Tanzanian woman
-
పాక్ మహిళకు ఐరాస పురస్కారం
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్(66)కు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రకటించే ప్రతిష్టాత్మక మానవహక్కుల పురస్కారం–2018 అస్మాను మరణానంతరం వరించింది. పాకిస్తాన్లో సైనిక జోక్యానికి, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన అస్మా ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో కన్నుమూశారు. న్యూయార్క్‌లో మంగళవారం సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఐరాస సాధారణ సభ అధ్యక్షురాలు మారా ఫెర్నాండా ఈ అవార్డును అస్మా కుమార్తె మునైజే జహంగీర్‌కు అందజేశారు. అస్మాతో పాటు టాంజానియాలో బాలికా విద్య కోసం ఉద్యమిస్తున్న రెబెకా గ్యుమీ, బ్రెజిల్లో తొలి ఆదివాసీ మహిళా న్యాయవాది జోనియా బటిస్టా, ప్రపంచవ్యాప్తంగా హక్కుల కార్యకర్తల కోసం పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ డిఫెండర్స్(ఐర్లాండ్)కు 2018కి గానూ ఈ మానవహక్కుల పురస్కారం లభించింది. -
మహిళ నుంచి రూ. 7.4 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ముంబై: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం భారీ ఎత్తున మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. దోహా మీదుగా దార్-ఇ-సలామ్‌కు భారీ ఎత్తున మెథాక్విలోన్ అక్రమంగా తరలిస్తుండగా స్నిఫర్ డాగ్స్ పట్టేశాయి. 74 కేజీల మెథాక్విలోన్ ను తరలిస్తున్న టాంజానియా మహిళ చాంబో ఫాత్మా బాసిల్ ఎయిర్ ఇంటిలిజెన్స్ విభాగానికి చిక్కింది. ఈ డ్రగ్స్ విలువ 7.4 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా స్నిఫర్ డాగ్స్ మత్తు మందుల బ్యాగ్ ను గుర్తించాయని ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున మత్తుమందులను పట్టుకోవడం ఇదే మొదటిసారని కస్టమ్స్ ఎడిషనల్ కమిషనర్ మిలింద్ లాంజేవార్ తెలిపారు. తక్షణమే బాసిల్‌ను అదుపులోకి తీసుకున్నామని తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. గతంలో జింబాబ్వే మహిళ 13 కేజీలు ,ఇపుడు టాంజానియా మహిళ74 కేజీల అక్రమంగా రవాణా చేస్తున్న మత్తుమందులను పట్టుకోవడంలో కూడా తమ స్నిఫర్ డాగ్స్ టీమ్ ప్రముఖ పాత్ర వహించాయని అధికారులు వెల్లడించారు.