసికల్ ఫార్మాట్లో భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఆనంద్ ఐదుసార్లు (2000, 2007, 2008, 2010, 2012) విశ్వవిజేతగా నిలిచాడు. -
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ప్రపంచంలో తేయాకు రకాలు ఎన్నో ఉన్నాయి. అరుదైన రకాల తేయాకుకు, అలాంటి రకాల తేయాకు తయారు చేసిన తేనీటికి ధర ఎక్కువగా ఉంటుంది. చైనాకు చెందిన ఊలాంగ్ టీ చూడటానికి బంగారు రంగులో ఉంటుంది. అంతమాత్రాన అది బంగారు తేనీరు కాదు. సింగపూర్‌లోని టీడబ్ల్యూజీ కంపెనీ మాత్రం అచ్చంగా బంగారు తేయాకు విక్రయిస్తోంది.నాణ్యమైన తేయాకులను పొడవుగా కత్తిరించి, ఆరబెట్టిన తర్వాత ఆ తేయాకులకు 24 కేరట్ల బంగారు పూత పూసి కళ్లు చెదిరే ప్యాకింగ్‌తో అందిస్తోంది. బంగారు పూత పూసిన ఈ తేయాకును 50 గ్రాముల మొదలుకొని 1 కిలో వరకు ప్యాకెట్లలో అమ్ముతోంది. ఈ తేయాకు తయారు చేసిన తేనీరు బంగారు రంగులో ధగధగలాడుతూ కళ్లు చెదరగొడుతుంది.ప్రస్తుతం దీని ధర కిలో 12,830 డాలర్లు (రూ.10.70 లక్షలు) మాత్రమే! టీడబ్ల్యూజీ కంపెనీ సింగపూర్‌లో రెస్టారంట్‌ను కూడా నిర్వహిస్తున్నా, అక్కడ ఈ బంగారు తేనీటిని అందించరు. కావలసిన వారు ఈ తేయాకు ప్యాకెట్లను కొని తీసుకువెళ్లాల్సిందే!ఇవి చదవండి: ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా? -
భారత సంతతి వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష!
భారత సంతతి వ్యక్తికి సింగపూర్ హైకోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ప్రియురాలిని హతమార్చిన కేసులో కోర్టు ఈ శిక్ష విదించింది. తన ప్రియురాలు మలికా బేగం రహమాన్సా అబ్దుల్ రెహమాన్‌ని జనవరి 17, 2018 తీవ్రంగా గాయపరిచి హతమార్చాడు. ఈ నేరాన్ని కృష్ణ కోర్టు ఎదుట అంగీకరించాడు. అంతకుమునుపు 2015లో కృష్ణన్ గృహహింస కేసులో అరెస్టు అవ్వడం జరిగింది. తీరు మార్చుకుంటానని చెప్పి విడుదలయ్యాక కూడా అతడి నేర ప్రవృత్తి మానుకోలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇలా మహిళలపై పదేపద గృహహింసకు పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కోర్టు స్ఫష్టం చేస్తూ..కృష్ణన్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2015లో కృష్ణన్ భార్య తన భర్త కృష్ణన్ అతడి గర్లఫ్రెండ్ ఇద్దరు కలిసి మద్యం సేవించడాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వెంటనే ఆమె కృష్ణన్ నిలదీయడంతో విస్కీ బాటిల్‌తో కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె కృష్ణన్‌కి క్షమాపణలు చెప్పి ఏం చెయ్యొద్దని బతిమాలుకుంది. ఆ తర్వాత పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి తన గర్లఫ్రెండ్ మల్లికతోనే వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అయితే 2018లో కృష్ణన్ భార్య పెట్టిన గృహహింస కేసులో అరెస్టయ్యి జైలులో ఉన్నాడు. ఆ టైంలోనే అతడి గర్ల్‌ఫ్రెండ్ పరాయి మగవాళ్లతో రిలేషన్ షిప్ పెట్టుకున్న విషయం తెలుసుకుని తీవ్రంగా కలత చెందాడు. దీంతో ఫుల్‌గా మద్యం తాగి జనవరి 19 2015న మల్లికపై దారుణంగా దాడి చేసి హతమార్చాడు. ఆ రోజు సాయంత్రమే సింగపూర్ ఢిపెన్స్కి కాల్ చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడు తరఫు న్యాయవాది గర్లఫ్రెండ్ మోసాన్నీ జీర్ణించుకోలేక మద్యం మత్తులో చేసిన అఘాయిత్యమని వాదించారు. పైగా తన క్లయింట్ వీక్ఆఫ్ల్లోనే సరదాగా తాగుతుంటాడని చెప్పారు. అయితే కోర్టు మద్యం మత్తులో చేసిన పనే అయినా, ఆ హింస చాలా తీవ్రంగా ఉందని, మహిళల పట్ల ఇలాంటి వాటిని ఉపేక్షించమని పేర్కొంది. అలాగే ఇక్కడ అతడి గర్ల్‌ఫ్రెండ్ జీవించి లేనందున ఆమె పరాయి వాళ్లతో సంబంధం పెట్టుకుందన్న కారణంగా చేసిన నేరంగా పరిగణలోని తీసుకోలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. ఇక్కడ నిందితుడు బాధితురాలి పట్ల చాలా హింసాత్మకంగా ప్రవర్తించి హతమార్చాడు, పైగా పోస్ట్‌మార్టం రిపోర్టులో తీవ్ర గాయాలు కారణంగానే బాధితురాలు మరణించిందని వెల్లడయ్యిందని పేర్కొంది. స్త్రీల పట్ల ప్రవర్తించిన ఈ హింసాత్మక ప్రవర్తనకు గానూ నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించింది సింగపూర్ హైకోర్టు. (చదవండి: US: ఐసీఈ కస్టడీలో ఉన్న భారత సంతతి వ్యక్తి మృతి!) -
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను సెంగ్ కాంగ్‌లోని అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ క్రోధి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ వేడుకల్లో బాగంగా పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఆ తరువాత సింగపూర్ స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేకంగా వ్రాయించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ గంటల పంచాంగాన్ని ప్రముఖ జ్యోతిష పండితులు, పంచాంగ కర్తలు కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు, మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ గార్లు సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 500 వరకు ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు ఇతర రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి పులిహోర మొదలగు ప్రసాదం పంపిణి చేయడం జరిగింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నంగునూరి సౌజన్య, జూలూరు పద్మజ, మాదారపు సౌజన్య, దీప నల్లా మరియు బసిక అనిత రెడ్డి, వ్యవరించారు. ఈ ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు, అలాగే ప్రసాదానికి సహాయం అందించిన దాత లకు, స్పాన్సర్సకు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ వేడుకలు ఇంతలా ఘనంగా జరగడానికి చేయూతనందించిన మై హోమ్ కంస్ట్రక్షన్ వారికి, చమిరాజ్ రామాంజనేయులు (టింకర్ టాట్స్), మన్నము శ్రీమాన్ (గరంటో అకాడమీ), రాజిడి రాకేష్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉగాది వేడుకల్లో పప్పు దుర్గా శర్మ గారి వద్ద సాంప్రదాయ నృత్యం నేర్చుకుంటున్న విద్యార్థులు రామిరెడ్డి శ్రేష్ఠ రెడ్డి, శ్రీవర్షిత రెడ్డి బండి, కంభంపాటి సాయి శాన్వి, లేష్ణ లలిత అన్నం, దేవగుప్తపు సమన్విత, కుప్పం వైష్ణవి సహస్ర, కొండపల్లి చిశితలు అష్టలక్ష్మి, దేవ దేవం భజే కీర్తనలతో ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. (చదవండి: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ!) -
సింగపూర్‌లో తమిళ భాష వైభవం.. ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!
పరాయి దేశాల్లో మన భాషకు ప్రాముఖ్యత ఇస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. అక్కడ విద్యా విధానంలో మన భాషలకు ప్రాధాన్యం ఇస్తే.. ప్రతి భారతీయ పౌరుడిగా సగర్వంగా అనిపిస్తుంది. సింగపూర్ దేశంలో అలాంటి అద్భుత సన్నివేశమే చోటు చేసుకుంది. సాక్షాత్తు ఆ దేశ మంత్రి అందుకు నడుబిగిస్తే అది మాములు విషయం కాదు కదా. ఏం జరిగిందంటే..సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మంత్రి ఇంద్రాణి రాజా తమిళ భాష ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సంపన్న నగర రాష్ట్రంలో నాలుగు అధికారిక భాషల్లో ఒక దానిని చిన్నారులకు పరిచయం చేయాల్సిన అవసరం గురించి తెలిపారు. అక్కడ సింగపూర్ విద్యా విధానం హిందీ, ఉర్దూ, పంజాబీ, వంటి ఇతర ప్రధాన భారతీయ భాషల తోపాటు తమిళం, మలయాళమ్, చైనీస్(మాండరిన్) వంటి భాషలను పాఠశాలల్లో సెకండ్ లాగ్వేజ్గా ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ఇంద్రాణి రాజా సింగపూర్ ప్రధాన మంత్రి కార్యాలయంలో మాట్లాడుతూ..తమిళ భాష ఇక్కడ ఉండే భారతీయ ప్రజలందర్నీ కలిపే పాస్‌పోర్ట్‌గా పనిచేస్తుంది. దాన్ని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత మనది కాబట్టి దాన్ని పాఠ్యాంశంగా పిల్లలు నేర్చుకోవాలని అన్నారు. కేవలం చదువుగానే గాక వాడుకలో కూడా ఆ భాషను వినియోగించాలన్నారు. చిన్నప్పటి నుంచి చిన్నారులు మాతృభాషను ఉపయోగిస్తున్నంత కాలం ఏ భాష అయిన సజీవంగానే ఉంటుందన్నారు. అంతేగాదు సింగపూర్‌లో తమిళ భాషా వారసత్వాన్ని నిలబెట్టేందుకు తమిళ భాషా మండలి(టీఎల్సీ) గత 18 ఏళ్లుగా తమిళ భాషా ఉత్సావాన్ని(టీఎల్ఎఫ్) నిర్వహిస్తోంది. గత శనివారమే ఈ టీఎల్ఎఫ్ని ప్రారంభించారు. ప్రతి తరం వారి మాతృభాషతో అనుసంధానింపబడి ఉండాలని అదే వారసత్వ సాంస్కృతిక గుర్తింపు అని దాని ప్రాముఖ్యత గురించి చెప్పుకొచ్చారు. 'క్యాపబిల్టీస్' అనే పేరుతో ఈ ఏడాది టీఎల్సీ సింగపూర్‌లో ఈ తమిళ భాషా ఉత్సవాన్ని మార్చి 30 నుంచి ఏప్రిల్ 28 వరకు జరుపుతోంది. ఈ వేడుకల్లో మొత్తం 47 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఇలా సింగపూర్‌లో భారత సంతతి తమిళులు సాముహికంగా వినూత్న కార్యక్రమాలు రూపొందించడానికి ఈ ఏడాది థీమ్‌ను కూడా ఎంచుకున్నట్లు టీఎల్సీ చైర్పర్సన్ ఎస్ మనోగరన్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 65%కి పైగా ఎక్కువ ఈవెంట్లు యువకులచే నిర్వహించనున్నారు. కళ, సంస్కృతి, సాహిత్య కార్యక్రమాల ద్వారా యువతకు తమిళ భాషను చేరువ చేయనున్నట్లు పేర్కొన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా అయినా తమిళ భాషను నేర్చుకోవడం వల్లే కలిగే ప్రయోజనం తెలుసుకోవాలన్నదే తమ ధ్యేయమని అన్నారు మనోగరన్. (చదవండి: US: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!) -
ఎయిరిండియా– విస్తారా విలీనం వేగం!
న్యూఢిల్లీ: విమానయాన దిగ్గజాలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియ వేగమందుకోనుంది. ఇందుకు సింగపూర్ నియంత్రణ సంస్థ కాంపిటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్(సీసీసీఎస్) షరతులతోకూడిన అనుమతులు ఇచి్చనట్లు ఎయిరిండియా చీఫ్ క్యాంప్‌బెల్ విల్సన్ తాజాగా పేర్కొన్నారు. దీంతో రెండు సంస్థలూ తమ షెడ్యూళ్లు, కాంట్రాక్టులు తదితర సవివర సమాచారాన్ని ఇచి్చపుచ్చుకునేందుకు అనుమతి లభించినట్లు తెలియజేశారు. 2022 నవంబర్‌లో ఎయిరిండియాలో విస్తారా విలీన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఎయిరిండియాలో 25.1 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ సొంతం చేసుకోనుంది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలసి సంయుక్త సంస్థ(జేవీ)గా విస్తారాను ఏర్పాటు చేసిన విషయం విదితమే. -
నరకం చూడాలనుకుంటే.. అక్కడకు వెళ్తే చాలు!
మత గ్రంథాల్లో నరకాన్ని గురించిన వర్ణన తప్ప నరకం ఎలా ఉంటుందో చూసినవాళ్లు లేరు. నరకం ఎలా ఉంటుందో చూడాలని ఉంటే సింగపూర్‌లోని ఈ థీమ్ పార్కుకు వెళ్లాల్సిందే! ఇది ప్రపంచంలోనే అత్యంత భయానకమైన థీమ్ పార్కు. ఈ థీమ్ పార్కు పేరు ‘హా పార్ విల్లా’. బయటి నుంచి చూడటానికి ఇది కొంత ఆకర్షణీయంగానే కనిపిస్తుంది గాని, లోపలకు అడుగు పెడితే మాత్రం అడుగడుగునా భయానక దృశ్యాలు ఎదురవుతాయి. బౌద్ధ పురాణాల ప్రకారం నరకంలోని పది న్యాయస్థానాలు, యముడు పాపులను విచారించే దృశ్యాలతో ఉన్న బొమ్మలు, యమభటులు పాపులకు విధించే శిక్షలకు సంబంధించిన శిల్పాలు ఈ పార్కులో కనిపిస్తాయి. వీటిని చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. పాప పుణ్యాల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి బతికి ఉన్నప్పుడు పూర్తిగా మంచి పనులు చేసినవారు బంగారు వంతెనను, చెడు కన్నా మంచి పనులు ఎక్కువగా చేసినవారు వెండి వంతెనను దాటుకుంటూ స్వర్గం వైపు వెళుతున్న బొమ్మలు ఉంటాయి. ఇతరులను దుర్భాషలాడటం, తన్నడం, ఇతరులపై దాడులకు దిగడం, ఆహారాన్ని వృథా చేయడం, పుస్తకాలను దుర్వినియోగం చేయడం, నిస్సహాయులను వేధించడం, అత్యాచారాలు చేయడం, దొంగతనం, దోపిడీలు, హత్యలు చేయడం వంటి పాపాలకు సంబంధించిన బొమ్మలు, భూమ్మీద బతికి ఉన్నప్పుడు ఆ పాపాలకు పాల్పడిన వారు అనుభవించే శిక్షలకు సంబంధించిన బొమ్మలు, పాపాలు చేసిన వారు నరకంలో శిక్షలు అనుభవించాక, తిరిగి భూమ్మీద పుట్టినప్పుడు అనుభవించే దయనీయ పరిస్థితులకు సంబంధించిన బొమ్మలు అత్యంత భయంకరంగా ఉంటాయి. సింగపూర్‌లోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ఇక్కడకు తీసుకొస్తుంటారు. చెడు పనులు చేస్తే పర్యవాసానాలు ఎలా ఉంటాయో పిల్లలకు వివరించడానికి వారిని ఇక్కడకు తీసుకొస్తుంటామని, ఇక్కడి బొమ్మలను చూసేటప్పుడు పిల్లలు భయపడినా, తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని సింగపూర్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. సింగపూర్ వచ్చే పర్యాటకులు కూడా ఈ భూతల నరకాన్ని తిలకించడానికి పెద్దసంఖ్యలో వస్తుంటారు. -
హైదరాబాద్ నుంచి నేరుగా సింగపూర్, కొలంబోలకు ఫ్లైట్స్: ఇండిగో
హైదరాబాద్ నుంచి ఇకపై నేరుగా సింగపూర్, కొలంబోకు వెళ్లేలా ఇండిగో సంస్థ విమాన సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రం నుంచి సింగపూర్, కొలంబోలను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం వల్లనే ఈ నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు ఇండిగో తెలిపింది. వీటిలో హైదరాబాద్-సింగపూర్ల మధ్య సర్వీసులు అక్టోబర్ 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి ఉదయం 2.50 గంటలకు బయలుదేరనున్న 6ఈ-1027 విమాన సర్వీసు సింగపూర్‌కు ఉదయం 10 గంటలకు(సింగపూర్ కాలమాన ప్రకారం) చేరుకోనుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో సింగపూర్‌లో రాత్రి 23.25 గంటలకు(సింగపూర్ కాలమాన ప్రకారం) బయలుదేరి హైదరాబాద్‌కు ఉదయం 1.30 గంటలకు చేరుకోనుంది. హైదరాబాద్-కొలంబోల మధ్య అలాగే నవంబర్ 3 నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు అందుబాటులోకి రానుంది. 6ఈ-1181 విమాన సర్వీస్ హైదరాబాద్ నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరి కొలంబోకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో కొలంబోలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు సాయంత్రం 5 గంటలకు వస్తుంది. అయితే ఈ సర్వీస్ వారానికి నాలుగు రోజులు సోమ, మంగళ, శుక్ర, ఆదివారాల్లో మాత్రమే ఉంటుందని ఇండిగో తెలిపింది. -
హైదరాబాద్ నుంచి మరిన్ని ఫ్లయిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్–సింగపూర్ రూట్లో అక్టోబర్ 29 నుంచి మరిన్ని ఫ్లయిట్లు నడపనున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ జీఎం (ఇండియా) సై యెన్ చెన్ తెలిపారు. ప్రస్తుతం వారానికి ఏడు సరీ్వసులు ఉండగా 12కి పెంచుకోనున్నట్లు వివరించారు. అనుబంధ బడ్జెట్ విమానయాన సంస్థ స్కూట్ నిర్వహించే ఫ్లయిట్స్ స్థానంలో వీటిని నడపనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి సరీ్వసులు ప్రారంభించి 20 ఏళ్లవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్ నుంచి ఫుల్ సరీ్వస్‌లు, కార్గోకు డిమాండ్ పెరిగినట్లు చెన్ చెప్పారు. -
మూడు వసంతాలు పూర్తి చేసుకున్న 'శ్రీ సాంస్కృతిక కళాసారథి'
సింగపూర్ లో " శ్రీ సాంస్కృతిక కళాసారథి" తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 2020 జూలైలో అంకురార్పణ చేసుకున్నఈ " శ్రీ సాంస్కృతిక కళాసారథి" గత మూడు సంవత్సరాల కాలంలో వివిధ రంగాలలో 50కు పైగా విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహించి తృతీయ వార్షికోత్సవ వేడుకలు అద్వితీయంగా జరుపుకుంది. ముఖ్యఅతిథిగా ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డా. రామ్ మాధవ్, విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అర్ధ శతాబ్ది సాంస్కృతికమూర్తి, వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు భారతదేశం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన వాక్కులతో సందేశాలను అందించారు. భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సంస్థను, నిర్వాహకులను అభినందిస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, ప్రఖ్యాత సినీ రచయిత భువనచంద్ర, పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ కూడా సంస్థ కార్యక్రమాలను కార్యదక్షతను అభినందిస్తూ సందేశాలు పంపించారు. ఈ సందర్భంగా సింగపూరు తెలుగు టీవీ వారి ఆధ్వర్యంలో చిన్నారులతో సింగపూరులో నిర్వహిస్తున్న తెలుగు నీతిపద్యాల ఫోటీ ధారావాహిక మొదటి భాగాన్ని జొన్నవిత్తుల గారు వారి అమృతహస్తాల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ, తెలుగు భాషా, భారతీయ సంస్కృతులను నిలబెట్టాలని కంకణ ధారి అయ్యి ప్రపంచంలోని అందరు తెలుగు ప్రముఖులను కలుపుకుంటూ సింగపూరు వేదికగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల పరంపరను కొనసాగిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి వారి బృందం అందరికీ అభినందనలు తెలియచేసారు. వారు రచించిన 'ఆవకాయ శతకము', 'కోనసీమ శతకములలోని' పద్యాలలో కొన్ని ఆలపించి శ్రోతలను ఉర్రూతలూగించారు. "మైకాష్టకం" అంటూ వారు హాస్యభరితంగా చెప్పిన మైకు గురించిన విషయాలు ఆహ్వానితులందరినీ నవ్వులతో ముంచెత్తింది. అలాగే "తెలుగోళ్ళం తెలుగోళ్ళం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళం" అంటూ వారు స్వయంగా రచించి పాడిన పాటకు సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ముఖ్య అతిధి డా. రామ్ మాధవ్ ప్రసంగంలో ఒక మంచి దృఢ సంకల్పంతో సంస్థను స్థాపించి, సమాజానికి, భాషకు, సంస్కృతికి సేవచేయాలనే పట్టుదలతో ప్రయత్నం చేస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ మరో వందేళ్ళు పాటు ఇలా తెలుగులు విరజిల్లుతూ వృద్ధిచెందాలని ఆశీస్సులు అందించారు. భారతీయత తెలుగుదనము మేళవించిన ఒక మంచి సమాజాన్ని తెలుగు రాష్ట్రాలలో నిలబెట్టాలని అలా నిలబెట్టేలా కృషిచేస్తున్న ఈ శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు అదే లక్ష్యంతో పనిచెయ్యడం చాలా సంతోషదాయకం అని అన్నారు. సమాజం తన కాళ్ళ మీద తాను నిలబడాలని, తనను తాను నడిపించుకోవడమే భారత ఆత్మనిర్భరత అని అదే సాహిత్యం, కళా రూపాల యొక్క లక్ష్యం కావాలని వివరించారు. కళలు, సాహిత్యం భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తాయని, ప్రపంచం ముందు భారతదేశాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది అని వ్యాఖ్యానించారు. "భగవంతుని అనుగ్రహంతో, పెద్దల దీవెనలతో, అందరి ప్రోత్సాహ సహకారాలతో, మూడు సంవత్సరాల మా ఈ ప్రయాణంలో మీ అందరి మన్ననలను పొందడం మా సంస్థ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. మా ఈ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలిపిన అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము" అని సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు కార్యక్రమం ఆద్యంతం ఎంతో చక్కగా జరిగింది అని, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అత్యద్భుతంగా ఉన్నాయని పలువురు ప్రశంసించారు. 400 మంది ప్రత్యక్షముగా మరియు 1200 మందికి పైగా ఆన్లైన్ వీక్షించడం జరిగిందని నిర్వాహుకులు తెలిపారు. రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించగా, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సింగపూర్ లో నివసించే కళాకారులచే కూచిపూడి కథక్ జానపద నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య సంకీర్తనాలాపన, తెలుగు పద్య పఠనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, వంశీ కృష్ణ శిష్ట్లా సాంకేతిక నిర్వహణా బాధ్యతలు అందించగా, కుమార్, మోహన్, మౌక్తిక, సునీత, రాధికా, రాజి, రేణుక మరియు ప్రసన్న తదితరులు వాలంటీర్ గా సహకారము అందించారు. జీఐఐఎస్, టింకర్ టాట్స్ మొంటోసిరి, కవ్ అండ్ ఫార్మర్ ఈగ జ్యూస్, శబ్ద కాన్సెప్ట్స్, ఎస్ఎన్ఎం డెవెలెపేర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ (భీమవరం), టెర్రాన్ స్పేస్ (హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీ), ప్రొపెనెక్స్ రాజశేఖర్ ఆర్ధిక సహకారం అందించారు. (చదవండి: ఆధ్యాత్మిక గురువు రవి శంకర్‌కు 'అరుదైన గౌరవం') -
అవినీతి కేసు పీకల్లోతులో చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ఈశ్వరన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబును నమ్ముకున్న ఏ ఒక్కరూ సక్రమమైన దారిలో నడిచినట్టు చరిత్రలో లేదు. అమరావతిని బాహుబలి సినిమాలో మాదిరిగా రూపొందిస్తానంటూ సింగపూర్ బృందాన్ని విజయవాడలో దింపి.. ఠక్కుఠమార విద్యలన్నీ ప్రదర్శించిన బాబు డొల్లతనం ఇప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతో బయటపడుతోంది. చంద్రబాబుతో కలిసి అమరావతిని ఏదో చేస్తామని చెప్పిన సింగపూర్ బృంద నాయకుడు ఈశ్వరన్ ఇప్పుడు కీలక నేరాల్లో చిక్కుకుని పదవికి దూరమయ్యారు. ఇక్కడి సిబిఐని మేనేజ్ చేసుకుని కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు.. ఇప్పుడు సింగపూర్ లో CBIకి సమానమై CPIB ని ఈశ్వరన్ కోసం ఏ రకంగా ప్రభావితం చేస్తాడో చూడాలి. బాబు పార్ట్ నర్ ఈశ్వరన్ అసలు రూపం ఇది ఈశ్వరన్ సింగపూర్ దేశంలో రవాణాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీగా నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. అయితే ఈ కేసు తీవ్రత ఏంటీ? ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాలేంటీ? దేశానికి ఏ రకంగా నష్టం జరిగింది? అన్న వివరాలను అక్కడి దర్యాప్తు సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ఇది ఒక హైప్రొఫైల్ కేసు అని, అత్యంత కీలక అంశాలతో ముడిపడి ఉన్న విషయమని సింగపూర్ వర్గాల సమాచారం. అందుకే ఈశ్వరన్ ను విచారించేందుకు అక్కడి దర్యాప్తు సంస్థ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CPIB) ప్రధానిని అనుమతి అడగ్గానే ఆయన స్పందించారు. ఈశ్వరన్ ను అధికారికంగా విచారిస్తామంటూ డైరెక్టర్ డెనిస్ టాంగ్ ప్రధాని లీ అనుమతిని కోరారు. ఈ నేపధ్యంలో తాను జూలై 6న సీపీఐబీ డైరెక్టర్‌కి సమ్మతి తెలిపానని, ఆ తర్వాత అధికారిక విచారణ జూలై 11న ప్రారంభమైందని ప్రధాన మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. విచారణ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలని మంత్రి ఈశ్వరన్‌ను ఆదేశించినట్లు ప్రధాని లీ తెలిపారు. On 5 July, Director CPIB briefed me on a case and sought my concurrence to open a formal investigation. Minister S Iswaran is assisting with investigations and will take a leave of absence. SMS Chee Hong Tat will be Acting Minister for Transport. – LHL https://t.co/0ut4SRoTfG — leehsienloong (@leehsienloong) July 12, 2023 ఎవరీ ఈశ్వరన్ అమరావతి విషయంలో ఎన్నో కొత్త విషయాలను తెరమీదికి తెచ్చారు చంద్రబాబు. అందులో ముఖ్యమైంది రైతుల భూమిని సేకరించి అభివృద్ధి చేసి మళ్లీ ఇస్తానని. ఇందులో భాగంగా సింగపూర్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించారు. మే 17, 2017న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై నాటి చంద్రబాబు ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి స్టార్టప్ ఏరియాకు మందడం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరిపి MOUలో భాగంగా సింగపూర్ కంపెనీలకు 1691 ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. అమరావతి భూములను అభివృద్ధి చేసినందుకు సింగపూర్ ప్రభుత్వానికి 58% వాటా, ఏపీ ప్రభుత్వానికి 42% వాటా ఉంటుందని బాబు చెప్పారు. ఈ సింగపూర్ కన్సార్టియానికి మంత్రి ఈశ్వరన్ నేతృత్వం వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇంకేముంది విడతల వారీగా సింగపూర్ బృందాలు విజయవాడ రావడం, ప్రతీ నెలా సమావేశాలు పెట్టడం.. అదిగో ఇదిగో అంటూ రకరకాల ఊహాచిత్రాలను విడుదల చేయడం జరిగింది. అయిదేళ్లలో చంద్రబాబు గానీ, ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియం గానీ చేసిందేమీ లేదు. "Director of the Corrupt Practices Investigation Bureau (CPIB) briefed me on a case CPIB had uncovered... This would involve interviewing Minister S Iswaran, among others... I have instructed Minister Iswaran to take leave of absence until these investi... https://t.co/KkMSp0rhB2 — The Independent Singapore (@IndependentSG) July 12, 2023 2019లో ఏం తేలింది? 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. అదే సమయంలో 151 స్థానాల్లో ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి ఒప్పందం గురించి పరిశీలించగా.. అసలు ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియానికి సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. సింగపూర్ లోని కొన్ని సంస్థలు కలిసిందే కన్సార్టియం తప్ప చంద్రబాబు అప్పటివరకు చెప్పినట్టు సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని తేలింది. (చదవండి : కన్సార్టియం పేరిట బాబు అక్రమాలు ఇవి) ‘పక్షపాతం లేకుండా దర్యాప్తు’ ఒక మంత్రిగా ఉన్న ఈశ్వరన్ మీద ఆరోపణలు రావడంతో అక్కడి దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవాలను వెలికితీయడానికి, సత్యాన్ని నిరూపించడానికి, చట్టబద్ధమైన పాలనను సమర్థించడానికి, దృఢ సంకల్పంతో ఈ కేసును దర్యాప్తు చేస్తామని పేర్కొంది. CBIP చేపట్టే అన్ని కేసులను పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తుందని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడే పార్టీలపై చర్య తీసుకోవడానికి వెనుకాడదని ఆ ప్రకటనలో పేర్కొంది. మరో వైపు ఈశ్వరన్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులను కూడా సీపీఐబీ విచారిస్తుందని ప్రధాన మంత్రి లీ సియన్ లూంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూరో బయటపెట్టిన ఒక కేసుకు సంబంధించి ఇటీవల సీబీఐబీ డైరెక్టర్ తనకు సమాచారం అందించారని ప్రధాని లీ చెప్పారు. Singapore PM asks country's Transport Min Iswaran to go on leave after he was linked in the corruption case. Why should TN CM not follow this in Fmr Liq Min #SenthilBalaji's case? pic.twitter.com/ZtfAFfWyCP — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) July 12, 2023 ఈశ్వరన్ రాజకీయ జీవితం.. మంత్రి ఈశ్వరన్ రాజకీయ జీవితం 1997లో వెస్ట్ కోస్ట్ GRCకి పార్లమెంటు సభ్యునిగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుండి ప్రారంభమయ్యింది. 26 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2006లో క్యాబినెట్లోకి ప్రవేశించకముందు అనేక ప్రభుత్వ పార్లమెంటరీ కమిటీలలో సభ్యనిగా కొనసాగారు. సెప్టెంబర్ 2004 నుండి జూన్ 2006 వరకు పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. మే 2021 నుండి రవాణా మంత్రిగా ఉన్నారు. మే 2018 నుండి వాణిజ్య సంబంధాల ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మంత్రి ఈశ్వరన్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖలలో మంత్రి పదవులను కూడా నిర్వహించారు. మే 2011 నుండి సెప్టెంబర్ 2015 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో మంత్రిగా కూడా ఉన్నారు. రాజకీయాలలో ప్రవేశించక ముందు ఈశ్వరన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పాటు టెమాసెక్ హోల్డింగ్స్‌తో సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేశారు. ఈశ్వరన్ ను పక్కకు తప్పించడంతో ఆయన బాధ్యతలను సింగపూర్ సీనియర్ మంత్రి చీ హాంగ్ టాట్ పర్యవేక్షిస్తారని ప్రధాని తెలిపారు. Singapore PM asks country's Transport Min Iswaran to go on leave after he was linked in the corruption case. Why should TN CM not follow this in Fmr Liq Min #SenthilBalaji's case? pic.twitter.com/ZtfAFfWyCP — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) July 12, 2023 ఇది కూడా చదవండి: ‘శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు.. రక్తమోడుతున్న చీరతో’.. -
సింగపూర్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
సాక్షి, సింగపూర్/ హైదరాబాద్: ఆగస్టు 6వ తేదీన సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని సింగపూర్‌లోని ప్రవాస తెలుగు వారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెకీలకు సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ పిలుపునిచ్చారు. మహాసభలకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ కుమార్ మఖ్తల నాయకత్వంలోని బృందానికి హామీ ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వ సహకారం అందించేందుకు కృషి చేస్తానని సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ భరోసా ఇచ్చారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల నాయకత్వంలోని బృందం నేడు కుమరన్‌తో సమావేశం జరిపింది. ఈ సందర్భంగా తెలుగు ఐటీ పరిశ్రమకు చెందిన నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు, టెక్నోక్రాట్స్ ఇటు పరిశ్రమ అభివృద్ధి అటు స్వరాష్ట్రంలో పెట్టుబడులు అనే అంశంపై విస్తృత అవకాశాలు అందించేందుకు సింగపూర్‌లో అంతర్జాతీయ మహాసభలను నిర్వహిస్తున్న విషయాన్ని బృందం వివరించింది. దాదాపు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్న ఈ మహాసభ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సత్తాను చాటి చెప్పనున్నారని పేర్కొంటూ, తెలుగు రాష్ట్రాలు ప్రవేశ పెట్టిన ముఖ్యమైన విధానాలు, నిర్ణయాలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. టెక్నికల్ ప్రజెంటేషన్, థాట్ ప్రొవొకింగ్ డిస్కషన్స్ వంటివి ఈ మహాసభల్లో భాగం చేయడం వల్ల కేవలం ప్రొఫెషనల్ నెట్వర్క్ విస్తరించుకోవడమే కాకుండా వారి సాంకేతిక పరిజ్ఞానం సైతం పెంపొందించుకునే అవకాశం దక్కుతుందని వెల్లడించింది. సింగపూర్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ తమ పూర్తి మద్దతు ఇస్తామని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల నాయకత్వంలోని బృందానికి హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు, ఇండియాకు, సింగపూర్‌కు మధ్య అనుసంధానత కల్పించనుందని సంతోషం వ్యక్తం చేశారు. సింగపూర్‌లోని తెలుగు టెక్నోక్రాట్స్ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని భాగం చేస్తామని, సింగపూర్ ఐటీ మంత్రిని పాల్గొనేలా తాను సహకరిస్తామని హైకమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఫ్లయర్‌ను సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్, ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు రాకేష్, సింగపూర్ మండలి సభ్యులు కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాటా విమెన్ ఫోరమ్) -
అమరత్వం అంటే అదే!..చనిపోయిన ప్రజల గుండెల్లోనే..
దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డిగారి 74వ జయంతిని పురష్కరించుకుని సింగపూర్ లోని ఎన్నారైలు సింగపూర్ వైఎస్సార్సీపీ అడ్వైసర్ కోటి రెడ్డి, సింగపూర్ వైఎస్సార్సీపీ కన్వీనర్ మురళి కృష్ణ ఆద్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైన వైఎస్సార్ అభిమానులు పాలుపంచుకొన్నారు. వైస్సార్ గారు చేసిన మంచి పనులను నెమరు వేసుకున్నారు. ఎంత మంది సీఎం లు పాలించిన కూడా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో కొలువైనారని, నిజమైన అమరత్వం అంటే ఇదే అని పలువురు కొనియాడారు. (చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు) -
ఎయిర్‌లైన్స్‌లో కొత్త రూల్! గర్భిణి క్యాబిన్ సిబ్బంది కూడా...
ఎయిర్‌లైన్స్ గర్భిణి క్యాబిన్ సిబ్బందిని విధుల నుంచి తొలగించనని చెబుతుంది. వారు ఉద్యోగం కొనసాగించేలా ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా ఇచ్చింది. అంతేగాదు డెలిరీ అయినా తర్వాత కూడా యథావిధిగా ఉద్యోగాన్ని కొనసాగించవచ్చని కూడా స్పష్టం చేసింది. గత కొంతకాలంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌పై పలు విమర్శులు ఉన్నాయి. లింగ సమానత్వం పాటించడం లేదని గర్భిణి క్యాబిన్ సిబ్బందిని నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. అంతేగాదు వారిని ప్రెగ్నెన్సీ సమయంలో బలవంతంగా వేతనం లేని సెలవుల్లో ఉంచి, తదనంతర డెలివరీ తర్వాత పిల్లల బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వారిని విధుల నుంచి తొలగిస్తుంది. దీనిపై సర్వత్ర విమర్శలు రావడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ కొత్త రూల్‌ని అమలు చేయనుంది. ఇక నుంచి గర్భణి క్యాబిన్ సిబ్బందిని తొలగించమని చెబుతోంది. అంతేగాదు గర్భిణి క్యాబిన్ సిబ్బంది తాత్కాలికంగా గ్రౌండ్ అటాంచ్మెంట్ పని చేసుకోవచ్చని, ప్రశూతి సెలవుల అనంతరం తిరిగి విధులు నిర్వర్తించ వచ్చని పేర్కొంది. ఈ మహమ్మారి కారణంగా సిబ్బంది కొరత సమస్యను ఎదుర్కొనడంతో ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ గర్భిణి సిబ్బంది మూడు నుంచి తొమ్మిది నెలలు గ్రౌండ్ ప్లేస్మెంట్లో విధులు నిర్వర్తించవచ్చు అని తెలిపింది. అలాగే ప్రతిభావంతులైన తమ సిబ్బందిని వదులుకోమని కూడా పేర్కొంది. అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ యాక్షన్ అండ్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొరిన్నా లిమ్ ప్రసవానంతరం తల్లులు విమాన ప్రయాణం చేయకుండా మరైదైన బాధ్యతలు అప్పగించే అవకాశం లేదా అని ప్రశ్నించారు. అంతేగాదు ఈ కొత్త రూల్ కచ్చితంగా అమలవుతుందా అని కూడా ఎయిర్‌లైన్స్‌ని నిలదీశారు. ఐతే సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ విషయంపై ఇంకా స్పందించ లేదు. (చదవండి: కొట్టుకువచ్చిన... 500కి పైగా భారీ తిమింగలాలు) -
గోటబయకు ఊరట... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సింగపూర్!
కొలంబో: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆందోళనకారులు చేసిన నిరసనల నడమ లంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన మాల్దీవులు అక్కడ నుంచి సింగపూర్‌కు పరారయ్యారు. ఐతే గోటబయకు సింగపూర్ ఆశ్రయం ఇచ్చిందంటూ వార్తలు గుప్పుమనడంతో వాటన్నింటిని సింగపూర్ అధికారులు ఖండించారు. లంక మాజీ అధ్యక్షుడు ఆశ్రయం కోరనూలేదూ, తాము ఆశ్రయం ఇవ్వనూలేదని తెగేసి చెప్పింది. అది గోటబయ వ్యక్తి గత పర్యటన అని నొక్కి చెప్పింది. ఈ క్రమంలో సింగపూర్ ఇమిగ్రేషన్ అధికారులు మీడియా సమావేశంలో తాజాగా గోటబయకు స్వల్పకాలిక సందర్శన పాస్ మంజూరు చేసినట్లు పేర్కొంది. సింగపూర్పర్యటన నిమిత్తం వచ్చే పర్యాటకులకు ఇక్కడ బస చేసేందుకు సాధారణంగా 30 రోజుల వ్యవధితో కూడిని ఎస్టీవీపీ జారీ చేయబడుతుందని తెలిపారు. ఒకవేళ పొడిగించుకోవాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులబాటు కూడా ఉంది. గతవారం ఆశ్రయం ఇవ్వలేదన్న సింగపూర్ ఇప్పుడు మాటమార్చి పర్యటన పాస్ మంజూరు చేశామని చెప్పడం గమనార్హం. (చదవండి: శ్రీలంకలో మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన) -
గర్లఫ్రెండ్ పై పైశాచిక దాడి... జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు
Indian-Origin Malaysian Jailed: పార్తిబన్ అనే భారతీయ సంతతికి చెందిన మలేషియన్‌కి సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. పార్తిబిన్ తన గర్లఫ్రెండ్‌ని పదేపదే భయబ్రాంతులకు గురిచేసేలా బెదిరించి పైశాచికంగా దాడి చేయడంతో ఈ శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాదు పార్తిబిన్ తన సహోద్యోగురాలితో గత రెండు, మూడు సంవత్సారాలుగా డేటింగ్లో ఉన్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జేమ్స్ ఎలిషా మాట్లాడుతూ...అతని ప్రవర్తన తీరు నచ్చాక అతనికి దూరంగా వచ్చేసి ఆమె తన మేనమామతో కలిసి ఉంటోంది. దీంతో అతను ఆమె పై పదే పదే భయబ్రాంతులకు గురిచేసేలా దాడి చేయడం ప్రారంభించాడు. ఆమెను అసభ్య పదజాలంతో దూషించి కొట్టడంతో ఆమె మేనమామ కలగజేసకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. అయిన అతను వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెయిల్ పై వచ్చి మళ్లీ ఆమె మేనమామ ప్లాట్ వద్దకు వచ్చాడు. ఐతే ఆమె నిరాకరిచడంతో గేట్ పగలుగొట్టి వచ్చి మరీ ఆమెను దారుణం హింసించి కారులో తీసుకుపోయేందకు యత్నించాడు. ఐతే ఆమె అక్కడ ఉండే స్థానికులను సాయంతో పోలీసులను రప్పించి అరెస్టు చేసింది. మళ్లీ బెయిల్ పై వచ్చి ఈ సారి ఏకంగా చంపేందకు పథకం వేశాడు. అందులో భాగంగా తన వస్తువులు తీసకునేందుకు వచ్చానంటూ ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చాడు. ఆ తర్వాత ఆమెను కత్తితో బెదిరించి హింసించడం మొదలు పెట్టాడు.ఇక తట్టుకోలేక ఆమె చచ్చిపోదాం అనుకుంటుండగా...ఇంతలో ఒక పోలీస్ కారు అటువైపుగా వెళ్తుండటంతో ఆమె వారి సాయం కోరింది. దీంతో పార్తిబన్ వెంటనే అప్రమత్తమైన తప్పించుకునేందకు యత్నించాడు. కానీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. అతను విచారణలో అతనిపై మోపబడిన ఆరోపణలన్నింటిని అంగీకరించాడని చెప్పారు. ఇలా అతను తన ప్రేయసిని పదేపదే పైశాచికంగా హింసించి హత్య చేసేందుకు యత్నించినందుకు గానూ ఏడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. ఐతే బాధితురాలి తరుపు న్యాయవాది ఆమెను గాయపరిచి, తీవ్రంగా హింసించినందుకుగానూ పార్తిబన్‌కి ఏడు నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష విధించాలని కోరడంతో అతనికి రెండు నుంచి మూడేళ్లు జైలు శిక్షతో పాలు జరిమాన కూడా విధించే అవకాశ ఉందంటున్నారు అధికారులు. (చదవండి: అఫ్గనిస్తాన్‌లో మళ్లీ భూకంపం.. ఇంకా శవాల దిబ్బలుగానే..) -
అట్టహాసంగా ‘స్వర్ణవంశీ-శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారాలు 2022’ కార్యక్రమం
"వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ ఇండియన్" & "శుభోదయం" గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై ప్రతిష్టాత్మక "స్వర్ణ వంశీ శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారాలు 2022" కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. "ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల నుంచి 37 మంది మహిళా మణులు ఈ అవార్డుకు ఎంపికయ్యారని, 50 సంవత్సరాల వంశీ సంస్థ ఈ సంవత్సరం స్వర్ణోత్సవాలు జరుపుకోబోతున్న సందర్భంగా, అంతర్జాతీయంగా సాహిత్య, సంగీత, సాంస్కృతిక, సేవా రంగాలలో రాణిస్తున్న వివిధ దేశాలలో ఉన్న తెలుగు మహిళల కృషి & సేవలకు గుర్తిస్తూ ఈ పురస్కారాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని" వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, యమ్.ఎల్.సి సురభి వాణీదేవి, ప్రముఖ సినీకవి భువనచంద్ర, శుభోదయం చైర్మన్ డా కలపటపు లక్ష్మీప్రసాద్, సింగపూర్ నుంచి కవుటూరు రత్నకుమార్ తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతలకు తమ అభినందనలు తెలియజేశారు. రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక నిర్వహణలో ప్రత్యేకమైన విజువల్ ఎఫెక్ట్స్'తో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది. భువనచంద్ర ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని, పురస్కార విజేతల పేర్లను జతపరచి చక్కటి పాటను రాసి బాణి కూర్చి పాడి వినిపించడంతో అందరూ చాలా ఆనందించారు. రాధిక మంగిపూడి, కాత్యాయని గణేశ్న, సింగపూర్ నుండి, శ్రీలత మగతల, డా పద్మ మల్లెల, న్యూజిలాండ్ నుండి, విజయ గొల్లపూడి, రమ కంచిభొట్ల ఆస్ట్రేలియా నుండి, బొంతల శ్రీలక్ష్మీ రమేష్ బాబు యుగాండా నుండి జయ పీసపాటి హాంకాంగ్ నుండి సత్యాదేవి మల్లుల మలేషియా నుండి, దీపిక రావి సౌదీ అరేబియా నుండి, ఫణి కళ్యాణి కొండూరు, రాజారమాపద్మజ ఉసిరికల, వర్ధని దేవి పాలగిరి, శ్రీవాణి అరికరేవుల ఖతార్ నుండి, శ్రీదేవి దాచేపల్లి, ఒమాన్ నుండి, డా. భారతి చాపరాల, కందుకూరి భారతి, వింజమూరి రాగసుధ యూ.కె నుండి, వడ్డాది రవళి, ఫిన్లాండ్ నుండి, రమ్య కృష్ణ, నెథర్లాండ్స్ నుండి, సాయి స్వాతి గురయ్య, మారిషస్ నుండి, శ్రావణి రెడ్డి పెట్లూరు దక్షిణాఫ్రికా నుండి, సుధ కామేశ్వరి వేమూరి కెనడా నుండి, అమెరికా నుండి లలితా రామ్, డా. శారదా పూర్ణ శొంఠి, శారద కాశీవజ్ఝల, మణి శాస్త్రి, రాధిక నోరి, డా. నాగేశ్వరి కృష్ణారెడ్డి, తేలుకుంట్ల జయశ్రీ, శ్రీదేవి జాగర్లమూడి, గుణసుందరి కొమ్మారెడ్డి, రాధ కాశీనాథుని, శారదా సింగిరెడ్డి, సుజాత వెంపరాల, మంజు భార్గవ, రమా కుమారి వనమా ఈ పురస్కారాలు అందుకున్నారు. -
Jio Vs Airtel: తగ్గేదె లే అంటున్న ఎయిర్టెల్..!
కొద్ది రోజుల క్రితం వరకు టెలికాం రంగంలో పోటీపడుతున్న దిగ్గజ కంపెనీలు టెలికాం జియో, ఎయిర్టెల్ ఇప్పుడు మరో రంగంలో పోటీ పడేందుకు సిద్ద పడుతున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ చేస్తూ జియో సముద్ర మార్గానా ఇంటర్నెట్ కేబుల్ నిర్మాణాల్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నిర్మాణాలు త్వరలో మాల్దీవ్లోని హుల్ హుమలే ప్రాంతం వరకు కనెక్ట్ చేసేందుకు సిద్ద పడుతుంది. అయితే, ఎయిర్టెల్ కూడా జియోకి పోటీగా సముద్ర మార్గానా ఇంటర్నెట్ కేబుల్ నిర్మాణ పనుల్ని చేపట్టేందుకు సిద్ద పడుతుంది. ఏంటి ఈ సీ-ఎంఈ-డబ్ల్యుఈ-6 ప్రాజెక్టు: వేగంగా అభివృద్ధి చెందుతున్న డీజీటల్ ఆర్థిక వ్యవస్థకు సేవలందించే తన హైస్పీడ్ గ్లోబల్ నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా 'సీ-ఎంఈ-డబ్ల్యుఈ-6(SEA-ME-WE-6)' అండర్ సీ కేబుల్ కన్సార్టియంలో చేరినట్లు భారతి ఎయిర్టెల్ తెలిపింది. సీ-ఎంఈ-డబ్ల్యుఈ-6లో "ప్రధాన పెట్టుబడిదారు"గా పాల్గొంటున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. ఈ అండర్ సీ కేబుల్ వ్యవస్థ నిర్మాణానికి కావాల్సిన మొత్తం పెట్టుబడిలో 20 శాతం పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. సీ-ఎంఈ-డబ్ల్యుఈ-6లోని మరో 12 కన్సార్టియం సభ్యుల్లో బంగ్లాదేశ్ సబ్ మెరైన్ కేబుల్ కంపెనీ, ధియాగు(మాల్దీవులు), జిబౌటీ టెలికామ్, మొబిల(సౌదీ అరేబియా), ఆరెంజ్ (ఫ్రాన్స్), సింగ్ టెల్ (సింగపూర్), శ్రీలంక టెలికామ్, టెలికామ్ ఈజిప్ట్, టెలికోమ్ మలేషియా, టెలిన్ (ఇండోనేషియా) ఉన్నాయి. SEA-ME-WE-6 ప్రాజెక్టులో భాగంగా ఫ్రాన్స్ నుంచి అన్నీ దేశాలను కలుపుతూ సింగపూర్ వరకు అండర్ సీ కేబుల్ నిర్మాణం చేపడుతారు. దీని పొడవు 19,200 కిలోమీటర్లు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సముద్రగర్భ కేబుల్ వ్యవస్థలో ఇది ఒకటిగా నిలవనుంది. SEA-ME-WE-6 వల్ల ఎయిర్టెల్ గ్లోబల్ నెట్‌వర్క్‌కు అదనంగా 100 టీబీపీఎస్ సామర్ధ్యం సమకూరనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎయిర్టెల్ ఇతర భాగస్వాములతో కలిసి సింగపూర్ - చెన్నై - ముంబై మధ్య నాలుగు ఫైబర్ పెయిర్ నిర్మించనుంది. (చదవండి: ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన కంపెనీ..!) -
సింగపూర్‌లో సంబరాల సంక్రాంతి
సింగపూర్ తెలుగు సమాజం అనాదిగా నిర్వహించే సంక్రాంతి సందడి ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించింది. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం, ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా మన ఊరి పండుగ వాతావరణం ప్రతిబింబించేలా నిర్వహించారు. కోవిడ్ నిబంధనల కారణంగా భోగి పండుగకు రేగుపండ్ల ప్యాకెట్స్ ని ఉచితంగా పంపిణీ చేయలేకపోయారు. వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమాన్ని సుమారు 5000 మంది వరకు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలు సింగపూర్ లో నివసిస్తున్న బాలబాలికలు, యువతీ యువకులచే వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిచడమే కాకుండా, మహిళలచే రంగవల్లులు, చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి, కార్యక్రమ వీక్షకుల అభిప్రాయసేకరణతో విజేతలకు బహుమతులు అందజేశారు. సింగపూర్ క్యాలెండర్ ఈ సంబరాలలో సింగపూర్ కాలమానంలో గుణించిన సింగపూర్ తెలుగు 2022 క్యాలెండెర్ ను ఆవిష్కరించారు. ఆంగ్లం ఉపయోగించకుండా తెలుగులో మాత్రమే మాట్లాడే కార్యక్రమం తెలుగు పలుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం అన్ని వయస్సుల వారిని ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతికి పట్టుగొమ్మలు , అచ్చతెలుగు సంక్రాంతికి ఆలవాలమైన తెలుగు రాష్ట్రాల పల్లెల్లో పండుగను వీడియో ద్వారా చూపించి అందరి మన్ననలను పొందారు. ఆటపాటల విజేతలకు తెలుగు సమాజం తరఫున బహుమతులు అందజేశారు. విజేతల ప్రకటన సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.., తెలుగు వారందరికీ సంక్రాతి శుభాకాంక్షలతో తెలిపారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన లక్ష్మీ నారాయణ, అనిత రెడ్డి, మైత్రి, సౌందర్య, రాఘవలతో పాటు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన స్వాతిలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్రాంతి పోటీల్లో గెలుపొందిన వారి వివరాలను ప్రకటించారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లను పోస్ట్ ద్వారా పంపిస్తామన్నారను. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్యాన్సీ డ్రెస్: కృతిక (ప్రథమ బహుమతి), డి.తస్విఖ (రెండవ బహుమతి), సంహిత (తృతీయ బహుమతి) , గర్వ్ కుండ్లియా (కన్సొలేషన్ బహుమతి), వరాహగిరి వేదాంషి (కన్సొలేషన్ బహుమతి) రంగోలి: పావని చిలువేరు (ప్రథమ బహుమతి), నీలా దేవి (రెండవ బహుమతి) మరియు పోలినేని లీలా భార్గవి (తృతీయ బహుమతి) తెలుగు పలుకులు: కొమ్మిరెడ్డి నిషాంత్ రెడ్డి (ప్రథమ బహుమతి) , లక్ష్మి శ్రీనిజ చింతలపూడి (ద్వితీయ బహుమతి), రావూరి జ్ఞాన కౌశికి (తృతీయ బహుమతి) మరియు నామ సాయి ఈశ్వర (కన్సొలేషన్ బహుమతి) కృతజ్ఞతలు ఆహ్లాదభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, స్వచ్ఛంద సేవకులకు , కార్యవర్గానికి , కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలను తెలియజేశారు. -
దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు
సింగపూర్: సింగపూర్ జంతుప్రదర్శనశాలలోని నాలుగు ఆసియా సింహాలకు కోవిడ్ -19 పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు వైల్డ్‌లైఫ్ గ్రూప్‌లోని పరిరక్షణ, పరిశోధన, వెటర్నరీ వైస్ ప్రెసిడెంట్, జూ ఆపరేటర్ అయిన డాక్టర్ సోంజా లూజ్ పేర్కొన్నారు. తాజాగా సింగపూర్ దేశంలో సుమారు 3,397 కేసులు ఉన్నాయని దేశం మొత్తంగా చూస్తే సుమారు 2 లక్షలకు పైగా కేసులు ఉన్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (చదవండి: చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’) ఈ నేపథ్యంలోనే సింగపూర్ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన నైట్ సఫారీ జంతుప్రదర్శనశాలలోని నాలుగు ఆసియా సింహాలకు కరోనా వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదీ కాక సింహాల్లో గత రెండు రోజులుగా దగ్గు, తుమ్ములు, నీరసంతో సహా తేలికపాటి లక్షణాలను కనిపించాయని వైల్డ్ లైఫ్ గ్రూప్ తెలిపింది. అలాగే నైట్ సఫారీకి చెందిన ముగ్గురు కీపర్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది. దీంతో ఆసియాటిక్ సింహాల పార్క్ నైట్ సఫారిని మూసేసినట్లు వైల్డ్ లైఫ్ గ్రూప్ అధికారులు చెప్పారు. ఈమేరకు వైల్డ్‌లైఫ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సోంజా లూజ్ మాట్లాడుతూ..."సాధారణంగా, వైరస్ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురికావు. కొద్దిపాటి సహాయక చికిత్సతో సింహాలు పూర్తిగా కోలుకుంటాయని మేము భావిస్తున్నాము. అయితే, తదుపరి చికిత్స అవసరమైతే గనుక యాంటీ ఇన్ఫ్లమేటరీలు, యాంటీబయాటిక్స్ ఇస్తాం" అని చెప్పారు. (చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్) -
ఫ్రాన్స్ అధ్యక్షుడు, సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ
జి–20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోమ్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. భారత్–ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మాక ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భదత్రా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. మోదీ, మాక్రాన్ నడుమ ఫలవంతమైన చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువరూ అభిప్రాయాలను పంచుకున్నారని వెల్లడించింది. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడనున్నాయని పేర్కొంది. నరేంద్ర మోదీ రోమ్‌లో సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్‌తోనూ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను ఈ సందర్భంగా సమీక్షించారు. లూంగ్‌తో మోదీ ఫలవంతమైన చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్విట్టర్లో వెల్లడించింది. భారత సంతతి ప్రజలతో సమావేశం ఇటలీలోని పలువురు భారత సంతతి ప్రజలు, భారతీయులను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. ఈ మేరకు ఫొటోలను మోదీ ట్విట్టర్లో పంచుకున్నారు. -
ఈ బార్ కి ఎగబడతున్న జనాలు.. ఎందుకంటే?
మీకు మంచి కిక్ ఇచ్చే మందు కావాలా? మందుతో పాటు మీ మూడ్ కి తగ్గట్టు వినోదం కోరుకుంటున్నారా? అయితే పదండి సింగపూర్ కి. ప్రస్తుతం కోవిడ్ వల్ల చాలా రెస్టారెంట్లు, హోటల్స్, బార్లలో రోబోలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటివల్ల కరోనా సోకే అవకాశం ఉండదు కాబట్టి, ఎక్కువ శాతం యజమానులు తమ హోటల్స్, బార్లలో రోబోలను ఉపయోగిస్తున్నారు. అలా ఓ బార్ యజమాని తన బార్ లో పనిచేసేందుకు ఓ రోబోని తీసుకొచ్చాడు. దాన్ని ముద్దుగా బార్నీ అని పిలుస్తాడు. ఈ రోబో కాక్టైల్ కలపడం నుంచి కస్టమర్లకు జోకులు వినిపించడం వరకు అన్ని పనులూ చకచకా చేసేస్తుంది. బార్ని 16 రకాల స్పిరిట్లనూ, 8 రకాల సోడాలను అవలీలగా మిక్స్ చేసి సూపర్ కాక్ టైల్స్ తయారు చేయగలదు. రోబో సినిమాలో రోబో మందు కలిపే సన్నివేశంలో చేసిన విధంగా. కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇచ్చే ఆర్డర్లకు అనుగుణంగా బార్నీ అన్నింటినీ సజావుగా కలిపి సర్వ్ కూడా చేస్తుంది. అలాగే, బార్ కు వచ్చేవారి మూడ్ కు తగ్గట్టు జోకులు వేస్తూ వారిని నవ్విస్తుంది. కరోనా సమయం కాబట్టి బార్ని కూడా తన చేతులను శానిటైజ్ చేసుకుంటుంది. అలా జాగ్రత్తలతో పాటు వినోదం అందిస్తోన్న ఈ బార్ కి వచ్చే కస్టమర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీంతో బార్ కు 'ది బార్ని బార్' అనే పేరు కూడా వచ్చింది. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
అమర్‌సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) మాజీ నేత అమర్‌సింగ్(64) కన్నుమూశారు. సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 2011లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరో కిడ్నీ మార్పిడి కోసం 8 నెలల క్రితం సింగపూర్‌లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య పంకజకుమారి, కుమార్తెలు దృష్టి, దిశ ఉన్నారు. అమర్‌సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘అమర్‌సింగ్ మరణం ఎంతో విచారం కలిగించింది. ఆయన సమర్థుడైన పార్లమెంటేరియన్. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి’అని రాష్ట్రపతి కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రముఖుల సంతాపం అమర్‌సింగ్ కుటుంబసభ్యులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో సంభవించిన కీలక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి అయిన అమర్‌సింగ్ గొప్ప ప్రజానాయకుడని ప్రధాని మోదీ కొనియాడారు. అందరితో కలివిడిగా మెలిగే అమర్‌సింగ్ మంచి రాజకీయ నేత, వ్యూహకర్త అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్లో తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ములాయంతో అమర్‌సింగ్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్‌సింగ్ మృతికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. రాజకీయ నేపథ్యం లేకుండానే... 1956 జనవరి 27న∙ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించిన అమర్‌సింగ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎస్పీ అధినేత ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పలుకుబడిగల నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వామపక్షాలు యూపీఏ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఆ సమయంలో ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమర్.. ఎస్పీ మద్దతుతో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించారు. యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్పీలో కీలక నేతగా కొనసాగారు. అనిల్ అంబానీ, అమితాబ్ బచ్చన్, ‘సహారా’ సుబ్రతా రాయ్ తదితరులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సినీనటి జయప్రద ఎస్పీలో చేరడం వెనుక అమర్ హస్తం ఉందని అంటుంటారు. అమితాబ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2016లో ఆయన అమితాబ్ భార్య జయా బచ్చన్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతరం పెరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన్ను సమాజ్‌వాదీ పార్టీ 2010లో బహిష్కరించింది. ఓటుకు నోటు కుంభకోణంలో 2011లో అరెస్టయ్యారు. అయినప్పటికీ, 2016లో ఎస్పీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో తిరిగి పార్టీలో చేర్చుకున్న ములాయం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ తర్వాత ఎస్పీ పగ్గాలు చేపట్టిన అఖిలేశ్ యాదవ్ 2017లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎస్పీ నుంచి దూరమైన అమర్‌సింగ్ ప్రధాని మోదీకి, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యారు. ఆజంగఢ్‌లో ఉన్న తమ పూర్వీ కుల ఆస్తులను ఆర్ఎస్ఎస్కు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు.