Najib Razak
-
అవినీతి కేసులో దోషిగా మలేసియా మాజీ ప్రధాని.. 12 ఏళ్ల జైలు శిక్ష
పుత్రజయ(మలేసియా): అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌ను దోషిగా తేలుస్తూ ఆ దేశ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. దీంతో మాజీ ప్రధానుల్లో చెరసాలకు వెళ్తున్న తొలి వ్యక్తిగా నజీబ్ అప్రతిష్ట మూటగట్టుకోనున్నారు. దోషిగా నిర్ధారణ కావడంతో ఆయనకు హైకోర్టు గతంలోనే 12 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ‘ఆయన చేసిన అధికార దుర్వినియోగం, నమ్మకద్రోహం, మనీ లాండరింగ్ నేరాలకు తగిన శిక్షే ఇది’ అని హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల ఫెడరల్(సుప్రీం) కోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. వెంటనే ఆయన తన జైలుజీవితం మొదలుపెట్టాలని ఆజ్ఞాపించింది. మలేసియా అభివృద్ధికి ఉద్దేశించిన 1 మలేసియా డెవలప్మెంట్ బెహ్రాత్(1ఎండీబీ) నుంచి ఏకంగా 450 కోట్ల అమెరికన్ డాలర్లను నజీబ్ దోచుకున్నారని, 1ఎండీజీ విదేశీ విభాగమైన ఎస్ఆర్సీ ఇంటర్నేషనల్ నుంచి 94 లక్షల డాలర్లు అక్రమంగా పొందారని దర్యాప్తులో తేలింది. దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి మైమన్‌ను ఈ కేసు విచారణ ప్యానెల్ నుంచి తప్పించాలంటూ నజీబ్ అంతకుముందు చేసిన అభ్యర్థననూ కోర్టు తిరస్కరించింది. ఇదీ చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం! -
మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష
కౌలాలంపూర్ : మలేషియా డెవలప్మెంట్ బెర్హాద్(వన్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి ఆరోపణలపై మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేలారు. దీంతో మాజీ ప్రధానికి కౌలాలంపూర్‌లోని హైకోర్టు 12 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. 2009 నుంచి 2018 వరకు నజీబ్ మలేషియా ప్రధానిగా చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయన అవినీతి బయటపడటంతో అధికారాన్ని కోల్పోయారు. మలేసియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా కోర్టు నిర్ధారించడం ఇదే మొదటిసారి. అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్, నమ్మక ద్రోహంకు పాల్పడ్డారని నజీబ్ పై అభియోగాలున్నాయి. కాగా.. మలేషియాలో ఎన్ఆర్సీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి 9.8 మిలియన్ డాలర్లను, అలాగే తన హయాంలో 4 నుంచి 5 బిలియన్ డాలర్లను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి ఆయన మళ్లించుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధిపై పూర్తి నియంత్రణ ప్రధానికే ఉంటుంది. ఈ కుంభకోణం కూడా ఆయన హయాంలోనే జరగడంతో పాటు, ఢిఫెన్స్ వాదనలు కూడా ఆయన నిర్ధోషిత్వాన్ని నిరూపించేలా లేవని హైకోర్టు పేర్కొంది. దీంతోపాటు నజీబ్‌పై అభియోగాలు రుజువు కావడంతో కౌలాలంపూర్ హైకోర్టు ఆయనకు ఏకకాలంలో మూడు శిక్షలు అమలయ్యేలా 12 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. (దుర్గమ్మతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..!) -
రజాక్ 1,875 కోట్ల ‘ఖజానా’ స్వాధీనం
కౌలాలంపూర్: మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు చెందిన భారీ ‘ఖజానా’ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 273 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,875 కోట్లు) ఆస్తిని జప్తు చేసినట్లు చెప్పారు. అందులో నగదుతోపాటు, ఆభరణాలు, లగ్జరీ వస్తువులు ఉన్నట్లు తెలిపారు. 1ఎండీబీ (1మలేసియా డెవలప్మెంట్ బెర్హాడ్) నిధుల కుంభకోణం కేసులో భాగంగా సోదాలు నిర్వహించిన పోలీసులు.. 12 వేల ఆభరణాలు, సుమారు రూ.205 కోట్ల విదేశీ కరెన్సీ, సుమారు రూ.132 కోట్ల విలువైన గడియారాలు, ఇతర ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో కౌలాలంపూర్‌లో జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న భారీ ‘ఖజానా’ విలువను అధికారులు బుధవారం లెక్కించారు. నజీబ్‌తోపాటు ఆయన సన్నిహితులు 1ఎండీబీకి చెందిన మిలియన్ డాలర్ల నిధులతో కళాఖండాలు, ఆభరణాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
190 కోట్ల నగదు.. 400 హ్యాండ్‌బ్యాగ్‌లు
కౌలాలంపూర్: మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు చెందిన అపార్ట్మెంట్లలో పోలీసులు సోదాలు నిర్వహించి దాదాపు రూ.190 కోట్ల (2.86 కోట్ల డాలర్ల) విలువైన నగదు, అత్యంత ఖరీదైన 400 హ్యాండ్‌బ్యాగ్‌లను జప్తు చేశారు. మరెన్నో ఆభరణాలు, చేతి గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై ఉన్న తీవ్ర అవినీతి ఆరోపణలే తాజా ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం. మలేసియా ప్రభుత్వానికి చెందిన 1ఎండీబీ అనే సంస్థ డబ్బునూ నజీబ్, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు కలసి కాజేశారనే ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలపై కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో గతవారం రోజుల్లో నజీబ్ ఇల్లు సహా 12 చోట్ల పోలీసులు సోదాలు నిర్వహించారు. -
జకీర్‌కు మలేసియా ఆశ్రయం
కౌలాలంపూర్: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ (52)కు మలేసియా ప్రభుత్వం శరణార్థిగా దేశంలోకి అనుమతించింది. ఇక్కడి పుత్ర మసీదు(మస్జీద్ పుత్ర) నుంచి జకీర్ తన అంగరక్షకుడితో కలిసి బయటికొస్తున్న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ మసీదులోనే ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ సహా పలువురు కేబినెట్ మంత్రులు ప్రార్థనల్లో పాల్గొంటారు. 2018, జూన్‌లో జరిగే ఎన్నికల్లో దేశంలోని మెజారిటీ మలయా ముస్లింల ఓట్లను దక్కించుకునేందుకు రజాక్ ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయమై ఆ దేశ ఉపప్రధాని అహ్మద్ జహీద్ పార్లమెంటులో మాట్లాడుతూ.. జకీర్ ఐదేళ్ల క్రితమే మలేసియాలో శాశ్వత నివాసం కోసం అనుమతి పొందారని తెలిపారు. జకీర్ అప్పగింతపై భారత్ నుంచి ఎలాంటి విజ్ఞప్తులు అందలేదన్నారు. -
సూపర్ స్టార్ ఇంటికి దేశాధినేత
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసానికి శుక్రవారం ఓ విశిష్ట అతిథి వచ్చారు. రజనీని చూసేందుకు ఏకంగా ఓ దేశాధినేత వచ్చారు. భారత పర్యటనకు వచ్చిన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్.. రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. మలేసియా ప్రధాని మర్యాదపూర్వకంగా రజనీ ఇంటికి వెళ్లి కలసినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు. కొన్నాళ్ల క్రితం మలేసియాలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నానని, అప్పుడు నజీబ్ రజాక్‌ను కలవలేకపోయానని చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయన తనను కలిసేందుకు వచ్చారని తెలిపారు. మలేసియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని ప్రధాని నజీబ్ తనను కోరలేదని, ఇవన్నీ ఊహాగానాలేనని అన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా రజనీ నివాసానికి వెళ్లారు. రజనీకాంత్‌కు దేశంలోనే గాక శ్రీలంక, జపాన్, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో అభిమానులు ఉన్నారు. రజనీ సినిమాలను అక్కడ బాగా చూస్తారు. రజనీ సినిమా విడుదల రోజున విదేశాల్లో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఆయన విదేశాలకు షూటింగ్‌లకు వెళ్లినపుడు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కలవడంతో పాటు విందు ఏర్పాటు చేశారు. -
ప్రధానిని అరెస్టు చేయాలని విద్యార్థుల భారీ ర్యాలీ
కౌలాలంపూర్: మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ను అరెస్ట్ చేయాల్సిందిగా విద్యార్థులు బారీ ర్యాలీని నిర్వహించారు. పోలీసుల నిషేధాజ్ఞలను లెక్కచేయక దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఆ దేశ రాజధాని కౌలాంలపూర్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో సమావేశమయ్యారు. నగరం మొత్తం ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. కరపత్రాలను పంచారు. గత నెలలో ప్రధాని మలేషియా ఖజానా నుంచి 3.5 మిలియన్ల డాలర్లను కొల్లగొట్టి అమెరికాలోఆస్తులను కొనుగోలు చేశారని యూఎస్ న్యాయ శాఖ నిర్ధారించింది. 700 మిలియన్ డాలర్లు మలేషియా అధికారుల బ్యాంకు ఖాతాల్లోకి అక్రమంగా చేరాయని కోర్టు నిర్ధారించింది. దీంతో ఆదేశంలో ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. -
మలేసియాలో కొల్లగొట్టి అమెరికాలో విలాసాలు
కాలిఫోర్నియా: అమెరికా మన్‌హట్టన్‌లోని టైమ్ వార్నర్ సెంటర్లో ఉన్న 3.60 కోట్ల డాలర్ల ఖరీదైన పెంట్ హౌజ్, లాస్ ఏంజెలిస్ హిల్స్‌లోని 3.90 కోట్ల డాలర్ల మిలియన్ మాన్షన్, బెవర్లీ హిల్స్‌లోని 1.70 కోట్ల డాలర్ల ఖరీదైన బంగ్లాలను చూస్తే ఎవరికైనా కన్ను కుడుతోంది. ఈ భవనాల్లో నివసిస్తూ విలాసాల కులాసా జీవితాలను గడుపుతున్న మహరాజులు ఎంతటి వారో, వారు బంగారు స్పూన్లతో పుట్టి ఉంటారని అందరూ అనుకుంటారు. వారంతా ఖరీదైనా మనుషులే. సంపన్నలే. వారికి ఆ సంపదంతా అప్పనంగా వచ్చినదేనంట. ‘మలేసియా డెవలప్మెంట్ బెర్హాద్ (ఎండీబీ)’గా పిలిచే మలేసియా సార్వభౌమాధికార సంపద నిధి నుంచి అక్రమంగా కొల్లగొట్టిన వందకోట్ల డాలర్ల రూపాయలతోనే కొంతమంది చోరాగ్రేసరులు అమెరికాలో ఈ సంపదను కొనుగోలు చేశారట. వారంతా కూడా మలేసియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ సన్నిహితులేనట. వారిలో ఆయన సవతి తల్లి కుమారుడు కూడా ఉన్నారట. ఈ విషయాలన్నీ అమెరికా న్యాయ శాఖ విచారణలో వెల్లడయ్యాయి. ప్రధాన మంత్రి నజీబ్ పలుకుబడిని ఉపయోగించుకున్న ఆయన సన్నిహితులు దొంగ చమురు ఒప్పందాల పేరిట కోట్లాది రూపాయలను దండుకొని వాటిని షెల్ కంపెనీల పేరిట వివిధ దేశాల మీదుగా అమెరికాకు సంపదనను తరలించారని అమెరికా న్యాయశాఖ అభిప్రాయపడింది. మలేసియాలో కొత్త చమురు నిక్షేపాలను అభివృద్ధి చేయడంతోపాటు పలు ప్రజా ప్రాజెక్టులను అమలు చేయడం కోసం 2009లో ఎండీబీ నిధిని మలేసియా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులోని ప్రతి పైసా మలేసియా పౌరులకు చెందినదే. వారి సంక్షేమం కోసమే అందులోని ప్రతి పైసాను ఖర్చు చేయాల్సి ఉంది. అయితే కొంతమంది రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయి బ్యూరోక్రాట్లు, సంపన్నులు కుమ్మక్కై దొంగ ఒప్పందాల పేరిట ఇలా డబ్బును దండుకుంటున్నారు. వాటిని షెల్ కంపెనీల పేరిట దేశ దేశాలను దాటిస్తున్నారు. ఇందుకోసం వారు ఖరీదైన సెలబ్రిటీ పార్టీలను, ఖరీదైన షిప్పుల్లో విహార యాత్రలను నిర్వహిస్తున్నారు. అలా సంపాదించిన సొమ్ముతో కొంత మంది భారీ ఎత్తున జూదం ఆడుతుండగా, మరికొందరు హాలివుడ్ సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ‘ది ఫూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’ అనే హాలివుడ్ సినిమాను మలేసియా ప్రజల డబ్బుతోని తీసినట్లు అమెరికా న్యాయ శాఖ దర్యాప్తులో వెల్లడైంది. మలేసియా సార్వభౌమా సంపద నిధి నుంచి మొత్తం మూడు వందల కోట్ల డాలర్లు అక్రమంగా ఆ దేశం నుంచి తరలిపోగా అందులో వంద కోట్ల డాలర్లు మాత్రమే అమెరికాకు చేరాయట. షెల్ కంపెనీల పేరిట సంపన్నులు, వివిధ వర్గాలకు చెందిన పెద్దలు పెడుతున్న అక్రమ పెట్టుబడుల గురించి పనామా పత్రాలు బయట పడిన నేపథ్యంలో ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక జరిపిన ఓ పరిశోధనలో అమెరికా అక్రమ పెట్టుబడుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ పత్రిక ఈ కేసులో తీగలాగగా, అమెరికా న్యాయశాఖ డొంక కదిపింది. దాంతో మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ సవతి తల్లి కొడుకు రిజా అజీజ్. ఆయన హాలివుడ్ సినీ నిర్మాత. ఆయనకు ఒకప్పుడు ఎంతో సన్నిహిత మిత్రుడిగా ఉన్న జో లో, అబూదాబిలోని ప్రభుత్వ నిధి మాజీ అధికారి మొహమ్మద్ బద్వి అల్ హుస్నేని తదితరుల పేర్లు ఈ వ్యవహారంలో బయటకు వచ్చాయి. వీరు మలేసియా నిధిని కొల్లగొట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న వారిలో ముఖ్యులని కూడా అమెరికా న్యాయశాఖ పేర్కొంది. అయితే వీరెవరిపైనా ఇంతవరకు క్రిమినల్ కేసులు దాఖలు చేయలేదు. వారు అమెరికాలో కొనుగోలు చేసిన ఆస్తులకు ఏయే షెల్ కంపెనీల నుంచి నిధులను అక్రమంగా తరలించారలో ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ఆ శాఖ అభిప్రాయపడింది. మలేసియాలో జరిగిన నిధి కుంభకోణం ఆ దేశం అంతర్గత సమస్యని, అది అమెరికా పరిధిలోకి రాదని న్యాయశాఖ ప్రాసిక్యూటర్లు మీడియాకు తెలిపారు. మలేసియా ఎండీబీ నిధుల దుర్వినియోగంపై ఆ దేశంలో ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తుండడంతో ఆ దేశం దర్యాప్తునకు కూడా ఆదేశించింది. అయితే ఆ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని, దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న ఉన్నతాధికారులను దేశ ప్రధాని నజీబ్ ఎప్పటికప్పుడు బదిలీ చేస్తున్నారని అక్కడి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. న్యాయబద్ధంగా జరిగే ఎలాంటి విచారణకైనా తమ సహాయ సహకారాలు ఉంటాయని అమెరికా న్యాయశాఖ వెల్లడించిన తాజా అంశాలపై అక్కడి ప్రధాని కార్యాలయం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. షెల్ కంపెనీల పేరిట నల్ల డబ్బు దేశం నుంచి తరలించడం భారత్ సహా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య. ఇప్పుడు ఈ సమస్య అమెరికాకు కూడా చుట్టుకుంది. -
'ఆ విషయంలో మలేషియా భేష్'
-
'ఆ విషయంలో మలేషియా భేష్'
కౌలాలంపూర్: భారత్-మలేషియాలు భద్రత విషయంలో పకడ్బందీగా ఉన్నాయని, ఇరు దేశాల మధ్య రక్షణపరమైన సహకారం ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తీవ్ర వాదాన్ని, జాతి వివక్షతను రూపుమాపడంలో మలేషియా చర్యలు అద్భుతం అన్నారు. ఇస్లాం మత అసలైన విలువలు ఎత్తిచూపడంలో మలేషియా అగ్రభాగాన ఉందన్నారు. మూడు రోజుల ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా మలేషియాలో ఉన్న మోదీ సోమవారం ఉదయం కౌలాలంపూర్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ పుత్రజయ వద్ద మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఆ దేశ సైనికులు గౌరవ వందనం చేశారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ, నజీబ్ మధ్య ముఖ్యంగా రక్షణ, సైబర్ సెక్యూరిటీవంటి అంశాలు చర్చకు రావడమే కాకుండా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మలేషియా సహకారాన్ని కోరారు. భారత్ లో పలు నగరాలను స్మార్ట్ సిటీలుగా మర్చనున్న నేపథ్యంలో వాటి నిర్మాణం కోసం సహకారం అందించాలని కూడా మోదీ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మలేషియా విద్యార్థులు భారత్ లో చదువుకునేందుకు రావాల్సిందిగా కూడా ఆహ్వానించారు. తోరణ గేట్ ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని నజీబ్ కలిసి లిటిల్ ఇండియాగా భావించే కౌలాలంపూర్ లో తోరణ గేట్ ను ప్రారంభించారు. భారత స్మృతి చిహ్నం సాంఛీ స్తూపాన్ని పోలి ఉండేలా దీనిని నిర్మించారు. 2010 దీని నిర్మాణంపై ప్రకటన చేసి పూర్తిగా భారత్ నిధులతో దీనిని నిర్మించారు. దీని ప్రారంభానికి మోదీ వచ్చిన సందర్భంగా అక్కడి భారతీయులు, మలేషియా పౌరులు భారీ సంఖ్యలో ఉత్సాహంతో పాల్గొన్నారు. మోదీని చూసేందుకు పోటీపడ్డారు. తోరణ గేట్ ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇది కేవలం రాతి కట్టడం మాత్రేమే కాదని ఇరు దేశాలకు సంస్కృతికి ప్రతిబింబం అని కొనియాడారు. తోరణ గేట్ ను ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. -
మోదీకి ఆత్మీయ స్వాగతం
కౌలాలంపూర్: ప్రధాని నరేంద్రమోదీకి మలేషియాలో ఘన స్వాగతం లభించింది. ఆగ్నేయాసియాలో మూడో రోజు పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఉదయం మలేషియాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ పుత్రజయ వద్ద మోదీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆ దేశ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. నిన్న (ఆదివారం) మోదీ 13వ ఏషియాన్ -ఇండియా, పదోవ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. సోమవారం మోదీ, నజీబ్ మధ్య ద్వైపాక్షి చర్చలు, ఇరు దేశాల మధ్య వర్తక సంబంధమైన అంశాలు చర్చకు రానున్నాయి. -
మలేసియా అతలాకుతలం!
కౌలాలంపూర్: గత పది రోజులుగా వరదలు మలేసియాను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల నీటితో ఎనిమిది రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లు స్థంభించాయి. ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు. దాదాపు లక్షా 32వేల మంది ప్రజలు ముంపుబారిన పడినట్టు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా కిలంటన్, తెరెన్గాను, పహంగ్, జోహర్, పెరెక్, నెగ్రిసెంబిలాన్ రాష్ట్రాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. పెర్లిస్, కేదాహ్లో పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని అధికారులు తెలిపారు.మలేషియా చరిత్రలో ఇంతటి వరదలు ఎప్పుడూ రాలేదని అంటున్నారు. కెలాంటన్లో 81వేల 925 మంది, తెరెన్గానులో 35 వేల మందికిపైగా సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వరదబాధితులకు సహాయం నిమిత్తం మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ అదనపు నిధులు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. -
విమాన ప్రమాదం మృతుల్లో ప్రధాని అమ్మమ్మ
ఎమ్హెచ్ 17 విమాన ప్రమాదంలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ అమ్మమ్మ శ్రీ సిటి అమీరహ్ మృతి చెందారు. ఆ విషయాన్ని మలేషియా దేశ రక్షణ మంత్రి, ప్రధాని నజీబ్ రజాక్ సోదరుడు హిషమ్ముద్దీన్ హుస్సేన్ వెల్లడించారు. తమ సవతి అమమ్మ విమాన ప్రమాదంలో మరణించారని వెల్లడిస్తూ ఆమె ఫొటోను హుస్సేన్ ట్విట్టర్ పెట్టారు. అమీరహ్ స్వస్థలం ఇండోనేషియా అని చెప్పారు. ఇండోనేషియాలోని జోగ్ జకార్తా నగరానికి వెళ్లేందుకు ఆమె ఒంటరిగా ఆమ్‌స్టర్‌డామ్‌లో విమానం ఎక్కారని తెలిపారు. రంజాన్ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో... బంధు మిత్రులతో ఆనందంగా ఆ పండగ చేసుకునేందుకు వస్తున్న తరుణంలో ఆమె మృతి చెందారని పేర్కొన్నారు. శ్రీసిటి అమీరహ్ను తమ తాత మహ్మద్ నవోహ్ ఒమర్ రెండో వివాహం చేసుకున్నారని చెప్పారు. తాను తన సోదరుడు నజీబ్ రజాక్ కజిన్స్ అని ఈ సందర్బంగా హిషమ్ముద్దీన్ హుస్సేన్ వివరించారు. ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
విమానం ఏమైందో... ఆచూకీ తెలిసే వరకు...
ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన విమానం ఏమైందో అర్థంకావడం లేదని... అయితే ఆ విమానం జాడ కనుగొనే వరకు విశ్రమించేది లేదని మలేషియా ప్రభుత్వం స్సష్టం చేసింది. విమానం అదృశ్యమై వంద రోజులు పూరైన సందర్బంగా ఆ దేశ ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ఈ మేరకు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల అదృశ్యంతో వారి బంధువులు తీవ్ర వేదనతో చెందుతున్నారని.... ఆ విషయాన్ని తమ ప్రభుత్వం మనస్పూర్తిగా అర్థం చేసుకుందని ఆ దేశ రవాణశాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ వివరించారు. అయితే విమానం అదృశ్యమై ఇంత కాలమైన తమ బంధువులు ఏమైయ్యారో అర్థం కావడం లేదని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మలేషియా విమానం జాడ కనుక్కోవడం మలేషియా ప్రభుత్వ తీవ్ర వైఫల్యమేనని ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన 227 మంది ప్రయాణికులు... 12 మంది సిబ్బందితో మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విమానం చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. అయితే కొన్ని గంటల వ్యవధిలో ఆ విమానం మలేషియా ఎయిర్పోర్ట్ ఏటీసీతో ఉన్న సంబంధాలు తెగిపోయాయి. అనాటి నుంచి జాడ తెలియకుండా పోయిన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దాంతో విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ విమాన ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయు ఉన్న విషయం విదితమే. -
త్వరలో మలేసియా విమానంపై నివేదిక
అదృశ్యమైన మలేసియా విమానం ఎంహెచ్ 370 ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రాధమిక నివేదిక వచ్చే వారం విడుదల చేస్తామని దేశ ప్రధాని నజీబ్ రజాక్ వెల్లడించారు. విమాన గల్లంతుపై నివేదికను ఇప్పటికే ఇంటర్నేషనల్ సివిల్ ఎవియేషన్ అర్గనైజేషన్ (ఐసీఏఓ)కు పంపినట్లు చెప్పారు. ఐసీఏఓ నుంచి రాగానే ఆ నివేదికను విడుదల చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అయితే విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అదృశ్యమైన విమానం ఆచూకీ కనుగొనడంలో పూర్తిగా విఫలమైందని గల్లంతైన విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు మలేసియా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాధమిక నివేదికను వచ్చే వారం విడుదల చేస్తామని నజీబ్ రజాక్ వెల్లడించారు. 239 మందితో గత నెల 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరింది. ఆ కొద్ది సేపటికే విమానం విమానాశ్రయంతో సంబంధాలు తెగిపోయాయి. నాటి నుంచి విమానం కోసం పలు దేశాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయింది. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న తమ బంధులువు ఏమైయ్యారో తెలియక వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనను తీవ్రతరం చేసి ప్రభుత్వం చేతకాని తనం వల్లే ఇలా జరిగిందంటూ విమర్శలు సంధించారు. దాంతో విమానం గల్లంతుపై మలేసియా ప్రభుత్వం ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు చేసి త్వరితగతిన నివేదిక అందజేయాని ఆదేశించింది. దీంతో మలేసియా విమానం గల్లంతుపై ప్రాధమిక నివేదిక ప్రజల చేతులలోకి రానుంది. -
అదృశ్యమైన విమానం జాడ ఒక్క సెకండ్లోనా.... ఎట్లా?
గత నెలలో అదృశ్యమైన మలేసియా విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతునే ఉన్నాయని ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ వెల్లడించారు. విమాన జాడ కోసం ఇతరదేశాల సంపూర్ణ సహాయ సహకారాలు తీసుకుంటున్నామని తెలిపారు. తానే దేశ ప్రధాని అయి ఉంటే అదృశ్యమైన విమానం జాడ ఒక్క నిముషంలో కనుక్కోనే వాడినంటూ మలేసియా ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం వ్యాఖ్యలను నజీబ్ ఖండించారు. అన్వర్ వ్యాఖ్యలు మతిలేనివిగా ఆయన అభివర్ణించారు. విమానం ఆచూకీ కోసం ఇప్పటికి చేయని ప్రయత్నం లేదని ఆయన మరోమారు స్పష్టం చేశారు. ఈ నెల 5న మలేషియా ప్రతిపక్ష నేత చైనా వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ... తాను దేశ ప్రధాని అయి ఉంటే ఒక్క నిముషంలో అదృశ్యమైన విమానం జాడ కనిపెట్టేవాడి నంటూ చెప్పారు. ఆ వ్యాఖ్యపై ప్రధాని నజీబ్ రజాక్‌పై విధంగా స్పందించారు. 2014, మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎమ్హెచ్ -370 విమానం బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం వినాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో నాటి నుంచి విమాన ఆచూకీ కోసం చైనా, బీజింగ్, అమెరికా, భారత్‌తో పాటు పలుదేశాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయిన ఇప్పటికి ఆ విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో విమానం జాడ కనుగోనడంలో మలేసియా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రయాణికుల బంధువులతో పాటు స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదృశ్యమైన విమానంలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్న విషయం విదితమే. -
ఆ విమానం సముద్రంలో కూలింది
-
ఆ విమానం సముద్రంలో కూలింది
దక్షిణ హిందూ మహాసముద్రంలో పడిపోయిందన్న మలేసియా ప్రధాని నజీబ్ శాటిలైట్ సమాచారంతో నిర్ధారణకు వచ్చాం కౌలాలంపూర్: అనుమానం నిజమైంది.. మిణుకుమిణుకుమంటున్న ఆశాదీపం ఆరిపోయింది! 17 రోజుల కిందట గల్లంతైన మలేసియా విమానం కథ నడిసముద్రంలో ముగిసింది. ఐదుగురు భారతీయులు సహా 239 మంది ఉన్న ఈ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో మారుమూల కూలిపోయిందని, అందులోని వారెవరూ బతికి బయటపడలేదని మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ విషణ్ణ వదనంతో ప్రకటించారు. ఆయన సోమవారం కౌలాలంపూర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. విషాదానికి చిహ్నంగా ఆయన నల్లదుస్తులతో సమావేశానికి వచ్చారు. పెర్త్‌కు పశ్చిమంగా.. : ‘ఫ్లైట్ ఎంహెచ్370 విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిందని తీవ్ర విచారం, బాధ తో చెబుతున్నా. బ్రిటన్‌కు చెందిన ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(ఏఏఐబీ) తాజా విశ్లేషణ, బ్రిటిష్ శాటిలైట్ కంపెనీ ఇన్మార్సాత్ అందించిన ఉపగ్రహ సమాచారం ప్రకారం విమానం దక్షిణ కారిడార్ మీదుగా ఎగిరి, ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు పశ్చిమంగా దక్షిణ హిందూమహాసముద్రం నట్టనడుమ చివరిసారిగా కనిపించినట్లు నిర్ధారణకు వచ్చాం. ఇది ఇప్పటికే బాధలో ఉన్న కుటుంబాలకు నిజంగా గుండెలు పగిలే వార్తే’ అని రజాక్ చెప్పారు. విమానం కూలిన ప్రాంతం ల్యాండింగ్ స్థలాలకు చాలా దూరంగా మూరుమూల ఉందన్నారు. బాధ్యత ప్రకారం ఈ సమాచారాన్ని మలేసియా ఎయిర్‌లైన్స్ అధికారులు.. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాలకు తెలిపారన్నారు. మంగళవారమూ విలేకర్ల సమాచారాన్ని నిర్వహిస్తాన న్న ఆయన.. ఈ ఉదంతంపై మరింత సమాచారాన్ని వెల్లడించనున్నట్లు సంకేతమిచ్చారు. దక్షిణ హిందూమహాసముద్రంలో ఐదురోజులుగా సాగుతున్న గాలింపులో.. గల్లంతైన విమానానివిగా భావిస్తున్న శకలాలను గుర్తించిన నేపథ్యంలో నజీబ్ ఈ వివరాలు తెలిపారు. గల్లంతైన విమానంలోని వారి కుటుంబాలకు మలేసియా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. విమానం సముద్రంలో కూలిందన్న వార్త తెలిసి బీజింగ్‌లోని ఓ హోటల్లో ఉన్న ప్రయాణికుల బంధుమిత్రులు ఒకరినొకరు పట్టుకుని గుండెలవిసేలా రోదించారు. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ఈ నెల 8న మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళ్తూ.. బయల్దేరిన గంటసేపటికే అదృశ్యమవడం తెలిసిందే. ఇది సముద్రంలో కూలినట్లు భావిస్తున్నా కచ్చితంగా ఎక్కడ, ఎందువల్ల కూలిందో స్పష్టత రావడం లేదు. దీని కోపైలట్ ఫరీక్ తొలిసారిగా చెక్-కోపైలట్ లేకుండానే విమానం ఎక్కినట్లు సమాచారం. శకలాల కోసం గాలింపు..: పెర్త్ నగరానికి 2,300 కి.మీ దూరంలో సముద్రంలో తేలియాడుతున్న విమాన శకలాలుగా భావిస్తున్న రెండు వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి ఆస్ట్రేలియా నౌక సోమవారం ప్రయత్నించింది. వీటిలో ఒకటి బూడిద లేదా ఆకుపచ్చ రంగులో గుండ్రం గా, మరొకటి నారింజ రంగులో ఉందని, అయితే ఇవి మలేసియా విమానానివో కావో చెప్పలేమని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ చెప్పారు. అదే ప్రాంతంలో తెల్లగా చతురస్రాకారంలో ఉన్న వస్తువులు తమ విమానానికి కనిపించాయని చైనా తెలిపింది. ఎంహెచ్370లో చెక్కబల్లలు ఉన్నాయని, అయితే సముద్రంలో కనిపించిన చెక్కబల్ల ఆ విమానంలోనిదే అని చెప్పలేమని మలేసియా మంత్రి హుసేన్ అన్నారు. విమాన బ్లాక్‌బాక్సులు సముద్రంలో 20 వేల అడుగుల కింద ఉన్నా పసిగట్టే ‘టోవ్డ్ పింగర్ లొకేటర్ 25’ పరికరాన్ని పంపుతున్నట్లు అమెరికా తెలిపింది. -
ఆ విమానం హైజాక్!
మలేసియా అధికారుల అనుమానం కమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాన్స్‌పాండర్‌ను కావాలనే స్విచాఫ్ చేశారని వెల్లడి పైలట్ ఇంట్లో సోదాలు కౌలాలంపూర్/న్యూఢిల్లీ: వారం కిందట కనిపించకుండా పోయిన మలేసియా విమానాన్ని హైజాక్ చేసి ఉంటారని ఆ దేశ దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. విమానాన్ని దారిమళ్లించే ముందు అందులోని కమ్యూనికేషన్ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా నిలిపేసి, రేడియో సిగ్నళ్ల ట్రాన్స్‌పాండర్‌ను స్విచాఫ్ చేశారని భావిస్తున్నారు. విమానం అదృశ్యం తర్వాత శనివారం తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ కౌలాలంపూర్‌లో విలేకర్లకు ఈ వివరాలు వెల్లడించారు. రాడార్, ఉపగ్రహాల సమాచారాన్ని పరిశీలించాక బోయింగ్ మలేసియా తూర్పు తీరానికి చేరకముందు దాని సాంకేతిక వ్యవస్థను విమానంలోని ఎవరో ఉద్దేశపూర్వకంగా నిలిపేసి, దారి మళ్లించినట్లు స్పష్టమవుతోందని అన్నారు. రజాక్హైజాక్ మాట వాడకున్నా ఆయన మీడియాతో మాట్లాడిన వెంటనే పోలీసులు కౌలాలంపూర్‌లోని ఈ విమాన పైలట్ జహరీ అహ్మద్‌షా(53) ఇంట్లో సోదాలు జరిపి, విమానం నేవిగేషన్‌కు సంబంధించిన పరికరాన్ని స్వాధీనం చేసుకోవడం హైజాక్ అనుమానాలకు బల మిస్తోంది. మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ ఐదుగురు భారతీయులు సహా 239 మంది తో కౌలాంపూర్ నుంచి ఈ నెల 8న బీజింగ్ వెళ్తూ బయల్దేరిన గంట తర్వాత కనిపించకుండా పోవడం తెలిసిందే. రజాక్ మీడియాతో ఏమన్నారంటే... - విమానం మలేసియా, వియత్నాంల ఎయిర్ ట్రాఫిక్ కంటోల్ ్రసరిహద్దులో ఉన్నప్పుడు అందులోని ట్రాన్స్‌పాండర్‌ను స్విచాఫ్ చేశారు. ఆ తర్వాత విమానం వెనక్కి వెళ్లి, పశ్చిమంగా, వాయవ్య దిశగా వెళ్లింది. ఇవన్నీ అందులోని ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగా చేసిన పనులే. - ఈ నెల 7న అర్ధరాత్రి దాటాక 12.41కి బయల్దేరిన విమానం నుంచి 8న ఉదయం 8.11 గంటలకు శాటిలైట్ చివరి సిగ్నల్ అందింది. అంటే విమానం కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగాక 7 గంటలకు పైగా గాల్లోనే ఉంది. కొత్త విషయాలు తెలుస్తుండడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులపై మళ్లీ విచారణ జరపాల్సిన అవ సరముంది. ‘బంగాళాఖాతంలో కూలిపోయింది!’:గల్లంతైన విమానం బంగాళాఖాతంలోనో, హిందూ మహాసముద్రంలోనో కూలి ఉండొచ్చని అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీఎన్ఎన్ టీవీ చానల్, న్యూయార్క్ టైమ్స్ పత్రికలు తెలిపాయి. అధికారుల విశ్లేషణ అంటూ అవి వెలువరించిన కథనాల ప్రకారం.. ‘విమానం నింగిలో ఉన్నప్పుడు నిర్దేశిత ఎత్తు, తగ్గులకు దాటి ప్రయాణించింది. మలేసియా మిలటరీ రాడార్ సమాచారం ప్రకారం.. విమానం కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోయాక 45 వేల అడుగుల ఎత్తుకు (నిర్దేశిత ఎత్తును దాటి) వెళ్లింది. తర్వాత అడ్డదిడ్డంగా 23 వేల అడుగుల ఎత్తుకు దిగి పెనాంగ్ ద్వీపం దిశగా వెళ్లింది. తర్వాత వాయవ్యదిశగా వెళ్లి మళ్లీ ఎత్తుకు చేరి మలకా జలసంధి మీదుగా హిందూ మహాసముద్రం వైపు పయనించింది. నిమిషం వ్యవధిలోనే 40 వేల అడుగులు కిందకి దిగింది. ఇదంతా ఇది మానవ ప్రమేయం లేకుండా సాధ్యం కాదు.విమానంలోని ఎవరో ఒకరు ఏదో కారణంతో, బహుశా ఉగ్రవాద చర్యలో భాగంగా ఈ పని చేసి ఉండొచ్చు.’