ఆ వ్యక్తికి 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు..! | Father Wanted Tanzanian Man Has 16 Wives, 104 Children | Sakshi
Sakshi News home page

ఆ వ్యక్తికి 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు..! కుటుంబమే..

Published Thu, Mar 6 2025 5:41 PM | Last Updated on Thu, Mar 6 2025 6:14 PM

Father Wanted Tanzanian Man Has 16 Wives, 104 Children

ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేసుకున్న ఒక్క రోజుల్లోనే పెటాకులు అవుతున్నాయి. కనీసం మూన్నాళ్లైన కలిసి ఉండటమే గగనం అన్నట్లుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి పెళ్లిళ్లల్లో రికార్డు సృష్టించాడు. అతడి ఇల్లే ఓ గ్రామంలా తలిపించేలా ఉంటుందట. ఎవరా వ్యక్తి అన్ని పెళ్లిళ్లు ఎలా చేసుకున్నాడో చూద్దామా..!.

ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని ఒక చిన్న గ్రామంలో నివసించే కపింగా (మ్జీ ఎర్నెస్టో ముయినుచి కపింగా) అనే వ్యక్తి వరుస పెళ్లిళ్లతోనే వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. ఈ ఆఫ్రికన్‌ వ్యక్తి సుమారు  20 పెళ్లిళ్లు చేసుకోగా.. కొన్ని కారణాలతో నలుగురు భార్యల్లో కొందరు చనిపోగా, కొందరు విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు ఉన్నారు. అలాగే.. 144 మంది మనవళ్లు, మనవరాళ్ళు కూడా ఉన్నారు. అంతా ఒకేచోట ఆనందంగా కలిసి మెలిసి జీవిస్తున్నారు.

చెప్పాలంటే అతడి ఇల్లే..ఓ గ్రామంలా మారిపోయింది. వాళ్లింట్లో వంటలు చేస్తే..ఏదో వేడుక జరుగుతుందేమో అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే అంతమందికి భారీస్థాయిలో వంటలు చేయాల్సి ఉంటుంది. అయితే అంతా కలసే వండుకుని ఒకే చోట కూర్చొని తింటారట. మరీ కపింగ ఇన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో తెలిస్తే మాత్రం విస్తుపోతారు..

ఇన్ని పెళ్లిళ్లు ఎందుకంటే..
కపింగ తన తండ్రి కోరిక మేరకు ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడట. తాను 1961లో మొదటి వివాహం చేసుకున్నానని, తన భార్య మొదటి బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన తండ్రి నువ్వు ఒక్క పెళ్లి కాదు మరిన్ని పెళ్లిళ్లు చేసుకోవాలి, మన కుటుంబం పెద్దదిగా ఉండాలి అని చెప్పాడట. 

నువ్వు మరో పెళ్లి చేసుకుంటే..వచ్చే కట్నం డబ్బులు నీకే ఇస్తానని చెప్పాట. తండ్రి కోరిక మేరకు ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడట. అయితే అందులో ఐదు వివాహాలకు తన తండ్రే డబ్బు ఖర్చు పెట్టాడట. మిగతావి తానే చేసుకున్నానని చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే..16 మంది భార్యల్లో ఏడుగురు కపింగ సోదరిమణులే. కానీ వాళ్లు అతడి భార్యలలాగే జీవిస్తున్నారు. 

వాళ్లంతా సవితి పోరు లేకుండా హాయిగా కలిసిమెలిసి ఉండటం విశేషం. మరీ ఇంతమంది ఆయన్నే ఎలా పెళ్లి చేసుకున్నారు అనే సందేహం కూడా వస్తోంది కదూ..? అయితే అందుకు అంతా చెబుతున్న కారణం ఒక్కటే..అది కపింగ మంచితనమేనట. అతడు చాలా మంచివాడని, అతడి భార్యగా ఉండటం అదృష్టంగా భావిస్తారట వారంతా. 

అలాగే తన కుటుంబ సభ్యులంతా ఎలాంటి గొడవులు లేకుండా ప్రశాంతంగా జీవించడానికి తన భార్యలే కారణమని అంటాడు కపింగ. ఏ సమస్య అయినా సాధ్యమైనంత వరకు తన వరకు రాకుండా పరిష్కరించుకుంటారని..ఒక్కోసారి తన వద్దకు వచ్చినా.. అక్కడితో సమస్యను పరిష్కరించి ఎలాంటి గొడవలు తలెత్తకుండా చూసుకుంటామని చెబుతున్నాడు. 

వారంతా స్వయం సమృద్ధి విధానంతో జీవిస్తున్నారని చెప్పాడు. మొత్తం కుటుంబం అంతా వ్యవసాయంపై ఆధారపి జీవిస్తుందట. అందరూ పంటలు పండిస్తూ, పశువులును మెపుతూ..తమ ఆహార అవసరాలను తీర్చుకుంటారట. అయితే కపింగా ఇంత పెద్ద కుటుంబ కారణంగా దాదాపు 50 మంది పేర్లే గుర్తుంటాయట. తక్కిన వారందర్నీ వాళ్ల ముఖం చూసి గుర్తుపట్టి మాట్లాడతానని చెబుతున్నాడు.

(చదవండి: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..!)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement