Malaysian
-
పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల కోసం తెలంగాణలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మలేషియా పారిశ్రామికవేత్తలను కోరారు. శ్రీధర్‌బాబు గత నెలలో మలేషియా తెలుగు మహాసభలకు హాజరైన సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించారు.ఈ మేరకు పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ చొరవతో సోమవారం సచివాలయంలో మలేషియా వాణిజ్య ప్రతినిధులతో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సౌర విద్యుత్ రంగం, డ్రైపోర్టుల నిర్మాణం, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, మహిళా పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలకు విదేశాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి హుస్సేన్ సాగర్‌లో పూడికతీత, మురుగు నీటి శుద్ధికోసం అత్యాధునిక సీవరేజీ ప్లాంట్ల ఏర్పాటులో పాలు పంచుకోవాలని మలేషియా పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డ్రైపోర్టుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ... ప్రస్తుతం మలేషియా నుంచి పామాయిల్ మొలకలు దిగుమతి చేసుకుంటున్నామని, అలా కాకుండా విత్తనాలు సరఫరా చేయడానికి గానీ, ఇక్కడే నర్సరీ ఏర్పాటు చేయడానికి గానీ ముందుకొస్తే సహకరిస్తామని చెప్పారు. -
మంచానపడ్డవాణ్ని మామూలు మనిషిని చేస్తే.. మరో పెళ్లి చేసుకున్నాడు!
బొమ్మనహళ్లి: కష్టసుఖాలలో భర్తకు వెన్నంటి ఉండేది భార్య, భర్తకు ఏ కష్టం వచ్చినా తోడుండి ఊరడిస్తుంది. అదే రీతిలో భర్త తీవ్ర అనారోగ్యంగా ఉన్న సమయంలో అతనిని కళ్ళలో పెట్టుకొని చూసుకొన్న భార్యను కాదని మరో మహిళను పెళ్లి చేసుకున్న సంఘటణ మంగళూరులో జరిగింది. వివరాలు.. స్థానిక యువతి సయాజ్ సైజ్వాని అనే యువతికి, మలేషియాలో నివాసం ఉంటున్న వ్యక్తితో 2016లో పెళ్లయింది. రెండేళ్ల తరువాత ఓ ప్రమాదంలో అతనికి పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు.ఈ సమయంలో సైజ్వాని భర్తకు సహాయంగా నిలిచింది. అన్నం తినిపించ డం, మందులు ఇవ్వడం తదితరాల సేవలు చేసే ది. భార్య చేసిన సేవల వలన పూర్తిగా కోలుకున్న భర్త అసలు బుద్ధిని చూపించాడు. భార్యకు విడాకులు ఇచ్చిన అతడు మరో మహిళను వివాహం చేసుకొన్నాడు. సైజ్వాని సోషల్ మీడియా ద్వారా తన మాజీ భర్తకు రెండవ పెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా, అతని కథ తెలుసుకున్న నెటిజన్లు బంగారం లాంటి భార్యను వదులుకొని చాలా పెద్ద తప్పు చేశాడని శాపనార్థాలు పెట్టారు. -
బ్యూటీ క్వీన్‌గా కిరీటాన్ని గెలుచుకుంది..కానీ అంతలోనే..
ఒక్కోసారి ఆకాశాన్ని అందుకునే గొప్ప విజయాన్ని అందుకుంటాం. అందరిచేతే ఆహా ఓహో అనిపించుకుంటాం. ఇక్కడ గెలిస్తే సరిపోదు..ఆ విజయాన్ని నిలబెట్టుకునేలా మనం బిహేవ్ చేయాల్సి కూడా ఉంటుంది. లేదంటే ఈ బ్యూటీ క్వీన్‌లా అందరిముందే అబాసుపాలయ్యే గెలుపు కూడా నీరుగారిపోతుంది. అసలేం జరిగిందంటే..మలేషియాకు చెందిన అందాల భామ వీరూ నికా టెరిన్సిప్ 2023లో ఉండక్ న్గడౌ జోహోర్ టైటిల్‌ని గెలుచుకుంది. అయితే ఆమె ఇటీవల సెలవులకు ధాయ్‌లాండ్‌లో గడపడానికి వెళ్లింది. అక్కడకు వెళ్లడమే శాపమై టైటిల్‌ని కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే..అక్కడ ఆమె కొంతమంది మగవాళ్లతో కలిసి కురచ దుస్తులు ధరించి డ్యాన్సులు చేసింది. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో వివాదాస్పదంగా మారి సదరు బ్యూటీ క్వీన్ విమర్శలపాలయ్యింది. ఈ వార్త కాస్త కడజాండుసున్ కల్చరల్ అసోసియేషన్‌కి చేరండంతో.. ఈ వీడియోపై సీరియస్ అవ్వుతూ ఆమె ఆ టైటిల్‌ను అందుకునే అర్హత లేదని స్పష్టం చేసింది. వెంటనే కిరీటాన్ని వెనక్కి ఇచ్చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు సదరు కడజాండుసున్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోసెఫ్ పైరిన్ కిటింగన్ మాట్లాడుతూ..అందాల రాణి ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం ఏ మాత్ర సబబు కాదని అన్నారు. హుమినోడున్ రాష్ట్రానికి చెందిన అందాల రాణిగా టైటిల్ గెలుచుకుంది. అంటే.. ఆమె అపారమైన జ్ఞానానికి, సంస్కారానికి ప్రసిద్ధి అని అర్థం. పైగా పబ్లిక్ ఫిగర్. అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంది. అలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడూ పద్ధతిగా నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆమె సాధారణ వ్యక్తి అయితే ఇదేం అంత పెద్ద సమస్యగా ఉండేది కాదని కూడా కిటింగన్ అన్నారు. అంతేగాదు ఆమె తన కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్రకు వెళ్లిందని మాకు అర్థమయ్యింది. కానీ ఇలాంటివి సహించేవి మాత్రం కావని అన్నారు. ఆ వీడియో నెట్టింట వైరల్ కాకుండా ఉంటే ఆమెకి ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు అయినా అందరికీ ఇదొక హెచ్చరికలా ఉంటుందన్నారు. మళ్లీ ఇలాంటి దుస్సాహసాలకు ఎవ్వరూ యత్నించరని కిటింగన్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బ్యూటీ క్వీన్.. నా స్వంత ఇష్టంతోనే ఈ ఉండుక్ న్గడౌ అందాల పోటీలకు వెళ్లాను. అయినా ఈ టైటిల్ ఏమి ఒక వ్యక్తి పరిపూర్ణ విజయాన్ని నిర్ణయిస్తుందని భావించను. అయినప్పటికీ వారి నిర్ణయాన్ని గౌరవించి వెనక్కి ఇచ్చేస్తాను ఈ టైటిల్‌ని. అలాగే ఇదంతా నా అజాగ్రత్త వల్లే జరిగిందని ఒప్పుకుంటున్నా. అందుకు నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరూ ఈ సంఘటనను నుంచి చాలా నేర్చుకుంటారని ఆశిస్తున్నా. అయినా ఈ విషయాన్ని భూతద్దంలా చూడొద్దు. దయచేసి ఇతర సమస్యలపై దృష్టిసారించండి. అలాగే ఈ ఘటనకు పూర్తి బాధ్యత నాదే, దీనికి నా స్నేహితులు, తల్లిదండ్రులను బాధ్యులుగా చెయ్యొద్దు. నా వివరణను యాక్సెప్ట్ చెయ్యడం, చెయ్యకపోవడం మీ ఇష్టం. గుండెల్లోంచి వస్తున్న మాటలు ఇవి. అయినా ఇంతవరకు ఓపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు. అని పోస్ట్‌లో పేర్కొంది. అందాల భామ వీరూ నికా టెరిన్సిప్. (చదవండి: రంజాన్ రోజు షీర్ కుర్మా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా..!) -
గర్లఫ్రెండ్ పై పైశాచిక దాడి... జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు
Indian-Origin Malaysian Jailed: పార్తిబన్ అనే భారతీయ సంతతికి చెందిన మలేషియన్‌కి సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. పార్తిబిన్ తన గర్లఫ్రెండ్‌ని పదేపదే భయబ్రాంతులకు గురిచేసేలా బెదిరించి పైశాచికంగా దాడి చేయడంతో ఈ శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాదు పార్తిబిన్ తన సహోద్యోగురాలితో గత రెండు, మూడు సంవత్సారాలుగా డేటింగ్లో ఉన్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జేమ్స్ ఎలిషా మాట్లాడుతూ...అతని ప్రవర్తన తీరు నచ్చాక అతనికి దూరంగా వచ్చేసి ఆమె తన మేనమామతో కలిసి ఉంటోంది. దీంతో అతను ఆమె పై పదే పదే భయబ్రాంతులకు గురిచేసేలా దాడి చేయడం ప్రారంభించాడు. ఆమెను అసభ్య పదజాలంతో దూషించి కొట్టడంతో ఆమె మేనమామ కలగజేసకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. అయిన అతను వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెయిల్ పై వచ్చి మళ్లీ ఆమె మేనమామ ప్లాట్ వద్దకు వచ్చాడు. ఐతే ఆమె నిరాకరిచడంతో గేట్ పగలుగొట్టి వచ్చి మరీ ఆమెను దారుణం హింసించి కారులో తీసుకుపోయేందకు యత్నించాడు. ఐతే ఆమె అక్కడ ఉండే స్థానికులను సాయంతో పోలీసులను రప్పించి అరెస్టు చేసింది. మళ్లీ బెయిల్ పై వచ్చి ఈ సారి ఏకంగా చంపేందకు పథకం వేశాడు. అందులో భాగంగా తన వస్తువులు తీసకునేందుకు వచ్చానంటూ ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చాడు. ఆ తర్వాత ఆమెను కత్తితో బెదిరించి హింసించడం మొదలు పెట్టాడు.ఇక తట్టుకోలేక ఆమె చచ్చిపోదాం అనుకుంటుండగా...ఇంతలో ఒక పోలీస్ కారు అటువైపుగా వెళ్తుండటంతో ఆమె వారి సాయం కోరింది. దీంతో పార్తిబన్ వెంటనే అప్రమత్తమైన తప్పించుకునేందకు యత్నించాడు. కానీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. అతను విచారణలో అతనిపై మోపబడిన ఆరోపణలన్నింటిని అంగీకరించాడని చెప్పారు. ఇలా అతను తన ప్రేయసిని పదేపదే పైశాచికంగా హింసించి హత్య చేసేందుకు యత్నించినందుకు గానూ ఏడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. ఐతే బాధితురాలి తరుపు న్యాయవాది ఆమెను గాయపరిచి, తీవ్రంగా హింసించినందుకుగానూ పార్తిబన్‌కి ఏడు నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష విధించాలని కోరడంతో అతనికి రెండు నుంచి మూడేళ్లు జైలు శిక్షతో పాలు జరిమాన కూడా విధించే అవకాశ ఉందంటున్నారు అధికారులు. (చదవండి: అఫ్గనిస్తాన్‌లో మళ్లీ భూకంపం.. ఇంకా శవాల దిబ్బలుగానే..) -
"భార్యలను కొట్టండి" భర్తలకు సలహాలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి!
Malaysian female minister Said husbands to 'gently' beat 'unruly' wives: అత్యున్నత పదవిలో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మాట్లాడేటప్పుడూ కాస్త ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్లు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి గానీ వాళ్లు ఎటువంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగురకతతో వ్యవహరించాలి. ఇక్కడొక మహిళా డిప్యూటీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. అసలు విషయంలోకెళ్తే... మొండిగా ఉండే భార్యలను కొట్టాలని మలేసియాకు చెందిన మహిళా డిప్యూటీ మంత్రి భర్తలకు సలహా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా క్రమశిక్షణ నిమిత్తం వారిని సున్నితంగా కొట్టాలని కూడా చెప్పారు. అందువల్ల అతను తన భార్య ఎంతగా మారాలనుకుంటున్నాడో ఆమెకు స్పష్టంగా తెలుస్తుందని కూడా మహిళా డిప్యూటీ మంత్రి సిటి జైలా మహ్మద్ యూసఫ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు మదర్స్ టిప్స్ పేరుతో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు కూడా. ‘మొండిగా వ్యవహరిస్తున్న భార్యలతో మాట్లాడి క్రమశిక్షణగా ఉంచాలి. అలా కుదరనప్పుడూ సున్నితంగా వారిని కొట్టండి. అప్పటికీ ప్రవర్తన మార్చుకోకపోతే వారికి దూరంగా ఉండండి. అంతేకాదు మహిళలు తమ భర్తతో మాట్లాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల’ని భర్తలకు మహ్మద్ యూసఫ్ సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీంతో ఆమె నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. (చదవండి: ఏకే 47 గన్‌తో సైనిక కసరత్తులు చేస్తున్న 79 ఏళ్ల బామ్మ!) -
రజాక్ 1,875 కోట్ల ‘ఖజానా’ స్వాధీనం
కౌలాలంపూర్: మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు చెందిన భారీ ‘ఖజానా’ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 273 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,875 కోట్లు) ఆస్తిని జప్తు చేసినట్లు చెప్పారు. అందులో నగదుతోపాటు, ఆభరణాలు, లగ్జరీ వస్తువులు ఉన్నట్లు తెలిపారు. 1ఎండీబీ (1మలేసియా డెవలప్మెంట్ బెర్హాడ్) నిధుల కుంభకోణం కేసులో భాగంగా సోదాలు నిర్వహించిన పోలీసులు.. 12 వేల ఆభరణాలు, సుమారు రూ.205 కోట్ల విదేశీ కరెన్సీ, సుమారు రూ.132 కోట్ల విలువైన గడియారాలు, ఇతర ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో కౌలాలంపూర్‌లో జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న భారీ ‘ఖజానా’ విలువను అధికారులు బుధవారం లెక్కించారు. నజీబ్‌తోపాటు ఆయన సన్నిహితులు 1ఎండీబీకి చెందిన మిలియన్ డాలర్ల నిధులతో కళాఖండాలు, ఆభరణాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
సైనా శుభారంభం
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సైనా 21–12, 21–16తో యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. సమీర్ 13–21, 15–21తో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు నిరాశే మిగిలింది. తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 16–21, 12–21తో నాలుగో సీడ్ జెంగ్ సివె–హువాంగ్ యాకియోంగ్ (చైనా) ద్వయం చేతిలో... రోహన్ కపూర్–కుహూ గార్గ్ (భారత్) జోడీ 9–21, 10–21తో హి జిటింగ్–డు యు (చైనా) జంట చేతిలో ఓడిపోయాయి. -
బ్యాడ్మింటన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్
కౌలాలంపూర్: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు మలేసియా బ్యాడ్మింటన్ ఆటగాళ్లపై కెరీర్ ముగిసే విధంగా నిషేధం విధించారు. 31 ఏళ్ల తన్ చన్ సియాంగ్, మాజీ జూనియర్ ప్రపంచ చాంపియన్ 25 ఏళ్ల జుల్ఫాద్లి జుల్కిఫ్లిలు 2013 నుంచి క్రమం తప్పకుండా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు స్వతంత్ర దర్యాప్తు బృందం విచారణలో తేలింది. దీంతో సియాంగ్‌పై 15 ఏళ్లు, జుల్ఫాద్లిపై 20 ఏళ్లు నిషేధం విధించారు. దీంతో వాళ్ల కెరీర్‌కు పూర్తిగా తెరపడింది. వాళ్లు ఈ నిషేధ కాలంలో ఆటతో పాటు పరిపాలన, కోచింగ్, అధికారి, అభివృద్ధి పాత్రలకు కూడా దూరంగా ఉండాల్సిందేనని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) స్పష్టం చేసింది. బ్యాడ్మింటన్ చరిత్రలో ఫిక్సింగ్ ఉదంతంలో శిక్ష పడటం ఇదే తొలిసారి. బీడబ్ల్యూఎఫ్ నైతిక విలువల కమిటీ సియాంగ్కు రూ. 10 లక్షలు (15 వేల డాలర్లు), జుల్ఫాద్లికి రూ. 16.70 లక్షలు (25వేల డాలర్లు) జరిమానాగా విధించింది. -
క్వాలిఫయింగ్‌లోనే కశ్యప్ అవుట్
బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్ మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో మొదటిరోజు భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. భారత అగ్రశ్రేణి ఆటగాడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడంలో విఫలమయ్యాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో కశ్యప్ 14–21, 17–21తో కాంతపోన్ వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తొలి రౌండ్లో సిక్కి–ప్రణవ్ జోడీ 18–21, 17–21తో ఏడో సీడ్ లీ చున్ హె రెగినాల్డ్–చౌ హోయ్ వా (హాంకాంగ్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
‘అతిథి దేవోభవ’తో మలేసియా వాసికి ప్రాణదానం
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల్లో ఉన్న ఓ మలేసియా ప్రతినిధికి సకాలంలో ‘అతిథి దేవోభవ’తో మెరుగైన చికిత్స అందించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సెపక్తక్రా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన మలేసియా జట్టు మేనేజర్ యూనిస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పర్యాటక, క్రీడా శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆయననను మెరుగైన వైద్య చికిత్స కోసం కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులతో మాట్లాడి వెంటనే శస్త్రచికిత్స చేయించారు. సకాలంలో వైద్యం అందడంతో యూనిస్ కోలుకున్నారు. సోమవారం వెంకటేశం యూనిస్‌ను పరామర్శించారు. అవసరమైతే వైద్య ఖర్చులు, విమాన టికెట్‌ను కూడా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సకాలంలో వైద్యం అందించటంతో పాటు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసినందుకు మలేసియా ప్రతినిధులు బుర్రా వెంకటేశంకు కృతజ్ఞతలు తెలిపారు. ‘అతిథి దేవోభవ’కార్యక్రమంతో కొంతకాలంగా విదేశీయుల విషయంలో రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక గౌరవాన్ని చూపుతోంది. మన రాష్ట్రానికి వచ్చి, ఇబ్బందుల్లో చిక్కుకున్న వారిని చేరదీసి క్షేమంగా స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. -
భారత్ x మలేసియా
లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో గురువారం భారత జట్టు కీలకపోరుకు సిద్ధమైంది. మలేసియా జట్టుతో జరిగే క్వార్టర్ ఫైనల్లో టీమిండియా బరిలోకి దిగనుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 1–3తో ఓడిన భారత్ ఈ నాకౌట్ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా పోరాడనుంది. ఫామ్‌లో ఉన్న ఆకాశ్‌దీప్ సింగ్, సునీల్, రమణ్‌దీప్ సింగ్ మళ్లీ రాణిస్తే భారత్‌కు సెమీఫైనల్ బెర్త్ కష్టమేమీ కాదు.