నజీబ్ రజాక్
కౌలాలంపూర్: మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు చెందిన భారీ ‘ఖజానా’ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 273 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,875 కోట్లు) ఆస్తిని జప్తు చేసినట్లు చెప్పారు. అందులో నగదుతోపాటు, ఆభరణాలు, లగ్జరీ వస్తువులు ఉన్నట్లు తెలిపారు. 1ఎండీబీ (1మలేసియా డెవలప్‌మెంట్ బెర్హాడ్) నిధుల కుంభకోణం కేసులో భాగంగా సోదాలు నిర్వహించిన పోలీసులు.. 12 వేల ఆభరణాలు, సుమారు రూ.205 కోట్ల విదేశీ కరెన్సీ, సుమారు రూ.132 కోట్ల విలువైన గడియారాలు, ఇతర ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో కౌలాలంపూర్‌లో జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న భారీ ‘ఖజానా’ విలువను అధికారులు బుధవారం లెక్కించారు. నజీబ్‌తోపాటు ఆయన సన్నిహితులు 1ఎండీబీకి చెందిన మిలియన్ డాలర్ల నిధులతో కళాఖండాలు, ఆభరణాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment