![Malaysian Of Indian Origin Sentenced Jail For Terrorise His Girlfriend - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/23/singapoor.jpg.webp?itok=iidmMRQk)
Indian-Origin Malaysian Jailed: పార్తిబన్ అనే భారతీయ సంతతికి చెందిన మలేషియన్‌కి సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. పార్తిబిన్ తన గర్లఫ్రెండ్‌ని పదేపదే భయబ్రాంతులకు గురిచేసేలా బెదిరించి పైశాచికంగా దాడి చేయడంతో ఈ శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాదు పార్తిబిన్ తన సహోద్యోగురాలితో గత రెండు, మూడు సంవత్సారాలుగా డేటింగ్‌లో ఉన్నట్లు న్యాయస్థానం తెలిపింది.
ఈ మేరకు న్యాయమూర్తి జేమ్స్ ఎలిషా మాట్లాడుతూ...అతని ప్రవర్తన తీరు నచ్చాక అతనికి దూరంగా వచ్చేసి ఆమె తన మేనమామతో కలిసి ఉంటోంది. దీంతో అతను ఆమె పై పదే పదే భయబ్రాంతులకు గురిచేసేలా దాడి చేయడం ప్రారంభించాడు. ఆమెను అసభ్య పదజాలంతో దూషించి కొట్టడంతో ఆమె మేనమామ కలగజేసకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. అయిన అతను వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెయిల్ పై వచ్చి మళ్లీ ఆమె మేనమామ ప్లాట్ వద్దకు వచ్చాడు. ఐతే ఆమె నిరాకరిచడంతో గేట్ పగలుగొట్టి వచ్చి మరీ ఆమెను దారుణం హింసించి కారులో తీసుకుపోయేందకు యత్నించాడు. ఐతే ఆమె అక్కడ ఉండే స్థానికులను సాయంతో పోలీసులను రప్పించి అరెస్టు చేసింది. మళ్లీ బెయిల్ పై వచ్చి ఈ సారి ఏకంగా చంపేందకు పథకం వేశాడు.
అందులో భాగంగా తన వస్తువులు తీసకునేందుకు వచ్చానంటూ ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చాడు. ఆ తర్వాత ఆమెను కత్తితో బెదిరించి హింసించడం మొదలు పెట్టాడు.ఇక తట్టుకోలేక ఆమె చచ్చిపోదాం అనుకుంటుండగా...ఇంతలో ఒక పోలీస్ కారు అటువైపుగా వెళ్తుండటంతో ఆమె వారి సాయం కోరింది. దీంతో పార్తిబన్ వెంటనే అప్రమత్తమైన తప్పించుకునేందకు యత్నించాడు. కానీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.
అతను విచారణలో అతనిపై మోపబడిన ఆరోపణలన్నింటిని అంగీకరించాడని చెప్పారు. ఇలా అతను తన ప్రేయసిని పదేపదే పైశాచికంగా హింసించి హత్య చేసేందుకు యత్నించినందుకు గానూ ఏడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. ఐతే బాధితురాలి తరుపు న్యాయవాది ఆమెను గాయపరిచి, తీవ్రంగా హింసించినందుకుగానూ పార్తిబన్‌కి ఏడు నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష విధించాలని కోరడంతో అతనికి రెండు నుంచి మూడేళ్లు జైలు శిక్షతో పాలు జరిమాన కూడా విధించే అవకాశ ఉందంటున్నారు అధికారులు.
(చదవండి: అఫ్గనిస్తాన్‌లో మళ్లీ భూకంపం.. ఇంకా శవాల దిబ్బలుగానే..)
Comments
Please login to add a commentAdd a comment