
బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్ మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో మొదటిరోజు భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. భారత అగ్రశ్రేణి ఆటగాడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడంలో విఫలమయ్యాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో కశ్యప్ 14–21, 17–21తో కాంతపోన్ వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. తొలి రౌండ్‌లో సిక్కి–ప్రణవ్ జోడీ 18–21, 17–21తో
ఏడో సీడ్ లీ చున్ హె రెగినాల్డ్–చౌ హోయ్ వా (హాంకాంగ్) జంట చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment