Malaysian female minister Said husbands to 'gently' beat 'unruly' wives: అత్యున్నత పదవిలో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మాట్లాడేటప్పుడూ కాస్త ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్లు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి గానీ వాళ్లు ఎటువంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగురకతతో వ్యవహరించాలి. ఇక్కడొక మహిళా డిప్యూటీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి.
అసలు విషయంలోకెళ్తే... మొండిగా ఉండే భార్యలను కొట్టాలని మలేసియాకు చెందిన మహిళా డిప్యూటీ మంత్రి భర్తలకు సలహా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా క్రమశిక్షణ నిమిత్తం వారిని సున్నితంగా కొట్టాలని కూడా చెప్పారు. అందువల్ల అతను తన భార్య ఎంతగా మారాలనుకుంటున్నాడో ఆమెకు స్పష్టంగా తెలుస్తుందని కూడా మహిళా డిప్యూటీ మంత్రి సిటి జైలా మహ్మద్ యూసఫ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు మదర్స్ టిప్స్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు కూడా.
‘మొండిగా వ్యవహరిస్తున్న భార్యలతో మాట్లాడి క్రమశిక్షణగా ఉంచాలి. అలా కుదరనప్పుడూ సున్నితంగా వారిని కొట్టండి. అప్పటికీ ప్రవర్తన మార్చుకోకపోతే వారికి దూరంగా ఉండండి. అంతేకాదు మహిళలు తమ భర్తతో మాట్లాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల’ని భర్తలకు మహ్మద్ యూసఫ్ సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీంతో ఆమె నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
(చదవండి: ఏకే 47 గన్‌తో సైనిక కసరత్తులు చేస్తున్న 79 ఏళ్ల బామ్మ!)
Comments
Please login to add a commentAdd a comment