అందాల సుందరి ముఖాన్ని కట్‌చేసి, 90 డిగ్రీల్లో తిప్పితే.. | Mimi Choi's Weird Makeup Video Goes Viral - Sakshi
Sakshi News home page

అందాల సుందరి ముఖాన్ని కట్‌చేసి, 90 డిగ్రీల్లో తిప్పితే..

Published Sat, Aug 26 2023 1:25 PM | Last Updated on Sat, Aug 26 2023 1:30 PM

Mimi Chois Weird Makeup Video Foes Viral - Sakshi

మేకప్‌ అనేది ఎంతటి మహత్తరమైన కళ అంటే అది చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. మేకప్‌ కళను ఇష్టపడేవారు అనేకులు ఉన్నారు. మేకప్‌ అంటే ఇష్టం లేదని చెప్పేవారు చాలా తక్కువమంది ఉంటారు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక మేకప్ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అలాగే భయంతో కాసేపు కదలకుండా ఉండిపోతున్నారు. 

చాలా మంది కళాకారులు తమ కళా ప్రతిభను వీడియోల రూపంలో ప్రదర్శించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ కళాకారులలో కొందరు వారి అద్భుతమైన కళ కారణంగా ప్రజలలో ఎంతో ఆదరణ దక్కించుకుంటారు. తాజాగా మేకప్ ఆర్టిస్ట్ మిమీ చోయ్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో మిమి కళా ‍ప్రతిభను చూసినవారంతా నోరెళ్లబెడుతున్నారు. వీడియోలో మిమీ చోయ్ ఆ మహిళ ముఖం ఏ వైపు ఉందో అర్థం కాని విధంగా ముఖానికి మేకప్ చేసింది. మిమీ మేకప్ తర్వాత ఆ మహిళ ముఖాన్ని మధ్య నుండి ఎవరో కత్తిరించినట్లు, ఆ తర్వాత దానిని 90 డిగ్రీలు తిప్పినట్లు అనిపిస్తుంది. ఇలాంటి కళను మనం చాలా అరుదుగా చూస్తుంటాం.

ఈ వీడియో @HOW_THINGS-WORK పేరుతో ఉన్న పేజీ నుండి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X లో షేర్‌ చేశారు. వీడియోకు ఇప్పటివరకూ 272.3కే వీక్షణలు దక్కాయి. ఈ అద్భుతమైన మేకప్‌ కళను చూసిన నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ విభాగంలో తెలియజేస్తున్నారు. ఒక యూజర్‌ ఇలా రాశాడు ‘నిజంగా నా తల తిరుగుతోంది’ మరొక యూజర్‌ ‘ఆమె మేకప్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకువెళ్లారు’ అని రాశారు.
ఇది కూడా చదవండి: పిజ్జా యాప్‌ సాయంతో ప్రియుడి అరెస్ట్‌.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement